Tuesday, September 30, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

           *ఆచార్య సద్బోధన*
               ➖➖➖✍️
```
“గురువును ఆశ్రయించి ధర్మం గురించి తెలుసుకొని దాన్ని జీవనంలో వర్తింప జేసుకోవటమే సాధకుని కర్తవ్యమా?”

మనందరిలో భగవంతుడు గురురూపంలో ఉండి ధర్మబోధ చేస్తూనే ఉన్నారు.

అది వెన్నెల, వెలుతురులా చాలా సున్నితంగా ఉంటుంది. 

సూర్యకాంతిలా ప్రచండంగా కనిపించే ప్రాపంచిక విషయాలలో పడి మనం దాన్ని పట్టించుకోవట్లేదు. 

ధర్మాచరణ కేవలం మనం ఎంచుకొని ఆచరించే మార్గం కాదు. అది విధిగా ఆచరించి తీరాల్సిన నియమం. 

ఎందుకంటే ఏ విషయంలో మనం ధర్మాన్ని పాటించమో ఆ విషయంలో మనకు శిక్ష తప్పదన్న భగవంతుడి హెచ్చరిక గుర్తుపెట్టుకోవాలి. 

‘భగవంతుడికి పూజ చేస్తున్నాం కదా ఏమీ కాదులే’ అనే భావనతో అధర్మం చేయబూనితే అదే భగవంతుడు అంగీకరించడు. 

ఆధ్యాత్మిక సాధనలో వైరాగ్యం అనే మాట వాడుతూ ఉంటాం. మనం ఇప్పుడు అధర్మంలో ఉండటంచేత వైరాగ్యం పేరుతో కూడా కొన్ని నియమాలతో ధర్మాన్నే బోధించాల్సి వచ్చింది. 
ధర్మంలో ఉండటం అలవర్చుకుంటే మనం సహజంగానే ధర్మమార్గంలోనే ఉంటాం!✍️```

🙏 **సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment