అరుణాచలం వెళ్లలేని వారు చిన్న అరుణాచలం వెళితే చాలు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే మార్గంలోని నర్సాపురం గ్రామంలోని శ్రీరమణ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఇది చిన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచింది. అరుణాచలం లాగే గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న అష్టలింగాలను దర్శనం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1008 బ్రహ్మ సూత్రాల లింగాలను ఒకే సారి దర్శనం చేసుకునే భాగ్యం ఉంది. ఈక్షేత్రం మరో విశిష్టత ఏమిటంటే 12 జ్యోతిర్లింగాలకు భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకునే అవకాశం ఉంది. అరుణాచల క్షేత్రానికి వెళ్ళలేని భక్తులు చిన్నఅరుణాచలం సందర్శిస్తే ఆ అనుభూతిని పొందవచ్చు..
No comments:
Post a Comment