🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(255వ రోజు):--
ఆయన ఎక్కడకు వెళ్లినా, వివిధ బృందాలు చేపట్టే సమాజహిత కార్య క్రమాలకు ఆయననుంచి ప్రోత్సాహం లభించేది, అవి ఆధ్యాత్మికపరమైనా సరే, లౌకికపరమైనా సరే. కార్యక్రమా లను అమలుపరిచేవారిలో చాలా మంది ఆయన సలహాలకోసం వచ్చే వారు. దేశపర్యటనలో తన అనుభ వాలనూ, తను గమనించిన విష యాలనూ పురస్కరించుకొని ఆయన వారికి మంచి సలహాల నిచ్చేవారు. వీలైనపుడల్లా తాము చే పట్టే పథకాలను దూరదృష్టితో యోచించాలని ఉద్బోధించేవారు. ఉదాహరణకు, వరదబాధితులకు సహాయాన్ని చేపట్టిన ఒక బృందాన్ని మెచ్చుకుంటూ, "కాని, వరదరావటం కోసం చూస్తూ కూచోకండి, సేవచేయ టంకోసం. అటువంటి సేవా కార్య క్రమం అవసరంలేకుండా చేయటమే మీ లక్ష్యం కావాలి. ఇప్పుడు వరద ల్లేకపోవటంచేత పన్లేకుండా కూర్చు న్నారు మీరు, అడవుల్లేనిచోట అడవులు పెంచటం ఇప్పుడు మొద లుపెడితే, కొండలనానుకొని ఉన్న ప్రాంతాల్లో పెంచిన ఆ చెట్లు పెద్దవై, పదేళ్లలో వరదలను నిరోధిస్తాయి."
వేదాంతపు ఆదర్శాలు చాలా మంది నిపుణులు తమంతతామే ఏదో ఒక సత్కార్యాన్ని చేపట్టి ముందుకు సాగించేలా చేశాయి. కాని, కొంతమంది మాత్రం స్వామీజీ నాయకత్వం, ప్రోద్బలంమీదనే ఎక్కు వగా ఆధారపడేవారు. అటువంటి వారిని ఆయన ఎప్పుడూ నిరుత్సా హపరచలేదు. ప్రతిపరిస్థితినీ జాగ్ర త్తగా గమనించి, ఇతర మిషన్ కేంద్రాల అనుభవాన్ని కూడా సమీక రించి, వారికి కొత్త ఆలోచనలను కాని సలహాలను కాని తగినరీతిలో ఇచ్చే వారు. ఇటువంటి సహాయాలవల్ల ఆయనపై మరింతగా ఆధారపడటం జరిగేది. తమ పట్టణంలో ప్రతి సంవత్సరం జరిగే యజ్ఞకార్యక్రమా నికి స్వామీజీ వచ్చేవరకూ మిషన్ కేంద్రాలు తమ పథకాలను నిలిపి ఉంచేవి, ఆయన సలహాకోసం. 1970-71లో అనారోగ్యంనుంచి కోలు కుంటూ విశ్రాంతిలో ఉండటంచేత, చిన్మయమిషన్ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షించటానికి ఆయనకు సమయం దొరికింది. కాల క్రమేణా ఆయనతో సంప్రదించకుం డా ఏ పనీ చేయలేని 'చిన్మయ'లు ఎక్కువయ్యారు. మిషన్ లో వచ్చే ఫిర్యాదులన్నిటికీ, ఎప్పుడూ ఆయనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. 1978 లో, పఠనబృంద సభ్యుల్లో చాలామంది సమావేశాలు ఎగ్గొడుతున్నారని ఆయనకు చాలా జాబులు చేరాయి. కలం చేతిలోకి తీసుకొని, ఫిర్యాదు చేసిన నాయకు లకు ఈ జాబు వ్రాశారు :
"పఠనతరగతులలో హాజరుసమస్య గురించి ..."
వారంవారం జరిగే అధ్యయన తరగతులకు అందరూ, లేదా వీలై నంత ఎక్కువమంది హాజరయ్యేలా చేయటానికి సలహానీయవలసిందని రెండు మూడు కేంద్రాలనుంచి నాకు జాబులు వచ్చాయి. ఈ విషయంలో క్రమశిక్షణ కోసం అమలుచెయ్యాల్సి న కొన్ని నియమాలను ఈ జాబులో వ్రాస్తున్నాను .
అనారోగ్యం :- అనారోగ్యం కార ణంగా చెప్పి తరగతులకు రాకపోవ టాన్ని చిన్మయమిషన్ పఠనకేంద్రా లు క్షమించకూడదు. అనారోగ్యం విషయమై వైద్యుని ధృవీకరణపత్రా న్ని కూడా అంగీకరించకూడదు. వైద్యునివద్దకు వెళ్ళటానికి శక్తిఉంటే తరగతులకు రావటానికి కూడా శక్తి ఉంటుంది. వైద్యుని సలహాను ఫోను ద్వారా కాని, ఎవరిద్వారానైనా కాని పంపితే, ఆ వైద్యుని ఫోన్ నంబర్ కూడా తీసుకోవాలి, హాజరుకానందు కు క్షమాపణపత్రంతో పాటు.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment