*_మనం ప్రేమించే వాళ్ల కన్నా, మనల్ని ప్రేమించే వాళ్లతో జీవితం మరింత ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది.ఎందుకంటే అక్కడ ఆపేక్ష కాదు అనురాగమే ఉంటుంది._*
*_అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న స్వార్థం నాది. ఇది స్వార్థం కాదు...సానుభూతి గల స్వార్థం._*
*_ఈ కాలంలో మాయ మాటలకు ఎక్కువ విలువ కానీ,నిజమైన మంచి మాటలకు మాత్రం విలువ లేకుండా పోయింది._*
*_“నీవేమి సాధించావ్..?” అని ఎవరైనా అడిగితే, గర్వంగా చెబుతాను.“నమ్మినవాళ్లను మోసం చేయలేదు...విశ్వాసాన్ని వదలలేదు” అని!_*
*_వదిలేస్తే జారిపోయేవి ఎన్నో ఉండొచ్చు..కాని, పట్టుకుంటే మనతో ఉండిపోయేవి మరెన్నో ఉంటాయి.అది బంధం కావచ్చు, అనుబంధం కావచ్చు... లేదా జీవితం కూడా!_*
*_నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధమే.ఓటమి ధైర్యంగా ఎదుర్కొనగలిగినవారికే నిజాయితీ సంపత్తిగా మిగులుతుంది._*
*_సమాజంలో మనం ఎంత మంచిగా ఉన్నా, ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవాళ్లమే.కాబట్టి నచ్చేలా నటిస్తూ బ్రతకడం కన్నా, నచ్చినట్టు బ్రతకడం మేలు. ☝️_*
*_✍️మీ. తుకారాం జాదవ్. 🙏_*
No comments:
Post a Comment