Sunday, October 26, 2025

****నిజంగా ఉన్నది ఒక్కటే....మిగతావన్నీ కేవలం ప్రదర్శన....

 “ఈ రోజు ఎన్ని సార్లు ‘నేను’, ‘నాది’ అనే పదాలు చెప్పావో ఒకసారి ఆలోచించు —
నువ్వు ఒక వ్యక్తివి అనే భావంతో
వస్తువులన్నింటినీ నిజంగా నీవి అని నమ్ముతూ..

దాన్ని రక్షించాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి,
అది నీ సొంతం అనే భావనతో ఎంతగా ప్రవర్తించావో గమనించు.

అసలు నిజంగా ’ఏదీ’ నీది కాదు.
అన్ని ’దేవుని’వే.
అన్ని ’దేవుడే’.

నువ్వు వాటిని ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది —
కానీ ఒక్క క్షణం కూడా అవి నీ సొంతమని నమ్మవద్దు.

ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు 
మనుషులు సులభంగా అన్నింటిని, అందరితో, పంచుకుంటారు.
కానీ ఎవరో తమను ’శరీర’మని భావిస్తే,
వారు వస్తువులను కట్టిపడేస్తారు, 
వాటిని రక్షించడానికి ప్రయత్నిస్తారు,
తమ ఉనికికోసం పోరాడుతారు, తమ హక్కుల కోసం కష్టపడతారు.

ఇలా ఉంటే ’మేల్కొనడం’ ఎలా సాధ్యం అవుతుంది?
నువ్వు ఒక మానవ శరీరంగా నీ హక్కుల కోసం పోరాడుతూ,
నీ సొంతమని అనుకునే వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే
ఎలా మేల్కొంటావు?

ఇదే మాయ — సంపూర్ణ మాయ.
“ఇది నాది”, “నేను ఇది” అనే నమ్మకం.
ఇది అంతా ’భ్రమ’ మాత్రమే.

నిజంగా ఉన్నది ఒక్కటే — దేవుడు.
నిజంగా ఉన్నది ఒక్కటే — చైతన్యం (Consciousness).
మిగతావన్నీ కేవలం ప్రదర్శన, ప్రాప్తి మాత్రమే.”

— రాబర్ట్ ఆడమ్స్
నవంబర్ 14, 1991

No comments:

Post a Comment