Sunday, August 31, 2025

 🔔 *సరదాగా* 🔔

ఒక నాస్తికుడికి జబ్బు చేసింది. తీసికెళ్ళి ఆస్ప త్రిలో వేశారు!  సిలిండర్ తీసుకొచ్చి ఆక్సిజెన్ పెట్టారు!

ఈ లోపల భార్య గుడికె ళ్ళి భర్త పేరు మీద అర్చ న చేయించి ఆస్పత్రి కి వచ్చింది. ఆమె నాస్తికు రాలు కాదు! ఆస్పత్రి కొచ్చి భర్తతో అన్నది. ఎమండీ..గుళ్లో మీ పేరు మీద అర్చన చేయించి అమ్మవారి కుంకుమ తీసుకొచ్చాను.. పెట్టుకోండి. ఇది పెట్టు కుంటే మీరు త్వరగా కోలుకుంటారు!"
నాస్తికుడు:- (కోపం గా..) నీకేమన్నా పిచ్చా.. నా సంగతి తెల్సు కదా నీకు? సరే.. ఒక మాట అడుగు తాను నాకు జవాబు చెప్పు.. (హేళనగా..)మీ దేవుడు సర్వత్రా అంత టా వ్యాపించి ఉంటాడు కదా.. అలాంటప్పుడు దేవుడికి గుడి ఎందుకు?

భార్య: అమాయకంగా ఇలా అడిగింది. "ఏమో నాకేం తెలుసండి.. కాని నాకూ మీలాగే ఒక డౌటు. దానికి మీరు చెప్పండి  జవాబు అంది
 అదేంటంటే ఆక్సిజన్ కూడా అంతటా వ్యాపిం చే ఉంటుంది కదా.. మరి మీకు ఆక్సిజెన్ ఇవ్వటా నికి సిలెండరు ఎందుకు? "😀

No comments:

Post a Comment