🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(234వ రోజు):--
దీనిభావం క్రైస్తవమతం నిరుప యోగమనికాదు. జీవితం గురించి వివరణను కోరే ఈనాటి యువకుల న్యాయమైన కోర్కెను చర్చి సంతృప్తి కరంగా తీర్చలేకపోతుందని మాత్రమే దీని భావం. ఈ పరిస్థితికి కారణం క్రీస్తు, బైబిలు కావు. మత పురోహితులూ, మతప్రచారకులూ, వారి బోధలే యువతను నిరాశపరి చాయి. భారతదేశంలో కూడా,వారికి అర్ధమయ్యే రీతిలో చెప్తే తప్ప వేదాంతసత్యాన్ని వినటానికి విద్యా ర్థులెవ్వరూ ఇష్టపడరు.
హిందూమతంలో మానవుని దివ్యతత్వాన్నీ, ఆమతాన్ని అనుస రించేవారు తమ వ్యక్తిత్వాలను సరైన రీతిలో మలుచుకోడానికి అనుసరిం చాల్సిన పద్ధతులనూ వివరించే తర్కబద్దమైన శాస్త్రం ఉంది. అందు చేతనే అది శాస్త్రమే కాక, కళకూడా. శాస్త్రం నేర్చుకోడానికి స్వేచ్ఛ అవస రం. ఆత్మవికాసపు కళను అభ్యసిం చటానికి కూడా స్వేచ్చాపూరితమైన వాతావరణమే కావాలి. అందుచేత నే, హిందూమతంలో స్వేచ్ఛ, యథా స్థితిని పొందే గుణమూ ఎక్కువగా ఉంటాయి. కాని, అవే ఆ మతపు బలమూ, బలహీనతా కూడా.
క్రైస్తవమతం వ్యక్తివికాసానికి అవసరమైన తార్కికజ్ఞానాన్ని కాని, అనుసరించాల్సిన పద్దతులను కాని అందజేయకుండా, ఏవి చేయకూడ దో మాత్రమే తెలియజేస్తుంది. సంస్కృతి కాని, మతంకాని హీన స్థితిలో ఉన్నపుడు, చేయకూడని వాటికే ఆధ్యాత్మిక శిక్షణలో అతిగా ప్రాముఖ్యమీయటం జరుగుతుంది. ఈనాటి పూజారులతోనూ, తల్లి తండ్రులతోనూ, వేదాంతగ్రంథాల తోనూ ఉన్న సమస్య ఇదే. ఈ సమ స్య ఉన్నది అమెరికాలోనే కాదు. దీనికి విరుద్ధంగా, మతవిషయాలలో చేయదగ్గవేమిటో లోతుగా అధ్యయ నం చేసి అభ్యసిస్తే, ఆధ్యాత్మిక పురో భివృద్ధి సాధ్యపడుతుంది.
పర్యటనలో వెస్టిండీస్, దక్షిణా ఫ్రికా, మారిషస్, మలేసియా వంటి హిందుజనాభా ఎక్కువగా ఉన్న దేశాలకు వెళ్ళటం జరిగింది. చాలా ఏళ్ళక్రితం వేలాది భారతీయులను - ముఖ్యంగా తమిళనాడునుంచి, ఉత్తరబెంగాలు నుంచి - కిక్కిరిసిన ఓడలలో (పరిస్థితులకు తట్టుకోలేక చాలామంది దారిలోనే చనిపోయే వారు) బానిసలుగా తీసుకుపోయి ఆ దేశాల్లో చవకగా దొరికే వ్యవసాయ కూలీలుగా ఉపయోగించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గుర్తుకు తెస్తారిక్కడి ప్రజలు. ఒప్పందం ప్రకారం పది సంవత్సరాలు కూలీలుగా పనిచేసిన తర్వాత, తిరుగుప్రయాణానికి బదులు, ఆ సొమ్ముతో చాలామంది చిన్నచిన్న భూములు కొనుక్కున్నారు అప్పులపాలై, భూస్వాములకు శాశ్వతంగా అమ్ముడుపోయిన కూలీ లకు 1833 లో బ్రిటిష్ చట్టసభ సామ్రాజ్యమంతటా బానిసత్వాన్ని నిషేధిస్తూ చేసిన శాసనం వల్ల విముక్తి లభించింది.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment