Friday, August 29, 2025

 🫟🍀🫟🍀🫟🍀🫟🍀🫟
*మన ఆరోగ్యం…!```

నిరంతర అధ్యయనం!```

 *తెలిసింది గోరంత…!!* 
 *తెలియాల్సింది కొండంత !!!*
             ➖➖➖✍️
```
 “డి విటమిన్ లోపిస్తే రికెట్స్ వ్యాధి వస్తుంది”
...ఇదీ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివింది. 

డి విటమిన్ లోపం ఎవడిలో ఉంటుంది? అనుకునేవాడిని. 
కరోనా కాలం లో లోతుగా అధ్యయనం చేస్తే విస్తుపోయే నిజాలు తెలిసాయి. 

మనది ఉష్ణ మండల దేశం! 
అయినప్పటికీ ఇక్కడ అధిక సంఖ్యాకులకు డి విటమిన్ లోపం.
 దీని వల్ల కేవలం రికెట్స్ వ్యాధి కాదు. మూడ్ స్వింగ్స్.., జుట్టు రాలిపోవడం.. ఇలా సవా లక్ష సమస్యలు.

 బి కాంప్లెక్స్.. అని చదివాము. 
సివిల్స్ కు  బోధిస్తున్నప్పుడు బి కాంప్లెక్స్ కిందకు వచ్చే వివిధ విటమిన్ ల గురించి అయిదు ముక్కలు చెప్పేవారం. 

కరోనా కాలం లో B12 గురించి తెలుసుకోవాల్సి వచ్చింది.
 
మెడికల్ న్యూస్ టుడే అని పత్రికలో వచ్చిన ఒక అంశం  పట్టుకొని నేను లోతుగా అధ్యయనం  చేస్తే విస్తుపోయే నిజాలు తెలిసాయి. 
మన దేశంలో శాఖాహారులు.. 
వారిలో ఈ విటమిన్ లోపం.. 
ఇది కరోనా తీవ్రత ను ఎలా పెంచుతుంది అనేది అర్థమయ్యింది.

పోయిన సంవత్సరం దసరా సెలవుల్లో రాజస్థాన్ - ఆగ్రా టూర్ వెళ్ళాము. 
మూడో రోజు నుంచే నాకు కండరాలు లాగడం మొదలయ్యింది.
పట్టుదలతో మరింత ఎక్కువ సేపు జిమ్ చేశా. 
చేసినంత సేపు బాగానే ఉండేది..
అయిపోయాక మజిల్ క్రామ్ప్ మొదలయ్యేవి. 
జైపూర్ హోటల్ లో రాజస్థానీ సంగీతం ఏర్పాటు చేసారు. 
ఆ రోజు డిన్నర్ అయ్యాక నొప్పికి తట్టుకోలేక నేను రూమ్ కెళ్ళి నిద్ర పోయాను. 
ప్రోగ్రాం చాలా బాగున్నా మిస్ కావాల్సి వచ్చింది. 

హైదరాబాద్ కొచ్చాక "అసలు ఏంటి?" అని చిన్న సైజు పరిశోధన.
తేలింది ఏమిటంటే నాకు పొటాషియం లోపం ఉంది అని!
వారం లో సమస్య నుంచి బయట పడ్డాను.
అటు పై ఎప్పుడూ మజిల్ క్రామ్ప్ రాలేదు.

పొటాషియం లోపం గురించి ఎవరూ మాట్లాడుకోరు. 
రాయరు. 
చాలా మందికి తెలియదు.
మన దేశం గ్రామీణ ప్రాంతాల్లో అయితే కేవలం 3 శాతం పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం 7  శాతం జనాభా తగినంత పొటాషియం కలిగి ఉన్నారు. 
{ఖచ్చితంగా చెప్పాలి అంటే సోడియం పొటాషియం నిష్పత్తి. 
మనాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు. అంటే బాడీ కి ఎక్కువ సోడియం వెళుతుంది. తగినంత పొటాషియం వెళ్ళదు}.

మన శరీరానికి రోజుకి  సుమారుగా 4700  మిల్లి గ్రాముల పొటాషియం కావాలి. 
 
పొటాషియంనందించే ఆహారాలు: 

1.అరటి పండు. 
2.పనస తొనలు. 
౩.పాల కూర  
4.బీన్స్,చిక్కుడు. 
5.సముద్రపు చేపలు 
6.చిలగడ దుంప 
7. పాలు పాల ఉత్పత్తులు 
8. గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదాం.

