Saturday, October 18, 2025

 ఒక చీమ పూలదండలో దాగి ఉంది.
ఆ పూలదండను రాజు మెడలో వేసారు.
చీమ నెమ్మదిగా పాకుతూ కిరీటం పైకి చేరుకుంది.
దాన్ని చూసినా ఎవరూ దాన్ని తొలగించే సాహసం చేయలేదు.

రాజు స్వయంగా గ్రహిస్తే తప్ప,
దానిని ఎవరూ తాకే ధైర్యం చేయలేరు.

అంటే —
మనం ఎవరితో ఉన్నావన్నది మన స్థాయి, గౌరవం, గుర్తింపును నిర్ణయిస్తుంది.

అందుకే —
మహాత్ములతో, సత్పురుషులతో సాంగత్యం కలిగి ఉండాలి.
వారు మనని మందలించినా,
వారి సన్నిధిని వదులుకోకుడదు 

వారి సాన్నిధ్యం మన దుర్గుణాలను పారద్రోలుతుంది,
మన జీవితాన్ని గౌరవనీయమైనదిగా మారుస్తుంది.

🙏🙏🙏🙏

No comments:

Post a Comment