Wednesday, November 26, 2025

 *_దేవుడికే శాపం !_*
 
*150  ఏళ్ళ క్రితం..  దక్కను లో...* *కరువుతో కోటిమంది చనిపోయారు .*
*అటు పై కొన్నేళ్ళకు ప్లేగు వ్యాధి తో ముంబై ప్రాంతం లో కోట్లాది మంది చనిపోయారు*.
*వందేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తితంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ...*
 *అటు పై బెంగాల్ కరువు     ..* 
*మధ్యలో రెండు ప్రపంచ యుద్ధాలు* .. *బాంబుల  చావులు     .. ఆకలి చావులు...*

 *లిస్ట్...  కొండవీటి    చేంతాడంత .*
*గతమంతా...  కష్టాల కాలం ..* 

*కష్టాల కొలిమి కాలిన లో   మనిషి...* *ఉక్కులా తయారవుతాడు*  .
*కష్టం...  శ్రమించే తత్వాన్ని,  పొదుపును     అలవాటు చేస్తుంది* . . 

*కష్టాల కడలి లో.*. 
*బడాయికి* .. *డాంబికానికి దూరంగా ఉండి* ... *చీమలా...  రేపటి కష్టకాలంకోసం కాస్తో కూస్తో కూడబెట్టిన వారే మిగిలారు* .
*జీవన పోరాటం* ...
  *పొదుపు లక్షణం ఉన్నవారినే ప్రకృతి బతకనిచ్చింది .*
   *ఇది చేయలేని వారు ..  మునిగి చచ్చి పోయారు* . 
*సోషల్ డార్వినిజం*. 
*నిజమంత నిజం* . 

*_సింహావలోకనం !)_*

*మా తాత కు ముగ్గురు సోదరులు* .
*నాలుగు కుటుంబాలకు కలిసి ఎకరా భూమి* . 
*ఎకరా లో ... నాలుగు కుటుంబాలు ఎలా బతుకుతాయి ?*
*పెద్దాయన ఇండోనేషియా కు వలస పోయి అక్కడ రాత్రి  పూట షిప్పుల్లోకి లోడ్లు ఎత్తే పని .. పగటి పూట వేరుశనిగె గింజెలు అమ్మే పని..  చేసాడు*. 
*రెండో వ్యక్తి మా తాత* ..
 *ఊళ్ళోనే ఉంటూ ఎకరా భూమి సాగు చేస్తూ...  గొర్రెలు మేపేవాడు . మూడో ఆయన మలేషియా కు వలసపోయి అక్కడ రబ్బరు తోటల్లో పని చేసేవాడు* .
 *చివరి వాడు ఊళ్ళోనే చిల్లర కొట్టు నడిపే వాడు* .
*కష్టపడాలి .. డబ్బు సంపాదించాలి*.. *రేపటి కష్టకాలం కోసం దాచుకోవాలి అనుకొనే కాలం నాటి మనుషులు వీరంతా !*

*ప్రతి తల్లి ..  బిడ్డలు జీవితం లో ఎలా స్థిరపడాలి అని ఆలోచించేది* .
*తాతల్లాగే మా నాన్నలు కూడా నలుగురు*.
*మొదటి ఇద్దరు..  తండ్రితో బాటే వ్యవసాయం*..  *గొర్రెలు మేపడం .*
*మా నాన్న* *శ్రీరాములు .. మూడో వాడు*.
*వ్యవసాయ కుటుంబాల్లో*...  *అందులో రాయలసీమ లో*...  *కాస్త ఎర్రగా పుట్టేవారు అరుదు* . 
*మా నాన్న ది మంచి  వర్చస్సు* .
 *మా నాన్నమ్మ భాగ్యమ్మ .." అయ్యో శ్రీరాముడు* .. *నాజూకుగా ఉన్నాడు..  పాపం బిడ్డ .. గొర్రెలు ఏమి మేపుతాడు ?"...* *అని... " నువ్వు స్కూల్ కు పోరా" అని తోలింది*.
 *తన అన్నలు కష్టపడతారు* . 
*సేద్యం చేసుకొని బతికేస్తారు*. 
*తనకు మడక దున్నడం రాదు* .. 
*కపిల తోలడం రాదు ..*
*చివరకు మడవకట్టడం కూడా రాదు .* 

*చదవక పొతే బతుకు నాశనం ..*
*అందుకే ..*
*కష్టపడి చదివాడు* . 
*బతుకంటే అంత భయం !*
*యుద్ధ భూమిలాంటి జీవితం లో ఉన్నోడు ఆయుధం వదులుతాడా ?*
*ఆదమరుస్తాడా?*

*ప్రభుత్వ టీచర్ గా ఎంపిక అయ్యాడు* .
 *దూరపు బంధువుల అమ్మాయి ని ఇష్టపడ్డాడు*.
 *ఆమెను కూడా ప్రభుత్వ టీచర్ గా నిలబెట్టి...  పెళ్లి చేసుకొన్నాడు .*

*నెలకు ఇద్దరి జీతం* .
 *కాలిపై కాలేసుకుని బతకొచ్చుగా ?*

*చీమల తరం మనుషులు వారు !*

*జల్సా లు చేయడం రాదు* . 
*బడాయి కి పోవడం...  అసలు తెలియదు* .
 *తాము ఉద్యోగ రీత్యా స్థిరపడిన ఊళ్ళోనే మూడెకరాల మెట్ట భూమి కొన్నారు .*
 *అందులో వేరుశనిగె..  కందులు..  పెసలు...  అలసందుల వ్యవసాయం* .
 *ఇంట్లో ఎప్పుడూ రెండు మూడు ఆవులు*.
 *మా అమ్మ ... జమునమ్మ...  పొద్దునే మూడింటికి లేచేది* .
 *పాలు పిండి...  డిపో వారి ఊరి కౌంటర్ లో నాలుగింటికల్లా పొయ్యాలి . లేదంటే పాల   వాన్ వెళ్లి పోతుంది*.
 *పొద్దున్న నేను నిద్ర లేచేటప్పటికి ఇల్లు వాకిలి కొట్టం ఊడ్చి .. కళ్ళాపు చల్లి*. *ఆవులకు గడ్డి వేసి .. పాలు మరగ* *కాచి నాకు లోటా పాలగ్లాసుతో* ...  *రెడీ గా ఉండేది*

*నెలకొక్క సారి జానకారం పల్లి లో టీచర్స్ మీటింగ్ . హోటల్ లో  తింటే* ..  *దుడ్డు అయిపోతుందని .. ఇంటికొచ్చి సాయంకాలం అయిదింటికి చద్ది అన్నం లో మజ్జిగ వేసుకొని తినే టీచరమ్మ  జమునమ్మ* . 
*చీమలు కూడా సిగ్గు పడాల్సిందే*.

*ఊళ్ళో పెళ్లి . ..  దినాలు...  జరిగితే జాంగ్రీ ని...  అరటి పండును  కొంగులో ముడేసుకొని ఇంటికి తెచ్చి నాకిచ్చేది*.

 *స్కూల్ .. ఒక  రోజు కూడా సెలవు తీసుకొనేది కాదు*. 
*ప్రభుత్వ టీచర్* . *పక్కన టౌన్ లోకెళ్ళి ఇంటింటికీ కందులు అమ్మడాన్ని ఊహించగలరా ?*
*మార్కెట్ లో అమ్మితే కిలో రూపాయి యాభై పైసలే*. 
*అదే    ఇంటింటికి   పోయి అమ్మితే రెండు రూపాయిలు* . 
*చిన్నప్పుడు ఇంటింటికీ మా అమ్మతో వెళ్లి కందులు అమ్మిన రోజులు ఇప్పటికీ నాకు గుర్తు* .
*ఆమె కంటే ఘనుడు ... ఆచంట మల్లన్న ... . కాదు శ్రీరాములు* .

*ఇంట్లో ..*
*ఎప్పుడూ అదేదో ఆకీటన్స్ రిజిస్టర్ ... ఇంకేదో రిజిస్టర్*. 

*అసలే పూరి గుడిసె* . 
*ఇరుకు.*
  *ఇంటి నిండా పిల్లల భోజనం కోసం ప్రభుత్వం ఇచ్చిన గోధుమ రవ్వ బస్తాలు  .. సోయాబీన్ సాలిడ్ ఆయిల్ డబ్బాలు* . 
*ఒక్కసారి దీన్ని  వాడి     ఉప్మా  చెయ్యి అంటే మా అమ్మ ఒప్పుకునేది కాదు*. 
*మా నాన్న కు తెలిస్తే అంటే సంగతులు అని ఆయన ముందు కనీసం అడిగేందుకు బయపడేవాడిని.*
 
*"పరుల సొమ్ము ఆశించకు ..* *కష్టపడిందే నీకు దక్కుతుంది" అనే సత్యం నా నరనరాల్లోకి నాకు తెలియకుండానే వెళ్ళిపోయింది* .

