ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…
*#ఆసనం - #శాసనం*
➖➖➖✍️
```
1966 జనవరిలో… మహాస్వామివారు ఎలవూర్ లో మకాం చేస్తున్నారు. అక్కడినుండి ఆహ్వానం అందటంతో నేను ఎలవూర్ వెళ్ళి మహాస్వామివారి దర్శనం చేసుకున్నాను.
వారు నాతో “చెన్నైలో అనుకోకుండా ఒక అపూర్వ సదస్సు ‘మహానాడు’ జరగబోతోందని, అందులో తమిళనాడుకు చెందిన అందరు మఠాధిపతులు హాజరుకానున్నారు.
అని అన్నారు.
మరల వారు నన్ను “నువ్వు కూడా మాతోపాటు ఆ మహానాడుకు వచ్చి అక్కడ మాట్లాడే ప్రతి విషయము సంగ్రహంగా వ్రాయవలసినదని” ఆజ్ఞాపించారు.
నేను వారి ఆజ్ఞను పాటించాను.
ఫిబ్రవరి 6 & 7 తేదీలలో ఆ మహానాడు సదస్సు చెన్నైలోని కమీషనర్ ఆఫ్ హిందూ ఛారిటబల్ అండ్ ఎండోమెంట్స్ బోర్డ్(HR & CE) కార్యాలయ భవనంలో జరిగింది. ఆ రెండు రోజులపాటు ప్రణాలికాబద్ధంగా ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా అన్ని కార్యక్రమాలు జరిగాయి.
మహానాడు మొదటి రోజున ఉదయం సభ మొదలవ్వడానికి ముందు పరమాచార్య స్వామివారు చేసిన ఒక పని వల్ల ఆహ్వానితులైన పీఠాధిపతులకు ఎటువంటి మానసిక క్షోభ, వేదన, అధికులమన్న గర్వం, చేదు జ్ఞాపకాలను మిగలకుండా చేశాయి. అందరి మనస్సులు తేలికపడి సర్వులకూ ఆనందం కలిగేలా చేసింది. మొత్తం మహానాడు ఫలించడానికి ఇది పునాదిగా పనిచేసింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది శ్రీమఠం మూలసిద్ధాంతాన్ని ఆచరించి చూపినట్టయ్యింది.
ఈ మహానాడుని HR & CE కమీషనర్ నిర్వహించారు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఈ ఉత్సవంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కూర్చోవడానికి వీలు లేదు.
మహానాడు ఆహ్వానితులైన మఠాధిపతుల్లో ఎవరు మధ్యలో కూర్చోవాలి, వారికి కుడివైపున ఎవరుండాలి, ఎడమవైపు ఎవరుండాలి, ఎవరికి ఎటువంటి ఆసనం వేయాలి వంటివన్నీ ప్రభుత్వం ఆజ్ఞప్రకారం జరగాలి. వారి ప్రొటోకాల్ లోని శ్రేణుల ప్రకారమే ఆసనాలను వేసి వాటిపైన ఆ సంబంధించిన మఠం పేర్లు కూడా రాయబడ్డాయి.
మహానాడు ప్రారంభ వేడుకకు తిరువావదుతురై, ధర్మపురం, తొండైమండల ఆధీనకర్తలు, తిరుప్పనండాల్, కాంచీపురం, మదురై, కుండ్రక్కుడి, మయిలం ఇలా ఎంతోమంది మఠాధిపతులు పాల్గొనడానికి వచ్చారు. కమీషనర్ వారిని ఒక్కొక్కరిగా ప్రొటొకాల్ ప్రకారం ఆహ్వానించి సభాస్థలికి తీసుకుని వచ్చారు. కంచి మహాస్వామివారు వేంచేశారు. ఒక్కసారి సభాస్థలినంతా కలయజూసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంతటి గంభీరమైన పరిస్థితులనైనా వారు తమ వాత్సల్యపూరిత నవ్వుతో తేలికపరచగలరు. ఆ నగుమోముతోనే వారికి కేటాయించిన ఆసనం వైపు వెళ్ళారు. అందరు మఠాధిపతులు కూడా వారికి కేటాయించిన ఆసనాలవైపు వెళ్ళారు.
చెరువులో స్నానానికి ముందు ఎలాగైతే నీటిపై ఉన్న నాచును తొలగించడానికి రెండు చేతులతో నీటిని వేరుచేస్తామో, కూర్చోవాలంటే ఎలాగైతే పైపంచతో నేలపైన ఉన్న దుమ్ముని దులుపుతామో అలా స్వామివారు అధికారులు కేటాయించిన ఆ ఆసనాన్ని రెండు చేతులతో వెనక్కు తోసి అదే స్థానంలో నేలపైన కూర్చుండిపోయారు.
వెంటనే అందరు మఠాధిపతులు వారికి కేటాయించిన ఆసనాలలో కాకుండా చక్కగా నేలపైన కూర్చున్నారు. ఆ సభాస్థలిలోని నేల అందరికి సమస్థానం అయ్యింది.
కంచి పరమాచార్య స్వామి వారి అతిశయాన్ని ఏమని చెప్పగలం. ‘వేదములకు ఆవల నిలబడినటువంటి ఆ జ్ఞానమూర్తి’ ముందుచూపుతో సూక్ష్మ దృష్టితో, ‘జీవాత్మ-పరమాత్మ’ ఒక్కటే అనే గొప్ప సత్యాన్ని ఆవిష్కరించి ఆచరించి చూపారు. ఈ భువిపై నివసించేవారికి డబ్బు కులం వల్ల వచ్చిన గొప్పదనమేంటి? లేనివాడికి వచ్చిన చిన్నతనమేంటి? అందరిది ఒకే కులం, ఒకే జాతి.
“అహం బ్రహ్మాస్మి” “ప్రజ్ఞానం బ్రహ్మ” “అయమాత్మా బ్రహ్మ” “తత్వమసి”✍️```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
“కంచిపరమాచార్యవైభవం”🙏
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment