*"అమర చైతన్యం"*
*( శ్రీ రమణ మహర్షి బోధనలు )
*ప్రశ్న: ఈ ఆలోచనల నుంచి తప్పించుకునేదెలా..*
*జవాబు: నీవు అనవసరమైన ఆలోచనలతో నిండిపోయినావు. అదే అసలు సమస్య. నీవు ఉన్నట్లుగానే వుండు. ఆలోచనలన్ని మాయమౌతాయి. ఆలోచనలు, స్పందనలు ఎవరికి వస్తున్నాయి. నీవు అతిగా ఆలోచించడానికి బాగా అలవాటు పడిపోయినావు. అందువల్లనే ఆలోచించకుండా ఉండలేక పోతున్నావు.*
*ప్రశ్న: 'అహం బ్రహ్మస్మి' అని అనుకుంటూ వుండేదా.. అది సరియైన అభ్యాసమేనా..*
*జవాబు: అలా ఎందుకు అనుకోవాలి.. నిజానికి నీవు బ్రహ్మానివే. నేను మనుష్యుడునా, నేను పురుషుడునా అని ఎవరు అనుకుంటా వుంటారు. ఎవరైనా ఎపుడైనా నేను మనుష్యుడను కానేమో అని సందేహం వస్తే నేను జంతువును అని అంటే అపుడు కాదూ నేను మనుష్యుడనే అని చెప్పవచ్చు. తప్పు అభిప్రాయము పోగొట్టుకునేందుకు అలా అనుకొనవచ్చును. దృఢపడింతర్వాత ఇక అలాంటి ఆలోచన అవసరం లేదు. సాక్షాత్కారమైతే ఇక సిద్ధాంతాలతో నమ్మకాలతో పనిలేదు.
*"అమర చైతన్యం"*
*( శ్రీ రమణ మహర్షి బోధనలు )*
*ప్రశ్న: అవిద్య (అజ్ఞానము) ఎలా వచ్చింది ?*
*జవాబు: అవిద్య మాయలాంటిదే. మాయ అంటే ఏది లేదో అదే మాయ. కనుక ఈ ప్రశ్న ఉత్పన్నం కారాదు. కాబట్టి ఎవరికి అవిద్య అని ప్రశ్నించుకుంటే మంచిది. ఆత్మ గురించి, అజ్ఞానము గురించి శాస్త్రాలు రెండింటిని గురించి చెప్పినాయి. ఆత్మ పూర్ణమైనది. అజ్ఞానం తొలగించుకొనుట చాల అవసరము. ఇవి రెండు పరస్పర విరుద్ధములుగా అనిపించవచ్చు. తీవ్ర జిజ్ఞాస గల సాధకుల కొరకు మార్గాన్ని చూపేందుకు, అసలు తత్వాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తాయి. కృష్ణుడు చాల స్పష్టంగా చెప్పినాడు ప్రజలు తనను శరీరంగా భావిస్తున్నారని. నిజానికి కృష్ణుడు (ఆత్మ) పుట్టేది లేదు. చనిపొయ్యేది లేదు. నీవు ఆత్మగానే వుండు. అపుడు అజ్ఞానము నశించిపోతుంది. అసలు 'నేను' ఉండనేవుంది. దానిని తెలుసుకోవడమంటూ లేదు. కొత్తగా పొందబడే జ్ఞానము కాదు. జ్ఞానానికి ఒక అడ్డు ఉన్నది. అదియే అజ్ఞానము. దానిని తొలగించు. జ్ఞానము అజ్ఞానము ఆత్మకు కాదు. వాటిని తొలగించాలి.*
No comments:
Post a Comment