🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(249వ రోజు):--
ఇటువంటి విశాలభావాలే ఇతరులు నిర్వహించిన అనేక కార్య క్రమాలలో స్వామీజీ పాల్గొనేలా చేశాయి. 1956 లో స్వామి నిర్మల్ మహారాజ్ అమృతసర్ లో ఏర్పాటు చేసిన అఖిలభారత వేదాంతసమ్మే ళనంలో పాల్గొనమని ఆయనకు ఆహ్వానం వచ్చింది. అర్థరాత్రి ఢిల్లీలో బయలుదేరి, 300 మైళ్ళు కారులో ప్రయాణంచేసి,ఉదయం సమావేశం లో ప్రసంగించి, వెంటనే బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీలో జరుగుతున్న యజ్ఞానికి తిరిగివచ్చా రు. అదే సంవత్సరం డిసెంబర్ నెల లో యజ్ఞకార్యక్రమాన్ని ఒకరోజు నిలిపి, నాయరు సేవాసంఘం కేరళ లో ఏర్పాటుచేసిన హిందూ సమ్మేళ నానికి అధ్యక్షత వహించారు.
హిమాలయాల్లో ఒక ఆశ్రమాన్ని నిర్మించి 1980 నుంచి అక్కడే నివసించే ఉద్దేశంతో, ఆశ్రమానికి నిర్దేశించబడిన స్థలాన్ని చూడటాని కి స్వామీజీ 1978 లో ధర్మశాల వెళ్లారు. అక్కడ టిబెటన్ బౌద్ధనాయ కుడైన దలైలామాను దర్శించారు.
స్వామీజీ వెంటనే సంభాషణ ప్రారంభించారు, "భారతదేశంలో చాలామందికి బౌద్దమతపు ఉన్నత భావాలగురించి తెలియదు. మీరు మైదానప్రాంతాల్లో పర్యటించి, వాటి ని ప్రజలలో ఎందుకు ప్రచారం చేయ కూడదు ? మీరు బౌద్ధసంస్కృతికీ, బోధనలకూ ఖనివంటివారు. ఆధ్యా త్మికజ్ఞానం అందరికీ అవసరమే ; అందరూ దానికోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు."
"మావద్దకు వచ్చే విద్యార్థులకోసం మేము ఎప్పుడూ వేచివుంటాం" దలైలామా సమాధానమిచ్చారు సన్నని చిరునవ్వుతో.
"ఔనౌను, నాకుతెలుసు.. కాని, వాళ్ళు రావట్లేదు. అంచేత మనమే వాళ్ళవద్దకు వెళ్లి బోధించాలి." స్వామీజీ నవ్వుతూనే స్పందించారు.
దలైలామా అంగీకారం తెలుపు తున్నట్లు తలఊపి, "ఈవిషయం ఆలోచించాల్సిందే" అన్నారు. ఆ వెంటనే పెద్దగా నవ్వుతూ, "మీకు ఓర్పు లేదనుకుంటాను" అన్నారు.
"నిజమే, అందరికీ వారి దివ్య మైన సహజతత్వాన్ని తెలియజేయ డానికి తొందరపడుతున్నాన్నేను" అన్నారు స్వామీజీ చేతులు పైకెత్తి అభినయం చేస్తూ.
హిందూమతగ్రంథాల్లో వాడిన కొన్ని సంస్కృతపదాలకు అర్థాన్ని దలైలామా స్వామీజీనడిగి తెలుసు కున్నారు. తర్వాత ఆయనకు జిడ్డు కృష్ణమూర్తి అనే గురువుగురించి తెలుసునా అని అడిగారు.
"ఆయన ఒకగొప్ప బౌద్ధమతాభి మాని, ఒకగొప్ప వేదాంతి. ఐతే, ఆయన చాలా ఉన్నతస్థాయి గురించి మాట్లాడుతారు. ఆ స్థితిలో అభ్యాసం కాని, గురువుకాని అవస రం ఉండదు. ఆయన చెప్పేదానిని అర్థంచేసుకోగలిగే నిశ్చలమైన మన స్థితి చాలాతక్కువమందికే ఉంటుంది. ఈనాటి మానవులకు ఆధ్యాత్మిక పద్దతుల అభ్యాసం ఆవశ్యకమే." అని స్వామీజీ సమాధానమిచ్చారు.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment