*జై శ్రీమన్నారాయణ🕉️*
*ఆచార్య సద్భోదన*
➖➖➖
**చాలామంది ఆధ్యాత్మిక* *సాధనలను ముసలితనంలో* *చేయవచ్చుననీ, జీవితంలోని* *రకరకాల భోగభాగ్యాలను ముందు* *అనుభవిద్దామనీ అనుకుంటూ* *ఉంటారు* .
*వారు తమ శక్తిలో చాలా భాగం భౌతిక సుఖాలలో ఖర్చుపెట్టడం వలన కష్టతరమైన ఆధ్యాత్మిక సాధనలు చేసే అవకాశం వారికి ఎన్నడూ రాదు. వారు ఆధ్యాత్మిక సాధనలు మొదలు పెట్టినా, చేయడానికి కావల్సిన శక్తి, ఓర్పు లేక వారికి అంతగా మేలు కలగదు.*
*అసంఖ్యాకులైన జనులు తమ జీవితం వ్యర్థమై పోయిందన్న విషయాన్ని తెలుసుకునే సరికి సమయం మించిపోతుంది. అయితే ఆ విషయమే తెలియక ఇంకా నవయౌవనంలోనే ఉన్నామనుకుంటూ భౌతిక సుఖాల వెంట పరిగెట్టే వృద్ధులకంటే వీరు నయం.*
*ఆధ్యాత్మిక జీవనాన్ని వీలైనంత తక్కువ వయస్సులోనే ప్రారంభించాలి. ఆధ్యాత్మికత అనే బీజాన్ని మనలో మనం ముందుగా నాటుకోకపోతే వయసు ముదిరిపోయాక ఆ స్వభావాన్ని అలవరుకోవడ కష్టం.*
*బంధవిముక్తి, శోకనివృత్తి చేసుకుని పారమార్థిక సిద్ధిని పొందడమన్నదే కనుక మీ ఆదర్శమైతే ఇప్పుడే సాధన మొదలుపెట్టండి.*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
No comments:
Post a Comment