*భగవాన్ స్మృతులు-9*
🪷
రచన: గుడిపాటి వెంకట చలం
*సాధుని శాంతమ్మ అనుభవాలు -6*
*భూమధ్యంలో వెలుగు*
నేను మొదటిసారి భగవాన్ దగ్గర్నించి వెళ్లినప్పుడు పెద్ద సూర్యబింబం, దానిమధ్య భగవాన్ రూపం కనపడ్డది. పూజలో ఓసారి భూమధ్యంలో వెలుగు కనపడ్డది. ఆ సంగతి భగవాన్ తో చెప్పితే, "అంతే అట్లాంటివి కనపడతాయి. అవేమీ బయటినుంచి వచ్చినవి కావు. అన్నీ మనసు లోపలివే. 'ఆ వెలుగు వెనక ఉండే వెలుగు ఏది? ఆ వెలుగును చూచేది ఏది?' అని ప్రశ్నించుకో” అన్నారు.
ఓసారి భగవాన్ని ఆడిగాను: నాకు ఎప్పుడూ ధ్యానంలో కూర్చోవాలని ఉందనీ, నేను ఆశ్రమంలో చేస్తున్న పని దానికి అభ్యంతరం గా ఉందనీ. దానికి భగవాన్ "ని మనసుని ఉండవలసిన స్థలంలో నిలుపు. నీ దేహాన్ని పని చెయ్యనీ" అన్నారు. ఆనాటినుంచీ ఏ పని చేస్తున్నా, ధ్యానం వల్ల కలిగే శాంతి నాతోనే ఉండేది.
నాతోనే ఉండి భగవాన్ తానూ వంటపనులు చేస్తూ, అందిస్తూ, సరిదిద్దుతూ, ఏది యెట్లా వుండాలో చెప్పుతూ వంటింటిలోనే ఎక్కువ ఉండేవారు. వండినవన్నీ పక్కగా పెట్టేదాన్ని, భగవాన్ ముందు రుచి చూచి సరిగా ఉన్నవో లేదో చెప్పేందుకు.
“ఇట్లా వంటలు రుచి చూచేవారిని పెద్ద పెద్ద జీతాలిచ్చి పెట్టుకుంటారు మహారాజులు- నాకు నువ్వేం ఇయ్యబోతున్నావో?" అన్నారు ఓసారి.
“నా సర్వస్వము మీకు అర్పించాను కదా స్వామీ! ఈ బికారిదాని దగ్గర ఇంకేం మిగిలింది?" అన్నాను. గొప్పగా నవ్వారు భగవాన్.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఒక భక్తుడు వూరికి వెళ్లుతూ భగవాన్ తో యిట్లా అన్నాడు: "స్వామీ! నేను దూరంగా వెళ్లిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికో తిరిగి రాగలగడం. మీ చుట్టూ ఉండడానికి ఈ భక్తులందరు ప్రతి నిమిషం సాన్నిధ్యమనే ఆహారాన్ని రుచి చూస్తూ ఉంటారు, ఎంతో దూరంలో వున్న ఈ దాసుడు మీ జ్ఞప్తిలో ఉంటాడా? భాగ్యమంటే వీరిది. తప్పకుండా మీ మనసులో ఏ మూలో ఉంచుకొని సదా నన్ను రక్షించాలని ప్రార్థిస్తున్నా.”
ఆ ప్రార్థనకి భగవాన్ అన్నారు: “నీ ప్రార్థన సరే. అతడు ఎక్కడ ఉన్నాడు. అతన్ని రక్షించాలి అనే తలంపు అనేది ఉంటే అతను జ్ఞాని యెట్లా అవుతాడు! మనసు లేనివాడు దేన్ని కాని యెట్లా మనస్సులో ఉంచుకోగలడు? నువ్వు ఇక్కడ మనవి చేసికొన్నావు. అంతే కావలసింది. నీ మనవి ని ఈశ్వరుడికి నివేదించాను. ఇక ఆయన చూచుకుంటారు” అని చెప్పి శలవిచ్చి పంపి, మాతో అన్నారు: "అందరూ అనుకుంటారు. జ్ఞానిని సేవించుకుని వారి చుట్టూ ఉన్న భక్తులకి ఏదో ప్రత్యేకమైన గొప్ప అనుగ్రహం లభిస్తుందని. అట్లాంటి ప్రత్యేకత ఉంటే ఆ గురువు జ్ఞాని యెట్లా అవుతాడు? లోకంలో ఎక్కడ ఎంత దూరాన వుంటేనేం. ఎవడు గురువుకి తాను తనని సంపూర్ణంగా అర్పించుకుంటాడో, ఎవడు సమస్తమూ గురువే ననీ… తానేమీ కాదనీ అహంకారాన్ని వర్జిస్తాడో, అట్లాంటి అతనిని ఉద్ధరించడం ఈశ్వరుని విధి. అట్లా అర్పించుకున్నవాడు ఏ ప్రార్ధనా చెయ్యనక్కరలేదు. ఈశ్వరుడే పరుగెత్తుకొని వెళ్లి, సదా అతనివెంట ఉంటాడు. పద్మం పక్కనే కప్ప నివసిస్తూ ఉంటుంది. ఏ దూరాన్నుంచో తుమ్మెద వచ్చి మకరందం తాగిపోతుంది” అన్నారు.
