Monday, October 13, 2025

 *#ఆలోచనలు*

"మన ఆలోచనలు ఎలా ఉంటాయో, మనం అలానే అవుతాం" అని అన్నాడు స్వామీజీ తన శిష్యులతో. 
“ఒక ఆలోచన నాటితే దాని ఫలాన్ని తప్పక అందుకుంటారు. దీనికి ఒక చిన్న కథ చెప్తాను వినండి".
ఒక రాజు తన రాజ్యంలో ఏనుగుపై సంచరిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా బజారులోని ఒక దుకాణం దగ్గర అయిపోయాడు. "ఎందుకో నాకు తెలియట్లేదు, కాని ఈ షాపు యజమానిని ఉరిశిక్ష వేయాలనిపిస్తోంది" అని తన మంత్రితో అన్నాడు రాజు.
విన్న మంత్రి నిర్గాంత పోయాడు. 'ఎందుకని' అని రాజును అడిగేలోపే రాజు ముందుకు వెళ్లిపోయాడు.  మరుసటి రోజు మంత్రి ఒక సాధారణ పౌరుని వలె ఆ గంధపు చెక్కల యజమానిని చూడటానికి దుకాణం దగ్గరికి వెళ్ళాడు. మాటలు కలిపి, 'వ్యాపారం ఎలా ఉంది?' అని అడిగాడు గంధపు చెక్కలు అమ్మే దుకాణం  యజమానిని మంత్రి. 
విచారంగా అన్నాడు, "వ్యాపారం ఏమీ సరిగా సాగడం లేదు. ఎవరూ గంధపు చెక్కలు కొనడానికి రావట్లేదు. అందరూ వచ్చి గంధపు చెక్కుల నాణ్యత చాలా బాగుంది అని మెచ్చుకునేవారు. గంధం చెక్కల రంగు, వాసన చూసి ఆనందించే వారే కానీ, కొనేవాళ్లు అసలు ఉండటం లేదు.  అతనికి ఉన్న ఒకే ఒక్క ఆశ ఉండేది...కనీసం ఆ దేశపు రాజు చనిపోతే, గంధపు చెక్కలు అతని దహనసంస్కారాలకి కొంటారు కదా అని 
ఆ చుట్టుపక్కల ఎక్కడ గంధపు చెక్కల దుకాణాలు లేవు. కాబట్టి రాజు చనిపోయినప్పుడు తప్పనిసరిగా తన వద్దకే వచ్చి గంధపు చెక్కలు కొంటారు అని ధీమా!   గంధపు చెక్కలను ఆ సమయంలో అమ్మి ధనం సంపాదించవచ్చు అని అనుకున్నాడు . 
మంత్రికి ఇది విన్నాక రాజు అతని దుకాణం ముందు ఆగి ఇతనికి ఉరిశిక్ష వేయాలని ఎందుకు అనుకున్నాడు అర్థమైంది. 
ఆ దుకాణం యజమాని చెడు ఆలోచన ఆ దుకాణానికి దగ్గరగా వెళుతున్న రాజును తాకి ఉండవచ్చు. దాంతో రాజు కూడా అతనిని చంపాలి అనే దురాలోచన వచ్చి ఉండవచ్చు. 
మంత్రి ఒక్కక్షణం ఈ విషయమై ఆలోచించాడు. తను ఎవరో చెప్పకుండా, గంధపు చెక్కల యజమాని నుంచి కొన్ని గంధపు చెక్కలను కొన్నాడు. ఆ దుకాణం యజమాని ఎంతో సంతోషించాడు. గంధపు చెక్కలను చక్కగా ఒక పొట్లంలో చుట్టి మంత్రికి ఇచ్చాడు.
మంత్రి రాజభవనానికి తిరిగి వచ్చి, నేరుగా రాజు సభ నడుపుతున్న సభా మందిరానికి వెళ్ళాడు.  "గంధపు చెక్కల దుకాణపు యజమాని గంధపు చెక్కలను తమకు బహుమతిగా ఇచ్చాడు" అని మంత్రి  గంధపు చెక్కల పొట్లాన్ని రాజు చేతిలో ఉంచాడు. 
రాజు ఆశ్చర్యపోయాడు. గంధపుచెక్కల పొట్లాన్ని విప్పినప్పుడు రాజు చాలా ఆనందించాడు ..అందులో నుంచి చక్కటి పరిమళం ఆయన ముక్కుపుటాలను తాకింది.ఆదిత్యయోగీ.
రాజు ఆనందించిన వాడై కొన్ని బంగారు నాణాలను గంధపు చెక్కల యజమానికి బహుమతిగా పంపించాడు. 
అదే సమయంలో రాజు తన మనస్సులో అతనికి ఉరిశిక్ష వేయాలన్న ఆలోచన వచ్చినందుకు చాలా సిగ్గుపడ్డాడు. 
అక్కడ రాజు పంపిన బంగారు నాణేలను తీసుకున్న గంధపు చెక్కల దుకాణపు యజమాని కూడా ఆశ్చర్యపోయినాడు! రాజు యొక్క మంచి గుణగణాలను పొగడటం ప్రారంభించాడు, ఎందుకంటే రాజు పంపిన బంగారు నాణాల వల్ల తన పేదరికం నుంచి బయటపడ్డాడు! 
కొంత సమయం తర్వాత అతను రాజు పట్ల తనకు కలిగిన చెడు ఆలోచనల గురించి పశ్చాత్తాప పడ్డాడు.  
*
మనం ఒక మనిషి పట్ల మంచి ఆలోచన కలిగి ఉంటే అది మనకు వెనక్కి మంచిని కలిగిస్తుంది. అదే మనం ఒక వ్యక్తి పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉంటే మనకు మళ్ళీ ఏదో ఒక రూపంలో చెడు ప్రభావం తగులుతుంది. 
*
"కర్మ అంటే ఏమిటి?" అడిగాడు స్వామీజీ.
చాలామంది "మన మాటలు, మన చేతలు, మన పనులు, ఇవే కర్మ అంటే" అని అన్నారు. 
స్వామిజీ తన తలను  అడ్డంగా ఊపారు కాదనునట్టుగా, "నీ ఆలోచనలే నీ కర్మ" అని ముగించారు..*.       

No comments:

Post a Comment