Wednesday, September 24, 2025

 .              *🚩సత్సంగం🚩*

*సిరిసంపదలకంటే గుణసంపద మనిషిని మహూన్నతుని చేస్తుంది.*

*నీతి కథలతో సద్గుణాలు అలవడే విధంగా సంస్కారవంతమైన పెంపకాలతో సాగిన నాటితరం ఆలోచనలు నేటి తరానికి పనికిరావడం లేవు.*

*సృష్టిలో మానవుడంటే ప్రథముడు కాదు అధముడు అనే భావన క్రమేపీ పెరిగిపోతున్నది.*

*నిండైన గుణాలు మెండుగా ఉంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. సమాజం గౌరవిస్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం వలనే వ్యక్తిత్వానికి వన్నె చేకూరుతుంది.*

*గాలికి వంగే చెట్టు తుఫానును సైతం తట్టుకుని నిలబడుతుంది. పొడవైన చెట్టు అననుకూలమైన పరిస్థితుల్లో నిటారుగా నిలబడితే, గాలివాటానికి వంగకపోతే నేలపై ఒరగక తప్పదు.* 

*మనిషి కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే నిజమైన సంస్కారగుణం.*

*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏* 

*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🧘🏻‍♂️🍁 🙏🕉️🙏 🍁🧘🏻‍♀️🍁

No comments:

Post a Comment