🦚జ్ఞాన ప్రసూనాలు🚩
27/11/25
1) నీవు సమూహంలో ఉన్నా ఏకాంతం నిన్ను ఆవహిస్తోందంటే నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్టు లెక్క.
2) సకలానికి కర్త-భోక్త-హర్త పరమేశ్వరుడే
మెరుపు మెరిసేది ఆయన వల్లే. మనం రెప్పలు ఆర్చడం ఆయన వల్లే. ఆయన సర్వశక్తిమంతుడు.
3) నేను పాపిని అని భగవంతుణ్ణి కొలవడం కంటే కొలవకపోవడమే మేలు. నేను పాపిని అని భగవంతుణ్ణి కొలిస్తే భగవంతుణ్ణి అవమాన పరచడమే అవుతుంది.
4) మురికిలో పడ్డాడని బిడ్డను ఎవరైనా వదిలేసుకుంటారా? అలాగే మనం ఎలా ఉన్నా భగవంతుడు మనల్ని వదలలేడు.
5) దేవుణ్ణి పొందడానికి నీ మేధస్సు సరిపోదు. ఏకైక మార్గం శరణాగతే.
6) సాధన అనేది కూడా మనస్సు చేసే జిమ్మిక్కే
No comments:
Post a Comment