Saturday, November 1, 2025

 🌸 మనసు శుద్ధి – జెన్ ప్రతిధ్వని

(డా. తుమ్మల దేవరావ్, ఓల – నిర్మల్)
ఇంటి మూలల్లో పేరుకుపోయిన దూళిని ఊడ్చినట్టు,
మనసు మూలల్లో కూర్చున్న ఆలోచనలను ఊడ్చేయాలి.
పాత జ్ఞాపకాలు వాడిన ఆకుల్లా కూలిపోనివ్వు,
గాలి తాకిన మౌనంలో కొత్త పువ్వు పుడుతుంది.
ఇల్లు శుభ్రమైతే వెలుగు ఆహ్వానిస్తుంది,
మనసు శుభ్రమైతే నిశ్శబ్దం పూస్తుంది.
ఆ నిశ్శబ్దమే జీవితం యొక్క శ్వాస —
అది మాటలకీ అర్థాలకీ దాటి వినిపించే సత్యం.
దుఃఖాన్ని ఆరబెట్టండి 
కన్నీటి చివరలో ధ్యానం మొదలవుతుంది.
ఆశలు దిగి వచ్చిన చోటే
శాంతి మొదలవుతుంది.
వదిలేయి...
నిన్నను, దానిలోని నీడలను,
వదిలేయి స్నేహపు బూడిదను,
ప్రేమ దహనాన్ని కాదు.
అన్నీ వదిలినప్పుడు మాత్రమే
నీవు మిగిలిపోతావు 
అది ‘నీవు’ కాదు,
అనంతం.
నీ హృదయం ఒక వాయిద్యం కాదు,
అది ఒక శూన్యం 
దానిని తాకిన గాలి మాత్రమే రాగమవుతుంది.
దానికి శిక్షణ అవసరం లేదు,
గుర్తు తెచ్చుకోవడమే సరిపోతుంది.
పాత నీటిని వదిలేస్తే కొత్త ఊట ఉద్భవిస్తుంది,
మలినం తొలగితే స్పష్టత కలుగుతుంది,
స్పష్టతలోనే కరుణ పుడుతుంది,
కరుణలోనే బుద్ధుడి మౌనం ఉంది.
హృదయం శుద్ధమైతే
ప్రపంచం నీ అంతరంగ ప్రతిబింబమవుతుంది 
నిశ్శబ్దం ఆలయమవుతుంది,
శూన్యం సత్యమవుతుంది,
జీవితం జెన్ పుష్ప పరిమళ మవుతుంది.
 మిత్రులారా ! 
మీతో నాకు ఎదురైన ఒక సైబర్ నేరస్థులతో కల్గిన పంచుకుంటున్నాను .
  మీరు నా వలె సమస్యకు గురికాకూడదనే ఉద్దేశంతో !
   29-10-2025 తేదీ , బుధవారం 
ఉదయం 9.30 గంటలకు నాకు ఒక unknown నెంబర్ 7224961427 
నుండి కాల్ వచ్చింది ! 
“ మేము Troy నుండి మాట్లాడుతున్నాం ! మీరు 02-01-2025 తేదీన బెంగుళూర్ లో ఒక సిమ్ కార్డు తీసుకున్నారు ! ఆ ఫోన్ నెంబర్ , 7022450009 నుండి 
మీరు 17 మంది ఆడపిల్లలకు అసభ్యకర అశ్లీలమైన నగ్న ఫోటోలు , వీడియోలు , మెసేజ్ లు చేసి వేధిస్తున్నట్లు గాంధీనగర్ , బెంగుళూర్ , కర్ణాటక పోలీస్ స్టేషన్ లో మీ మీద 17 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.  మీరు వెంటనే 
గాంధీనగర్ , PS, బెంగుళూర్ కు వెళ్ళి పోలీస్ అధికారులకు లొంగిపోవాలి ! “ అని చెప్పారు . దానికి నేను , “ నేను ఏ సిమ్ కార్డు తీసుకోలేదు .  ఆడవాళ్ళకోసం నేను ఫైట్ చేస్తుంటాను ! అలాంటి నేరాలు నేనుగా చెయ్యలేదు .నేను ఇప్పుడు బెంగుళూర్ కు రాలేను , నాకు 71 ఏళ్ళు!” అని చెప్పాను ! 
   దానికి వాళ్ళు ,” మీరు సీనియర్ సిటిజెన్ కాబట్టి బెంగుళూర్ కు వెళ్ళలేరు అంటున్నారు కాబట్టి , మీకు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నుండి నేరుగా ఫోన్ కాల్ కలుపుతా! మీరు పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడి , మీ ఇబ్బంది చెప్పుకోండి !” అని చెప్పాడు. చేసేది లేక , ఆ అవకాశాన్ని ఉపయోగించుకుందాం అనుకున్నానే గానీ , అదంతా సైబర్ మోసం అనుకోలేదు నేను ! మా వారికి ఫోన్ ఇచ్చాను . ఆయన BSNL లో పనిచేశారు కాబట్టి,” సిమ్ తీసుకున్నవాళ్ళు , ఇచ్చినవాళ్ళు అక్కడ ఫోటో తీయించుకుంటారుగదా ! అసలు మేము సిమ్ తీసుకోలేదు , నా భార్య ఆడవాళ్ళ సమస్యల పై పోరాడుతుంది . ఆమెకు ఆ నేరాలతో ఎటువంటి సంబంధం లేదు !” అని చెపుతుంటే , అక్కడి అచ్చం  పోలీస్ అధికారి వలె యూనిఫారం వేసుకుని , ఆఫీస్ రూము , జాతీయజెండాల మధ్య కూర్చుని ఉన్న వ్యక్తి , పోలీస్ SP లా ఉన్నాడు ! అతను “ ఏంటి మీరు పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడేది ఇట్లాగేనా ? ఇన్వెస్టిగేషన్ ఎట్లా చెయ్యాలో పోలీసు ఆఫీసర్స్ కే మీరు చెప్తారా ?” అని బెదిరిస్తూ మాట్లాడారు ! FIR కాపీ చూపించి FIR నెంబర్ కూడా చెప్పి , వ్రాయించాడు ! 
  మేము నేరం చేయలేదని పదే పదే చెప్పాం ! మా పిల్లల వివరాలు వాళ్లు ఎక్కడుండేది వాళ్ళే చెపుతూ ., ఈ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఎవరికీ చెప్పవద్దు . చెపితే , మీ పిల్లల గ్రీన్ కార్డ్ లు లాగేసుకుని , తెచ్చి ఇండియాలో పడేస్తారు ! మీరు లోకల్ గా కూడా ఎవరికీ చెప్పరాదు . ఇంటికి ఎవరూ రాకుండా తాళం వెయ్యండి , వేసింది లేనిది చూపండి ! ఇప్పుడు ఎవరూ మీ ఇంటికి రాకూడదు ! 
 మిమ్మల్ని సైబర్ క్రైమ్ పోలీసులతో ఎంక్వయిరీ చేయించి మాట్లాడుతా !” అని చెప్పి , అదే ఫోన్ నెంబర్ తోనే 
9903947916 
  సైబర్ క్రైమ్ పోలీసులతో అంటూ 
మాట్లాడించాడు ! అతను ,” మీరు ముంబయి లో కెనరా బ్యాంకు లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ అకౌంట్ లో అత్యంత క్రిమినల్ రు.80 లక్షలు పా నా డిపాజిట్ చేశాడు . అతడు గత నవంబర్ 2 న అరెస్ట్ అయినట్లు ఉన్న 
న్యూస్ పేపర్ కటింగ్ కూడా పంపాడు . వాడు వివిధ ప్రాంతాల నుండి 200 మంది పిల్లలను ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేశాడు . వారి తల్లిదండ్రుల నుండి వసూలు చేసిన డబ్బును కొంత మీ అకౌంట్ లో వేశాడు . మీకు ఈ నేరంలోనూ 
‘ అక్రమంగా హ్యూమన్ రవాణా ‘ చేసిన నేరం కింద కేసు నమోదు అయివుంది ! “ అని చెప్పడంతో నేను కంగారుపడిపోయాను . గుండె నొప్పి వచ్చేలా అయింది . ఈ గండం నుండి ఎట్లా బయటపడగలనో అని గడగడలాడి పోయాను ! 
   మరలా నాలుగు గంటలకు కాల్ చేసాడు. బెదిరించాడు !
   “ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఎవ్వరికీ ఈ విషయం చెప్పను !” అని వ్రాయించి సంతకం పెట్టించాడు , ఆ కాయితాన్ని నా మొబైల్ తో ఫొటో తీయించి వాడికి పంపమని బెదిరించాడు !  అయోమయంలో ఆందోళనలో వున్న నేను మా వారు అదే పని చేశాము. ప్రతి గంటకు , నా పేరు టైప్ చేసి “ I am at home!”
అని  రెండురోజులపాటు మెసేజంపెట్టాలని , నిద్రపోయేముందు ,” good night- నిద్ర మేల్కొన్నాక “ good morning “ అని మెసేజ్ పంపాలని బెదిరించాడు !
   లేదంటే మా ఇద్దర్నీ గొలుసులు వేసి లాక్కుని వెళ్తాం !” అని తీవ్రంగా భయపెట్టారు ! నా ఫోన్ ను ‘ నిఘా ‘ లో ఉంచుతామని బెదిరించారు .
    సాయంత్రానికి బెంబేలు నుండి కొంత బయటపడుతూ బెంగుళూర్ 
లో  ఉన్న మా అక్క కూతురుకు కాల్ చేస్తే ఆ అమ్మాయి ,” ఇదంతా సైబర్ నేరగాళ్ల పని ! వాడు చేసినఫోన్ నెంబర్ ను బ్లాక్ చెయ్యండి !” అని చెప్పింది . వెంటనే block చేశాను!
   కొలకత్తా లో మా బాబు మిత్రుడు IG గా ఉన్నాడు. అతనికి కాల్ చేస్తే “ ఇలాంటివి సీనియర్ సిటిజన్స్ మీద ఎక్కువగా జరుగుతున్నాయి ! భయపడవద్దు . నెంబర్ బ్లాక్ చేసి ,
1930 సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు కాల్ చేసి , లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి . భయపడవద్దు !” అని చెప్పాక ధైర్యం వచ్చింది ! 
  1930 కు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాను.  2 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ వ్రాసి ఇచ్చాను . “ డబ్బు నష్టపడకుండా జాగ్రత్తపడ్డారు ! మంచిది ఇద్దరు డాక్టర్ల ను సైబర్ క్రిమినల్స్  ఇలాగే బెదిరించి ఆరు కోట్లు తీసుకున్నారు . డబ్బు అలా నష్టపోతే ., దానిని తెప్పించడం కోసం యాక్షన్స్ తీసుకుంటాము ! నేరస్థులను దేవుడు కూడా పట్టుకోలేడు ! వాళ్ళు విస్తారంగా వ్యాపించి ఉన్నారు. నెంబర్లు మార్చుకుంటారు , ఉన్న ప్లేస్ నుండి మారుతుంటారు ! “ అని చెప్పారు కావలి పోలీసులు !
     నేనెలాగో ఇంతటితో బయటపడ్డాను !
    నా వలెనే మీరెవ్వరూ ఇబ్బందులకు లోను కాకూడదు !
   ముఖ్యంగా నా ఆధార్ కార్డు నెంబర్ కనిపెట్టేశారు నేరస్థులు ! అదెలా జరిగిందో అర్థంకాలేదు !
     ఆధార్ జిరాక్స్ కాపీ ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే దాని మీద “ ఎవరికి ఇస్తున్నాము , ఏ పర్పస్ కోసం ఇస్తున్నామో వ్రాసితీరాలి! అది నేనెప్పుడూ చేయలేదు ! 
  ఇది ఒక ముందుజాగ్రత్త ! 
    దయచేసి మిత్రులారా ! నేను మోసపోయినట్లు మీరు ఎవరూ మోసపోరాదు! అనే సదుద్దేశంతో 
ఈ విషయాన్ని- నా బాధాకర అనుభవాన్ని మీకు చెప్పాను !
  Wish you all the best 💐🙏💐
చాకలకొండ. శారద Rtd HM,VBH School, Kavali! 
      మెంబెర్ , ఎల్డర్స్ క్లబ్ 
         మెంబెర్ కావలి తాలూకా పెన్షనర్ల అసోసియేషన్, కావలి
 Kavali Women Force kavali
 *_ప్రయాణం చాలా చిన్నది_*

*_ఒక మహిళ బస్సు ఎక్కి, ఒక పురుషుడి పక్కన కూర్చున్నప్పుడు, ఆమే బ్యాగ్ అతనిని ఢీకొట్టింది... కానీ ఆ పురుషుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు._*

*_ఆ పురుషుడు మౌనంగా ఉన్నప్పుడు, ఆ స్త్రీ అడిగింది, "నేను నిన్ను నా బ్యాగ్‌తో కొట్టాను, మరి నువ్వు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?"_*

*_ఆ పురుషుడు నవ్వి ఇలా జవాబిచ్చాడు:_*
*_"ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కలిసి ప్రయాణం చాలా చిన్నది... నేను తదుపరి స్టాప్‌లో దిగుతున్నాను...!"_*

*_ఈ సమాధానం స్త్రీని తీవ్రంగా కదిలించింది. ఆమె ఆ పురుషుడికి క్షమాపణలు చెప్పి, తనలో తాను ఇలా అనుకుంది, "ప్రయాణం చాలా చిన్నది"—ఈ మాటలు బంగారంతో రాయబడాలి._*

*_ఈ ప్రపంచంలో మన సమయం చాలా చిన్నదని, అనవసరమైన వాదనలు, అసూయ, క్షమించలేకపోవడం, ఆగ్రహం మరియు ప్రతికూల భావోద్వేగాలు నిజంగా సమయం మరియు శక్తిని వృధా చేయడమేనని మనం అర్థం చేసుకోవాలి._*

*_👉🏻 ఎవరైనా మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేశారా? ప్రశాంతంగా ఉండండి..._*
*_ప్రయాణం చాలా చిన్నది...!_*

*_👉🏻 ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా, బెదిరించారా లేదా అవమానించారా?_*
*_విశ్రాంతి తీసుకోండి - ఒత్తిడికి గురికావద్దు..._*
*_ప్రయాణం చాలా చిన్నది...!_*

*_👉🏻 ఎవరైనా కారణం లేకుండా మిమ్మల్ని అవమానించారా?_*
*_ప్రశాంతంగా ఉండండి... విస్మరించండి..._*
*_ప్రయాణం చాలా చిన్నది...!_*

*_👉🏻 ఎవరైనా అసహ్యకరమైన వ్యాఖ్య చేశారా?_*
*_క్షమించండి, విస్మరించండి, మీ ప్రార్థనలలో వారిని ఉంచండి మరియు నిస్వార్థంగా ప్రేమించండి..._*
*_ప్రయాణం చాలా చిన్నది...!_*

*_మనం వారిని పట్టుకున్నప్పుడే సమస్యలు సమస్యలుగా మారుతాయి. గుర్తుంచుకోండి, మన "కలిసి ప్రయాణం చాలా చిన్నది."_*

*_ఈ ప్రయాణం ఎంత పొడవు ఉందో ఎవరికీ తెలియదు..._*

*_రేపు ఎవరికి తెలుసు? ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు._*

*_కాబట్టి మన స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులను గౌరవిద్దాం... వారిని గౌరవిద్దాం..._*

*_మనం దయగా, ప్రేమగా మరియు క్షమించేవారిగా ఉందాం.._*

*_కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని గడపండి... ఎందుకంటే మన కలిసి ప్రయాణం నిజంగా చాలా చిన్నది...!_*

*_మీ చిరునవ్వును అందరితో పంచుకోండి..._*

*_మీ జీవితాన్ని అందంగా మరియు ఆనందంగా మార్చుకోండి... ఎందుకంటే ఎంత పెద్ద సమూహం అయినా, మన ప్రయాణం చాలా చిన్నది...!_*

*_ఎవరు ఎక్కడి నుండి దిగుతారో ఎవరికీ తెలియదు._* 

*_కాబట్టి.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి మరియు జీవితాన్ని ఆస్వాదించండి._*

*_ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు పర్సనల్ సమస్యలు మొదలైనవి అన్ని బుర్రగా పెట్టుకొని బుర్ర పాడు చేసుకుని టెన్షన్ పెట్టుకొని అనుక్షణం భయంతో బ్రతకడం  ఆపి వేయండి. ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ, తోటి వారిని సహాయపడుతూ ఇతతలని మోసం చేయకుండా, పకృతిని నాశనం చేయకుండా.. మంచి ఆలోచనతో ఉండండి మంచే జరుగుతుంది. మీరు ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించండి._* 

*_నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మైండ్ డైవర్ట్ చేయండి మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి. జోక్స్ చూడండి, మంచి సంగీతములో వినండి మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవండి  మన ప్రయాణం గమ్యం దగ్గరలో ఉందని గమనించుకోండి.._*

*_సర్వేజనా సుఖినోభవంతు_🙏🏼😀_*
 


🙏 *రమణోదయం* 🙏

*స్వప్నంలోవలె జాగ్రదవస్థలో మనచుట్టూ ఉన్నట్లు గోచరించే నామ రూపాత్మకమైన ఈ ప్రపంచం మనస్సు యొక్క మిథ్యాకల్పనా మాత్రం. ఇట్టి నిశ్చయ బుద్ధితో దానిపై ధ్యాస లేకుండా సన్యసించిన వారు మాత్రమే అజ్ఞానావరణాన్ని ఛేదించగల్గుతారు. ఇతరులంటారా? అజ్ఞాన పాశాన్ని ఎట్లాగ త్రెంచుకోవాలో తెలియనివారు.*

గాఢనిద్రలో నీకు ప్రపంచం లేదు..
కానీ నీవున్నావు...సుఖంగా కూడా ఉన్నావు!
నిద్రనుండి మేల్కొన్న తరువాతనే నీకు సుఖం 
పోయింది....ఎందువలన?
మేలుకోవడంతో అహంకారమనేది క్రొత్తగా వచ్చింది..
నిద్రలో ఈ అహంకారం లేదు..అహంకారం పుట్టుకే
వ్యక్తి పుట్టుక గా చెప్పబడుతున్నది.. అహంకారాన్ని
నశింపజేస్తే మిగిలేది ఆత్మ, ఆత్మానందమే!

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి* 
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.831)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
 *ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
            
🌹🌹🙏🙏 🌹🌹
 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-189.
306d3.;2910e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣8️⃣9️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                  *భగవద్గీత*
                  ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```


*7. విజ్ఞాన యోగము.*
(ఏడవ అధ్యాయము)
_________________________
*12. వ శ్లోకము:*

*”యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యేI*
*మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి” ॥12॥*

“మానవులలో సాత్విక, రాజసిక, తామసిక భావాలు ఉన్నాయి. వాటిని నేనే కలిగిస్తున్నాను. కాని ఆ భావాలు నాలో నుండి వచ్చినా, ఆ భావాలలో నేను లేను.”
```
ఇప్పటి దాకా కృష్ణుడు బాహ్య ప్రపంచంలో అంటే పంచభూతములతో నిర్మితమైన ప్రకృతిలో ఉండే విషయాలు అంటే సూర్యచంద్రులు, అగ్ని వాటి తేజస్సు, జలము, వేదములు, ఓంకారము, పౌరుషము, భూమి, తపస్సు, మొదలగు బాహ్య ప్రపంచములో ఉన్న వస్తువులలో నేను ఉన్నాను అని చెప్పి, ఇప్పుడు అంతరంగ ప్రపంచంలో అంటే మనలో ఉండే సూక్ష్మ ప్రపంచము వాటిలో ఉండే విషయాల గురించి వివరిస్తున్నాడు.

ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి. అవే మనలో కూడా ఉన్నాయి. వాటి పేర్లు సత్వ, రజస్ తమో గుణాలు. 
ఈ గుణాలను బట్టి మనం ఈ ప్రపంచంలో కర్మలు చేస్తుంటాము. 
ఈ మూడు గుణాలతో కూడిన భావాలను కూడా నేనే అని అంటున్నాడు పరమాత్మ. మూడు గుణాలు దైవస్వరూపాలే. కాని ఏ గుణం ఎంచుకోవాలో తేల్చుకోవాల్సింది మానవుడు. మనం ఏ గుణం ఎంచుకుంటే దానికి అనుగుణంగానే మనలో భావాలు కలుగుతాయి. ఆ భావాలకు అనుగుణంగా కర్మలు చేస్తాము. ఆ కర్మలకు తగిన ఫలితం వస్తుంది.

ఈ మూడు గుణాలు తనలో నుండి వచ్చినా, ఆ గుణములలో నేను లేను అని మెలిక పెట్టాడు పరమాత్మ. అంటే ఆ మూడు గుణాలు పరమాత్మలో ఉన్నాయి. పరమాత్మ నుండి ప్రకృతి ఆవిర్భవించినపుడు, ఆ గుణాలు కూడా ప్రకృతిలో ప్రవేశించాయి. అవే గుణాలు ప్రకృతిలో ఒక భాగమైన మానవునిలో కూడా ప్రవేశించాయి. ఈ మూడు గుణములకు కారణం మాత్రము పరమాత్మ అయినా, ఆ మూడు గుణములు పరమాత్మలో నుండి వచ్చినవే అయినా, ఆ గుణములలో తాను లేడు అంటే ఆ మూడు గుణముల ప్రభావం పరమాత్మ మీద లేదు. కాని ఆ మూడు గుణములతో మానవులు ఏమి సంకల్పించినా, ఏమిచేసినా, ఆ కర్మలతో, కర్మఫలములతో తనకు సంబంధము లేదు, తాను బాధ్యుడు కాడు అని స్పష్టంగా వివరించాడు.

తనకు అవసరమైన వస్తువు కావాలి అనుకోవడం సాత్విక భావము. ఉన్నవన్నీ నాకే కావాలి అని అనుకోవడం రాజసిక భావము. అవి లేకపోతే నేను బతకలేను అనే మోహంలో పడటం తామసిక భావము. ఈ మూడు భావాలకు అనుగుణంగా మానవులు ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు రజోగుణము బలపరాక్రమములు వీరత్వము, సూచిస్తుంది. అవి కూడా పరమాత్మ తత్వములే అని తన బలపరాక్రమాన్ని ఇతరుల మీద చూపించి చితక బాదితే, పోలీసులు కేసుపెడతారు. "అదేవిటండీ! ఇవి అన్నీ పరమాత్మ విభూతులు అండీ, నేను ఆ పరమాత్మ విభూతి అనుసరించి వాడిని కొట్టాను. నన్నెందుకు పట్టుకున్నారు" అంటే అందరూ నవ్వుతారు. ఇంకా నాలుగు తంతారు. అదే రాజసిక ప్రవృత్తితో బలహీనులను, దీనులను రక్షించవచ్చు. వారికి అండగా నిలువ వచ్చు వారికి సాయం చేయవచ్చు. తనకు ఉన్న బలపరాక్రమాలతో, వీరత్వంతో, వారిని ఆదుకోవచ్చు. అలా చేసిన వాడిని జనం అంతా పొగుడుతారు. ఆకాశానికి ఎత్తుతారు. కాబట్టి రాజసిక ప్రవృత్తి, రాజసిక భావాలు పరమాత్ముడిలో నుండి వచ్చినా, వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది మానవుల విచక్షణమీద ఆధారపడి ఉంటుంది. ఒక సారి సత్వ, రజస్, తమోగుణములు పరమాత్మలో నుండి వెలువడిన తరువాత, వాటిని సద్వినియోగం చేసుకోవడమో, దుర్వినియోగం చేసుకోవడమో మానవుల ఇష్టం. అందుకే వాటిలో నేను లేను అని పరమాత్మ ముందే సూచించాడు.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏
 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-188.
296d3;2810e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣8️⃣8️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                 *భగవద్గీత*
                 ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```


*7. విజ్ఞాన యోగము.*
(ఏడవ అధ్యాయము)
_________________________
*11. వ శ్లోకము:*

*బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।*
*ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥11॥*

“ఓ అర్జునా! నేను కామముతో కానీ, రాగముతో కానీ సంబంధములేని బలాన్ని, అలాగే ధర్మవిరుద్ధమైన పనులు చేయని వారియొక్క కోరికలు కూడా నేనే అయి ఉన్నాను.”
```
ఈ శ్లోకంలో నెగటివ్ మీనింగ్ వచ్చేపదాలు వాడారు వ్యాసులవారు. 

స్థూలంగా చెప్పాలంటే అధర్మముతో కూడిన పనులు చేసే వారి కోరికలలో, రాగము (సంగము--అటాచ్మెంట్) తో కూడిన కోరికలు ఉన్న వారిలో నేను ఉండను అని భావము.

బలవంతుడు అని ఎప్పుడు అంటాము, వాడికి బాగా బలం ఉంటే అంటాము. ఆ బలం నేనే అంటున్నాడు పరమాత్మ. బలం అనేది ఒకటే మానవునిలో ఉన్న శక్తి. ఆ బలం మంచి పనులకు ఉపయోగపడితే అది ధార్మికమైన బలం. ఆ బలాన్నే అసాంఘిక కార్యక్రమాలకు, ధర్మవిరుద్ధమైన కార్యాలకు వినియోగిస్తే అది రాక్షస బలం అంటారు. 
రాముడు బలవంతుడు. రావణుడు కూడా బలవంతుడే. రాముడు తన బలాన్ని ధర్మరక్షణకు, దుష్టశిక్షణకు వినియోగించాడు. రావణుడు తన బలాన్ని రాక్షసప్రవృత్తులకు వినియోగించాడు. రాముని బలంలో దైవత్వం ఉంది. రావణుని బలంలో దైవత్వం లోపించింది. అందుకే రాముడి బలం ముందు రావణుని బలం నిలువలేకపోయింది. కాబట్టి, మనలో ఉన్న బలం ధర్మబద్ధంగా ఉండాలి. పరోపకారానికి వినియోగపడాలి. ధర్మవిరుద్ధమైన పనులు చేయడానికి, తన స్వార్ధపూరితమైన కోరికలు తీర్చుకోడానికి ఉపయోగించబడకూడదు. స్థూలంగా చెప్పాలంటే భగవత్స్వరూపమైన బలాన్ని దుర్వినియోగం చేయకూడదు.

అలాగే కోరికలు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. ఇతరులకు హాని కలిగించేవిగా ఉండకూడదు. మానవునికి ఉన్న బలం, తనలో చెలరేగే పనికిమాలిన, ఇతరులకు హాని కలిగించే కోరికలు తీర్చుకోడానికి, తనలో ఉన్న ఇష్టాఇష్టాలకు సంబంధించి ప్రవర్తించడానికి అయి ఉండకూడదు. తనలో ఉన్న బలాన్ని ఉపయోగించి ఒకడిని అనవసరంగా కొట్టాలి అనే కోరిక ఉండకూడదు. వీడు నావాడు, వాడు పరాయివాడు, వాడిని చితక బాదాలి, నా వాడు వెధవ, దుర్మార్గుడు, నీచుడు అయినప్పటికినీ, వాడిని రక్షించాలి అనే రాగద్వేషములు లేకుండా ఉండాలి. అంతే కాకుండా, బలవంతుడు, ధైర్యవంతుడు అయి నందుకు, బలహీనులను రక్షించడమే కర్తవ్యంగా పెట్టుకోవాలి.

మన సినిమాలలో హీరోలను బలవంతులుగానూ, ధైర్యవంతులుగానూ, ఆపదలలో ఉన్న వారినీ, అబలలనూ రక్షించేవారిని గానూ చిత్రీకరించడంలో ఉన్న అంతరార్థం ఇదే. కనీసం తమ అభిమాన హీరోలను చూచైనా అటువంటి మంచి లక్షణాలు అలవరచుకుంటారనేదే సినిమాలు తీసేవారి ఆశ. (ఈ రోజుల్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఈనాడు ఇడియట్, పోకిరి, డాన్, ఖతర్నాక్, ఖల్నాయక్, మన్మధుడు... వీళ్లు మన హీరోలు. నేటి యువత వీరినే అనుకరిస్తున్నారు) అందుకనే పరమాత్మ, సత్పురుషుడిలో ఉన్న బలం నేనే అని అన్నాడు.

అలాగే కోరికలు కూడా నేనే   కానీ ఆ కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. ధర్మంగా కలిగే కోరికలు నేనే అని అన్నాడు పరమాత్మ. కాబట్టి మనలో ఉండే బలం, కోరికలు, ప్రతాపం, వీరత్వం అన్నీ ధర్మబద్ధంగా ఉంటే భగవంతుని సాయం తప్పక ఉంటుంది. ఆయన పక్కన ఉండి నడిపిస్తాడు. తాత్కాలికంగా అధర్మం పైచేయి అయినా ధర్మమే గెలుస్తుంది. ధర్మమేవ జయతే అని అందుకే అన్నారు.

లోకంలో అన్ని రకాల కోరికలు ఉంటాయి. మంచి కోరికలు చెడ్డ కోరికలు రెండూ ఉంటాయి. ఏది కావాలో కోరుకోవడం మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ధర్మానికి అనుకూలంగా ఉంటుందో, ఏది ధర్మవిరుద్ధం కాదో ఆ కోరికలనే కోరుకోవాలి. అంటే సంకల్ప స్థితిలోనే ధర్మవిరుద్ధం కాని కోరికలు కావాలని సంకల్పించాలి. ఇతరులకు పరోపకారం చేయడం, భగవంతుని ధ్యానం చేయాలని అనుకోవడం, మంచి పనులు చేయాలని కోరుకోవడం, పుణ్యకార్యములు చేయాలని కోరుకోవడం, ఇవి ధర్మబద్ధమైన కోరికలు. ఇతరులకు అపకారం చేయడం, ఇతరులను మోసం చేయడం, వారికి నష్టం కలిగించడం మొదలగునవి అధర్మబద్ధమైన కోరికలు. 

మనలో ఉన్న విచక్షణ ఉపయోగించి ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే భగవంతుడు ఆ కోరికలను తీరుస్తాడు. ఆ కోరికలలోనే తాను ఉంటాడు. క్రమక్రమంగా ఆ కోరికలను కూడా వదిలిపెట్టి పరమాత్మను చేరుకోవచ్చు.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 🔥అంతర్యామి 🔥
# ఉపనిషత్తుల వెలుగు...

☘️ప్రపంచం ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా, మనిషి అంతరంగంలో మాత్రం శాంతి కోసం అన్వేషణ ఆగలేదు. ఆధునికత, భౌతిక సుఖాలు పూరించలేని ఏదో ఒక శూన్యం మనిషిని నిరంతరం వెన్నాడుతూనే ఉంటుంది. అలాంటి సమయంలోనే, మన పూర్వీకులు అందించిన ఉపనిషత్తుల జ్ఞానం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.

☘️మన నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన తాత్విక పునాదిని ఉపనిషత్ (గురువు దగ్గర కూర్చుని తెలుసుకోవడం అని అర్థం) గ్రంథాలు అందిస్తాయి.

☘️నవజీవనాన్ని నిర్మించుకోవడానికి ఉపనిషత్తుల సమన్వయం ఎంతో ఉపకరిస్తుంది. నేటితరం ఎక్కువగా బాధపడేది అనిశ్చితి, ఒత్తిళ్లతోనే. ఆ దిశగా ఉపనిషత్తులు మనకు అతి ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తాయి. బాహ్య రూపం, పదవులు, ఆస్తులు తాత్కాలికమని, మనలో ఉన్నది శాశ్వతమైన, శక్తిమంతమైన ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఒత్తిడికి విరుగుడు ఇదే. శ్రీరాముడికి వశిష్ఠుడు ఉపదేశించినట్లుగా, 'నువ్వు' శరీరం కాదు, మనసు కాదు. కేవలం సాక్షి అనే జ్ఞానం స్థిరపడినప్పుడు చిన్న చిన్న వైఫల్యాలు, నిరాశలు మనల్ని కదిలించలేవు. ఒత్తిడికి లొంగిపోకుండా, నిజమైన అంతర్గత శక్తితో పనిచేయడం అలవడుతుంది. ఛాందోగ్యోపనిషత్తులోని 'తత్త్వమసి' (ఆ సత్యమే నువ్వు) అనే మహా వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఆధునిక సమాజానికి ఎంతో అవసరం. స్వార్ధం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, సర్వజీవులలోనూ ఒకే చైతన్యం ఉందని, మనలో ఉన్న పరమాత్మే ఎదుటివారిలోనూ ఉందని గుర్తించడం మానవ సంబందాలను మెరుగుపరుస్తుంది. ఈ భావన మనలో సహానుభూతి, కరుణలను పెంచుతుంది. ఇతరుల పట్ల ద్వేషం, అసూయ లేకుండా ప్రేమతో మెలిగే గుణాన్ని అలవరుస్తుంది.

☘️ఈశావాస్యోపనిషత్తు చెప్పే ప్రధాన సూత్రం- ఫలితం ఆశించకుండా కర్మ చేయమని. ఉపనిషత్తుల అధ్యయనం మనకు పని పట్ల కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. శ్రద్ద మాత్రమే మన చేతిలో ఉందని, ఫలితం దైవ సంకల్పం లేదా ప్రకృతి నియంత్రణలో ఉందని తెలుస్తుంది. ఫలితంపై అధికారం లేదని గ్రహించినప్పుడు, భయం తగ్గి, మనం చేయగలిగే పనిపైనే దృష్టి ఉంటుంది. ఇది వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. మన
జాతీయ చిహ్నంపై ఉన్న 'సత్యమేవ జయతే' అ వాక్యం ముండకోపనిషత్తు నుంచి తీసుకున్నది.

☘️జీవితంలో స్థిరమైన పునాది ఉండాలంటే, అది
కేవలం సత్యం, ధర్మం మీదే ఆధారపడాలి. విలువలు లేని విజయం తాత్కాలికం. ఎన్ని ప్రలోభాలు ఉన్నా. సత్య మార్గాన్నీ, ధర్మబద్ధమైన జీవితాన్నీ ఎంచుకున్న వ్యక్తి ఎప్పుడూ పతనమవ్వడు. నిజాయతీ, నైతికతలతో కూడిన వ్యాపారాలు, వృత్తులే దీర్ఘకాలికంగా మనుగడ సాగిస్తాయి.

☘️ఉపనిషత్తులు కేవలం గ్రంథాలు కావు, అవి జీవన సూత్రాలు. అవి మనకు కొత్త లోకాన్ని చూపించవు, కానీ ఉన్న ప్రపంచాన్ని సరికొత్తగా, లోతుగా చూసే జ్ఞానాన్ని అందిస్తాయి. అప్పుడు ఆ ఉపనిషత్తుల వెలుగులో మన ప్రతి అడుగు మరింత దృఢంగా పడుతుంది.

✍️- యర్రాప్రగడ ప్రసాద్

Power of Mind & Meditation 😱 ధ్యానం వల్ల సిద్ధులు నిజమేనా? 😱 Scientist Proved! Then What Happened?

Power of Mind & Meditation 😱 ధ్యానం వల్ల సిద్ధులు నిజమేనా? 😱 Scientist Proved! Then What Happened?

https://youtu.be/LKlEz_F0-t8?si=qZIO5K-l4T1n_JFE


ధ్యానం అసలు ఎందుకు చేయాలి ఇప్పటివరకు ఎప్పుడు ఎవరో నీకు చెప్పని కారణం ఈ వీడియోలో వింటావు. ధ్యానం చేస్తే ఎన్నో లాభాలు అని వేల ఏళ్ల నుంచి సనాతన ధర్మం చెప్తోంది. పుట్టిన దగ్గర నుంచి నీకు ఇది చాలా మంది చెప్పారు. మైండ్ పవర్ ను వాడి ఏవో సూపర్ పవర్స్ కూడా వస్తాయని నువ్వు విన్నావు. సినిమాలో చూసావు. అయినా కానీ నిజాయతిగా చెప్పు బాబా సైన్స్ చదువుకున్న నువ్వు ఈ విషయాన్ని ఎంత శాతం నమ్ముతావు. ఒక 10% మహా అయితే 40 నుంచి 50% సైన్స ధ్యానం ఈ రెండు వ్యతిరేక పదాలు అని కదా నీకు నేర్పించబడింది మరి అందుకే అలా మన ఋషులను నమ్మడం నీకు కష్టం చిన్నప్పటి సైన్స్ పుస్తకాల్లో రాసిన అక్షరాలను నమ్మడం మాత్రం సులువు. మన పెద్దలక ఏం తెలియదు సైన్స్ కి అంతా తెలుసు అంతే కదా ఇప్పుడే ఆలోచన కానీ బాబా సైన్స్ పేరుతో నీ బుర్రలో పెట్టబడిన ఆలోచనలు ఒక రకమైన కుట్ర అని నేను చెప్తే ఆ బైరాగి కదా ఇలా కాక ఇంకెలా మాట్లాడతాడు అంటుంది నీలోని సైన్స్ బుర్ర కానీ నాన్న సైన్స్ ధ్యానం గురించి మైండ్ పవర్ శక్తుల గురించి ఎన్నెన్నో కనుక్కుంది. అవన్నీ మాత్రం నీ వరకు రానివ్వలేదు. అందుకే నీకు తెలిసిన సైన్సు ఒక కుట్ర అంటున్నాడు బైరాగి వీడు సైన్సు చదువుకున్న బైరాగిరా ఆశామాషి కాదు ఆ ఈ వీడియోలో విజ్ఞానం దిమ్మ తిప్పేయొచ్చు నీకు వీడియో చివరిలో క్లైమాక్స్ ఆశ్చర్యంలోని నోరు తెరిపించొచ్చు ముందే చెప్తున్నాను సిద్ధమై విను పద మహానుభావుడు నికోలా టెస్ల వంటి శాస్త్రవేత్తలు ఇంకా కొందరు పుట్టారు ఈ భూమ్మీద వారిలో అతి గొప్ప సైంటిస్టులలో ఒకరు హెకోబో గ్రీన్బర్గ్ అనే మహానుభావుడు 1946 లో మెక్సికోలో పుట్టాడు నాన్న ఆయన ఒక న్యూరో న్యూరోఫిజియాలజిస్ట్ ఇంకా సైకాలజిస్ట్ గ్రీన్బర్గ్ మెక్సికో దేశపు ప్రాచీన శామానిజం నిను కూడా అభ్యసించినవాడు. ఆయన రెండు పెద్ద పెద్ద సైకోఫిజియాలజీ లాబరేటరీలను నెలకొల్పారు. 50 పుస్తకాలు రాశారు ఆయన బ్రెయిన్ యాక్టివిటీ, మెడిటేషన్, విచ్ క్రాఫ్ట్, శామనిజం, టెలిపీల మీద. బాబా ఆయన ఎందుకు వినూతనమైన వాడు అంటే సైంటిఫిక్ ప్రయోగాల్లోకి ఆయన మ్యాజిక్ ప్రపంచాన్ని మంత్ర తంత్రాలను తీసుకువచ్చారు. ఆయన కనుక్కున్న విషయాలు చరిత్ర సృష్టించాయి. అయితే ఆ చరిత్రను మనకు చేరనివ్వలేదు. అది బాధాకరం. మరో గొప్ప విషయం చెప్పనా హకోబో గ్రీన్బర్గ్ డాన్ లూచియో అనే గొప్ప మాస్టర్ వద్ద శిష్యరికం చేశారు. లూచియో వాతావరణాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి కలిగి ఉండేవారు. గ్రీన్బర్గ్ ఏమేం కనుగొన్నాడు కొన్ని విషయాలు తెలుసుకో. ఒకటి మనిషి మెదడు గొప్ప శక్తులను కలిగి ఉంది. కానీ అవి మనం డెవలప్ చేసేంతవరకు నిద్రాణమై ఉంటాయి. రెండు ఎక్స్ట్రా ఆక్యులర్ విజన్ అని ఉంటుంది మనిషికి. కళ్ళకు గంతలు కడితే ఎదురుగా ఉన్న నంబర్లు, రంగులు సరిగ్గా చెప్పేయగలం. కళ్ళు అవసరం లేకుండానే ఇవాళ సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు ఉన్నాయి చూడు బాబా. టెల్ మీ వాట్స్ ఆన్ దిస్ కార్డ్ ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు చిన్న పిల్లలకు ఈ ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్ట్రా ఆక్యులర్ విజన్ ఉంటుందని నిరూపించాయి. అది నేర్పించేందుకు మన పిల్లల్ని కూడా పంపించొచ్చు అనుకుంటాం మనం. మూడు గ్రీన్బర్గ్ ఒక కొత్త పుస్తకాన్ని అలా కళ్ళు మూసుకొని కేవలం ముట్టుకుంటాడు అంతే. అందులో ఏముందో అప్పుడు చెప్పేసేవాడు. ఒక సాధారణ మనిషికి ఇటువంటిది సాధ్యమని నిరూపించారు ఆయన. వేల ఏళ్లుగా మన యోగులు కనపరిచిన శక్తే ఇది. అటువంటి యోగుల కాలి గోటికి కూడా సరితూగని చెత్త బ్రిటిష్ కుంకలు హేళన చేశారు వాళ్ళని. ఆ కుంకల అత్తేసరు చప్రి జ్ఞానం చదువులు చదువుకొని ఇంతకాలం మనం కూడా యోగులను తప్పు పట్టాం. మూఢ నమ్మకాలని విజ్ఞాన వేదిక వెధవ మాటలు మాట్లాడాం. ఇలా చేసిన జాతి తరపున భారతమాతకు క్షమార్పణలు తల్లి. నాలుగు గ్రీన్బర్గ్ తన అనుభవాలను పుస్తకాలుగా రాశారు. పచీత అని ఒక శామాను గురువు ఉండేవారు. ఆయన తన శక్తులతో సర్జరీలు చేశారు. కొత్త అవయవాలు సృష్టించి పాడైన వాటి స్థానంలో పెట్టారు ఆయన. ఒక మామూలు కత్తితో కుట్లు వేశారు. గ్రీన్బర్గ్ తన కళ్ళతో చూసిన ఈ ఆపరేషన్ల గురించి పచీత అనే పుస్తకంలో ఉంటుంది నాన్న. ఐదు మామూలుగా మిరకల్స్ అద్భుతాలు అని అందరూ అనే విషయాలు ప్రతి ఒక్కరు చేయవచ్చు అని ఆయన కనుక్కున్నారు. అయితే ఇవన్నీ ఎలా ప్రాక్టికల్ గా సాధ్యం అని గ్రీన్బర్గ్ శోధన చేశారు 15 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఈ శోధనలో సింటర్జిక్ థియరీని కనుక్కున్నారు గ్రీన్బర్గ్ బాబా పురాతనమైన పూర్వీకుల థియరీలు, సూత్రాలు తీసుకొని కబాల, బుద్ధిజం, ట్రాన్స్ పర్సనల్ సైకాలజీలను స్టడీ చేసి సెంటెర్జిక్ థియరీని ప్రవేశపెట్టారు ఆయన. ఇదేంటో సులువుగా చెప్తా విను. లోకం రెండు రకాలుగా పనిచేస్తుంటుంది. ఒకటి టోనల్. రోజువారి చైతన్యం కనిపించే ప్రపంచం. రెండవది నహువల్. అదృశ్య ప్రపంచం. ధ్యానం చేసే వారికే అందుబాటులోకి వస్తుంది. నహువల్ స్థితిలో మనిషి మనసుకు ఆవల వెళ్లి విశ్వశక్తులతో కనెక్ట్ అవుతాడు. ఆరు లాటిస్ అంటే ప్రాథమికంగా విశ్వం ఎలా ఉందో అది. సంపూర్ణ పొందిక, సమరూపత కలిగిన హైపర్ కాంప్లెక్స్ ఎనర్జీ నెట్వర్క్ లాటిస్ అంటే రియాలిటీ. వాస్తవం. మనసు ఫిల్టర్ చేయని వాస్తవికత బాబా ఇందులో స్పేస్ టైం రెండు ఒకటే అయితే నెహువాల్ అనేది అదృశ్యంగా ఉంటుంది. ఒకానొక క్రియ దాని స్థితిని మారిస్తే మాత్రమే అది మనకు గోచరిస్తుంది. ఏడు మనిషి మెదడు లాటిస్ లాగే హైపర్ కాంప్లెక్స్ బాబా మెదడు మినీ లాటిస్ అన్నమాట. మినీ లాటిస్ అయిన నీ మెదడుకి విశ్వం అనే లాటిస్ కి మధ్య సమాచారం తిరుగుతూ ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ఆలోచనా క్రియ మొత్తం విశ్వం మీద ప్రభావాన్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నారు గ్రీన్బర్గ్ ఎనిమిది మనిషి మెదడు వైబ్రేషన్ ఇంకా ఎనర్జీలను ఆధారం చేసుకొని పని చేస్తుంది. వీటిని బట్టే మనం ప్రపంచాన్ని చూసి దేన్నైనా వాస్తవంగా అనుకోవడం అనేది ఆధారపడి ఉంటుంది. మన నిజం అనేది మన దృక్పదం పర్సెప్షన్ అంటే విషయాన్ని మనం ఎలా చూస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ వాస్తవం ఆ ఇప్పుడు కనెక్షన్ విను బాబా విశ్వం అనే లాటిస్ కి సింటర్జిక్ బ్యాండ్లు ఉంటాయి. నీ మెదడు అనే లెటైస్ కి కూడా సింటర్జిక్ బ్యాండ్లు ఉంటాయి. ఈ సింటర్జిక్ బ్యాండ్లు ఆ సింటర్జిక్ బ్యాండ్లు కనెక్ట్ అవుతూ ఉంటాయి. వీటి బంధం ఎలా ఉంటుంది అంటే నేను చెప్పాను గుర్తుందా నీ వైబ్రేషన్ కి మ్యాచ్ అయ్యే వైబ్రేషన్లు ఘటనలను విశ్వం నీకు పంపిస్తూ ఉంటుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలో చెప్పాను. ఇదే అది బాబా. అంటే నీ లాటిస్ బ్యాండ్స్ యొక్క ఎనర్జీ వైబ్రేషన్ ఉచ్చ స్థాయిలో ఉంటే విశ్వం యొక్క లాటిస్ దానికి అనుగుణంగా మారుతుంది. మంచి వైబ్రేషన్స్, మంచి ఎనర్జీ, మంచి అనుభవాలు నీకు ఇస్తూ వెళుతుంది. అలాగే నువ్వు లో వైబ్రేషన్ లో ఉంటే దానికి తగ్గ అనుభవాలు యూనివర్స్ నీకు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంది. కనుక నువ్వు ఏం చేయాలి? నీ వైబ్రేషన్ ఎనర్జీ ద్వారా నీ బ్రెయిన్ లో ఉన్న బ్యాండ్స్ ను మార్చుకుంటే విశ్వం యొక్క లాటిస్ లో ఉండే మ్యాచింగ్ ఉన్నత వైబ్రేషన్స్ తో నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. ఇది గ్రీన్బర్గ్ కనుక్కొని రాసిన విషయం బాబా దీని వల్ల మాయ అద్భుతం అనుకునే విషయాలన్నీ సులువుగా నువ్వు మేనిఫెస్ట్ చేసుకోగలవు అని అర్థమవుతుంది. పచీత ఇంకా డాన్ లూజియోలు మనిషి శరీరాన్ని ప్రకృతిలో తుఫాన్ లని కూడా కంట్రోల్ చేయగలిగింది ఈ బ్రెయిన్ బ్యాండ్లను హైపర్ వైబ్రేషన్ లోకి తీసుకువెళ్ళడం వల్లనే అని గ్రీన్బర్గ్ ఆవిష్కరించారు నాన్న. తొమ్మిది బాబా గ్రీన్బర్గ్ కనుకున్న విషయాల్లో నేను ఒక ఆఖరి దాన్ని ఇప్పుడు చెప్తా ప్రతి మనిషికి ప్రతి జీవికి ఒక న్యూరోనల్ ఫీల్డ్ ఉంటుంది. అంటే విస్తరించిన నాడీ మండలపు ప్రకంపన పరిధి న్యూరోనల్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. నీకున్న న్యూరోనల్ ఫీల్డ్ ఉంది కదా అది చుట్టూ ఉన్న అందరి అన్నిటి న్యూరోనల్ ఫీల్డ్లతో సంపర్కిస్తూ ఉంటుంది. కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ న్యూరోనల్ ఫీల్డ్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ లోకి వస్తూ మార్చుకుంటూ ఉంటాయి ఒకదాన్నఒకటి. దీన్నే సింటర్జిక్ థియరీలో హైపర్ ఫీల్డ్ అన్నారు నాన్న. అయితే ఇక్కడ బాబా నీ హైపర్ ఫీల్డ్ ని బట్టే నువ్వు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావో ఉంటుంది. అంటే వేరు వేరు సింతజిక్ బ్యాండ్లతో ఇంటరాక్ట్ అయ్యేవారు వేరు వేరు వాస్తవాలను చూస్తుంటారు. వేరే డైమెన్షన్లను చూస్తారు. అంటే వేరే తలాలు, లోకాలు, డైమెన్షన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నీకు కనపడట్లేదు అంతే అని చెప్తున్నారు గ్రీన్బర్గ్ అవి నీకు కనపడట్లేదంటే అవి నీ న్యూరోనల్ ఫీల్డ్ పరిధిలో లేవు అని అర్థం అందుకే కనపడట్లేదు. బాబా ఇదే విషయాన్ని సనాతన ధర్మం ఏ పేరుతో పిలిచిందో ఊహించు మాయ మాయ అనే పదం వాడాం న్యూరోల్ ఫీల్డ్ కాన్సెప్ట్ మాయనే ఇప్పుడు మెట్రిక్స్ అని కూడా అంటున్నారు. బాబా ఇదంతా కాస్త టెక్నికల్ గా అనిపించి ఉండొచ్చు నీకు కానీ నువ్వు దానివల్ల తెలుసుకోవలసింది ఒక్కటే సింపుల్ నువ్వు ఏది కావాలంటే అది సృష్టి చేసుకోవచ్చు మేనిఫెస్ట్ చేయవచ్చో దానికి కావలసింది కేవలం కేవలం నీ సింటర్జిక్ బ్యాండ్ ను మరింత ఉన్నత స్థితికి ఎలా వైబ్రేట్ చేసుకోవాలో నీకు చేత కావాలంతే ఊహించు బాబా ఇదే స్కూళ్లలో నేర్పించి ఉంటే మనకు ప్రపంచం ఎలా ఉండేది స్వర్గాన్ని భూమి మీదకి దించి ఉండేవాళ్ళం ఎందుకంటే నరకాన్ని సృష్టించాలి అంటే అలాంటి సైకో ఆలోచనలు ఉండే మనిషి పుట్టి ఉండేవాడే కాదు కనుక అవునా కాదా బాబా గ్రీన్బర్గ్ మెడిటేషన్ చేసి తన గత జన్మలను తెలుసుకున్నారు. లాటిస్ లో అన్ని ఉంటాయి. స్పేస్ టైం వేరు కావు కనుక అందులో పదిలంగా ఉన్న గతజన్మ అనుభవాల వైబ్రేషన్స్ సులువుగా పొందడం సాధ్యం. ఇంకా యోగులు గాలిలోకి లేచే ప్రక్రియ మనందరికీ సాధ్యమే అని కనుగొన్నారు గ్రీన్బర్గ్ నీ లోపల ఎనర్జీ మార్పులను తీసుకువస్తూ న్యూరోనల్ ఫీల్డ్ లో మార్పులు తెస్తే భూమి ఆకర్షణ శక్తిలో కూడా మార్పులు తీసుకురావచ్చు. క్షణంలో రోగం మాయం చేసుకోవడం కావలసినవి టకీమని ప్రత్యక్షమయ్యేలా చేసుకోవడం మానసిక ఆధ్యాత్మిక సాధనతో ఇవి సాధ్యమని చెప్పారు గ్రీన్బర్గ్ చేయాల్సిందల్లా బ్రెయిన్ యొక్క సింటర్జిక్ బ్యాండ్లను హై వైబ్రేషన్ లోకి తీసుకువెళ్ళడమే అది ఎలా లాటిస్ ను మనకు అనుకూలంగా మార్చే సింటర్జిక్ బ్యాండ్స్ హై వైబ్రేషన్ పరివర్తన ద్వారా అంటే ఏం లేదు తెలుగులో చెప్తే ధ్యానంలో కూర్చోవడం ద్వారా అంతే అంతా ఎనర్జీ మాత్రమే నీ ఎనర్జీని నువ్వు ఎలా తీర్చి దిద్దుకుంటే దానికి కి అనుగుణంగా నీ వాస్తవం మారుతుంది. సరే బాబా నేను మొదట్లో చెప్పిన చివరి ట్విస్ట్ వచ్చేలోగా ఇంకొక విషయం చెప్పాలి అసలు ఇవన్నీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో ఎందుకు లేవంటావ్ నాన్న గ్రీన్బర్గ్ కనుక్కున్న విషయాలు పిల్లలకి స్కూల్లో నేర్పిస్తే పిల్లలు వారి నిజ శక్తిని కనుగొంటారు. మనిషిగా మనకు శక్తి లేదు దరిద్రంలో బతకాలి కష్టపడడానికే జన్మ తీసుకున్నాము. ఇలాంటి పనికి మారిన దిక్కు మారిన మాటలన్నీ తప్పు అని తెలుసుకుంటారు పిల్లలు. అప్పుడు ఏమవుతుంది ఆ తరం అంతా ఆ జనరేషన్ అంతా ఒక శక్తివంతమైన జనరేషన్ అవుతుంది. న్యూ ఎర్త్ లో అదే జరగబోతోంది. మరి అలా జరిగితే బ్లాక్ ఓట్స్ కి చీకటి శక్తులకి మనిషి మీద పట్టు ఉంటుందా? మనుషులను కంట్రోల్ చేయగలవా అవి చేయలేవు. చీకటి శక్తులకు బానిసలు కావాలి. మనిషి తన నిజ స్వరూపం తెలుసుకుంటే బానిసగా బతకడు. అందుకని ఇటువంటి గొప్ప సైంటిస్టులను తొక్కేసే ప్రోగ్రాం పెడతాయి ఈ చీకటి శక్తులు. గ్రీన్బర్గ్ కనుక్కున్నవన్నీ కల్పనలు అని బ్లాక్ కోట్స్ కి పనిచేసే సైంటిస్టులు అనడం మొదలుపెట్టారు. అడుగడుగున తొక్కేసే ప్రయత్నం చేశారు. బ్లాక్ ఓట్స్ కోసం ఇటువంటి సైంటిస్టులే కాదు కమ్యూనిస్టులు హస్తాల వంటివారు కూడా పని చేస్తుంటారు. వీరందరి కుట్రతో అంత గొప్ప ఆవిష్కరణలు ప్రజలకు చేరకుండా పూర్తిగా అడ్డుకున్నారు. పిల్లలకు దిక్కుమాలిన సైన్సు మాత్రమే మిగిల్చారు. ఇప్పుడు చివరి ట్విస్ట్ విను బాబా. 1994 డిసెంబర్ 8 నుంచి అకస్మాత్తుగా అకోబో గ్రీన్బర్గ్ కనపడకుండా పోయారు. 30 ఏళ్ల 10 నెలల 22 రోజులు అయింది. ఈ వీడియో నేను మాట్లాడుతున్న సమయానికి ఆయన ఎందుకు మాయమయ్యారో నీకు తెలుసు కదా బాబా ఆయన ఆవిష్కరించిన విషయాలు ప్రపంచాన్ని పాలిస్తున్న కొన్ని రహస్య శక్తులకు ఆపదగా మారాయి. సినిమాల్లో లాగా ఆయన్ని సింపుల్ గా తప్పించేశారు. ఇదే బాబా మన ప్రపంచ వాస్తవం. అయితే నాన్న ఆ రోజుల్లో ఆయన చెప్పిన విషయాలు అర్థం చేసుకునే తెలివి ఎదుగుదల ప్రపంచంలో లేదు. 30 ఏళ్లకి ఇప్పుడు వచ్చింది. ఆ నీచ బ్లాక్ కోట్స్ షాడో గవర్నమెంట్ శక్తులను వాళ్ళ కుట్రలను తెలుసుకో వారిని ఓడించే మార్గం ఒక్కటే అది నీ చేతుల్లో ఉంది ఇప్పుడు ఈ సంగమ యుగంలో అదే గ్రీన్బర్గ్ చెప్పిన మార్గం ధ్యానం ధ్యానం లే మేలుకో సాధన మొదలుపెట్టు కుట్రలు భగ్నం చేసే టైం వచ్చింది. నిన్న అక్టోబర్ 30, 2025 లైవ్ ధ్యానంలో నాతో పాటు కూర్చొని ధ్యానం చేసిన వేల మంది లైట్ వర్కర్లకు ఆత్మ బంధువులకు బైరాగి మనసారా నమస్కరిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాడు. జై శ్రీరామ్ జై శివశంభం జై భారత్ జై గురుదేవదత్త

