.*_రాముడు కౌసల్యకు తన వనవాసం_*
*_గూర్చి తెలుపడం_*
*_꧁❀❀━❀📿🌏📿❀━❀❀꧂_*
*_రాముడు దశరథునికి, కైకేయికి నమస్కరించి బయలుదేరగానే అంతఃపురంలోని స్త్రీలంతా ఘౌల్లున ఏడ్చారు. రాముడు తండ్రి చెప్పినా చెప్పకపోయినా అందరికీ అన్ని పనులు చేసిపెడుతూ ఉండేవాడు. ఎవరి మీదా కోపగించుకొనేవాడు కాదు. ఒకవేళ ఎవరికైనా కోపంవస్తే వాళ్ళ కోపం మంచులా కరిగిపోయేట్లు మాటలు చెప్పేవాడు. అటువంటి రాముణ్ణి అడవులకు పంపుతున్నారు. మనమంతా దూడలు లేని ఆవుల్లాగా అయిపోతామే అంటూ ఏడవసాగారు. ఈ ఏడుపులన్నీ వింటూ దశరథుడు మళ్ళీ మూర్చపోయాడు. ఈ రోదన అంతా రాముడు కూడా విన్నాడు. కానీ మనోనిగ్రహంతో మదపుటేనుగులా మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయాడు._*
*_కౌసల్యాదేవి అంతఃపురంలోకి ప్రవేశిస్తూనే అక్కడ చాలాకాలంగా ఉంటున్న వృద్దుడైన ద్వారపాలకుణ్ణి, మరికొందరిని చూశాడు. వారంతా రాముణ్ణి “జయీభవా' అని_* *_అభినందించారు అట్లా ముందుకు పోతూనే రెండవ ప్రాకారం దాటాడు. అక్కడ వృద్దులైన బ్రాహ్మణులున్నారు. రాముడు వారందరికీ నమస్కారం చేశాడు. అట్లా ముందుకుపోయి మూడవ ప్రాకారంలో ప్రవేశించాడు. అక్కడంతా స్త్రీలే ద్వారపాలకులుగా ఉన్నారు. వారంతా పరుగెత్తుకుపోయి కౌసల్యాదేవికి రాముని రాకను తెలియజేశారు._*
*_కౌసల్యాదేవి ఎప్పుడూ వ్రతాలనాచరిస్తూ నియమనిష్టలు పాటిస్తూ ఉంటుంది. ఆ క్రిందటి రోజు రాత్రి అంతా జాగారం చేసి, ఉదయానే రాముని క్షేమాన్నికోరి తెల్లని పట్టుచీర ధరించి విష్ణుపూజ చేస్తోంది. సాక్షాత్తూ లక్ష్మీదేవిలా ప్రకాశిస్తున్న తల్లి పాదాలకు రాముడు నమస్కారం చేశాడు. ఆమె రాముణ్ణి లేవనెత్తి రెండు చేతులతో గట్టిగా కౌగలించుకొని శిరస్సుపై ముద్దుపెట్టుకొంది._*
*_"ఓ రామా! నీ పూర్వీకులంతా పరమధార్శికులు. అంతా రాజర్లులే. మహాత్ములైన వారికి మల్లేనే నువ్వు దీర్హాయుష్మంతుడవు కావాలి. గొప్ప కీర్తిమంతుడవు కావాలి. నీ కీర్తి ముల్లోకాలలోను వ్యాపించాలి. మన వంశ గౌరవాన్ని, వంశ ధర్మాన్ని ఎప్పటికీ కాపాడాలి._*
*_నాయనా! నీకు రాజ్యాభిషేకానికి సమయం దగ్గరవుతూంది. ధర్మపరుడు, సత్యసంధుడు అయిన నీ తండ్రి దశరథ మహారాజు నీకు రాజ్యాభిషేకం చేయిస్తాడు. నువ్వు రాత్రంతా ఏమీ తినలేదు. ఉపవాసం ఉన్నావు. భోజనం చేసి వెళ్లు” అంది._*
*_రాముడు: అమ్మా! ఇప్పుడు మనకు వచ్చిన ఆపద గూర్చి నీకు తెలియదు. నీకు ఎట్లా చెప్పటమా అని తటపటాయిస్తున్నాను. ఇంకా కొద్దిసేపట్లో నిన్ను, లక్ష్మణుని, సీతను విడిచి దండకారణ్యానికి పోవలసి ఉంది. ఇకపై మాంసాహారానికి బదులు, తేనె, దుంపలు, పండ్లు తింటూ ఉండాలి. పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో నివసించాలి. రాజ్యాభిషేకం భరతుడికి జరుగుతుంది. ఒక మునీశ్వరునిలా దండకారణ్యంలో నివసించమని నన్ను మహారాజు ఆజ్ఞాపించాడు._*
*_రాముని మాటలు విన్న కౌసల్యాదేవి గొడ్డలితో నరికిన మద్దికొమ్మవలే నేలపై ఒరిగిపోయింది. స్వర్గం నుండి భూమిపై పడ్డట్లు పడిపోయింది. మొదలు నరికిన అరటిచెట్టులా నేలపై పడిపోయింది. రాముడు వెంటనే తల్లిని లేవదీసి పట్టుకొని కూర్చోబెట్టాడు. ఉపచారాలు చేశాడు._*
_{ఇంకా ఉంది}_
*_┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈_*
*_ఆధ్యాత్మిక అన్వేషకులు_*
🦚🏹🦚 🙏🕉️🙏 🦚🏹🦚
No comments:
Post a Comment