Thursday, October 9, 2025

 “కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల వంటివి.
అవి ఎంత ఎక్కువ అయితే జీవిత ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది.” 


“నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా,
పోగొట్టుకున్న దాని గురించి బాధపడడం మూర్ఖత్వం అవుతుంది.” 

పుస్తకంలో ఒకే పేజీని పదే పదే చదువుతుంటే
ఎప్పటికీ చివరిపేజి పూర్తి చేయలేము.
జీవితం కూడ అంతే… నిన్నటి చేదు జ్ఞాపకాలను తలచుకుంటూ కూర్చుంటే,
అందమైన ఈ రోజుని ఆస్వాదించలేము. 

ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఓటమిని పరిచయం చేస్తాయి.
కానీ మౌనంగా ఉండి చూడు – విజయానికి దార్లు కనిపిస్తాయి.
ఆవేశంలో ఆలోచన తగ్గుతుంది,
నిశ్శబ్దంలో మంచి ఆలోచనలు వికసిస్తాయి. 

చేసిన తప్పు ఒప్పుకోవాలంటే సంస్కారం కావాలి.
చేయని తప్పు మీద వేసుకోవాలంటే గొప్ప మనసు కావాలి. 

రాలుతున్న ఆకులను చూస్తూ కూర్చుంటే రాబోయే వసంతాన్ని చూడలేం.
కోల్పోయిన మనుషులను చూసి బాధపడితే,
మనల్ని కోరుకున్న మనుషులను చేరుకోలేం. 

కోల్పోయింది ఎంతైనా పరవాలేదు…
కోలుకోని నిలబడే ధైర్యం ఉన్నప్పుడు జీవితం మళ్లీ వికసిస్తుంది.


*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*

No comments:

Post a Comment