*🌻మనం దైవానికి నచ్చితే చాలు🌻*
ఇదివరకు జరిగినది ఒక కల లాంటిది, ఇక జరగబోయేది మనం రాయాల్సిన కథ లాంటిది.
మనిషి నోటిని రెండు సందర్భాల్లో అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండోది మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాలను కాపాడుతుంది.
అనేక బిందెలతో నీళ్లు పోసినా చెట్టు వెంటనే కాయలు కాయదు. అలాగే మనం ఎంత కష్టపడ్డా, ఫలితం వెంటనే రాదు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి.
హేళన చేసి నవ్వేవారిని చేయనివ్వు, మాటలతో గాయం చేసేవారిని చేయనివ్వు. నీ మీద పడి ఏడ్చే వారిని మాత్రం గౌరవించు. ఈ ప్రపంచంలో ఎవరికీ నచ్చకపోయినా, భగవంతుడికి నచ్చితే చాలు.
గెలుపు తలుపులు ఎప్పుడూ మూసుకుని ఉంటాయి. వాటిని మన ప్రయత్నం, పట్టుదలతోనే బద్దలు కొట్టి తెరవాలి.
కొసరి కొసరి వడ్డించే వారిని, కసిరి కసిరి మంచి చెప్పే వారిని దూరం చేయొద్దు. అలాంటి వారుంటే అది అదృష్టం.
*🔥 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🔥*
No comments:
Post a Comment