Tuesday, October 28, 2025

 *చేసే పాపాలకు యమలోకంలో శిక్షలు యేముంటాయి?*

•  పరుల ధనాన్నీ, పరస్త్రీనీ ఆశిస్తే అంధకారంలో వుంచి కర్రలలో బాదుతారు.

•   స్త్రీల ధనాన్ని తీసుకుంటే కటిక చీకటిలో నరికిన చెట్ల మీద పడవేస్తారు. 

•  తల్లీ, తండ్రీ బాగోగులు చూడనివాడిని, నిప్పులు చెరిగే సూర్యుడి క్రింద మాడి మసయ్యేలా చిత్రవధ చేస్తారు. 

•  సంభోగించకూడని వారితో సంభోగిస్తే మండుతున్న ఇనప మూర్తిని అనగా స్త్రీ మూర్తిని స్త్రీ, పురుషమూర్తిని పురుషుడూ కౌగిలించుకునేలా చేస్తారు. 

•  అబద్ధాలు ఆడిన వారిని 100 యోజనములు గల పర్వతము పైనుంచి పడత్రోసి పచ్చడి చేస్తారు. 

ఇలా ఒక్కో పాపానికీ ఒక్కో శిక్ష ఉంటుంది. మొత్తం 84 లక్షల నరకాలు ఉన్నాయి.  గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్య కృత్యాలలో ఎంత పాపం చేస్తున్నామో, మరెంత పాపాన్ని మూటగట్టుకుంటున్నామో అర్థమవుతుంది.        

No comments:

Post a Comment