Thursday, October 9, 2025

అందరికీ చెప్తున్నా! దయచేసి ఈ కల్చర్ కి అలవాటు పడకండి!!| Food Desert | Dr Manthena Satyanarayana Raju

అందరికీ చెప్తున్నా! దయచేసి ఈ కల్చర్ కి అలవాటు పడకండి!!| Food Desert | Dr Manthena Satyanarayana Raju

https://youtu.be/8m7-Cys4xGM?si=ONTeSBcLdyAGBekA


ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పోషకాలు ఉన్న ఆహారం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పోషకాలు లేని ఆహారం అనారోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పోషకాలు ఉన్న ఆహారం యొక్క రుచి కంటే ఏ పోషకాలు లేని ఆహారం ఎక్కువ రుచినిస్తూ ఉంటుంది ఎక్కువ మనిషిని ఆనందింపజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పోషకాలు లేని ఆహారం కంటే పోషకాలు ఉన్న ఆహారమే కాస్ట్లీ అయిపోయింది ఈరోజు అందుకని జనాలు ఎక్కువమంది టేస్ట్ గా ఉండటంతో పాటు ఖర్చు తక్కువలో లభిస్తున్నాయి కాబట్టి పోషకాలు లేని ఆహారానికి ఎక్కువ ఇష్టపడి తినటం వల్ల వయసు రాకుండా రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. 60 70 సంవత్సరాలు పైబడిన తర్వాత రావాల్సిన హై బీపీను పక్షవాతాలు కీళ్ళ నొప్పులు గుండె జబ్బులు క్యాన్సర్లు గాని మతిమరపు సమస్యలు గాని ఇవన్నీ ఏజ్ రాకుండానే ఈ రోజుల్లో రావటానికి పోషకాలు లేని రుచికరమైన ఆహారం చవకలో దొరుకుతుందని ఎక్కువగా తినటమే కారణం ఫుడ్ డెసర్ట్ అనేది పేరు బాగా వినపడుతున్నది కదా ఈ మధ్య ఏమిటి అనుకుంటున్నారు కదా ఈ ఫుడ్ డెసర్ట్ అంటే డెసర్ట్ అంటే ఎడారి ఎడారిలో ఒక ఇసుకు తప్ప ఏమి ఉండదు కదా ఎడారిలో ఏమి లేనట్లు ఎండమావి మాత్రమే ఉన్నట్టు ఎడారిలో ఎండమావలు చూడండి నీళ్లు ఉన్నట్టు అనిపిస్తే ఏమి ఉండవు అట్లాగే ఎడారిలో ఏమీ లేనట్టే గానీ ఇప్పుడు సమాజంలో ఎక్కువమంది రుచికరమైన ఆహారాన్ని తినటం వల్ల ఏమీ ఉండట్లేదు ఇందులో ఐసుకు తప్ప ఎడారిలో ఏమి కనపడినట్టు మనక ఇక్కడ పదార్థం రుచికి కనపడుతుంది తప్ప పోషకాలు ఏమి ఉండటం లేదు అందుకని ఫుడ్ డెసర్ట్స్ అంటే పోషకాలు ఏమీ లేని ప్రాసెస్ చేసిన రుచినిచ్చే ఆహార పదార్థాలు ఇందులో హై కార్బ్స్ హై ఫ్యాట్ హై సాల్ట్ హై షుగర్ తో పాటు ఫైబర్ లేకుండా ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అంటే సాల్ట్ షుగరు ఫ్యాట్ కార్బ్స్ ఇవన్నీ ఎక్కువ ఉండి ఫైబర్ లేకుండా ప్రోటీన్ లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇక న్యూట్రిషన్ లేకుండా ప్రాసెస్ చేసిన హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటన్నిటిని ఫుడ్ డెసర్ట్స్ అంటారు. ఈ ఫుడ్ డెసర్ట్స్ ఎక్కువగా వాడుకోవడానికి ఎందుకు అలవాటు పడుతున్నారు అంటే ఆరోగ్యకరమైన ఆహారము పోషకాలు ఉన్న ఆహారము ఖర్చు పెరగటం వల్లే వాటిని కొనుక్కునే స్తోమత లేకపోవటం వల్లే జనాలు చవకలో ఏదో ఒకటి తింటే పనైపోతుంది కదా తక్కువ ఖర్చులు అయిపోతుంది పైగా టేస్ట్ గా ఉంటున్నాయి కదా అని ఇలాంటి రుచికరమైన హాని కలిగించే పోషకాలు లేని ఆహారానికి అలవాటు పడుతున్నారట ముఖ్యంగానండి ఆరోగ్యకరమైన ఆహారం తినాలంటే ₹5000 రూపాయల నుంచి 7000 రూపాయలు ఒక నెలకు ఖర్చు పెట్టాలి అంటే కొంచెం పాలిష్ పట్టని ధాన్యాలు కూరలు ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ పండ్లు ఎక్కువ విత్తనాలు గాని కొంచెం నట్స్ గాని పప్పు ధాన్యాలు గాని ఇలాంటివి బాగా కొనుక్కోవాలి అంటే కాస్త పంచదార బదులు ఆర్గానిక్ బెల్లమో తేనో ఖర్జూర పొడో ఖర్జూరాలు ఇట్లాంటివి కొనుక్కొని వాడుకోవాలంటే 5000 నుంచి 7000 ఖర్చు పెట్టాలి. నిజంగా అంత ఖర్చు పెడితే ఆరోగ్యాన్ని కొనుక్కోలేం కానీ మంచి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు. 5000 7000 రూపాయలు ఒక వ్యక్తికి అయితే మరి కుటుంబానికి దగ్గర దగ్గర 20,000 పాతికివ000 రూపాయలు సుమారుగా నెలంతర ఖర్చు పెట్టాలి. ఇంట్లో నలుగురు ఉంటే 20 పాతికివేలు కేవలం ఫుడ్ కోసమే ఖర్చు పెట్టాలి అంటే ఎంతమంది భరించగలుగుతారు సత్యనారాయణరా చెప్పిన ఆహారం తినటానికిఅని నన్ను కూడా కామెంట్ చేస్తారు కరెక్టే హాస్పిటల్కి వెళ్తే బిల్లు మన లైఫ్ ఎంత తగ్గిపోతున్నది ఆయుష్యు ఎంత తగ్గిపోతున్నది ఎంతమంది ఎన్ని సిక్క ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నాం వీటిన్నిటిని ఆలోచిస్తే ఇక్కడ ఖర్చు తక్కువే కానీ మనిషికి ముందు బాగున్న ఆహారం వైపు మనసు వెళ్తుంది కాబట్టి ఫుడ్ డిసర్ట్స్ వైపు ఎక్కువగా మైండ్ వెళ్ళిపోతున్నది. అవి ఇంకా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి అన్ని వాళ్ళలో దొరుకుతున్నాయి పళ్ళు విత్తనాలు అన్ని ప్రాంతాల్లో దొరకవు గానీ మరి ఇలాంటి టేస్టీ ఫుడ్స్ అని ప్యాకెట్ ఫుడ్స్ అని పల్లెటూర్లో ఉండే డబ్బా కొట్లో కూడా బాగా దొరుకుతున్నాయి. అందుకని అలాంటివి తినేస్తున్నారు. ఇలా రోజు రోజుకి ఈ ఫుడ్ డిసర్ట్స్ పెరగటం హెల్దీ ఫుడ్ తినటం తగ్గిపోవటం వల్ల పల్లెటోళ్ళల్లో పట్టణాల్లో ఏం మార్పులు వచ్చేస్తున్నాయని నాలుగైదు ఇన్స్టిట్యూషన్స్ దేశాల వారు కలిసి పరిశోధన చేశారు ముఖ్యంగా మన దేశంలో అయితే సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ వారు ఇండియా ఇంకా మన దేశంలో కొంతమంది ఇతర దేశాలు కొంతమంది సంయుక్తంగా కలిపి చేసిన పరిశోధనలో ఈ ఫుడ్ డెసర్ట్స్ వల్ల ఒబిసిటీ డయాబెటిస్ ఎంత పెరుగుతున్నాయి 2005 నుంచి 2023 మధ్యలో పట్టణాల్లో ఎంత పెరిగింది పల్లెటూర్లలో ఎంత పెరిగింది ఫుడ్ డెసర్ట్స్ వల్ల వచ్చిన ఒబేసిటీ డయాబెటిస్ ని వీళ్ళు ఇవ్వటం జరిగింది. పట్టణాల్లో మగవారిలో 46% ఒబేసిటీ దగ్గర దగ్గర ఈ 20 ఏళ్లల్లో పెరిగిపోయింది. అదే ఆడవారిలు అయితే 43% ఒబిసిటీ పెరిగిందట సిటీలో ఉండే వారికి ఈ ఒబిసిటీ ది పల్లెటూళ్లల్లో మగవారిలో అయితే 35% పల్లెటూర్లలో ఒబీసిటీ పెరిగింది ఆడవార్లు అయితే 32% పెరిగింది అనేది ఈ 20 సంవత్సరాల యొక్క గ్యాప్ లో వచ్చిన మార్పు అని ఈ నాలుగైదు సంస్థలు చేసిన పరిశోధనలో తేలిన సారాంశం అన్నమాట ఇది ఫుడ్ డెసర్ట్స్ ద్వారా ఒబీసిటీ పెరగటం అనేది ఇంత స్పీడ్ గా పెరగటానికి ఫుడ్ డిజర్ట్స్ కారణం అని వీళ్ళఇచ్చారు. ఇక షుగర్ వ్యాధి పట్టణాల్లో తీసుకుంటే మగవారిలో 30 నుంచి 35% పెరిగింది పట్టణాల్లో ఆడవారిలో 28 నుంచి 32% షుగర్ వ్యాధి పెరిగిందట ఈ ఫుడ్ డెసర్ట్ వల్ల సిటీలో ఉండే వారికి షుగర్ వ్యాధిలో పెరుగుదల ఇంత ఎక్కువగా ఉన్నది అని ఇవ్వటం జరిగింది. ఇక షుగర్ వ్యాధి పల్లెటోళ్లల్లో ఉండే వారికి ఎలా పెరిగింది? 2005 నుంచి 2023 మధ్యలో మగవారిలో 18 నుంచి 21% పల్లెటోళ్లలో షుగర్ వ్యాధి పెరిగింది ఆడవారిలో 14 నుంచి 18% షుగర్ వ్యాధి పల్లెటోళ్ళల్లో పెరిగిందన్నమాట ఈ మధ్య ఐదర ఏళ్ల నుంచి ఈ పర్సెంటేజ్ ఇంకా పెరుగుతున్నది ఇంకొక ఇప్పటి నుంచి నాలుగైదే ఏళ్ల లోపు గనక తీస్తే దీనికి డబుల్ అయిపోయే అవకాశం ఉన్నది ఎందుకంటే పల్లెటోళ్ళలు కూడా మరి డోర్ డెలివరీ సదిపాయం ఆర్డర్ చేసుకుంటే చిటికలో వచ్చే సదిపాయం ఇవన్నీ బాగా వచ్చేస్తున్నాయి కదా ఆన్లైన్ ఫెసిలిటీస్ ద్వారా అందుచేత భవిష్యత్తులో ప్రతి ఫ్యామిలీలో ఒబేసిటీ డయాబెటిస్ అనేది నలుగురిని తీసుకుంటే ఫ్యామిలీలో ముగ్గురికి ఒబేసిటీ డయాబెటిస్ ఉండే రోజులు రాబోతున్నాయి ఐదారఏళ్ల లోపే కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కాస్త మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులో ఒక 30 40% సంపాదన అన్నా ఆహారం కోసం కేటాయించగలిగితే ఒక్కొక్క వ్యక్తి మిగతా వాటిని మిగతా వాటికి ఎందుకంటే ఒక 15వ000 నెలకు సంపాదించామ అనుకోండి ఒక 5000 మీ ఆహారం కోసం ఒక 10,000 దానికోసం మరి ఈ ఫుడ్ డెసర్ట్స్ వల్ల పోషకాలు లేని టేస్టీగా ఉండే ఆహారం ఖర్చు తక్కువలో వస్తుందని తినటం వల్ల ఈ ఒబీసిటీ డయాబెటిస్ అనేది ఇంత రేంజ్లో పెరిగిపోతున్నది కాబట్టి ఇప్పటికైనా కాస్త మనం ఆలోచించి కొస్త కాస్త రేట్ ఎక్కువ ఉన్నా తక్కువ రేట్లో మంచి ఆహారాలు ఏవైతే దొరుకుతుంటాయో బాదం జీడిపప్పులు కొనుక్కోపోయినా పుచ్చగంజలో గుమ్మడి గింజలో పొద్దు తిరేడు పప్పు కాస్త వేరుశనపప్పులు నువ్వులు కొబ్బరి ఇలాంటివి తినగలిగితే చాలు పాలిష్ పట్టకుండా ఉండే ముడి బియ్యము రాగులు జొన్నలు సజ్జలు లాంటివి చవకలో జరుగుతాయి ఇలాంటివి ఎక్కువ తింటే ఖర్చు తక్కువలో పనియపోతుంది కాస్త పొట్టు తీయని మినప్పప్పు పెసరపప్పు శనగపప్పు ఇట్లాంటివి కూరగాయలు ఆకుకూరలు ఏ కూరగాయలు ఏ ఆకుకూరలు చవకుంటాయో అలాంటి వాటిని ఎక్కువగా ఎక్కువగా మనం ఇష్టపడుతుంటే ఇక అంజీరా కిస్మిస్ లాంటివి కొనుక్కోపోయినా కాస్త ఖర్జూరాలు పండ్లల్లో జామకాయ అరిటిపండు దీనితో పాటు కొద్దిగా బొప్పాయి కర్బూజా పుచ్చకాయ ఇట్లాంటివి కొద్దిగా చవగా ఉండే పళ్ళు దానిమ్మకాయలు ఆపిల్లు కొనుక్కోపోయినా నష్టం లేదు. సాధ్యమైనంతవరకు ఇట్లా తక్కువ ఖర్చులో మంచి ఆహారాన్ని కొనుక్కోవడానికి అలవాటు పడితే డబ్బులతో ఆరోగ్యాన్ని కొనుక్కోలేం మంచి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చుని మాత్రం మరవకండి కాబట్టి టేస్టీగా ఉంటున్నాయి. సింపుల్ గా ఈజీగా దొరుకుతున్నాయని ఫుడ్ డిజైర్స్ వైపు వెళ్ళిపోయామా చేజేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ అనారోగ్యాన్ని డబ్బులతో కొనుక్కున్నట్టు అవుతుందని గమనించి అలాంటి వాటికి మనము మన పిల్లలము దూరమైతే మంచిదని అందరికీ విజ్ఞప్ చేస్తూ నమస్కారం

No comments:

Post a Comment