ఇదివరకే కిడ్నీ వ్యాధితో బాధపడే వారు ఎక్కువ పొటాషియం ఉన్న పై ఆహారం తీసుకోకూడదు. 
ఆపిల్,బెర్రీస్ లాంటి తక్కువ పొటాషియం ఆహారాన్ని తీసుకొనే అవకాశముంది. (వీరు పొటాషియం లెవెల్స్ క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.)

నాకు ఉన్నట్టుండి టూర్ లో పొటాషియం లోపం ఎందుకు వచ్చింది?
మామూలు వారి సంగతి వేరు. 
రోజూ జిమ్ లో వ్యాయామం చేస్తే శరీరం విటమిన్స్,ఇతర పోషకాలను వేగంగా ఉపయోగించుకుంటుంది. కాబట్టి వాటిని తగినంతగా శరీరానికి అందించకపోతే వెంటనే ప్రభావం కనిపిస్తుంది. 

నేను ఇంట్లో వున్నప్పుడు రోజూ బ్రేక్ ఫాస్ట్ లో బాదాం,  వాల్ నాట్స్  తింటాను. దీనితో శరీరానికి తగినంత పొటాషియం అందేది. టూర్ లో వున్నప్పుడు బాదాం తినలేక పోయాను. అప్పుడు అరటి పండు కూడా తినేవాణ్ణి కాను. పాల ఉత్పత్తులు పెద్దగా వాడలేదు. దీనితో లోపం వచ్చింది. టూర్ నుంచి వచ్చాక ప్రతి రోజు ఒక అరటి పండు తింటున్నా.```

*అరటి పండు డయాబెటిస్ వారు తినొచ్చా?*```

డయాబెటిస్ కి ఇది మందు. 
కాకపోతే అన్నం బాగా తగ్గించి తినే వారే అరటి తినాలి!
కడుపు నిండా అన్నం తిని దాని పై అరటి పండు తింటే మెట్ ఫార్మిన్ వెయ్యి mg  వేసుకున్నా రీడింగ్ పెరిగి పోతుంది. అన్నట్టు మెట్ ఫార్మిన్ మాత్రలు వాడుతూ పొతే బి 12  లోపం వస్తుంది. 
ఇలా జరిగితే అనీమియా...  నెర్వ్ డామేజ్...  జ్ఞాపక శక్తి బలహీనం కావడం, మెదడు చురుకుదనం తగ్గిపోవడం  జరుగుతుంది.
పొటాషియం లోపం వల్ల కేవలం మజిల్ క్రామ్ప్స్ కాదు. హృద్రోగాలకూ అవకాశం. 
దసరా టూర్ నుంచి వచ్చాక పొటాషియం లోపముంది అని తెలుసుకొన్నాక నాకు ఒక విషయం  గుర్తొచ్చింది. 
మా నాన్నకు 2010 సం॥లో వెల్లూర్ సీఎంసీ లో గుండెకు స్టంట్ వేశారు. రెండు  రోజుల్లో డిశ్చార్జ్ అని ముందు చెప్పారు. అటు పై పొటాషియం లోపం వుంది కండీషన్ సీరియస్ అన్నారు. వారం రోజులు స్పృహ లో లేరు. కోలుకున్నాక కూడా ఆయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో బాగుపడలేదు. మూడేళ్ళలో చనిపోయారు. సర్జరీ జరిగినప్పుడు పొటాషియం లోపం వస్తుందట. అంత గొప్ప ఆసుపత్రి. అక్కడ కూడా ఇలాంటి లోపాలు. ఏమి చేద్దాము.. మన ఖర్మ అని సరి పెట్టుకోవడమే.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
అన్నట్టు వినాయకుడికి పళ్ళు అంటే ఇష్టం. 
మారేడు/ వెలగ  పండు ఇమ్మ్యూనిటి ని బూస్ట్ చేస్తుంది. యాంటీఆక్సిడెంట్ లను ఇచ్చి కాన్సర్ నుంచి రక్షణ.

రోజూ ఏదో ఒక పండు తింటే చాలా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.✍️.     

    -సేకరణ.

ఈ ఆరోగ్య విషయాలన్నీ   కేవలం అవగాహన కోసం మాత్రమే! 
🙏```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🫟🍀🫟🍀🫟🍀🫟🍀🫟

No comments:

Post a Comment