Thursday, October 23, 2025

 అరుణాచల👏
రమణులు తాము సుబ్రహ్మణ్య స్వామి అవతారము అని స్వయముగా తెలుపు సంఘటన :

రమణ మహర్షి అరుణాచలము మీద ఉన్న విరూపాక్ష గుహలో ఉండే రోజులతో భగవాన్ దర్శనం చేసుకున్న వారు ఎందరో వున్నారు.   అందులో కొంత మంది భక్తులు మహర్షిని స్తుతిస్తూ ఎన్నో శ్లోకాలు రచించారు. 

ఎంతో కాలంగా మహర్షికి సేవ చేస్తున్న ఒక సేవకుడు తనలో తాను ఇలా అనుకున్నాడు  అయ్యె ఎందరో భక్తులు భగవాన్ మీద చక్కటి శ్లోకాలు రాస్తున్నారు.     కానీ తానేమీ రాయడం లేదని విచారించేవారు.    ఈ విషయం తెలిసిన మహర్షి తానే ఆ సేవకుని పేరుతో ఈ విధంగా రాసారు :

షణ్ముఖా ( ఆరు ముఖములు కలవాడా ) ! మానవ రూపంలో  తల్లి అలఘుమ్మ ,  తండ్రి సుందరానికి తిరుచ్చుళిలో జన్మించి భక్తుల భయాందోళనలను తొలగించావు. 

నీకు ఉన్న 12 చేతులతో,  12 రచనలను అందించావు (అయిదు శ్లోకాలు,  ఉపదేశ ఉండియర్,  ఉల్లదు నార్పదు,  అనుబంధం,  ఏకాత్మ పంచకం,  అప్పడం పాట,  ఆత్మవిద్య కీర్తనం,  నేనెవరు?).

కర్మ పరిపక్వము కావడానికి నీ పాదాలను శరణు వేడమని  అన్నావు.    మనః కమలానికి చిహ్నమైన మయూర ( నెమలి ) వాహనం ఎక్కి జ్ఞానశూలాన్ని విసురుతూ భువిలో  "అరుణాచల రమణుడు" అయ్యావు.    

No comments:

Post a Comment