Thursday, October 2, 2025

 మహాత్మా గాంధీ గారి హత్య జరిగిన రోజుల్లో ..
ఒక మతి భ్రమించిన వ్యక్తి ‘రమణమహర్షి’ వద్దకు వచ్చి
“గాంధీ ని చంపిన గాడ్సే అందరి కి తెలిసాడు. నేను నిన్ను చంపి కీర్తి సంపాదిస్తాను” అన్నాడు ఉగ్రంగా.
భగవాన్ “చంపు నాయనా. నాకీ దేహ బాధ తప్పుతుంది” అన్నారు, శాంతి వందనం తో.
ఇంతలో ఆశ్రమ వాసులు అతన్ని అటకాయించి, దూరంగా తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశారు.
భగవాన్ వారించి అతన్ని తనవద్దే ఉంచుకుని తనతో భోజనానికి తీసుకువెళ్లాడు. రెండు రోజులు అతను ఆశ్రమం లో ఉండి పోయాక అతని తాలూకు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు.
జరిగిన విషయం తెలుసుకుని “మన్నించండి. అతనికి మతిస్థిమితం లేదు. ఏదయినా తరుణో పాయం ఉపదేశించండి.” అని భగవాన్ ని వేడుకున్నారు.
“గాయత్రి చేయించండి” అన్నారు భగవాన్.
కొన్ని నెలల తర్వాత అతను తిరిగి వచ్చాడు. “పరిస్థితి చాలా మెరుగయ్యిందని. సాదారణ జీవితం లోకి తనని గాయత్రి మంత్రం తీసుకువచ్చిందని ధన్యవాదాలు చెప్పుకోటానికి వచ్చానని” చెప్పి భగవాన్ ఆశీర్వచనం తీసుకున్నాడు.
(ఈ సంఘటన ‘రమణ వాణి ‘ లో ప్రచురింపబడింది)

No comments:

Post a Comment