🙏 *రమణోదయం* 🙏
*ఏ ప్రాణీ తనను చూసి భయపడకుండునట్లు అందరికీ అభయ వచనములు ఇచ్చి, జ్ఞాని శాశ్వతానంద మగ్నుడై ఉంటాడో, అతడు, ఆ జ్ఞాన సమాధి నిష్ఠుడు, యముణ్ణి చూసినా భయపడడు.*
వివరణ: *జనులకు తమ శరీరాలపై అభిమానం ఉంటుంది. యముడు తమ శరీరాలను వేరు చేస్తున్నాడనే భయంతోనే మరణ భయం అందరికీ సహజంగా కలుగుతుంది. అయితే జ్ఞాని, తాను ఈ శరీరం కాదనే జ్ఞానానుభవంతో జీవన్ముక్తుడుగా (జీవించినపుడే శరీరం నుండి తను విడివడిన వాడై) ఉండుట చేత అతనికి యముడంటే భయం లేదు. భయపడవలసిన అవసరం కూడా లేదు. యముడు అంటే భయం లేనివాడగుట చేత జ్ఞాని ఒక్కడే నిర్భయంగా ప్రాణులను నిజంగా దయ చూపించగలవాడని భావం.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.810)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌷🙏🌷
No comments:
Post a Comment