🦚జ్ఞాన ప్రసూనాలు 🚩
03/11/25
1) మాయ నాలుగు విధాలుగా ఉంటుంది.
1. అయినది కానట్టుగా.
2. కానిది అయినట్టుగా
3. ఉన్నది లేనట్టుగా,
4. లేనిది ఉన్నట్టు.
2) పది మందికి పెట్టి తింటే అది అమృతం నీవొక్కడివే తింటే అది విషం.
3) గోవు పాదాల వద్ద కూర్చొని క్షీరాన్ని సంగ్రహించున్నట్లు గురుపాదాల వద్ద కూర్చొని జ్ఞానాన్ని సంగ్రహించాలి.
4) తనకు అన్యం గోచరించడమే సృష్టి. తనకు అన్యం గోచరించకుంటే ముక్తి.
5) నీవు చూచే ప్రతి దృశ్యం క్రింద నీవు తలచే ప్రతి తలంపు క్రింద నీవు పొందే ప్రతి అనుభవం క్రింద "భగవదిచ్ఛ" అనే పదం చేర్చు. ఇక ఏ ఘర్షణకు తావుండదు.
6) సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు ఈ సమస్తమూ ఆత్మయే తప్ప మరేదీ కాదు. మరేదీ లేదు
No comments:
Post a Comment