*మనం వీరులు సూరులు అనుకొంటాం..*
*కానీ   విషయం    ఏమిటంటే మనం కాలమాన పరిస్థితుల ప్రొడక్ట్స్ .* 
*సంఘం చెక్కిన శిల్పాలు .*

*1970 - 2020*
 *మన దేశ చరిత్ర లోనే కాదు ప్రపంచ చరిత్ర లో స్వర్ణ యుగం*. *ప్రపంచ యుద్దాలు కాదు కదా* ..       *చిన్నా చితకా యుద్ధాలు కూడా లేవు* .
*హరిత విప్లవం ..     పాల  వెల్లువ*. 
*ఆహార కొరత లేదు* . 
*కరువులు ఉన్నా*...  *తిండికి లేకుండా...  చచ్చింది లేదు* .
*స్వర్ణ యుగం   మొదటి తరం*  .. *అంటే..  ఇప్పుడు 50-60  లలో ఉన్నవారు... అమ్మా నాన్న లనుంచి కష్టాలు నేర్చారు* .
 *పొదుపు నేర్చారు .* 
*ఆస్తులు కూడ పెట్టారు .*

*బడులు బతుకు పాఠాలు చెప్పేవి* . 
*తల్లితండ్రులు కూడా*!

*ఎక్కడో గాడి తప్పింది !*

*డిజిటల్ యుగం వచ్చింది* . 
*సోషల్  మీడియా పుణ్యమా అంటూ ప్రతి దానికి పక్కోడితో పోలిక . టెక్కులు* .. *పెగ్గేలు.. బడాయి ..* *దాంబికాలు .*

*కరోనా కష్టం రుచి చూపింది* .
*కానీ ఆలోచించకుండా కన్ఫ్యూజ్ చేసేసారు !*

*ఒకప్పుడు కత్తులతో ... అటుపై ఫిరంగులు*..  *బాంబులతో యుద్ధాలు చేసి ఆస్తులు దోచేవారు* . *డిజిటల్ యుగం లో సమాచారమే  మార్కెటింగ్ సాధనం*..
 *వక్రీకరించిన   సమాచారమే    పబ్లిక్ ఆస్తులు కొల్లకొట్టే కొట్టే యుద్ధ సామాగ్రి*. 

*ఇప్పుడు చెంగిజ్ ఖాన్ లు.. ఘోరీ లు.. గజనీ లు లేరు .. ఇప్పుడున్నది .. గేట్ల తాత.. సోరో తాత .. మార్క్ మామ . వీళ్ళ  రూటే...  సెపరేట్* . 
*అది డిజిటల్ గొర్రెలకు అర్థం కాదు*. 

*పని కట్టుకొని రెచ్చ గొట్టారు .* 
*బ్రెయిన్ వాష్ చేసారు .* 
*"రేపన్నది లేదు ....*
*అందరూ సంపాదిస్తే అనుభవించేది ఎవరు ?*
*జల్సా చేసేయ్* . *రేపటి సంపాదనతో ఈ రోజే . క్రెడిట్ కార్డు.. EMI .. అప్పు .. ఆన్లైన్ క్రెడిట్ ."*
*ప్రతి డిజిటల్ బానిస నరనరాల్లో ఈ నయా తత్వాన్ని నింపుకొన్నాడు* . *మిడతగా మారిపోయాడు* . 

*నిన్నటి తరం వారు కష్టపడ్డారు .. ఆస్తులు సంపాదించారు* .
 *కానీ పిల్లల చేయి ఎప్పుడూ వదలలేదు*. 
*బతకడం కోసం వ్యవసాయం* .. *ఉద్యోగం .. *వ్యాపారం చేసారు* .
*కానీ డిజిటల్ యుగం పిచ్చోళ్ళు..  ఉద్యోగం కోసం బతుకుతున్నారు* . *రాత్రి పదింటికి కూడా ఇంటికి రాలేని ఉద్యోగాలు .*
*సెల్ ఫోన్ లో బందీ అయిన బాల్యం* . 
*గంజాయి విత్తనాలు చల్లితే తులసి మొక్కలు ఎలా మొలుస్తాయి బ్రో ?*