📖
*భోజనాల ముందు*
నేను నచ్చిన కొత్తరోజులవి. రాత్రి అన్నం తప్ప తక్కినవన్నీ మధ్యాహ్నం వండినవే రాత్రికి అట్టేపెట్టి, వడ్డించేవాళ్ళము. ఆ రాత్రి
బంగాళ దుంపలూ, చామదుంపలూ కలిపి వేయించి వుంచిన కూరని రామనాధం అనే కుర్రాడు అందరికీ ముందే విస్తళ్లలో వడ్డించి వుంచాడు. అందరి విస్తళ్లలోను - మూడు నాలుగు ముక్కలే ఉన్నాయి. స్వామికి బాగా ఇష్టమని ఆయన విస్తట్లో అయిదారు ముక్కలు వడ్డించాడు. స్వామి విస్తరివంక చూస్తారు. తక్కిన విస్తళ్ల వంక చూస్తారు. వడ్డించే మా ముఖాలవంక చూస్తారు, చారు గిన్నె పట్టుకుని నేను పక్కనే నుంచుని ఉన్నాను. తిరిగి తిరిగి కోపంతో నిండిన కళ్లతో నా ముఖంవంక చూచారు. ఎవరు ఏమి లోపం చేశారో, ఆగ్రహం కలిగించారు అనుకున్నాను. నావల్ల అపకారం కలిగి వుండవచ్చుననే అనుమానం కూడా కలుగ లేదు నా మనస్సులో.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
భోజనాలైనాక స్వామి హాలులో గోడవైపు తిరిగి పడుకున్నారు. రోజూ మేము రాత్రి పనంతా ముగించుకొని వూళ్లోకి వెళ్ళే ముందు శలవు తీసుకోడానికి హాలులోనికి వెళ్ళినప్పుడు యెప్పుడు శలవడిగినా సాధారణముగా ముసుగు తీసి మా వంక చూచి "మీ వెంట యెవరు వస్తున్నారు? లాంతరు వుందా?" అంటూ అట్లాంటివి అన్నీ జాగ్రత్తగా కనుక్కుంటారు. ఆ రాత్రి నేను శలవు అడగగానే ముసుగు తీసి నా వైపు తిరిగి “ఇల్లారా” అన్నారు. నేను దగ్గరకు వెళ్ళాను.
"ఏం చేశావు రాత్రి? తక్కినవాళ్లకన్నా స్వామికి ఎక్కున కూర వడ్డించావు.”
ఇదేమిటి నిందిస్తున్నారు. స్వామిపైన ఉన్న ప్రేమ వల్ల, మా భక్తివల్లనే కదా నేను ఎక్కున వడ్డించింది? నాలోని భక్తి చూచి స్వామి సంతోషిస్తారనుకున్నాను. తక్కినవాళ్లు, స్వామి నాకు ఒక్కటి ఎట్లా అవుతారు? మా ఇళ్లల్లో అంతేకద! పైగా, నాకెట్లా వుంటుంది? ఈ చివాట్లూ నలుగురిలో వుండగానాయె. సిగ్గు వేసింది.
"ఇది నేర్చుకోడానికా ఇంతదూరం వచ్చింది నువ్వు? అందరికీ యెక్కువ వేసి నాకు తక్కువ వెయ్యి, నాకు సంతోషం" అన్నారు.
“నాకు చేతులెట్లా వస్తాయి?”
“ఎక్కువ కూర వేస్తే నాకు సంతోషచునుకు న్నావా? కూరతో అనుగ్రహం సంపాయిద్దామ నుకున్నావా?”
"స్వామిపైన ప్రేమతో నేను చేసిన పని అది. అపరాధాన్ని మన్నించండి. ఇకమీద భగవాన్ చెప్పినట్లే నడుచుకుంటాను" అన్నాను.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"నా భక్తులందరినీ నువ్వు యెంత ప్రేమతో చూస్తే (వాళ్లందర్ని నువ్వు నన్నుగానే చూస్తే) అంత ప్రేమ కలుగుతుంది" అని చెప్పి సెలవిచ్చారు. ఆ మాటలు మాట్లాడుతుంటే ఆయన కళ్లు మండిపోతున్నాయి.
దాంతో నాకు మంచి పాఠం జరిగింది. ఆనాటి నుంచీ ప్రతి భక్తుణ్ని నా హృదయం లోకి తీసుకొని, ప్రతివారి తల్లినైనాను, ఎవరికే పత్యం కావలసినా, ఎవరికి వళ్లు బాగుండకపోయినా ఎంతో శ్రద్ధతో సేన చెయ్యడం నేర్చుకున్నాను. భగవాన్ నన్నే పిలిచి, ఎవరు ఎట్లా వున్నదీ అడుగుతూ ఉండేవారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment