Sunday, October 19, 2025

 *@ అటునుంచి ఆలోచిద్దాం@63
          తేది: 18/10/2025
""""""""""""""""'''''''""""""""""""""""""""""""

ఎవరైనా వెంటనే ఫోన్ ఎత్తకపోతే, వాళ్లకసలు మనుషులంటే
లెక్కలేదనుకుంటారు అడగగానే అప్పివ్వకపోతే పీనాసి, స్వార్ధపరుడు అని తిట్టుకుంటారు ఎప్పుడూ కలిసేవాళ్లు కలవకపోయినా
ఫోన్ చేయకపోయినా, వాళ్లకి మన అవసరం తీరిపోయింది కాబోలని నిర్ణయానికి వచ్చేస్తారు... అంతేగానీ ఒక్కసారైనా అవతలి
వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అని ఆలోచించరు కొంతమంది
అవతల ఏం జరిగిందో తెలుసుకోకుండా అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు
ఇది ఇన్ స్టంట్ యుగం పనులన్నీ అప్పటికప్పుడు
అయిపోవాలి నిర్ణయాలూ అలాగే తీసుకుంటారు
ఒక కుటుంబం కొత్తగా ఓ ఇంట్లోకి అద్దెకి దిగింది
ఆఇంటామెకి శుభ్రం కాస్త ఎక్కువే కిటికీ అద్దాలతో సహా
తరచూ శుభ్రంచేస్తూ ఉండేది ఓసారి అలా చేస్తుంటే తమ
కిటికీకి సమాంతరంగా ఉన్న పక్కింటి కిటికీ తలుపులకు
బూజులు వేళ్లాడుతూ కన్పించాయి తరచూ అది చూసి
'అలా దుమ్ము కొట్టుకుపోయిన కిటికీలు తుడుచుకోకుండా ఎలాఉంటారో' అనుకుంటూ ఉండేది...
ఓ రోజు వీళ్ల పనిమనిషి బయట ఊడుస్తూ తుడుస్తూ ఆవిడ లోపలినుంచి తుడుచుకుంటున్న కిటికీని బయటినుంచి కూడా శుభ్రంచేసింది అప్పుడు పక్క ఇల్లు
కూడా చాలా చక్కగా శుభ్రంగా కనబడింది
'అయ్యో ఇన్నాళ్లూ
మా కిటికీకి బయట ఉన్న మురికిని గమనించకుండా అవతల
వాళ్లని అపార్థం చేసుకున్నానే' అనుకుంది
ఆ ఇల్లాలు
ఆమె లాగానే చాలామంది పలు విషయాల్లో అపోహ పడుతుంటారు తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు మన
ఫోన్ ఎత్తని మనిషి ఏదైనా మీటింగులో ఉండి ఉండవచ్చు లేదా ట్రాఫిక్ లో చిక్కుకుని ఉండవచ్చు రోజూ పలకరించే
వారు వారమైనా ఫోన్ చేయలేదంటే ఏ ఆపద వచ్చిందో?
అంతమాత్రానికే అవతలి వాళ్లు కానివాళ్లు అయిపోతారా?
జీవితంలో ఎవరి ప్రాధమ్యాలు వాళ్లవి ఎవరి సమస్యలు
వాళ్లకుంటాయి మన పోస్ట్ కి లైక్ కొట్టకపోతేనో, మనకి బర్త్ డే
విషెస్ చెప్పకపోతేనో, మనల్ని వాళ్ల ఇంట్లో ఫంక్షన్ కి పిలవక
పోతేనో కోపం తెచ్చుకుని అలగడం వల్ల ప్రయోజనం ఏమీఉండదు మనకు తెలవని, వాళ్లు చెప్పుకోడానికి ఇష్టపడని సమస్యలు ఏవైనా ఉండవచ్చు
మన సహాయం అవసరమైతే వాళ్లే
అడుగుతారు మనం ఇతరులు సాయం ఆశించినట్లే మన
సహాయం కోరుకునేవాళ్లూ ఉంటారు అలాంటివాళ్లకు అండగా నిలిస్తే చాలు ప్రతి విషయానికీ రెండో కోణం ఉంటుంది...
అటునుంచి కూడా ఆలోచించగలిగినప్పుడే అపోహలకు, అపార్థాలకు తావు లేకుండా మనుషుల్ని బేషరతుగా ప్రేమించగలు
గుతాం ఎదుటివాళ్లను అర్థం చేసుకుని కలుపుకొని పోతే
బంధాలు గట్టి పడతాయి జీవితం మరింత
హ్యాపీగా
ఉంటుంది, అంతే...!*

No comments:

Post a Comment