🤫 అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానంలో ఏం జరుగుతుంది మీకు తెలుసా? ఇవి నా అనుభవాలు 🚨 What Is Meditation?
https://youtu.be/eQfqyoTzCDg?si=ZguJSbtZpWs8VZc7
ఓం ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఒకే దగ్గర కదలకుండా చాలాసేపు కూర్చోవడం కాదు. నీ మనసు కదలకుండా ఆ అనంతమైన ఆనంద స్థితిని పొందటం గాఢమైన నిద్రలో నిన్ను నువ్వు ఎలా అయితే మర్చిపోతావో అలానే నిన్ను నువ్వు ఇరుకలో ఉండి మర్చిపోవాలి. ఏకాగ్రత అంటే శ్వాస మీద ధ్యాస ఒకటే కాదు లేదా ఒక నామాన్ని ఉచ్చరించడం కాదు ఇవి లేని స్థితి కూడా ఉంది. వీటితో సంబంధం లేకుండా నీ మనసు నిశ్చలంగా తనని తాను మర్చిపోయి ఉండగలదు. నీ ఊపిరి నీ కంటి రెప్పలు ఎలా అయితే వాటి అంతట అవే పని చేస్తున్నాయో అలానే నీ ధ్యానం సాధన చాలా సహజంగా ఉండేలా చూడు. బలవంతంగా నీ శరీరాన్ని బాధించకు నీ మనసును ప్రశాంతత కోసం ప్రేరేపించకు ఎందుకంటే అది మరికొంత ఆందోళనను ఇస్తుంది. ధ్యానంలో చాలా రకాలే ఉన్నాయి. వాటి గురించి మన ఛానల్ లో ఉంటుంది చూడండి. అయితే ధ్యానం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అండ్ నా అనుభవాలను చెప్తాను. ఇవి మీ ప్రశ్నలకు సమాధానం కూడా కావచ్చు. నెంబర్ వన్ అసలు ధ్యానం ఎందుకు చేయాలి? రోజు ఒకే సమయానికి ఒకటే స్థలంలో కూర్చొని చేయాలా అసలు చేయకపోతే ఏమవుతుంది వీటిని తెలుసుకుందాం. ఈ విశ్వంలో ప్రతి జీవి తన స్థితిలో సంతోషంగానే ఉంది. మనకు తెలిసిన ఈ భౌతిక ప్రపంచం నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. ఎంత సంపాదించినా ఎన్ని సుఖాలను స్వాధీనం చేసుకున్నా మనసు ఎప్పుడూ తృప్తి చెందదు. అలజడి లేని సముద్రం ఎప్పుడైనా చూశారా అలలు లేని నీటి ప్రవాహం ఉంటుందా? అలానే ఆలోచనలు లేని మనసు ఉండదు. అందరూ ధ్యానం అంటే నిశబ్దంగా కూర్చోవడం అనుకుంటారు. నిజానికి మనం కదలకుండా కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. తదేకంగా నీ మనసు చేసే అల్లరిని గమనించు అదే నీకు మౌనాన్ని నేర్పిస్తుంది. ఏకాగ్రతగా నీ ఆలోచనలని ఆలకింపు అదే ఆ పరబ్రహ్మాన్ని పరిచయం చేస్తుంది. నీ శబ్దంలో కూడా శబ్దం ఉంది. అదే ఓంకారం అని నీకు అర్థంవుతుంది. కంగారుగా 10 మందితో కలిసి పోటీ పడడానికి ఇది పరుగుల పోటీ కాదు ఇక్కడ నీ సాధనకి పరీక్ష నీ ఓపిక నీ గురువు నీ క్రమశిక్షణ నీ మంత్రం మౌనం నీ ప్రయాణం చీకటి నీ గమ్యం వెలుతూరు నీ తోడు నువ్వే నీ ప్రతి అడుగు దైవానుగ్రహమే నీ ప్రతి పనిలో పరీక్షలు ఉంటాయి. ప్రతి అడుగు భయపెడుతుంది. ప్రతి జీవి నిన్ను గుర్తుపడుతుంది. నీతో ఈ విశ్వమే నడుస్తుంది. నీ భయాలు అనుమానాలు ఇవి అన్నీ క్షణికాల బుడగల లాంటివి. ప్రతిసారి నువ్వు ఒక అద్భుతాన్ని ఆహ్వానిస్తావు. నువ్వు ఆగిన ప్రతిసారి ఆ అద్భుతం ఏదో ఒక మాయ చేసి నీ కథను ముందుకు నెడుతుంది. శరీరం నువ్వు వేరు అయినప్పటికీ శరీర పోషణ నీదే సరిపడ ఆహారం నిద్ర ఇవి జీవితానికి ముఖ్యం. అదేంటి వీటి గురించి ప్రత్యేకించి చెప్పాలా రోజు చేస్తూనే ఉంటాంగా అనుకుంటున్నావా ఇది నా అనుభవం నేను చాలాసార్లు తినవలసిన దానికంటే ఎక్కువగా తినేస్తుంటా నచ్చిన కూర ఆర్ ఏదైనా ఉంటే ఆకలితో పని లేదు తినేస్తూనే ఉంటాను. నిద్ర సంగతి అంటారా ఈ ఫోన్స్ వచ్చాక ఇంతమంది ప్రశాంతంగా ఆనందంగా తొందరగా పడుకున్నారో చెప్పండి. పడుకునే 10 నిమిషాల ముందు వరకి కూడా YouTube ఆర్ఇస్గ చూస్తూనే ఉంటాం కదా ఇది ఎలా అలవాట అయిందో తెలియదు కానీ అందరం ఇలానే ఉన్నాం. అందుకే నాలో నుంచిఎనిమిది గంటల అయినా ఈ ప్రశాంతతమైన నిద్ర అవసరం. గాఢమైన నిద్ర నీకు ఇతర ప్రపంచాలను పరిచయం చేస్తుంది. నిద్రలో మనకు వచ్చే ప్రతి కల ఒక వింత అనుభవమే. హాలీవుడ్ సినిమాల కంటే తక్కువ ఏమి కాదు కదా చాలా మందికి ధ్యానంలో వారి గురువులు పూర్వజన్మ గురువులు లేదా వారి గత జన్మ రిలేటెడ్ గా చాలా విషయాలు తెలుస్తుంటాయి. కనిపిస్తాయి. మరి కొందరికి కలల రూపంలో ఇవి జరగవచ్చు. ధ్యానం గాఢమైన నిద్ర ఈ రెండిటికీ తేడా ఏంటి అని అడిగితే ఒకటి నీకు తెలుసు అండ్ ఇంకోటి నీకు తెలిీదు అంతే. ఈ రెండిటిలో జరిగేది నిన్ను నువ్వు మర్చిపోవటం. మరి కొంతమందికి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరగవచ్చు ఈ కలల్లా కూడా జరగవచ్చు. నాకు చాలాసార్లు జరిగింది నా శరీరం నేను వేరు కాదు అని నాకు అప్పుడే అర్థమయింది. కొన్నిసార్లు భయం కూడా వేసేది. నేను ఏదో కొంచెం సేపు ప్రశాంతంగా ఉండేకి ధ్యానం చేస్తున్నాను కానీ ఈ వింత అనుభవాలు ఈ వింత అనుభూతులు ఈ గోల అంతా ఏంటి అని అనుకునేవాడిని. ప్రతి కలకి కర్మకి కలయకకి అర్థం లేకుండా లేదు. మరి వచ్చే వీడియోలో దీని గురించి మాట్లాడుదాం. ఆత్మల చుట్టూ ముట్టిన సంఘటన గురించా లేదా నా శరీరం నన్ను విడిచి నేను ధ్యానం చేసే సంఘటన గురించా కామెంట్స్ లో చెప్పండి మీరు ఏదైనా అడగాలి అని అనుకున్నా చెప్పాలి అనుకున్నా చెప్పవచ్చు. ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకొని ముందుకు వెళ్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ డు సబ్స్క్రైబ్ సర్వం శివం జగత్ థాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లో ఉంటది సపోర్ట్ లో ఉంటది. సో డు సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ అగైన్ విరోహితాః ఏ భూతానామధిపతయో విషికాసవర్తినః ఏ
No comments:
Post a Comment