*పోనీ బడినైనా బతకనిచ్చారా?*
*ప్రబుత్వ బడి ఎప్పుడో వెంటిలేటర్ పైకి వెళ్లి పోయింది .*
*వీధి చివర బతుకు బతుకు తెరువు కోసం .. బడిపంతుళ్ళు ప్రారంభించిన చిన్న స్కూళ్ళు .. బడ్జెట్ స్కూళ్ళు కూడా అవసాన దశలో* .... 
*తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు అమ్మి తెగ ఎంజాయ్ చేస్తున్న 30  వయస్సు తరం*.
అన్ని విషయాల్లో బడాయి .
*స్కూల్ వంద ఎకరాల్లో ఉండాలి . గుర్రాలు . ఒంటెలు తాబేళ్లు ఉండాలి .
ఒక్క మాటలో చెప్పాలి అంటే స్కూల్ స్కూల్ లాగా కాకుండా క్లబ్ లాగా ఉండాలి .
ఇప్పుడు స్కూల్ పెట్టాలంటే వంద కోట్లు ఉండాల్సిందే .
 చిన్న చితకా వాడు బడి పెట్టే కాలం అయిపొయింది .
ఇప్పుడంతా బడా పెట్టుబడి దారులు . ఫార్మా పాపపు సొమ్ము .. రాజకీయ నాయకుల సొమ్ము బినామీల ద్వారా .
అన్నిటికీ మించి విదేశీ ఈక్విటీ*.
వందకోట్లు పెట్టినోడు చదువు చెబుతాడా ?
పిల్లలకు బడాయి .. నేర్పాలి . 
బడాయి తల్లితండ్రులకు కావాల్సింది కూడ అదే .
 తమ బిడ్డ స్కూల్ ఫీజు ఎంత ఉంటే అంత గొప్ప . 
తక్కువ ఫీజు ఉన్న బడినుంచి...  బిడ్డను ఇంటర్నేషనల్..  అయ్యబి .. సిబిఎస్సీ బడాయి స్కూల్ కి షిఫ్ట చేయకపోతే...  భర్త ను మంచం పైకి రానివ్వని భార్యలు .
బడులు అనబడే క్లబ్బుల గబ్బుల గురించి మందు పార్టీ లలో అయ్యలు ....  కిట్టి పార్టీ లలో అమ్మలు .
అమ్మా చెప్పదు..
 అయ్యా చెప్పడు .. 
బడి అసలు చెప్పదు . 
నేటి జెన్ z  తరానికి చుక్కాని ఏది ? 
దిక్సూచి ఏది ?
 

కాలమిలా ఆగిపోతే బాగుండు .
క్రెడిట్ కార్డు .. ఆన్లైన్ లోన్ అప్స్ .. బెట్టింగ్ .. పబ్బులు ..  ఓటిటి.. రీల్స్ ....      లైఫ్ హ్యాపీ కదా.
 మజప్పా.. మజా.. 
బట్ వాంతి కమింగ్??

*"ఉద్యోగాలు ఊడి పోతాయి . మధ్య తరగతి అంతరించి పోతుంది . గిగ్ ఎకానమీ .. గిగ్ జాబ్స్ " అని వినిపిస్తున్న మాటలు నిజం కాక పోవు గాక !*
*అయితే గియితే ..*
*క్లబ్బుల బడుల్లో.."* *మా నాన్నది ఈ కారు . నాది ఇంత సెల్ ఫోన్ అని బడాయిలు పోతూ ...* *రీల్స్ తో...  వీడియో గేమ్స్ తో , డిజిటల్ బోర్డు దొంగ  పాఠాలతో   , సెల్ ఫోన్ హోమ్ వర్క్ తో...  కాలం గడిపేస్తున్న నేటి జెన్ జెడ్ బతకలేదు .*
*బెంగాల్ కరువు .. ముంబై ప్లేగు ..* *మొదటి..  రెండవ ప్రపంచ యుద్ధం ..* *వీటన్నింటికీ మించిన మరణ హోమం జరగకుండు  గాక* .
 *రేపటి కోసం దాచే చీమలు...  చివరి తరం  వృద్ధాప్యం లోకి వెళ్లి పోయాయి* .
 *ఇప్పుడంతా మిడతలే*.
     *రేపన్నది ..*  *లేనట్టు .. రానట్టు ..*
*కనిపించిన దాన్ని  అబ ఆబగా    తినేసే మిడతలే* .
*ఓ .. దేవుడా !*
*మిడతల్ని రక్షించు స్వామి .* 
*కృతిమ  మేధ   యుగం ఉద్యోగ సంక్షోభం వద్దు*.
*గిగ్ ఎకానమీ వద్దు .. గిగ్ జాబ్స్ వద్దు*. 
*సోషల్ డార్వినిజంని అబద్దం చేసేయ్ .* 

*హ్యాపీ గా డిజిటల్  విర్చువల్ ప్రపంచం లో డీప్ ఫేక్ AI   వీడియోస్ లో   మునిగి తేలుతూ ...*
*ఆస్తులమ్మి జల్సా లు చేయడానికి వీలుగా..*
 *కామధేనువు ను...* *కల్పవృక్షాన్ని...* *అక్షయ పాత్రను ఇంటింటికీ ఒకటివ్వు* . 
*మరణ హోమాన్ని ఆపి పుణ్యం కట్టుకో* .. 
*లేకుంటే భువి నుంచి...  డిజిటల్ ప్రపంచం  లోకి పడిపోతావు*.

*దేవుడా .. ఓ మంచి దేవుడా . ఇస్తావు కదా ?*
*ఇస్తావులే ..* *ఎందుకంటే నువ్వు బేసికల్లి.. టెక్నికల్లి.. అండ్ ఫైనల్లీ మంచి దేవుడు కనుక !*

No comments:

Post a Comment