**ప్రకృతి ఇచ్చిన అరటిపండును తొక్క తీసి తింటాము.తొక్కతో తినలేము.కొబ్బరికాయ పీచు ,పెంకుతీసి తింటాము. బియ్యాన్ని వండుకుంటాము.ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే వస్తువులనే మనకు అనుకూలంగా మార్చుకొని వాడుకుంటాము. నీరు వడపోసుకొని తాగుతాము. జామపళ్ళు కావాలి.ఆకులు ,కొమ్మలు అక్కర్లేదు. సితాఫలంలో గింజలు తీసేస్తాము.మామిడిపండు టెంక,తొక్క తినము.లభించిన వస్తువులో పనికిరాని భాగం తీసి పక్కనపెట్టి, పనికొచ్చే భాగాన్ని కూడా మనకు కావలసిన విధంగా మార్చుకొని వాడుకుంటాము. అదే పద్ధతిలో వ్యక్తుల మానసికోద్వేగాలతో కూడా వ్యవహరించాలి. ఎవరూ మనకు కావలసిన విధంగా , మనకు నచ్చే రీతిలో ఉండరు. వారి భావోద్వేగాల్లో మనకవసరంలేనివి తీసి పక్కన ఉంచి కావలసిన గుణాలను మనకు అనుకూలంగా మలచుకోవాలి. కాయగూరలు వండుకున్నట్టే ,వారి మానసికోద్వేగాలను మన ప్రేమ లో వండాలి. సత్సంబంధాల కమ్మని రుచులాస్వాదించాలి. ఇదే జీవనకళ.
No comments:
Post a Comment