*రాధా క్రిష్ణులను ప్రేమకు ప్రతీకగా చెప్తారు. వారి ప్రేమ గురించి ఎందరో చరిత్ర కారులు, కృష్ణుడి భక్తులు అద్భుతంగా చెప్తూ వచ్చారు. కృష్ణుడుని రాధ ఎందుకు అంత పిచ్చిగా ప్రేమించారు.? అయినా వారు ఇద్దరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే దానిపై ఆసక్తికర చర్చలు ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి.*
*అసలు వారు ఎందుకు పెళ్లి చేసుకోలేదో చూద్దాం. రాధకు కృష్ణుని పైన ఉన్న ప్రేమ వివాహం చేసుకునే ప్రేమ కాదట. ఆ ప్రేమ కేవలం కృష్ణునిలో తనని తాను చూసుకొనే ప్రేమ మాత్రమేనట. తాను వేరు కృష్ణుడు వేరుగా ఆమె భావించకపోవడంతో... ఆమెకు కృష్ణునితో ఎడబాటు అనేది కనిపించదని చెప్తారు. ఆమె నిరంతరం కృష్ణుని స్మరణలోనే ఉండటం మరొక కారణం.*
*ఒక రకంగా చెప్పాలంటే అది భక్తిలో మరొక మెట్టుగా వర్ణిస్తారు. భక్తిలో కొంత స్వార్థం ఉంటుంది కానీ భక్తిలో నుండి వచ్చిన ప్రేమలో మాత్రం ఉండదట. దీనికి ఉదాహరణ కూడా కృష్ణుడి భక్తులు* *చెప్తారు. ఒక తల్లి తన పిల్లవాడికి తల దువ్వితే ఏమి ఆశిస్తుంది.? తన బిడ్డ అందరికి అందంగా కనపడాలని అందరికీ ముద్దు రావాలని తన కోరిక. అదే విధంగా రాధ ప్రేమ కూడా కృష్ణుడు అందరికి ఆనందాన్ని ఇవ్వాలని అందరూ కృష్ణుని తలుచుకొని తరించాలని కోరుకున్నారట. అందుకే రాధా కృష్ణుల ప్రణయం ఒక ఉత్క్రుష్టమైన భక్తి మార్గమే గాని వివాహం, సంసారం చేసేవి కాదని కృష్ణ భక్తులు చెప్పే మాట.*
*జై శ్రీ రాదా కృష్ణ... 🦚*
*┅━❀꧁ శ్రీమద్భగవద్గీత ꧂❀━┅*
🍁🙇♂️🍁 🙏🕉️🙏 🍁🙇♂️🍁
No comments:
Post a Comment