ధ్యానం అంటే నువ్వు అనుకునేది కాదు..! | The Secret of Supreme Meditation 🔱

ధ్యానం అంటే నువ్వు అనుకునేది కాదు..! | The Secret of Supreme Meditation 🔱

https://youtu.be/ZzJF0vdsh_s?si=2ng-vkHnaJp2MULx


ధ్యానం అంటే ఏమిటని అడిగితే కొంతమంది మనసుని నిశబ్దం చేయడం అని అంటారు. ఇంకొందరు దేవుడిని కలుసుకోవడం అని అంటారు. మరి కొందరేమో ఒత్తిడిని తగ్గించుకోవడం అని అంటారు. కానీ అసలు సత్యాన్ని ఎవ్వరూ చెప్పలేదు. ధ్యానం అంటే కేవలం మనసుని ప్రశాంతం చేయడం కాదు. ధ్యానం అంటే ఆ యూనివర్స్ తో మన మనసు ఒక్కటయ్యే క్షణం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది అదే యోగులు ఋషులు అనుభవించిన మహా ధ్యాన రహస్యాన్ని కొందరికి ధ్యానం క్షణాల్లో దైవానుభూతిలా అనిపిస్తుంది. మరికొందరికి సంవత్సరాలుగా ధ్యానం చేసిన వారికి అనుభవానికి రాదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ధ్యానం వెనక ఉన్న ఆ గూఢ సత్యం ఏమిటి? వేదాలు చెబుతున్న ఆ నిశబ్ద రహస్యం ఎక్కడ దాగి ఉంది? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ధ్యానం అనేది మనిషి కనుగొన్న మార్గం కాదు భగవంతుడు మనిషిలోకి ప్రవేశించే ద్వారం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి. ముందుగా ఈ ధ్యానం ఎప్పుడు పుట్టింది అనేది తెలుసుకోవాలి. సృష్టి ఆరంభంలో శబ్దమే మొదట పుట్టింది. అది కదలికకు రూపం ఇచ్చింది కాలానికి ఆరంభాన్ని ఇచ్చింది. కానీ ఆ శబ్దం ఆగిన క్షణంలోనే మొదటిగా నిశబ్దం జన్మించింది. ఆ నిశబ్దమే ధ్యానానికి మూలం ఆ నిశబ్దంలోనే ఈ సృష్టి విశ్రాంతి తీసుకుంది. దేవుడు తనలోకి మళ్ళీ మునిగిపోయాడు. ఋషులు మహర్షులు ఆ నిశబ్దాన్ని మళ్ళీ అనుభవించాలనే కోరికతో ఈ ధ్యాన యాత్రను మొదలు పెట్టారు. అప్పుడు వారు గ్రహించారు శబ్దం సృష్టిని ప్రారంభిస్తుంది. కానీ నిశబ్దం ఆ సృష్టినే నిలబెడుతుంది అని ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు కళ్ళు మూసుకొని మన లోపల ఉన్న విశ్వాన్ని దర్శించడం నీ ఊపిరి నిశబ్దంగా మారినప్పుడు నీ ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు నువ్వు నీలో ఉన్న ఆ శాశ్వత నిశబ్దాన్ని వింటావు. అక్కడ మాటలు లేవు కానీ ఒక చైతన్య ప్రవాహం ఉంది. అక్కడ కాలం ఆగిపోతుంది కానీ జీవం మేల్కుంటుంది. అదే క్షణంలో మీరు తెలుసుకుంటారు మీరు శరీరం కాదు మీరు మనసు కాదు మీరు ఒక చైతన్యం అని అయితే ఆ చైతన్యాన్ని కేవలం తెలుసుకోవడంతో సరిపోదు. దాన్ని ప్రతీక్షణం అనుభవించాలి. అవగాహనను అనుభవంగా మార్చే మొదటి దారి నీ శరీరాన్ని ఈ భూమితో మేళవించడం వేదాలు చెబుతున్నాయి మాతా భూమిహి పుత్రోహం పృథివ్యః అని ఈ వాక్యము అధర్వణ వేదంలో ఉంది. అంటే దీని అర్థం భూమి మన తల్లి మనం ఆమె సంతానం అని అంటే మన ప్రాణం భూమి ప్రాణం నుండే పుట్టింది. అందుకే ధ్యానంలో కింద కూర్చోమని అంటారు. ఎందుకంటే భూమి నీకు కేవలం నేల కాదు అది జీవశక్తి. ఈ భూమి హృదయగర్భంలో నిశబ్దంగా కొట్టుకునే ఒక చైతన్య నాదం ఉంది. ఆ నాదం మీ హృదయ స్పందనతో సమానంగా కదులుతుంది. మీరు నేలపై కూర్చున్నప్పుడు మీ కాళ్ళ కింద ఉన్న భూమి శక్తి మీలోకి ప్రవేశించడం ప్రారంభిస్తుంది. మీ కణాలు, మీ నాడులు, మీ ప్రాణం అన్నీ ఆ తరంగంతో సమానమైన రిథంలో కలిసిపోతాయి. అప్పుడు ఆ సూక్ష్మ కంపనం నీ వెన్నుముక దాకా పైకి ఎగిసిపోతుంది. నీ శరీరం మృదువైన గీతంలా ఆ భూమి రిథంలో నడవడం మొదలు పెడుతుంది. అప్పుడు నీ మనసు ఆగిపోతుంది. నీ ఊపిరి లోతుగా మారుతుంది. నీ చైతన్యం భూమి యొక్క నిశబ్దంలో మునిగిపోతుంది. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు. ఈ భూమి యొక్క గుండె చప్పుళ్లను వినడం. ఎందుకంటే మనం పుట్టింది ఈ భూమిపైనే జీవించేది ఈ భూమిపైనే మన శరీరం చివరికి లయమైపోయేది కూడా ఈ భూమాత ఒడిలోనే కాబట్టి ఈ నిజాన్ని మీరు గుర్తించిన క్షణంలోనే మీరు కేవలం ధ్యానం చేయడం కాదు మీరు ఈ భూమితో ఏకమవుతారు. భూమి యొక్క చైతన్యం మీలోకి ప్రవేశించిన తర్వాత ఆ శక్తి మీ వెన్నుముక మార్గంలో పైకి ప్రయాణించడం ప్రారంభిస్తుంది. అందుకే ధ్యానంలో ఒక సూత్రం చెబుతారు. శరీరం స్థిరమైతే శక్తి జాగృతం అవుతుంది అని ఎందుకంటే వెన్నుముక మధ్యలో ఒక గూడ మార్గం ఉంది. దానిని సుషుమ్న నాడి అంటారు. అది కేవలం నాడి కాదు అది భగవంతుడి శక్తి ప్రవహించే శ్రవంతి. ఈ నాడి భూమి నుంచి ఆకాశం దాకా ఉన్న ఒక అంతరిక లింక్ లాంటిది. మీరు నిటారుగా కూర్చున్నప్పుడు భూమి నుంచి వచ్చే శక్తి ఆ మార్గంలో పైకి ఎగిసిపోతుంది. అది మొదట మృదువైన వేడిలా అనిపిస్తుంది. తర్వాత ఒక కాంతిలా మారుతుంది. చివరికి ఒక నిశబ్ద తరంగంగా చైతన్యంలో కలిసిపోతుంది. ఈ ప్రయాణాన్నే యోగులు కొండలిని మేల్కొలుపు అని పిలుస్తారు. అది మన శరీరంలో ఆధ్యాత్మిక శక్తి మెలకువ అవ్వడం. వెన్నుముక వంకరగా ఉంటే ఆ శక్తి మధ్యలోనే ఆగిపోతుంది. కానీ నిటారుగా ఉన్నప్పుడు ఆ శక్తి నిర్బంధం లేకుండా సుషుమ్న నాడి ద్వారా పైకి ఎగిసి పోతుంది. ఆ ప్రవాహం పైకి ప్రవహిస్తూ ముందుగా మన హృదయాన్ని తాకుతుంది. తరువాత మన గొంతు దాటి మద్యంలోని ఆజ్ఞ చక్రాన్ని మేల్కొలుపుతుంది. చివరికి సహస్రార చక్రంలో దివ్య కాంతిగా వికసిస్తుంది. అదే క్షణంలో మీరు ఈ భూమి శక్తిని ఆ ఆకాశ చైతన్యాన్ని ఒకేసారి నీ లోపల అనుభవిస్తారు. కాబట్టి ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడమే కాదు. ధ్యానం అంటే భూమి నుంచి ఆకాశం వరకు మీ శక్తి యొక్క ప్రయాణం కూడా. భూమి నుంచి పైకి ఎగసిన ఆ శక్తి ఇప్పుడు నీ ఊపిరిగా మారుతుంది. ఆ ఊపిరి కేవలం గాలి కాదు అది నీలో ప్రవహించే ఆ దైవ చైతన్యం. అందుకే ప్రాచీన ఋషులు చెప్పారు శ్వాసే పరమజ్ఞానం అని. ఎందుకంటే ఊపిరి అనేది చైతన్యానికి తాళం చెవి. నువ్వు ఊపిరిని గమనించడం మొదలుపెట్టినప్పుడు నీ మనసు ఆలోచనల వలయం నుంచి బయటకు వస్తుంది. ఆలోచనలు తగ్గినప్పుడు నీ లోపల నిశబ్దం మొదలవుతుంది. కానీ ఆ నిశబ్దం ఖాళీ కాదు అది ఒక జీవం ఆకాశంల అంతులేని స్థితి అందులో ప్రతి ఊపిరి ఒక నాదంలా వినిపిస్తుంది. ప్రతి నిశ్వాసం ఒక కొత్త శాంతిలా అనిపిస్తుంది. ఆ నాదాన్ని విన్నవాళ్ళనే ఋషులు అన్నారు. వారు తమ లోపల ఆ నిశబ్దాన్ని విన్నప్పుడు ధ్యాన స్థితిలో వారు తలమునకలు అయ్యారు అప్పుడే వాళ్ళు గ్రహించారు ప్రతి ఊపిరి ఒక మంత్రం ప్రతి నిశ్వాసం ఒక సమర్పణ అని అయితే ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఈ మహా ధ్యాన రహస్యాన్ని ఎవరు మొదటిగా అనుభవించారు అనేది ఈ మహా ధ్యాన రహస్యాన్ని అనుభవించిన వారు మనలాగా సామాన్యులు కాదు వారు యోగులలో యోగులు మహా యోగులు వారి మనసు ఈ భూమి లాంటిది వారి అవగాహన ఆ ఆకాశం లాంటిది వారు కూర్చుని కళ్ళు మూసుకోలేదు వారు కళ్ళు తెరిచే ఈ సృష్టినంతటిని చూశారు. వారి ప్రతి శ్వాసలో ఆ భగవంతుని గుర్తించారు. వారు శ్వాసని కేవలం గమనించలేదు. ఆ శ్వాసనే ఆ విశ్వంగా భావించారు. వారు శబ్దాన్ని వినలేదు. శబ్దంలో ఉన్న శాంతిని గ్రహించారు. ఆ స్థితిలో శరీరం నిశబ్దమైంది. ఆలోచన ఆగిపోయింది. కానీ అవగాహన మాత్రం అంతటా విస్తరించింది. వారు గ్రహించారు మనసు ఆగిన చోటే చైతన్యం ప్రారంభం అవుతుంది అని అదే స్థితిని వారు మహాధ్యానం అని పిలిచారు. అక్కడ నేను అనే భావం లేనే లేదు కేవలం చైతన్యం మాత్రమే ఉంది. అయితే ఈ స్థితి సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అది మన మనసును దాటి చైతన్యంలోకి ప్రవేశించే స్థితి. ఆ స్థితి తపస్సు, నియమం, జాగృతి ఈ మూడు కలిసిన ఒక పర్వత శిఖరం లాంటిది. దానిని ఎక్కిన వారే ఈ సృష్టి రహస్యాన్ని అనుభవించారు. అదే మహా ధ్యాన రహస్యం. అక్కడ మౌనం మాత్రమే మాటగా మారుతుంది. శ్వాస ప్రార్థనగా మారుతుంది. జీవం స్వయంగా జ్ఞానం అవుతుంది. ఆ మహాయోగులు అనుభవించిన స్థితి ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు కాబట్టే వేదాలు మనకోసం ఒక మార్గాన్ని చూపాయి. అవే సామాన్యులకు చేరుకునే ధ్యానాలు. ప్రతి మనిషి తన స్థితికి సరిపోయే ధ్యానం చేయవచ్చు. ఎందుకంటే ధ్యానం ఒక్కటే కాదు అనేక రూపాలు ఉన్నాయి. శాంతి ధ్యానం మనసు నిశబ్దమయ్యే మార్గం ఆరోగ్య ధ్యానం శరీరాన్ని ప్రాణంతో నయం చేసే మార్గం సంపద ధ్యానం అబండెన్స్ ఫ్రీక్వెన్సీని మేలుకొలిపే సాధన సంకల్ప ధ్యానం ఆలోచనలను సృష్టిగా మార్చే మార్గం చైతన్య ధ్యానం అవగాహనను దివ్యంగా మార్చే ప్రయాణం ఈ ధ్యానాలన్నీ వేరు వేరు దారు లాంటివి కానీ చివరి కవి మనల్ని తీసుకెళ్లే స్థలం మాత్రం ఒక్కటే అది మీలోని సత్యానికే వేదాలు చెప్పిన ఈ మార్గం లు మనిషి నడవగలిగే దారులు ఈ ధ్యానాలు కూడా ఆ మహాధ్యానం వైపే మనల్ని తీసుకెళ్తాయి. భూమి నుండి ఆకాశం వరకు ఉన్న ఆ అంతరాన్ని మనలో కలుపుతాయి. అందుకే ఈ ధ్యానాలు కేవలం యోగులకే కాదు మనలాంటి సాధారణ మనుషులు కూడా సాధించగలిగే మార్గాలు. వీటిని అభ్యాసించినప్పుడు నీ ఆలోచన మారుతుంది. నీ శక్తి సమతుల్యం అవుతుంది. నీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. అందుకే ఈ ధ్యానాల వెనక దాగి ఉన్న రహస్యాన్ని మీ అందరికీ సులభంగా అర్థమయ్యేలా వివరించాలని అనుకుంటున్నాను. ఇక నుంచి మనం ఈ ధ్యాన రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సంపద ధ్యానం, శాంతి ధ్యానం, ఆరోగ్య ధ్యానం, సంకల్ప ధ్యానం, చైతన్య ధ్యానం ఇవన్నీ మీ జీవితంలో ఎలా చేయాలి ఎలా అనుభవించాలి అన్నది తదుపరి వీడియోలో ఒక్కొక్కటిగా వివరించబోతున్నాను. కాబట్టి మీరు ముందుగా ఏ ధ్యానం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఎక్కువ కామెంట్స్ వచ్చిన ధ్యానం పైనే మన తదుపరి వీడియో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మహా ధ్యాన రహస్యం మీకు ఏమనిపించింది? మీరు ఇప్పటివరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక పవర్ఫుల్ లైక్ కొట్టి మీ WhatsAppట్ఫ లలో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.
 🔥అంతర్యామి 🔥
# కర్మ మార్గం...

☘️చాలామంది సత్యాన్వేషణ చేస్తారు కానీ, తామే  సత్యమని గ్రహించలేరు. అసలు సత్యమంటే ఏంట అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించరు. సత్యవ్రతం మోక్ష సోపానమనుకుంటారు. సత్కర్మలు చేయాలనుకోరు. సత్యమనేది పుణ్యకర్మ కావచ్చు. కానీ సత్కర్మ కాదు. జ్ఞానంతో కూడినదే సత్కర్మ. ఎవరు దేవుడు అనేది ఎవరికి వారు జ్ఞానంతో తెలుసుకోవాలి. కర్మకాండలు చేస్తూ సత్యపథంలో ఉన్నామనుకునేవారు తమలోని దైవాన్ని దర్శించుకోవాలి.

☘️కర్మమార్గంలో కొన్ని క్లిష్టతలు ఉన్నాయి. కర్మలు చేసినా ఫలితం ఆశించవద్దన్నది గీతాకారుడి వ్యాక్యా కర్మలలో అనేక అనర్థాలు ఎదురవుతాయి. మరి శ్రేయోదాయక కర్మలు ఏంటీ అనే సందేహానికి కూడా పరమాత్మ సమాధానం ఇచ్చాడు. జీవులు కర్మకు బద్దులవుతారు. జ్ఞానంతో ముక్తులవుతారు. ఇది తెలుసుకుంటే కర్మ మార్గం ఫలవంతమవుతుంది. కర్మ చేసే క్రమంలో 'వ్యక్తిత్వాన్ని' మరచిపోవటం తగదు. మంచి, చెడు అనేవి మనసులో ఉండే భావనలంటారు మనస్తత్వవేత్తలు. వీటిననుసరించే చేసే కర్మ ఉంటుంది. రావణుడు, రాముడు, దుర్యోధనుడు, ధర్మరాజు ఇందుకు గొప్ప ఉదాహరణలు. వారిని పురాణ పురుషులుగా కాకుండా మానవ స్వరూపాలుగా గ్రహించగలిగితే 'కర్మతత్వం' అవగతమవుతుంది. 'నేను ఏదో ఒకనాటికి మరణించాల్సిందే'నని రోజూ ఓ అయిదు నిమిషాలు ఆలోచించుకుంటే సత్కర్మలే చేయాలని మనసవుతుంది. అలా అద్భుతాలు సాధించవచ్చు.

☘️కర్మకాండల్లో మునిగి తేలుతున్న జిజ్ఞాసువులు మోక్షానికి దూరమవుతున్నారని తలచిన శివుడు వారికి దిశానిర్దేశం చేయాలనుకున్నాడు. సాధారణ మనిషి రూపంలో వారిమధ్య అవతరించాడు. ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూసిన రుషిపత్నులు ఆయనను అభిమానించసాగారు. ఎంతో తపశ్శక్తి కల రుషులు సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ పాపాత్ముడు రుషిపత్నులను అపహరించటానికి వచ్చాడనుకున్నారు. ఎవరి కోసం సుదీర్ఘకాలం 'నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే...' అని ప్రార్థిస్తున్నారో స్వయంగా ఆయనే దిగి వస్తే గ్రహించలేకపోయారు. ఒక ఏనుగును, పులిని సృష్టించారు. పోయి అతణ్ని సంహరించమని చెప్పారు. పరమశివుడు వాటిని వధించి ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని ధరించాడని శివపురాణం చెప్పిన కథ. ఇది తెలుసుకున్న రుషులకు మోక్ష మార్గమేమిటో శివుడు నిజస్వరూపంతో బోధించాడు....

☘️సత్కర్మలో- 'కర్మకింపరం, కర్మతత్ జడం'- కర్మజడం. జడాన్ని కదిపే కర్త 'నేను కాదు' భగవంతుడని గుర్తుంచుకోవాలి. ఆ దేవుడి కోసం చేసే మంచి అంతా అన్నార్తుల కోసం చేయాలి. అదే సత్కర్మ. పక్షికి నాలుగు గింజలు, చెట్టుకు ఇన్ని నీళ్లు పోయడమూ ఈ కోవకు చెందుతాయి. కానీ దైవ సేవ పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నవారు ఈ చిన్ని జీవన సూత్రాన్ని గ్రహించలేకపోవటమే చిత్రం. స్వలాభాపేక్షతో చేసే కర్మలు సత్కర్మలు కావు. పైగా 'అటువంటి కర్మల నుంచి ఎన్నటికి విముక్తులు కాలేరు' అంటారు రమణ మహర్షి. ఎవరైతే సత్కర్మ భగవంతుడి కోసమే చేస్తారో అటువంటివారికి దుఃఖమే లేదు. అంతా సంతోషమే.🙏
✍️- భమిడిపాటి గౌరీశంకర్
 


🙏 *రమణోదయం* 🙏

*తాము ఇంకా ఎన్నాళ్ళు బ్రతికుంటామని నిక్కచ్చిగా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కనుక జన్మ బంధాన్ని త్రెంచుకోడానికి దృఢ సంకల్పం బూనిన తీవ్ర సాధకులకు తమ శరీరంపైన, ప్రాపంచిక విషయాల పైనా ఏ క్షణాన ఏవగింపు, ద్వేషం కలుగుతాయో ఆ క్షణమే వెంటనే అన్నిటినీ త్యజించి వారు సన్యసించటమే మేలు.*

వివరణ: *ఆశ్రమ క్రమం సామాన్యులకే కాని తీవ్రముముక్షువులకు కాదని భావం.*

నేలమీద కనిపించే మన నీడవంటిది అహంకారం.
ఎవరైనా ఆ నీడను ఊడ్చడానికి ప్రయత్నించడం
అవివేకం కాదా? ఆత్మ ఒక్కటే సత్యమైనది.
పరిమితి కలదైతే అది అహంకారం.
పరిమితి లేనిదైతే అది అనంతం, నిత్యసత్యం.

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹   

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.829)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
 🦚జ్ఞాన ప్రసూనాలు 🚩
    01/11/25

1) నా మనస్సు అని నీవు స్వంతదారుగా ఫీలవడం వలన మనసు చెడ్డదయ్యిందే గాని ఆత్మ ప్రకాశం నుండి ప్రసారమయ్యే ఓ కాంతిరేఖే మనస్సు.

2) మౌనం ఏకాంతం అనేవి అనుష్ఠించి ఉండవల్సిన విషయంగా కాకుండా అవి సహజంగా నీకు కలిగినప్పుడు నీవు ముక్తుడవు.

3) గొంతు కోసిన కోడి కూయలేదు. అహమణిగిన యోగి భాషించలేడు.

4) నింగీ నేలను
ఏకం చేస్తుంది వర్షం. దేవుణ్ణి జీవుణ్ణి ఏకం చేస్తుంది జ్ఞానం.

5) ప్రతివాడూ నేను - నేను అంటున్నాడు.
నేను అనేది భగవన్నామం. కాబట్టి తెలిసి పలికినా, తెలియక పలికినా ఫలితం సమం.
 _*శ్రీమల్లికార్జున అష్టోత్తరశతనామావళీ -5 (17-20)*_
[శ్రీశైలఖండాంతర్గమ్ - నందీశ్వరేణ ప్రోక్తం]
✍️ శ్రీ శ్రిష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మా
🙏🔱⚜️🔱⚜️🕉️🔱⚜️🔱⚜️🙏

17. _*ఓం దాక్షాయణీపతయే నమః*_

🔱 దాక్షాయణీపతి అనగా దక్షప్రజాపతికి కుమార్తె అయిన సతీదేవికి భర్త. ఇది శివుని శక్తితో అన్యోన్యతను, ఆత్మీయతను, ఆధ్యాత్మిక దాంపత్య తత్త్వాన్ని సూచిస్తుంది. 

🔱 మల్లికార్జునస్వామివారు శక్తితో ఏకత్వాన్ని పొందిన పరమేశ్వరునిగా భావించబడతారు. శివుడు సతీదేవిని భార్యగా స్వీకరించి, ఆమెతో అన్యోన్యతను పొందాడు. ఆమె త్యాగం, మల్లికార్జునస్వామి ధైర్యం కలసి జగత్తు ధర్మాన్ని స్థాపించాయి. మల్లికార్జున స్వామి శక్తితో ఏకత్వాన్ని పొందిన తత్త్వముగా, ప్రేమతో కూడిన ధర్మాన్ని భక్తులకు ప్రసాదించే స్వామిగా వెలుగుతాడు. 

🔱 ఈ నామము శివుని శక్తితో అన్యోన్యతను, ఆధ్యాత్మిక దాంపత్య తత్త్వాన్ని ప్రతిబింబిస్తుంది.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామివారినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి సతీదేవి స్వరూపం.మల్లికార్జునస్వామి దాక్షాయణీపతిగా శక్తితో ఏకత్వాన్ని పొందితే, భ్రమరాంబికాదేవి  శక్తిని జగత్తులో ప్రవహింపజేస్తుంది. ఇది శివ–శక్తుల అన్యోన్యతను, భక్తులపై వారి అనుగ్రహాన్ని ప్రతిబింబిస్తుంది.

🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

18. _*ఓం విశ్వేశ్వరాయ నమః*_

🔱 విశ్వేశ్వరుడు అనగా విశ్వానికి అధిపతి, సర్వలోకాలపై అధికారం కలిగిన పరమేశ్వరుడు. ఈ నామముద్వారా మల్లికార్జునస్వామివారు విశ్వాన్ని ఆవహించిన తత్త్వముగా, ప్రతి తత్త్వాన్ని నియంత్రించే అధిపతిగా భావించబడతారు.
మల్లికార్జునస్వామి విశ్వలోకాధిపతిగా, సర్వతత్త్వాలకు మూలంగా, జగత్తు ధర్మ చక్రాన్ని నడిపించే తత్త్వముగా వెలుగుతాడు. మల్లికార్జునస్వామి ఆజ్ఞే ధర్మం, మల్లికార్జున స్వామి అనుగ్రహమే శాంతి. 

🔱 ఈ నామము శివుని విశ్వాధిపత్యాన్ని, అంతర్యామిత్వాన్ని, సర్వతత్త్వాల ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో తన జీవితం శివుని ఆధీనంలో ఉందని గుర్తించి ధర్మ మార్గంలో స్థిరమవుతాడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామివారినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి ప్రకృతిలో సర్వశక్తి స్వరూపంగా, కార్యశక్తిగా నిలుస్తుంది. మల్లికార్జునస్వామి విశ్వేశ్వరుడిగా ధర్మాన్ని స్థాపిస్తే, భ్రమరాంబికాదేవి  ధర్మాన్ని భక్తుల జీవితాల్లో ప్రవహింపజేస్తుంది. ఇది శివ–శక్తుల విశ్వ నిర్వహణ తత్త్వాన్ని, జగత్తు స్థితి–లయ సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

    
19. _*ఓం విశ్వయోనయే నమః*_

🔱 విశ్వయోని అనగా ప్రపంచ సృష్టికి మూలమైనవాడు, సర్వ భూతాల జననానికి ఆధారమైన తత్త్వము. ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామివారు జగత్తు ఉద్భవానికి మూలబీజంగా, సర్వ సృష్టికి ఆదిగా భావించబడతారు.
ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి తత్త్వము మల్లికార్జునస్వామివారి చైతన్యానికి ఫలితంగా ఉద్భవించింది. మల్లికార్జునస్వామి సృష్టి, స్థితి, లయ అనే త్రికాల ధర్మాన్ని తనలో కలిగి ఉన్న పరబ్రహ్మం. విశ్వయోని అనగా అణువణువులో మల్లికార్జునస్వామి ఉనికి, ప్రపంచ జననానికి మూలతత్త్వము, ఆత్మజ్ఞానానికి ఆదిప్రేరణ. ఈ నామము శివుని సృష్టిశక్తిని, ఆత్మతత్త్వాన్ని, ప్రపంచజననానికి మూలాన్ని ప్రతిబింబిస్తుంది. 

🔱 భక్తుడు ఈ నామస్మరణతో తన ఉనికి మూలాన్ని గుర్తించి ఆత్మవికాస మార్గంలో అడుగులు వేస్తాడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామివారినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి సృష్టికి కార్యరూపం, ప్రకృతిలో జనన శక్తి, జీవరూపాల ఆవిర్భావానికి ఆధారం. మల్లికార్జునస్వామి విశ్వయోనిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  తత్త్వాన్ని జీవరూపంగా, ప్రకృతిలో అనుభూతిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల సృష్టి తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

20. _*ఓం విశ్వాత్మనే నమః*_

🔱 విశ్వాత్మ అనగా ప్రపంచంలోని ప్రతి జీవిలో అంతర్యామిగా ఉన్న ఆత్మతత్త్వము, సర్వ ప్రాణులలో వెలిగే పరబ్రహ్మం. ఈ నామముద్వారా మల్లికార్జునస్వామివారు ప్రతి హృదయంలో వెలిగే ఆత్మజ్యోతిగా భావించబడతారు. మల్లికార్జునస్వామి ప్రతి జీవిలో, ప్రతి శ్వాసలో, ప్రతి భావంలో అంతర్యామిగా ఉన్నాడు. మల్లికార్జునస్వామి నిరాకారమైనా, భక్తుల హృదయాల్లో సాకారంగా అనుభూతి చెందతాడు. 

🔱 విశ్వాత్మ అనే నామము శివుని నిత్యత్వాన్ని, అంతరంగ శుద్ధిని, ఆధ్యాత్మిక ఏకత్వాన్ని సూచిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో తనలో శివుని ఉనికిని గుర్తించి, ఆత్మజ్ఞాన మార్గంలో స్థిరమవుతాడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామివారినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి త్మకు ప్రకృతి రూపం, ఆత్మజ్ఞానాన్ని కార్యరూపంలోకి తీసుకెళ్లే శక్తి. మల్లికార్జునస్వామి విశ్వాత్మగా చైతన్యాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  చైతన్యాన్ని జీవరూపంలో, ప్రకృతిలో అనుభూతిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల అంతర్యామిత్వ సమన్వయాన్ని, జీవ–ఆత్మ ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు

*సేకరణ:*
🙏⚜️🔱⚜️🔱🕉️⚜️🔱⚜️🔱🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(262వ రోజు):--
        స్వామీజీ తన జీవితంలో దుర్ఘ టనలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఢిల్లీలో ఒక ముఖ్యమైన కార్యకర్తను అతని కొడుకే హత్యచేశాడు. స్వామీజీకి కార్యదర్శిగా పనిచేసే ఒక అమెరికన్ వ్యక్తి కామెర్లవ్యాధికి బలయ్యాడు. తన సవతి తల్లి కొడుకు త్రాగుబోతు తనం వల్ల అకాలమృత్యువు వాత పడ్డాడు. కొందరు శిష్యులు తాము గురువుగారి కంటే గొప్పవారైనట్లు భావించి, ఆయనను బాహాటంగా విమర్శించడం మొదలుపెట్టారు. దేనికీ భయపడకుండా ఆయన తన స్వేచ్చా గానాన్ని వినిపించేవారు, వినదలుచుకున్న వారికోసం. "విజయం పొందినా పొందకపోయి నా పర్వాలేదు" అని చెప్పేవారు అందరికీ ; తను బోధించినదే ఆచరించేవారు కూడా.
        తనవద్దకు వచ్చిన వారందరికీ వారి వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన వివేకాన్నీ, ధైర్యాన్నీ అందించడమే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు తను బోధించినన్నా ళ్లూ. వారంతా తమ స్వప్రయత్నం ద్వారా ముందుకుసాగి తమతోనే ఉన్న నిజమైన దైవాన్ని గ్రహించాలి. ఈ మార్గాన్ని జనులకు చూపే తన లక్ష్యం నుంచి ఆయన ఎన్నడూ - ఒక్క రోజైనా, ఒక్కగంటైనా - మరల లేదు. 
         తన జీవితాన్ని తన చెప్పుచేత ల్లో ఉంచుకోగలిగిన వాడు ప్రపంచా న్నంతనూ జయించగలడని స్వామీజీ విశ్వసించారు. విజయాని కి అదే నిజమైన పరీక్ష. వ్యాధిగ్రస్త మైన మనసుకు చికిత్సకోసం హిమాలయాలకు వెళ్లి ఆశ్రమంలో చేరటం కొందరికి అవసరమైనా, అందరూ ఆవిధంగా చేయనవసరం లేదని ఆయన అభిప్రాయం. " ఈ శరీరం ప్రపంచంలో వ్యవహరించ డానికి నిర్దేశించ బడింది. దీని నిజమైన యజమానికి ఎక్కడికైనా వెళ్లి, ఎప్పుడైనా, ఏదైనా చేసే స్వాతంత్య్రం ఉంది - ప్రత్యేకమైన గుర్తింపు పత్రమున్న వ్యక్తికిలా. 
         ప్రజలకు సేవచేయని స్వాముల నూ, మునులనూ ఆయన విమర్శిం చేవారు : "వాళ్లంతా ఈదేశం పండి స్తున్న ఆహారాన్నే తీసుకొని తింటున్నారు ; కాని, దానికి బదులు గా ఏమీ ఈయటం లేదు. మన ఆర్థిక స్థితికి దీనిని భరించే శక్తిలేదు. కొండ మీదినుంచి దిగివచ్చి ప్రపంచానికి సాయంచేయ్యడానికి భయపడితే, వాళ్లకేం జ్ఞానం ఉన్నట్లు ?" భగవద్గీత 3 వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృకృష్ణుడు పనిచేయ కుండా భుజించేవారందరూ దొంగ లన్నాడు. గాంధీజీ వ్యవసాయ దారులకు వర్షాకాలం లోనూ, శీతా కాలంలోనూ పనులుండవు కనుక ఆ కాలాలలో రాట్నంతో నూలు వడకాలని వారిని ఒప్పించడానికి అదే శ్లోకాన్ని వినియోగించారు. 
   "ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః ! తైర్దత్తా నప్రదాయైభ్య యో భుంక్తే స్తేన ఏవ సః !!   (3-12)"
        యజ్ఞాలద్వారా పూజింపబడిన దేవతలు కోరిన సుఖాలనిస్తారు వారివల్ల పొందిన వస్తువులను వారికి అర్పించకుండా అనుభవించ డం దొంగతనంతో సమానం. 
        స్వామీజీ తదనంతరం ఆయన వంటి వారెవరూ ఉండబోరని చిన్మయమిషన్ సభ్యులు తరుచూ వాపోయేవారు. వారి అభిప్రాయం 
సరైనదే ; మరొక స్వామి చిన్మయా నంద ఉండబోరు. కాని, తమకున్న ప్రత్యేకమైన సామర్థ్యాల తోనూ, ప్రేరణల తోనూ పనిచేయటానికి ముందుకు వచ్చిన ఎందరో బ్రహ్మ చారులున్నారు ; ఇంకెందరో బ్రహ్మ చారులు ముందుకు వస్తారు. విత్తనాలను చాలా జాగ్రత్తగా నాటడం జరిగింది ; తగిన సమయం లో అవి వృక్షాలై ఫలించకపోవు. 
        1974 లో స్వామి గోవిందగిరి తపోవన్ కుటీరం నుంచి మద్రాసు కు వైద్యచికిత్స కోసం వచ్చారు. స్వస్థత చిక్కిన తర్వాత, తన సహ శిష్యుడు నిర్వహించిన యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామీజీ బోధనల గురించి ఆయన సంక్షిప్తంగా చెప్పినదిది:
       స్వామి తపోవన్ మాత్రమే కాదు, స్వామి చిన్మయానంద కూడా నాకు గురుసమానులే. ఔను, నేను స్వామి చిన్మయానంద నుంచి నేర్చుకున్నది చాలానే ఉంది. సత్యాన్ని గ్రహింప జేసే శక్తి ఆయనకుంది. ఆయన మాటలు విన్నపుడు తెలుసుకోవాల్సి నదంతా తెలిసిపోయిందని మన కనిపిస్తుంది. ఆ జ్ఞాన ప్రకాశాన్ని మనసులో నిలిపి శంకలన్నీ మాయంచేయటం లోనే మన మంతా విఫలమౌతున్నాం. మన పాత ప్రవృత్తులు మళ్ళీ వెనుకకు వచ్చి మనలో పాతుకుపోయే అవకాశా న్నిస్తున్నాము. 
       భగవదవ తారులైన ఋషులం దరూ దివ్యగానాన్ని వినిపించే వాద్య పరికరాలే. విశ్వ సేవకే అంకితమైన ఆ మహనీయులు తమ అవతారం ఈవిధంగా ఉండాలనో, మరోవిధం గా ఉండాలనో కోరుకోరు. తాము ఎక్కడున్నా, ఎలాఉన్నా తమలోనూ, ప్రపంచంతోనూ వారు నిరంతర సంతుష్టితో ఉంటారు. మహాత్ముల ప్రత్యేకత ఇదే. అన్ని కాలాలకూ అన్వ యించే జీవన శాస్త్రమైన వేదాంతం వ్యక్తికి తను వాగ్దానం చేసినదంతా చేయగలదా? వేదాంతజ్ఞానం సత్య మని నిరూపించడానికి స్వామి జీవితం, ఆదర్శం దృష్టాంతంగా నిలిచాయి. 
                        --***--
        🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺
 


ఓం నమో భగవతే శ్రీ రమణాయ

    దక్షిణామూర్తివలె భక్తులందరి నడుమ మహర్షి సుఖ ఆశీనులై కూర్చొని ఉన్నారు.

  అరుణగిరి మీదనుండి ఒక కోతి చాలా కోతులని తనతోపాటు వెంటబెట్టుకుని మహర్షి సన్నిధికి వచ్చింది. భక్తులందరూ చూస్తూ ఉండగానే ఆ కోతి మహర్షి వద్దకు వెళ్లి, మహర్షి ఒడిలో కూర్చొని, మహర్షిని గట్టిగా కౌగలించుకుని పళ్ళు ఇకిలించింది; ఎదో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది. అక్కడ దాదాపుగా నూరు కోతుల వరకూ ఉన్నాయి. అక్కడఉన్న భక్తులు "భగవాన్! ఆ కోతి తమతో ఏమి మాట్లాడింది?" అని అడిగారు.
       
      మహర్షి ఇలా సెలవిచ్చారు ...
  
   "ఈ రోజే తక్కిన కోతులు తనని రాజుగా చేసాయని, ఆ గోడమీద కూర్చున్న కోతుల వంక చూపించి, అది నా పట్టమహిషి; దాని ప్రక్కన ఉన్నది రెండవ రాణి; ఆ కూర్చున్నవాడు సైన్యాధిపతి; తక్కినవారు సైన్యం!" అని చెపుతుంది.
    
      మహర్షి తన ఒడిలో ఉన్న కోతిరాజు తల నిమురుతూ అసలు కథ ఇలా చెప్పారు .... 

     నేను అరుణగిరి విరూపాక్ష గుహలో ఉండగా ఈ కోతి చాలా చిన్న పిల్ల. తక్కిన కోతులు దీనిని బాగా కరచి, వదలి వెళ్లిపోయాయి. కరచిన గాయాలతో కుంటుకుంటూ వచ్చి నా దగ్గర పడిపోయింది. దీని గాయాలు నయం చేశాను; అంతవరకూ నా వద్దనే ఉన్నది. అప్పుడే అనుకున్నాను "తరువాత ఎప్పుడో ఒకప్పుడు ఇది కోతులకు రాజు కాగలదు" అని.

   సాధారణంగా మనిషిని తాకిన కోతిని తక్కిన కోతులు తమ గుంపులో కలుపుకోవు. ఈ కుంటి కోతి ఈ రోజు రాజు అయ్యారు. ఈ సంతోష విషయాన్ని చెప్పటానికి అందరితో కలిసి వచ్చారు. అంతే.
 8️⃣5️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*39. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణాl*
 *కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చll*

ఈ కామము ఎన్నటికీ తీరదు. అన్ని కోరికలు తీరాయి అనే మాట ఎవడి నోటా రాదు. కామాగ్ని, అగ్నిమాదిరి ఎప్పుడూ మండుతూ ఉంటుందే కానీ అరిపోదు. ఇది సాధకునికి ప్రబల శత్రువు. ఎందుకంటే ఈ కామము సాధకునిలోని జ్ఞానమును కప్పి ఉంచుతుంది. జ్ఞానులు సాధకుల సంగతే ఇలా ఉంటే, ఇంక సాధారణ మానవుల సంగతి చెప్పేదేముంది.

ఈ శ్లోకంలో సాధకుల గురించి చెబుతున్నాడు. జ్ఞానిన: అంటే జ్ఞానులకు, సాధకులకు అని అర్థము. సాధకులకు ఈ కామము నిత్యవైరి. మామూలు శత్రువులు అయితే కొంత కాలానికి మిత్రులు అవుతారు. కాని ఈ కామము సాధకునికి జన్మ శత్రువు. అనుక్షణం జ్ఞానిని ప్రాపంచిక విషయాల వైపు లాగి అథ:పతితుడిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సాధకులనే కాదు, ఈ కామము పండితులను, రాజులను, చక్రవర్తులను, ఋషులను, బలవంతులను, ఇంద్రుడిని ఎవరినైనా తన ప్రభావంతో పడగొడుతుంది. ఆధ్యాత్మసాధనలో ఎంతో సాధించిన వారిని కూడా ఈ కామము తన ప్రభావంతో పడగొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కామము వాటి సంబంధమైన కోరికలు పైపైన తీరినట్టు కనిపించినా లోలోపల సూక్ష్మరూపంలో పొంచి ఉంటాయి. అదును చూసుకొని దెబ్బతీస్తాయి. వివేకము చేత, ఆత్మ విచారము చేతనే ఈ కామమును జయింపవలెనే కానీ ఇతరత్రా సాధ్యము కాదు.

కాస్త తెలివి జ్ఞానం ఉన్న మనిషికి, వాడు పిచ్చివాడు కాకపోతే, తాను ఏ పని చేయబోతున్నాడో, ఆ పనికి ఫలితం ఎలా ఉంటుందో బాగా తెలుస్తుంది. కొంత మంది, ఆ పని వల్ల దుఃఖం వస్తుందని తెలిసీ ఆ పనే చేస్తాడు. లాటరీ తీసుకుందాము. ఛాన్సు ఒకటికి లక్ష అని అందరికీ తెలుసు. కానీ లాటరీ కొంటాము. రాకపోతే దుఃఖము కలుగుతుంది. ఆ దుఃఖము కోపంగా పరిణమించి దానిని ఇంట్లో వాళ్లమీద చూపిస్తాము. ప్రాపంచిక వస్తువులు కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఆ కోరికలు చాలా మంచివిగా, అద్భుతంగా కనపడతాయి. తీరా అవి తీరకపోయేసరికి, వ్యతిరేక ఫలితాలు వచ్చేసరికి కోపం ముంచుకొస్తుంది. తనను అందరూ మోసం చేసారు అని ఏడుస్తాడు. ఈ కోరికలు కొంపముంచాయి అని బాధ పడతాడు. ఈ తెలివి ముందే ఉంటే ఈ దుఖము ఉండదు కదా! కాబట్టి ప్రతి తెలివి కలవాడు తెలుసుకోవలసినది ఏమిటంటే కామము అంటే అలవిమాలిన కోరికలు మనకు ప్రబల శత్రువులు, దానిని దూరంగా ఉంచాలి. దాని జోలికి పోకూడదు. ఒక వేళ పోయినా అతి జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలి. ఎందుకంటే కోరికలకు అంతు లేదు. అగ్నిలో ఆజ్యం పోసినట్టు కోరికలు తీరే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. వాటికి అంతం లేదు. కాబట్టి ఈ కామాన్ని మొదట్లోనే తుంచాలి.

మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎంత బలవంతుడో, వాడి దగ్గర ఏయే ఆయుదాలు ఉన్నాయో, వాడి వెనక ఎంత మంది బలగం ఉన్నారో తెలిస్తేనే కదా వాడితో పోరాడగలిగేది. అలాగే ఈ కామము మనకు నిత్య శత్రువు, ఈ శత్రువు ఈరోజు ఉంటాడు రేపు ఉండడు అని లేదు. ఇది ప్రచండమైన అగ్ని లాంటిది. ఎన్ని ఆహుతులు వేసినా తనివి తీరదు. వేసే కొద్దీ ప్రజ్వరిల్లుతుంటుంది. ఇప్పుడు మనం యోగపరంగా విచారిస్తే నిత్య వైరిణా అంటే ఈ కామము జీవుని జన్మ జన్మలను వెంటాడి వేధిస్తూ ఉంటుంది. చివరకు ముక్తి కలిగే వరకూ దీని బాధ తప్పదు. అందుకే దీనిని నిత్య శత్రువు అని అన్నారు.

రాజకీయాలలో నిత్య శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని నానుడి. మనకు ఇతరులతో ఉన్న శత్రుత్వము కూడా కొద్ది కాలానికి మాసి పోతుంది. కానీ ఈ కామము అనే శత్రుత్వము జన్మజన్మలకూ మాసి పోదు. దినదినప్రవర్ధమానమౌతూ ఉంటుంది. ప్రతిక్షణం కూడా జీవుని పడగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ కామము సామాన్య మానవులనే కాదు ఋషులను, పండితులను, జ్ఞానులను, రాజులను, యతులను, స్వామీజీలను ఎవరైనా సరే ఇట్టే పడగొట్టే శక్తి కలిగింది ఈ కామము. ఆధ్యాత్మిక సాధన చేస్తూ కాస్త ఆదమరిస్తే చాలు, ఈ కామము వాడిని అమాంతం కబళిస్తుంది. భరతుని కథ దీనికి ఉదాహరణ.

కొంత మంది అంటుంటారు మేము కోరికలను జయించాము మాకు ఏ కోరికలు లేవు మేము నిస్సంగులము అని అంటుంటారు. నిజమే. కాని ఏదో ఒక బలహీన క్షణంలో వారిని ఈ కామము పడగొట్టేస్తుంది. పతనం చేస్తుంది. కాబట్టి ఈ కామము క్రోధము అనే శత్రువుల గురించి చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. వివేకము, వైరాగ్యము అనే ఆయుధములతో ఈ కామము అనే శత్రువును సమూలంగా నాశనం చేసిన నాడే మానవుడు ముక్తి పొందుతాడు.

ఈ కామమునకు తృప్తి లేదు అని చెప్పడానికి రెండు ఉదాహరణలు ఇచ్చాడు. సముద్రం ఉంది. మీరు ఎన్ని బిందెలతో నీళ్లు తెచ్చి పోసినా చాలు ఇంక నిండింది అనదు. అలాగే అగ్నిలో ఎంత నెయ్యి పోసినా సమిధలు వేసినా, ఇంక చాలు అనదు. వేసినవి అన్నీ స్వాహా చేస్తుంది. ఇంకా కావాలి అని భగభగ మండుతుంది. తృప్తి అనే పదానికి అర్థం తెలియనిది కామము. కొంత మంది అంటారు కామములు అన్నీ అనుభవిస్తుంటే ఆ కామములు కొన్నాళ్లుకు అయిపోతాయి కదా అని. అది శుద్ధ తప్పు. అనుభవించే కొద్దీ కామజ్వాలలు ప్రజ్వరిల్లుతాయే కానీ చల్లారవు. అగ్నిని ఆర్పాలంటే సమిధలు వేయడం ఆపి, నీళ్లు పోయాలి అప్పుడే ఆరి పోతుంది. ఇక్కడ కూడా వివేకము వైరాగ్యము అనే నీటితో కామాగ్నిని ఆర్పాలి కానీ, అనుభవిస్తే కామం చల్లారుతుంది అనేది ఒట్టి మాట.

జ్ఞానినా నిత్య వైరిణా అని ఎందుకు అన్నారంటే, జ్ఞానులకు ముముక్షువులకు మోక్ష మార్గంలో ఉండే వారికి అది ప్రబల శత్రువు, నిరంతర శత్రువు. అందుకే జ్ఞానులకు శత్రువు అని వాడాడు పరమాత్మ. అటువంటి జ్ఞానులనే బుట్టలో వేయగల కామము సామాన్య మానవులను బుట్టలో వేయదని నమ్మకం ఏముంటుంది. కాబట్టి కామము సామాన్యులకు ముందు మిత్రుడుగా పరిచయం అయి, తరువాత శత్రువుగా మారుతుంది. జ్ఞానులకు మొట్టమొదటి నుండి శత్రువు.

పాము ఇంట్లోకి దూరింది. అది ఎక్కడ ఉండేది తెలిస్తేనే కదా దానిని కొట్టడానికి. ఈ కామము ఎక్కడుండేదీ తెలిస్తే దానిని నిర్మూలించవచ్చు. కామం ఎక్కడెక్కడ ఉండేది, ఆ శత్రువు ఉండే స్థావరాలు ఏమిటి? అనే విషయాలను తరువాతి శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ.
(సశేషం)

 (రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P208
 *శివయ్యకు చలా?????* 



నిన్న ప్రక్కింటావిడ, వాళ్ళ అమ్మాయి హారిక మా ఇంటికి వచ్చారు. ఈరోజు హారిక పుట్టినరోజండి, అందుకే తెల్లవారుఝామునే శివాలయంకు వెళ్లి అభిషేకం చేశామండి ... అని చెప్తూ, తెల్లవారక ముందే లేచి, చన్నీళ్ళు స్నానం స్వాములు ఎలా చేస్తారో గానీ, ట్యాంక్ లో నీళ్ళతో స్నానం చేసేసరికి వణికిపోయానండి చలితో, అని ఆవిడ చెప్తుండగా ... హారిక నవ్వుతూ, మరి నీళ్ళను , ఫ్రిడ్జ్ లో పాలును శివలింగం మీద పోస్తున్నప్పుడు శివునికి చలెయ్యదా ఏమిటీ? అని ఆ అమ్మాయి అంటే, శివయ్యకు చలా????? అని నేను అనుకుంటుండగా చాలా సంవత్సారాల క్రితం ఓ మాసపత్రికలో చదివిన ఓ భక్తుని చమత్కారపు భావన గుర్తుకొచ్చింది.
ఆ భక్తుని చమత్కార భావన ఇదే -
ఇదెక్కడి విపరీతమయ్యా స్వామీ! నెత్తిమీద చల్లని చంద్రుణ్ణి పెట్టుకున్నావ్. అక్కడితో ఆగావా? అంతకన్నా చల్లనైన గంగమ్మను నెత్తికెక్కించుకున్నావు. ఆపైన తాకితే జివ్వుమనిపించే చల్లని పాముల్ని నగల్లా అలకరించుకున్నావు. అవన్నీ చాలవన్నట్లు మంచుకొండ కూతుర్ని ప్రక్కన కూర్చోబెట్టుకున్నావు. నీ చోద్యపు చిన్నెలకు అంతెక్కడ? గజగజలాడించే కార్తిక మార్గశిరమాసాలలో బ్రహ్మీ ముహూర్తము నుంచే ధారపాత్ర కింద తిష్టవేస్తావు. అభిషేకం పేరుతో ఎప్పుడూ నీళ్ళక్రింద నానుతుంటావు. నీ భక్తులూ నీకు తగినవారే, ఈ శీతలోపచారాలకు తోడు నీ ఒళ్ళంతా చల్లని విభూది చందనాలను పూస్తూ ఉంటారు. అయినా నీకు చలెయ్యదా మహానుభావా? అని ఓ భక్తకవి శివున్ని ప్రశ్నించాడు. అంతలోనే ఆయనకే సమాధానం తట్టి, 'నా అమాయకత్వంకానీ, నీకు చలేమిటయ్యా? తాపత్రయాలతో సలసల కాగిపోతున్న నా హృదయంలోనే కదా నీవున్నావు' అన్నాడట. 

సేకరణ🙏
 ఓం నమో భగవతే శ్రీ రమణాయ
    
   మస్తాన్ ఒక మహమ్మదీయుడు; ఊరు తిరువణ్ణామలై ప్రక్కన. చేనేత పని చేసేవాడు. మహర్షి కొరకు బట్టలు నేసేవాడు. మహర్షిని 1914 లో మొదటిసారిగా దర్శించుకున్నాడు.
    
   అనుకోకుండా మహర్షి దృష్టి ఒకసారి మస్తాన్ మీద పడింది. ఇక అంతే; మస్తాన్ అలసట లేకుండా సంపూర్ణమైన శాంతితో "ఎనిమిది గంటలు" అలానే నిలబడ్డాడు. 

     మహర్షి గురించి మస్తాన్ ఇలా చెప్పాడు ...

     ఆ రోజులలో మహర్షి కేవలం ఒక్క చూపుతోనే మా హృదయ ద్వారాలు తెరచేవారు. ఆ చూపు మమ్మల్ని మార్చేసేది. తమ చూపుతోనే మమ్మల్ని కూడ తమ వంటి వాళ్ళుగా చేసేసేవారు. కాబట్టి ఇక ప్రశ్నల అవసరమే ఉండేది కాదు.

      మస్తాన్ గురించి బాగా తెలిసిన 
              ఒక భక్తురాలు ఇట్లా చెప్పారు ...

   మహర్షికి సేవ చేద్దామని నేనూ, మస్తాను వస్తూ ఉండేవాళ్ళం. చిత్రమైన మనిషి మస్తాను. తిరువణ్ణామలైకి నలభైమైళ్ళ దూరంలో ఉన్న మా గ్రామం నుండి మహర్షిని చూడడానికి వచ్చేవారం. ఒక్కొక్కసారి తన నేత పనిని ప్రక్కకు నెట్టి మహర్షితో గడపటానికని నాలుగైదు నెలలు వెళ్ళిపోయేవాడు. ఆ కాలంలో బిచ్చమెత్తుకొని కాలక్షేపం చేసేవాడు.  

    మహర్షి ఒకసారి మస్తాన్ గురించి 
                ఇలా సెలవిచ్చారు ....
    
    “మస్తాన్ వృత్తి వల్ల అతనికిగాని, అతని తల్లిదండ్రులకిగాని తిండి దొరకటం అంతంత మాత్రమే. నాకు మాత్రం బట్టలు లభించేవి.” 

    కానీ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మస్తాన్ కుటుంబానికి కావలసిన వనరులు ఏదో ఒక విధంగా లభిస్తూ ఉండేవి.

 *భగవాన్ శ్రీ రమణులు🙏*
 మనం తప్పక సాధన చేయవలసిన ఒకే ఒక గుణం ఏది?
మనం తప్పక సాధన చేయవలసిన ఏకైక గుణం భగవాన్ బాబా వారు చెప్పిన దాని ప్రకారం వైరాగ్యం లేదా అనాసక్తి (renunciation).
ఈ గుణాన్ని ఎందుకు సాధన చేయాలి?
* నిష్క్రమణకు సిద్ధపడటానికి (To be ready for the final journey): మనకు పిలుపు వచ్చినప్పుడు (అంటే, దేహాన్ని విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు), మీరు సిద్ధంగా ఉండటానికి ఇప్పుడే వైరాగ్యం సాధన చేయడం ప్రారంభించాలి. ఎందుకంటే, ఆ పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు.
* దుఃఖాన్ని నివారించడానికి (To avoid sorrow at the end): ఒకవేళ మీరు ఇప్పుడు సాధన చేయకపోతే, ఆ క్షణంలో మీరు కట్టిన ఇల్లు, కూడబెట్టిన ఆస్తి, సంపాదించిన కీర్తి, గెలిచిన చిల్లర విషయాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు.
* శాశ్వతమైన దానిపై దృష్టి పెట్టడానికి (To focus on the eternal): ఇవన్నీ క్షణికమైనవని తెలుసుకోండి. మీరు ఎక్కడికి వెళ్లినా మీతో ఉండే భగవంతునిపై మాత్రమే ప్రేమను పెంచుకోండి.
* నిజమైన జీవితాన్ని లెక్కించడానికి (To count the true life): మీరు భగవంతునితో గడిపిన సంవత్సరాలను మాత్రమే నిజమైన జీవితంగా పరిగణించాలి; మిగతావన్నీ లెక్కలోకి రావు.
ఉదాహరణ: డెబ్భై ఏళ్ల తాతను అతని ఏడేళ్ల మనవడు "తాతా! నీ వయస్సు ఎంత?" అని అడిగితే, ఆ ముసలాయన "రెండు!" అని సమాధానమిచ్చాడు. తాను కేవలం గత రెండు సంవత్సరాలు మాత్రమే భగవంతుని సాంగత్యంలో గడిపానని, అంతకుముందు సుఖాలను కోరుకునే చిత్తడి నేలలో కూరుకుపోయానని ఆ వృద్ధుడు వివరించాడు.
ముఖ్య సారాంశం: క్షణికమైన లోక సంబంధాల నుండి మనస్సును మరల్చి, నిత్యం మనతో ఉండే భగవంతునిపై అనుబంధాన్ని పెంచుకోవడమే మనం ఇప్పుడే ప్రారంభించాల్సిన ముఖ్యమైన సాధన.  
 🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 53

శ్లో॥ విలసన్తి మహోభోగైః విశన్తి గిరిగహ్వరాన్ |

నిరస్త కల్పానా ధీరా అబద్ధా ముక్త బుద్ధయః || 

మనోబుద్ధులలోని భావాల తాదాత్మ్యంనుండి విడివడి తన్ను తాను ఆత్మగా గుర్తించిన జ్ఞానులు సంతోషంగా సరదాగా అప్పుడప్పుడు మనో బుద్ధులతో ప్రపంచంలో వ్యవహరిస్తారు. మరొకప్పుడు పర్వత గుహలలో ధ్యానమగ్నులై ఉండనూగలరు.

జీవన్ముక్తులనుభవించే ముక్తస్థితిని, వారి ఆనందాన్ని, సుఖంగా పరి పూర్ణతృప్తితో వారు జీవించే విధానాన్నీ గానం చెయ్యడానికే అష్టావక్ర మహర్షి ఈ అధ్యాయాన్ని అంకితం చేసినారు. జ్ఞాని ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు అతని దృక్పథం ఎలా ఉండేదీ, బాహ్యవిషయాలకు అతడేవిధంగా స్పందించేదీ ఇక్కడ వర్ణిస్తున్నారు.

పరిపూర్ణుడయిన అట్టి మహాత్ముడు అహంకార రహితుడు, మనో బుద్ధులను అధిగమించినవాడు, కాబట్టి అతనిలో బాహ్య విషయాలపట్ల, వాటి 'ఉనికి వైఖరిపట్ల, ఊహాకల్పనలు ఎంతమాత్రమూ ఉండవు. మనఃకల్పనలు లేకపోవడంతో అతని మనస్సు సదా శాంతంగా ఉంటుంది. అహంకార వర్ణితుడయిన అతని బుద్దికి బంధుత్వ భావన ఉండదు. అతడి కోరికలచే అతడు పరిమితం కాబడడం లేదు. ఈ విధంగా అతడి మనోబుద్ధులు వాటి సహజ గుణాలయిన కోరికల భావాల ఒత్తిడినుండి విడివడి. ధ్యానఫలమయిన శాంతస్థితిని అనుభవిస్తూ తృప్తిగా ఉండగలుగుతాయి.

ఈ విధమయిన నిత్యతృప్త మానసంతో, శాంతబుద్ధితో కిరీటం లేని చక్రవర్తివలె జ్ఞాని జీవిస్తూ ఉంటాడు. అతడు సరదాగా, తన ప్రారబ్ధవశాత్తూ ప్రాప్తించిన మనశ్శరీరాలతో ప్రపంచాన్ని శాంతంగా వీక్షిస్తూ క్రీడించనూ గలడు, ఏకాంతంలో గిరి గహ్వరాలలో నదీతీరాలలో సమాధిస్థితుడై స్వరూపనిష్ఠలో కాలాతీతంగా ఉండనూగలడు.

జ్ఞానిశరీరం ఎక్కడ ఉంది అన్న విషయం అతడికి అనవసరం; అప్రస్తుతం, ఆ శరీరం ప్రారబ్ధానుగుణంగా అనంత సుఖభోగాల మధ్యనయినా, మహాకష్టదశ లోనయినా ఉండవచ్చును. ఆ పరిస్థితులేవీ అతనికి సుఖదుఃఖాల నివ్వజాలవు. అహంకారమేలేని అతడు విషయభోగాల సుఖాన్ని కానీ, ప్రాపంచిక కష్టాలను కాని అనుభవించడు. శరీరం ప్రారబ్ధానుగుణంగా అనుభవించడాన్ని, సాక్షిగా, శాంతంగా, నిర్వికారంగా చూడగలుగుతాడు. అహంకార మమకార రహితుడయిన అతనిని ఇంద్రియ భోగ్యక్షేత్రాలు కదలింపజాలవు. సర్వమూ భావనామయ మని, భావాలు తన నర్తనలని, భావం భావాన్ని కదిలిస్తోందని స్పష్టంగా చూస్తూ శాంతంగా సర్వదా కేవలంగా తానుగా ఆత్మగా ఉండగలుగుతాడు.

జ్ఞాని సుఖభోగాల ననుభవిస్తున్నట్టుగానీ, సత్కర్మ నిష్టాగరిష్ఠుడై ఉన్నట్టుకానీ, లేదా ఏకాంతంలో సమాధి స్థితుడయినట్టు కానీ మనకనిపించ వచ్చును. ఇది మన దృష్టిమాత్రమే. అతడే స్థితిలో ఉన్నట్టు మనం భావించినా అవన్నీ మన భావనలే. అతడు మాత్రం సదా ఆత్మానుభవస్థితుడై ఏకత్వాన్ని సర్వదా చూస్తూ శాంతుడై ఉంటాడు. జీవన్ముక్తునికి అతని మనఃకల్పిత ఉపాధీ, జగత్తూ ఇంద్రజాలంవలె స్వప్నం వలె ఉన్నా లేకున్నా ఒకటే. అహంకారంతో తాదాత్మ్యం చెందినప్పుడు మాత్రమే ఏదైనా ఆ విధంగా ఉండాలని కాని, ఇంకొక విధంగా మారాలని అనిపిస్తుంది. బుద్ధిలో విలువలతో తాదాత్మ్యం చెందిన అహంకారం మాత్రమే స్థితిని మార్పును గుర్తిస్తూ కోరుతూ ఉంటుంది. అహంకార వర్జితుడయిన జ్ఞాని నిర్వికారంగా భావాల లీలలను వీక్షించగలుగుతాడు!🙏🙏🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(261వ రోజు):--
       కోయంబత్తూరు సమీపంలో వందెకరాల్లో స్వామి సహజానంద చిన్మయ ఉద్యానవనం అనే పేరుతో ఒక పెద్ద ఆశ్రమ సముదాయాన్ని నిర్మించారు. అక్కడ బ్రహ్మచారులకు తరగతులు, వృద్ధాశ్రమం, ప్రకృతి వైద్య సదుపాయం ఉన్నాయి. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచు కొని ఒక హరిజన పాఠశాలనూ, ఆ ప్రాంతంలో అప్పటికే ఉన్న మరొక 10 గ్రామీణ పాఠశాలల అభివృద్ధినీ కూడా చేపట్టారు. ఆ ప్రదేశంలో ఒక నది, జలపాతం ఉండటంచేత సహ జంగానే ప్రకృతి సౌందర్యంతో విలసిల్లు తున్నప్పటికీ, పూదోటలను పెంచటం ద్వారా విద్యార్థులు దానిని ఇంకా అభివృద్ధి చేయగలిగారు. భవన నిర్మాణానికి కావలసిన ఇటుక లు కూడా అక్కడే తయారు చేయ బడ్డాయి. స్వామిని శారదప్రియా నంద ఎంత ఉత్సాహంగా, చైతన్య వంతంగా ఉంటారో, స్వామి సహజా నంద అంత ప్రశాంతంగా, తీరిగ్గా ఉన్నట్లగుపిస్తారు. ఐనప్పటికీ, ఒకే విధమైన సేవా కార్యక్రమాలు చే పట్టిన వారిద్దరూ ఒకేవిధమైన విజయాన్ని సాధించారు. 
      గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ దారుల సంతానానికి విద్యాబుద్ధులు నేర్పాలనే స్వామీజీ యోచనకు వారిద్దరూ కార్యరూపాన్నిచ్చారు. చిన్న పిల్లలకు చదవటం, వ్రాయటం, చిన్నచిన్న లెక్కలు చేయటం నేర్పు తారు. పది పన్నెండేళ్ల వయసున్న వారికి వారి సామర్థ్యాన్నిబట్టి, కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా వృత్తివిద్యలో శిక్షణ నిస్తారు. ఈ శిక్షణ వారు సమాజంలో తమ కాళ్ళమీద తాము స్వతంత్రంగా నిలబడటానికి ఉద్దేశించబడింది. లౌకిక విద్యతో పాటు వారికి మతపర మైన, నైతికపరమైన శిక్షణ కూడా ఇచ్చి, దానిద్వారా వారు తమ ఆత్మ గౌరవాన్నీ, తమ సంస్కృతిపై అవగా హననూ పెంపొందించుకునే అవకాశాన్నీ కల్పిస్తారు. 
         స్వామీజీ శిష్యులలో కొందరు చాలా స్వతంత్రంగా వ్యవహరించే వారు ; కొందరు మాత్రం ఇతరులపై ఎక్కువగా ఆధారపడేవారు. వారి వారి ఆధ్యాత్మిక పరిణతిని బట్టి స్వామీజీని వారు అర్థంచేసుకునే తీరు ఉంటుంది. తనవద్దకు వచ్చే వారందరికీ వారివారికి తగిన రీతిలో ఆయన స్పందించేవారు. వందలాది విద్యార్థులతో ఆయనకు సంబంధ మున్నప్పటికీ, వారందరినీ నిష్పాక్షి కంగా ఒకే దృష్టితో చూచి ఒకేవిధ మైన స్పందనలీయటం ద్వారా, ఆధ్యాత్మిక గురువుల చుట్టూ ఉండే అసూయ వంటి భావాలను ఆయన దూరంగా ఉంచగలిగారు. 
        తను భగవంతుని ప్రత్యేకమైన అవతారమని స్వామి చిన్మయానంద ఎన్నడూ భావించి నట్లనిపించదు. తన విద్యార్థులు ఎలాంటివారో, తనూ అలానేనని ఆయన అభిప్రాయం. ఈవిధమైన ఆదర్శం వల్ల జీవితాన్నీ, దాని సమస్యలనూ, దాని ఆకర్షణలనూ గురువైన తను ఎదుర్కొన్న విధంగా తన విద్యార్థులు కొందరు ఎదుర్కొన లేకపోయినపుడు ఆయన నిరాశ చెందేవారు. దేవుని అవతారం అనేక రీతుల్లో ఉంటుంది : అది దావానలమైనా కావచ్చు ; కొవ్వొత్తి దీపమైనా కావచ్చు. సృష్టి స్వభావమే అది .
         స్వామీజీ బోధన శ్రోతలవల్ల ప్రభావిత మయ్యేదికాదు. తను బోధించ దలుచుకున్న సత్యాన్ని అనర్గళంగా ఆలపిస్తారాయన. కొందరికి అది ఉపయోగపడుతుంది; కొందరికి ఉపయోగ పడదు. లాభించని వారు విమర్శించే అవకాశం కూడా ఉంది. కార్యకర్తల లో ఒకాయన తన వ్యాపారంలో అవి నీతి పద్ధతులవలంభిస్తారని అప్పు డప్పుడు విమర్శలు వచ్చేవి. ఆయన నవ్వి, "మతం కావల్సినది అవినీతి పరులకే ; మీరిక్కడున్నది అందుకే. మీరిద్దరూ ఎంత బాగుపడగలరో చూద్దాం" అనేవారు. 
        🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺
 🌄 నిత్యస్మరణీయం 🔥

1.తక్షణం సద్గురు సన్నిధిని అనుభవించాలంటే
మౌనంగా ఉండు సరిపోతుంది.
మౌనమే నిజంగా సద్గురువు.

2.అందరి లెక్కలో తానుండి
తనకు ఏ లెక్కా లేనివాడు
ముక్తుడు.

3.లోకవ్యవహారానికి
మనో వ్యాపారానికి 
అంటక ఉన్న ఆత్మను "నేను".

4.తాను ఉండాలి.
లేనట్టూ ఉండాలి.
"సున్న"లాగా.

5.నేను జ్ఞానిని అని
నేను అజ్ఞానిని అని
జ్ఞానమే అంటుంది.

6.భగవంతుని అభీష్టానికి
స్వచ్ఛందంగా లొంగిపోవడమే
శరణాగతి.

7.కర్మకు ఆచారం అవసరం.
భక్తికి ఆర్తి అవసరం.
జ్ఞానానికి విచారం అవసరం.

8.పునర్జన్మ లేనే లేదు.
యెందుకంటే 
ప్రస్తుత జన్మే లేదు గనుక.

9.అనిపించినా 
కనిపించినా
అది నిజం కాదు.

10.ఎవరికైనా మృత్యుభయమే ఉంటుంది.
మృత్యువు ఉండదు.

11.నోరు మూసుకుంటే నిశ్శబ్దం.
మనసు మూసుకుంటే మౌనం.
 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   మహాత్మాగాంధి హత్య జరిగిన రోజులవి. ఉన్నట్లుండి ఎక్కడినుండో మతి స్థిమితంలేని ఒక యువకుడు రమణాశ్రమం వచ్చాడు. సరాసరి మహర్షి సన్నిధిలోకి వచ్చి అందరూ చూస్తూ ఉండగానే ఉగ్ర నరసింహుని వలె ఊగిపోతూ  "గాడ్సే, గాంధీని చంపి ప్రఖ్యాతి పొందాడు. నేను, నిన్ను చంపి కీర్తి పొందుతాను" అని బెదిరించాడు మహర్షిని.

      అందుకు మహర్షి "చంపు నాయనా చంపు; నాకు కూడా ఈ శరీర భారం తప్పిపోతుంది" అని సెలవిచ్చారు. 

     అక్కడేఉన్న ఆశ్రమభక్తులు ఆ యువకుడిని బయటకు పంపించి వేయాలని చూశారు. కాని మహర్షి ఆ యువకుడిని తన వద్దనే ఉంచుకుని తనతోపాటే భోజనానికి తీసుకువెళ్ళారు. ఆ యువకుడు రెండు రోజులు ఆశ్రమంలోనే ఉండిపోయాడు.

     మూడవ రోజున ఆ యువకుడు మహర్షి వద్దకు పోయి వినయంగా "నన్ను క్షమించండి భగవాన్! నాకు అనుకోకుండా మతి స్థిమితం తప్పిపోతూ ఉంటుంది. నా మతి స్థిరంగా ఉండేటట్లు నన్ను అనుగ్రహించి నాకు ఏదయినా  ఉపదేశించండి!" అని అన్నాడు. 

  మహర్షి ఆ యువకునితో  "గాయత్రి మంత్రం చెయ్యి! అని అన్నారు. ఆ యువకుడు ఆశ్రమం నుండి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తరువాత పిచ్చి కుదిరి, గొప్ప భక్తితో ఆశ్రమానికి వచ్చాడు ఆ యువకుడు.
 8️⃣4️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*38. ధూమేనావ్రియతే వహ్నిర్యథాఽఽదర్శో మలేనచl* 
 *యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్:ll*

పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్టు, ఈ కామము దాని వలన పుట్టే క్రోధము, మనలో ఉన్న ఆత్మజ్ఞానమును కప్పి ఉంచుతుంది.

ప్రతి జీవిలో అత్మ జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి ప్రాపంచిక విషయములతో చేరితే జీవాత్మ, పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూపము అయిన ఆత్మ స్వరూపము అని తెలుసుకున్నాము. ఈ జీవాత్మకు కామము, క్రోధము ఒక పొరవలె ఏర్పడి కప్పి ఉంచుతాయి. ఎలాగంటే అద్దం ఉంది. దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు. ఆ మురికిని తుడిచి వేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది. అలాగే నిప్పు ఉంది, పొగ రావడం మొదలయితే అగ్ని కనిపించదు. ఊదితో మండుతుంది అప్పుడు పొగ ఉండదు. ఈ కామము క్రోధము అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవి కానీ, ఎక్కడి నుండి రావు. ఈ కామము క్రోధము అనే పొగ, మురికి పోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తుడవడమే సత్సాంగత్యము, నిష్కామ కర్మ ఆచరించడం, జ్ఞానము సంపాదించడం, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం. దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగి పోతుంది.

ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. పొగతో కప్పబడి నప్పుడు అగ్నికి గానీ, మురికితో కప్పబడినప్పుడు అద్దానికి కానీ, మావితో కప్పబడినపుడు శిశువుకు గానీ ఎటువంటి హానీ జరగదు. అవి తమ తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి. కేవలం పొగ, మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది. ఆ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వరూపాలు ప్రకటితమౌతాయి. దీని వలన మనకు తేలిందేమిటంటే మనం ఆనంద స్వరూపులము, మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడు ఆనందంతోనే ఉంటుంది. కాని మనం కామము, కోరికలు, అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము. అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపులము అవుతాము. మనం అందరం శివస్వరూపులము శివ అంటే ఆనందము. అంటే మనం అందరం ఆనంద స్వరూపులము అని తెలుసుకుంటే మనకు మనం మసి పూసుకోము. చాలా మంది నా జీవితం ఇంతే నేనింతే నాకు సుఖం లేదు ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతుంటారు. అది తప్పు, అందరూ ఆనంద స్వరూపులే. మనం ఆ ఆనందాన్ని చేచేతులా నాశనం చేసుకొని ఏడుస్తున్నాము అంతే. కాబట్టి ఆ పొగను మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాము.

పోనీ ఇదేమన్నా కష్టమా అంటే అదీ లేదు. కాస్త విసిరితే పొగపోయి మంట వస్తుంది. కాస్త నీటిలో తడిపి తుడిస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. వైద్యులు మాని తొలగించి శిశువును బయటకు తీస్తారు. ఇవన్నీ దైవ యత్నాలు కాదు. పురుష ప్రయత్నాలు. ఈ కామము క్రోధమును తొలగించుకోడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కానీ నా ఖర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు. సోమరి తనం పనికి రాదు. కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను జయించడం అంత కష్టమేమీ కాదు అని భగవానుడు మనకు భరోసా ఇస్తున్నాడు.

కామము మానవునిలో ఉన్న ఆలోచనా శక్తిని, వివేచనా శక్తిని తగ్గిస్తుంది. అంధకారంలో పడేస్తుంది. అందుకే కామాంధుడు అని కూడా మనం అంటూ ఉంటాము. కామంతో కళ్లు మూసుకుపోయినవాడు. ఇక్కడ కామము అంటే కేవలం స్త్రీవాంఛ అనే అర్థంలో వాడినా, కామము అంటే కోరిక అని అర్ధం చేసుకోవాలి. కామము అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థం. ఈ శ్లోకంలో అగ్ని, అద్దము, శిశువు అనే మూడు ఉదాహరణలు చెప్పాడు పరమాత్మ. ఈ మూడు ఉదాహరణలు కూడా చాలా ముఖ్యమైనవి.

అగ్ని నుండి పొగ వస్తుంటే, ఊదితే పొగ పోయి అగ్ని మండుతుంది. అలాగే కొన్ని కోరికలు ఉఫ్ మని ఊదితే చాలు ఎగిరిపోతాయి. ఎక్కువ శ్రమ పడనక్కరలేదు. కాని మరి కొన్ని కోరికలు ఉంటాయి. చాలా బలంగా ఉంటాయి. అవి అద్దానికి పట్టిన మురికిలాంటివి. అద్దానికి పట్టిన మురికిని బట్ట తీసుకొని నీటిలో తడిపి అద్దం మీద రుద్దాలి. అప్పటికీ పోకపోతే డిటర్జెంట్ వాడి క్లీన్ చేయాలి. అంటే కొంత శ్రమతో కూడిన పని. అలాగే మరి కొన్ని కోరికలు చాలా బలంగా ఉండి, ఎప్పటికీ తీరవు. ఎంతో శ్రమ పడితేనే గానీ ఆ కోరికల ప్రభావం నుండి బయట పడలేము. ఆ కోరికల ప్రభావంనుండి బయట పడటానికి కొంత కాలము వేచి ఉండాలి. ఓపికగా ఉండాలి. ఎలాగంటే శిశువుకు కప్పిన మాయను వెంటనే తీసివేయలేము. తొమ్మిది నెలలు నిండి శిశువు బయటకు వస్తేనే గానీ, ఆ మాయను తీసివేయలేము. అలాగే కొన్ని కోరికలు కాలక్రమేణా పోవలసిందేకానీ, మన ప్రయత్నం వలన పోవు. కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పి ఉంచిన ఈ కామాన్ని ముందు తొలగించుకోవాలి.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

 (రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P205
 🦚జ్ఞాన ప్రసూనాలు 🚩
    30/10/25

1) నేను అత్మ కంటే వేఱు అనుకోవడమే బంధం. ఆత్మకు విడిగా ఏమీలేదు అని ఉండడమే మోక్షం.

2) ప్రతి జీవీ భగవదవతారమే

3)"ఇతరం కూడా నేనే" అన్న స్వానుభవ నిష్ఠయే స్వధర్మ.

4) ఇది కల” అన్న ఎఱుక ఉంటే చాలు. నీవు మెలకువలో ఉన్నట్లే. కల పాటికి కల కొనసాగవచ్చు ఇబ్బందేమీ ఉండదు.

5) దైవానుభవం కలగాలంటే.. తాను లేని ప్రపంచమైనా ఉండాలి. ప్రపంచం లేని తాను అయినా ఉండాలి
 *భారం నీదే*
‘ఎన్నిసార్లు నిన్ను పిలవాలి? ఏ రీతి కొలవాలి? అనాథరక్షకుడివని, ఆపద్బాంధవుడివని అంటారే? మరెందుకు నా పిలుపు నిన్ను చేరడం లేదు? నా బాధ నీకెందుకు కనిపించడం లేదు?’... ఇలా మనకు కష్టం వచ్చినప్పుడల్లా దేవుడితో మొరపెట్టుకుంటాం. ఒళ్లంతా కళ్లున్న ఆయనకు మనం కనిపించమనుకోవడం, జగమంత చెవులున్న స్వామికి మన పలుకులు వినిపించలేదనుకోవడం... అవివేకమే!

గజేంద్ర మోక్షం ఘట్టంలో మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదని నిశ్చయించుకుంది. ‘స్వామీ! బలం క్షీణించింది, ధైర్యం సన్నగిల్లింది, ప్రాణాలు అదుపు తప్పుతున్నాయి, స్పృహ కోల్పోతున్నాను. నువ్వు తప్ప దిక్కెవరు లేరు. నన్ను రక్షించే బాధ్యత నీదే!...’  అని సర్వేశ్వరుణ్ని వేడుకుంది.

అక్కడెక్కడో వైకుంఠపురంలో లక్షీదేవితో వినోదిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు. ‘పాహీ! పాహీ!’ అనే ఆర్తనాదం వినిపించగానే గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఆయన లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు; శంఖచక్రాలను చేతుల్లోకి తీసుకోలేదు, సేవకులనెవరినీ పిలవలేదు, గరుడవాహనాన్నీ సిద్ధపరచుకోలేదు, ప్రణయకలహంలో భాగంగా పట్టుకున్న లక్ష్మీదేవి కొంగైనా వదల్లేదు... ఉన్నపళంగా భువికి బయలుదేరాడు. లక్ష్మీదేవితోపాటు సుదర్శన చక్రం కూడా శ్రీహరిని అనుసరించింది. గజరాజు ఉన్న సరోవరాన్ని చేరుతూనే విష్ణుమూర్తి తన చక్రాన్ని విడిచి పెట్టాడు. ఆ సుదర్శనం విస్ఫులింగాలు చిమ్ముతూ మరుక్షణంలో మొసలి తలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకుని కొలను నుంచి బయటికి వచ్చి సంతోషంతో తొండం ఎత్తి హరికి నమస్కరించాడు.
కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తనను రక్షించేవారి కోసం శోకంతో ఆమె చుట్టూ కలియజూసింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో ‘నాకు దిక్కెవరు?’ అనుకున్న సమయంలో కృష్ణుడు ఆమె కళ్ల ముందు సాక్షాత్కరించాడు. వెంటనే ‘ద్వారకావాసా శ్రీకృష్ణా పాహిమాం!’ అని వేడుకుంది. ఆయన కొన్ని ఘడియలు ఆలస్యంగా వచ్చాడు. ‘పిలిచిన వెంటనే పలికే దైవానివి కదా, నా పట్ల ఎందుకు ఆలస్యం చేశావు’ అని ద్రౌపది ప్రశ్నించింది. ‘సోదరీ! నువ్వు ద్వారకావాసా... అని పిలిచావు. అందుకే ద్వారక వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది’ అని మనోహరమైన మందహాసంతో జవాబిచ్చాడు నందగోపాలుడు. అప్పుడు ద్రౌపదికి తన పిలుపులోని దూరం అర్థమైంది.

భక్తుల ప్రార్థనలకు సులభంగా కరిగిపోయే భక్తవల్లభుడికి కావాల్సింది ఆడంబరంగా చేసే పూజలు కాదు. నిండు మనసుతో ధ్యాస ఆయన మీద కేంద్రీకరించాలి. ‘పాల ముంచినా నీట ముంచినా నీదే భారం స్వామీ!’ అనుకుని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. మనకు ప్రాప్తమనుకున్నది ఆయన అనుగ్రహిస్తాడు. లేదంటే అంతకన్నా మంచిదేదో మనకోసం వేచి ఉన్నదని గ్రహించాలి. ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకుంటేనే సంతృప్తిగా జీవించగలం! కాదని విధిని దూషిస్తుంటే అసంతృప్తి జ్వాలలకు అజ్ఞాన తిమిరం తోడై దహించుకుపోవాల్సి వస్తుంది. ఆర్తితో అంతరాంతరాల్లో ఆయన్నే స్మరిస్తూ ‘సర్వాంతర్యామీ! నువ్వే దిక్కు!’ అనుకుంటే పరమాత్ముడి కరుణాకటాక్షాలు ఏదోనాడు అమృత జల్లుగా వర్షిస్తాయి!

కె.వి.సుమలత
 _*శ్రీమల్లికార్జున అష్టోత్తరశతనామావళీ -4*_
[శ్రీశైలఖండాంతర్గమ్ - నందీశ్వరేణ ప్రోక్తం]
✍️ శ్రీ శ్రిష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మా
🙏🔱⚜️🔱⚜️🕉️🔱⚜️🔱⚜️🙏

13. _*ఓం కలానిధయే నమః*_

🔱 "కలానిధి" అనగా కళల సంపదకు నిలయమైనవాడు, ఇది సంగీతం, నాట్యం, శిల్పం, వాక్పాటుత్వం, ధ్యానశక్తి వంటి సర్వ కళల ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి వారు కళలపరిపూర్ణతకు మూలతత్త్వముగా భావించబడతారు.

🔱 మల్లికార్జునస్వామి సర్వకళలలో నిపుణుడు, మల్లికార్జునస్వామి రూపం నాట్యానికి, వాక్కుకు, శిల్పానికి, సంగీతానికి ప్రేరణగా నిలుస్తుంది. మల్లికార్జునస్వామి తత్త్వము భక్తుల హృదయాల్లో సౌందర్యాన్ని, శ్రావ్యతను, ఆనందాన్ని నింపుతుంది. ఈ నామము శివుని సౌందర్య తత్త్వాన్ని, ఆత్మవికాసానికి కళల ప్రాముఖ్యతను, ధ్యానంలో లయాన్ని ప్రతిబింబిస్తుంది.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామివారినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి కళల కార్యరూపం, ప్రకృతిలో కళల ప్రవాహం, సౌందర్యాన్ని వ్యక్తీకరించే శక్తి. మల్లికార్జునస్వామి కలానిధిగా కళలతత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికా దేవి ఆ కళలను భక్తుల జీవితాల్లో అనుభూతిగా మారుస్తుంది. ఇది శ్రీశైల శివ–శక్తుల సౌందర్యతత్త్వ సమన్వయాన్ని, ఆధ్యాత్మిక కళల విలువను ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

14. _*ఓం విశ్వరూపిణే నమః*_

🔱 "విశ్వరూపి" అనగా ప్రపంచమంతా తన రూపంగా కలిగినవాడు, ఇది అఖండత, సర్వవ్యాప్తి, అంతర్యామిత్వంకు ప్రతీక. ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామివారు ప్రపంచంలోని ప్రతి తత్త్వములో తన ఉనికిని సూచిస్తారు. మల్లికార్జునస్వామి ప్రపంచంలోని ప్రతి జీవిలో, ప్రతి వస్తువులో, ప్రతి భావంలో తన రూపాన్ని కలిగి ఉన్న పరబ్రహ్మం. మల్లికార్జునస్వామి అణువణువులో, ప్రాణంలో, శక్తిలో వ్యాపించి ఉన్నాడు. ఈ నామము శివుని సర్వవ్యాప్తిని, అంతర్యామిత్వాన్ని, జీవ–జగత్తు ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో తనలో శివుని ఉనికిని గుర్తించి ఆత్మజ్ఞాన మార్గంలో అడుగులు వేస్తాడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామివారినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి  విశ్వరూపానికి ప్రకృతి రూపం, ప్రపంచంలో శక్తి ప్రవాహం, జీవన చలనం. మల్లికార్జునస్వామి విశ్వరూపిగా తన తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికా దేవి ఆ తత్త్వాన్ని ప్రపంచంలో కార్యరూపంగా ప్రవహింపజేస్తుంది. ఇది శ్రీశైల శివ–శక్తుల సర్వవ్యాప్త తత్త్వ సమన్వయాన్ని, జీవ–ప్రకృతి ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

15. _*ఓం విరూపాక్షాయ నమః*_

🔱 "విరూపాక్షుడు" అనగా విరూపమైన, సాధారణ దృష్టికి అందని కంటిని కలిగినవాడు, ఇది అంతర్ముఖ దృష్టి, జ్ఞానచక్షువు, కాలాతీత దర్శనంకు ప్రతీక. మల్లికార్జునస్వామి విరూపాక్షుడిగా భౌతిక రూపాలకు అతీతమైన, జ్ఞానదృష్టిని కలిగిన, అంతర్యామిగా వెలుగుతాడు. మల్లికార్జునస్వామి చూపు బాహ్య రూపాన్ని కాదు, అంతరంగాన్ని చూస్తుంది.

🔱 ఈ నామము శివుని జ్ఞాన స్వరూపాన్ని, కాలాన్ని అధిగమించిన దృష్టిని, అహంకార రహిత దర్శనాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో తన అంతరంగాన్ని పరిశీలించి, ఆత్మవికాసాన్ని పొందగలడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామివారినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి  జ్ఞానదృష్టికి కార్యరూపం, అంతర్ముఖతకు శక్తి రూపం, ప్రకృతిలో ఆత్మజ్ఞాన ప్రవాహం. మల్లికార్జునస్వామి విరూపాక్షుడిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  జ్ఞానాన్ని భక్తుల జీవితాల్లో అనుభూతిగా మారుస్తుంది. ఇది శ్రీశైల శివ–శక్తుల జ్ఞాన తత్త్వ సమన్వయాన్ని, అంతర్ముఖ దృష్టి విలువను ప్రతిబింబిస్తుంది.
🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

16. _*ఓం త్ర్యక్షాయ నమః*_ 

🔱 "త్ర్యక్షుడు" అనగా మూడు కళ్లను కలిగినవాడు. ఇది జ్ఞానచక్షువు, కాలాన్ని అధిగమించిన దృష్టి, అంతర్యామిత్వంకు ప్రతీక. మల్లికార్జునస్వామివారు త్రికాలజ్ఞుడిగా, భక్తుల అంతరంగాన్ని దర్శించగల పరమేశ్వరునిగా భావించబడతారు. మూడవ కన్ను శివుని జ్ఞానచక్షువు. అది అజ్ఞానాన్ని సంహరించి, ధర్మాన్ని స్థాపిస్తుంది. మల్లికార్జునస్వామి భూతం, వర్తమానం, భవిష్యత్తు అన్నింటినీ తన దృష్టితో ఆవహించి, భక్తుల జీవితాన్ని మార్గనిర్దేశం చేస్తాడు. 

🔱 ఈ నామము శివుని జ్ఞాన స్వరూపాన్ని, కాలాతీత దృష్టిని, ధర్మ పరిరక్షణ శక్తిని ప్రతిబింబిస్తుంది.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామివారినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి జ్ఞానదృష్టికి కార్యరూపం. మల్లికార్జునస్వామి త్ర్యక్షుడిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  జ్ఞానాన్ని భక్తుల హృదయాల్లో ప్రవహింప జేస్తుంది.ఇది శివ–శక్తుల జ్ఞానతత్త్వసమన్వయాన్ని, శ్రీశైలమహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🙏⚜️🔱⚜️🔱🕉️⚜️🔱⚜️🔱🙏
 🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకం 52

శ్లో॥ ఉచ్ఛృంఖలా ప్యకృతిగా స్థితిరీరస్య రాజతే | నతు సంస్పృహ చిత్తస్య శాంతిర్మూఢస్య కృత్రిమా||


విధినిషేధాలనుండి విముక్తినందిన జ్ఞాని ప్రవర్తన సహజానందంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అభ్యసించిన శాంతితో ఎంత నియమబద్ధంగా ప్రవర్తించినా కోరికలతో నిండిన మనస్సుగల మూఢుని చేష్టలు కృత్రిమంగానే ఉంటాయి.

ఇంద్రియానుభవాలద్వారా సుఖాన్ని సాధించాలనే కోరిక జీవన్ముక్తు నిలో ఉండదు. అతనిలో ఏ విధమయిన కోరికలూ ఉండవు. విధిని షేధాలతో పనిలేకుండా, స్వతంత్రంగా సహజంగా అతడు చరించగలుగుతాడు. ఆత్మానుభవనిష్ఠుడై శాంతస్వరూపంగా ఆనందంగా అద్వయమయిన తన స్వరూపాన్నే సర్వత్రా వీక్షిస్తూ ఉంటాడు. 

అట్టి జ్ఞాని స్థితిని నిర్దేశిస్తూ మూడుని ప్రవర్తనను పోల్చి చూపిస్తున్నా రిక్కడ. తనలోని కోరికలనూ ఉద్రేకాలనూ అణచుకొని బాహ్యంగా శాంతంగా ఉన్నట్టుగా కనిపించే మూఢుని చర్యలలో కృత్రిమత్వం అడుగడుగునా స్ఫురిస్తూనే ఉంటుంది. ఇలా కృత్రిమంగా ప్రయత్నపూర్వకంగా శాంతంగా ఉన్నట్టుగా పైవారికి కనిపంచవచ్చు కానీ, అతని అంతరంగం అశాంతితో నిండి ఉంటుంది, ఆత్మానుభవం అట్టివారికి గగన కుసుమమే అవుతుంది.

నిజమైన సాధకుడు ఇటువంటి కృత్రిమపు శాంతిని హర్షించకూడదు, ఆశించకూడదు. నిజమైన శాంతి ఆత్మానుభవంలోనే లభిస్తుంది. సరైన జ్ఞానం వలననే ఆత్మానుభవం సిద్ధిస్తుంది. అప్పుడు మాత్రమే అహంకారం అంతరిస్తుంది.🙏🙏🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(260వ రోజు):--
       స్వామి తేజోమయానంద బోధన లో బొంబాయిలోని సాందీపని సాధ నాలయంలో పట్టభద్రులైన బ్రహ్మచా రుల నుద్దేశించి 1987లో స్వామీజీ ఇలా మాట్లాడారు :
       గురువుకు ఆహారం సంపాదించి  తెచ్చిపెట్టడం, తర్వాత తను భుజించ డం, నిద్రించడం - ఇది ప్రాచీనకాలం లో బ్రహ్మచారుల పద్దతిగా ఉండేది. దీనివల్ల హిందూమతం మురిగిపో యి, నాశనమయ్యే స్థితికి వచ్చింది. మీరుకూడా బ్రహ్మచారులే ; కాని, పద్దతి మాత్రం అదికాదు. హిందూ మతాన్ని రక్షించటానికీ, దానినిఇంకా అభివృద్ధి చేయటానికీ, మనం ఒక కార్యకర్తల సైన్యాన్ని తయారుచేస్తు న్నాం - భరతమాత నిజమైన హృదయాన్ని జనులు గ్రహించేలా.
        ఈవిషయంలో మీకు విశ్రాంతి అనేది ఉండకూడదని నేను భావిస్తు న్నాను. పని ఎక్కువగా ఉంటోందని జాలిపడే ప్రశ్నేలేదు. నేను పనిచే స్తుంటే ఎవరూ దిగులుపడలేదు. ఇప్పుడు హఠాత్తుగా అందరూ నాకే చెప్తున్నారు నాకు 70 ఏళ్ళని! నేను వృద్దుడనౌతున్నానని నాకు తెలియ నేలేదు ; దానిగురించి ఆలోచించ డానికి నాకు ఒక్కక్షణమైనా తీరిక లేదు. బ్రహ్మచారులైన మీరందరూ కూడా అదేవిధంగా పనిచెయ్యాలని నేను ఆశిస్తున్నాను.
       1987 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లోనూ, పట్టణాల్లోనూ సుమారు 50 మంది బ్రహ్మచారులు పనిచేస్తున్నారు. వారంతా బోధన లోనూ, మిషన్ కార్యక్రమాలు నిర్వ హించటంలోనూ, వారి సామర్థ్యం, సమాజపు అవసరాలు, పరిస్థితు లనుబట్టి వివిధ సేవాకార్యక్రమాల్లో నూ నిమగ్నులయ్యారు. వారిలో చాలామంది తమంతతామే సేవా పథకాలను యోచించి అమలు చేస్తున్నారు. 
         ఆంధ్రప్రదేశ్ లోని కడపజిల్లాలో గ్రామస్థులు విరాళంగా ఇచ్చిన 22 ఎకరాల భూమిలో స్వామిని శారదా ప్రియానంద గ్రామీణుల సేవకోసం చిన్మయారణ్యం అనేపేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ భూమి ఎటువంటిదంటే, దానిమీద ఒకచెట్టై నా, మొక్కైనా లేదు; మారుమూల నున్న ఆ ప్రాంతాన్ని చేరాలంటే, ఒక మైలుదూరాన్నుంచి ఎద్దుబండి మీదనే ప్రయాణం చేయాలి. అటు వంటి స్థలంలో ఐదు సంవత్సరాల్లో నూతులు త్రవ్వారు, చెట్లునాటారు, వ్యవసాయం మొదలుపెట్టారు, ఒక మైదానం చుట్టూ భవనాలు నిర్మిం చారు. వంటగది, భోజనశాల తప్ప మిగిలిన వాటన్నిటినీ స్థానికులు అక్కడున్న ముడిసరుకుతోనే ఆ ప్రాంతపు శైలిలో వెదురుకఱ్ఱలు తాపడం చేసిన మట్టిగోడలతోనూ, గడ్డితో చేసిన పైకప్పుతోనూ నిర్మిం చారు. ఆ భవన సముదాయంలో ఒక సభాభవనం, తరగతులకు గదు లు, వృద్దులకు వేరువేరుగా నిర్మించి న చిన్నచిన్న కుటీరాలు, బాలబాలిక లకు ప్రాథమిక పాఠశాల, రెండువస తి గృహాలుఉన్నాయి. అంతేకాకుం డా, స్థానికప్రజల అవసరాలను దృష్టి లో ఉంచుకొని ఉచిత హోమియో పతి వైద్యసదుపాయం, పేదవిద్యా ర్థుల అవసరాలకు తగినట్లు ఒక పాఠశాల, వృత్తివిద్యాకేంద్రం, 6గురు చిన్నపిల్లలున్న ఒక అనాథ శరణా లయం కూడా ఏర్పాటుచేశారు. శ్రీమతి అనంతరావమ్మ అనే 80 ఏళ్ల బామ్మగారు పిల్లల సంరక్షణ బాధ్యత వహిస్తున్నారు. వృద్దులకూ, అంగవైకల్యంతోఉన్న పేదవారికీ మధ్యాహ్నభోజనం ఉచితంగా లభిస్తుంది. ప్రతిఆదివారం ఒక వారానికి సరిపడే ఆహారధాన్యాల నూ, విరాళంగా లభించిన కూరల నూ, దుస్తులనూ విద్యార్థులు సమీ పగ్రామాల్లో అవసరమైన జనులకు అందజేస్తున్నారు. స్వామినికున్న అంతులేని శక్తి, ఉత్సాహం, ప్రేరణ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా నిధులు అందజేసేలా చేశాయి. 1988లో ఆమె గుంటూరులో నాలు గెకరాల స్థలంలో చిన్మయారణ్యం శాఖ నిర్మాణాన్ని కూడా స్వయంగా పర్యవేక్షించారు. 
       🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
              🌺 సరళ  🌺
 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   నా పేరు త్రివేణిగిరి. వివాహమైన మూడు మాసాలలోనే శరీరం అంతా కుష్టు వచ్చింది. జీవితం నరక ప్రాయమైంది.
   
    అరుణాచలంలో ఎవరో విభూదిస్వామి తగ్గిస్తారంటే వెళ్ళాను. తీరా వెళ్ళాక అంతా మోసం అని తెలిసింది. ఇంతలో ఎవరో రమణ మహర్షి పేరు చెప్పారు. నేను ఆ పేరు వినటం అదే మొదటిసారి. మహర్షి అనుగ్రహంతో నీ రోగం పోతుంది అని  కొందరు అన్నారు. 
   
     నేను రమణాశ్రమంలోకి వెళ్ళి రమణులు ఉన్న హాలులోకి ప్రవేశించబోయాను. ఒక ఆశ్రమ సేవకుడు నా వికృత ఆకారము చూసి అసహ్యంతో లోపలికి వెళ్ళకుండా చెయ్యి అడ్డం పెట్టాడు. నేను పట్టలేని బాధతో నిరాశతో కిటికీలోంచి మహర్షిని చూస్తూ ఉద్వేగంతో పెద్దగా ఏడ్చాను. నా దౌర్భాగ్యానికి నా ఏడుపు విని మహర్షి కిటికీలోంచి నా వైపు దయతో చూసి లోపలకు రమ్మని సైగ చేశారు. 

     నేను నమస్కరిస్తూ ఏడుస్తూ వెళ్ళి మహర్షి రెండు కాళ్ళ మీద పడిపోయాను. మహర్షి కరుణతో నన్ను లేవనెత్తి నా శరీరమంతా చేతులతో తడిమి విభూతి ఇచ్చారు. అక్కడఉన్న భక్తులు 'నీవు అదృష్టవంతుడవు; మహర్షి ఎవరినీ తాకరు; ఎవరికీ విభూతి ఇవ్వరు' అన్నారు. 

      'నిజంగా నేను అదృష్టవంతుడినే. మూడు నెలల్లో నా రోగం మాయమైపోయింది. ఏమిచ్చి మహర్షి ఋణం తీర్చుకోగలను నేను? ఇప్పుడు పిల్లాపాపలతో సుఖంగా ఉన్నాను. మహర్షి అనుగ్రహం ఎవరిమీద ఎప్పుడు ఎలా పడుతుందో ఎవరూ చెప్పలేరు.'
 *అరుణాచల శివ*

“ఈ అరుణాచలాన్ని చూసి ఇది రాళ్ళతో, చెట్లూ చేమలతో కూడిన సాధారణ పర్వతమని భావించవచ్చు. ఇది పరమేశ్వరుని స్వరూపం” అని ఎల్లవేళలా హెచ్చరించేవారు.
శ్రీ రమణులు.

అనలాచలసంకాశం యదిదం లింగముల్టితమ్, అరుణాచల మిత్యేద తదిదం ఖ్యాతిమేప్యతి ॥ అత్ర తీర్థంచ బహుధా భవిష్యతి మహత్తరమ్, ముక్తిరప్యత, జంతూనాం వాసేన మరణేనచ ॥
అత్ర సంస్మృ తి మాత్రేణ ముక్తిర్భవతి దేహినామ్ ||

"అరుణగిరి వాసం, మరణం - రెండూ ముక్తి దాయకం. ఇది గొప్పతీర్థం.

ఇక్కడ *నన్ను స్మరించినంత* మాత్రాన ముక్తి కలుగుతుంది" అని శివపురాణంలో సాక్షాత్తు *పరమేశ్వరుని* వచనం.

"అరుణం - శక్తి - పార్వతి డైనమిక్ ఫోర్స్. అచలం నిశ్చలాత్మ శివుడు (స్టాటిక్ ఫోర్స్). సగుణ నిర్గుణాల ఏకరూపం ఇది” అని రమణుల మాట.

సూర్యుని నుండి విడివడి భూమి అగ్నిమయంగా ఉన్న దశ నుండి చల్లారుచూ
రాగా ఏర్పడిన ప్రథమ పాషాణమయ స్థానమిది" 
అని భూగర్భ శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలిన విషయం.

ఇది ఆసియా ఖండంలో భాగం కాదని, ఇప్పటి మహా సముద్రంలో మునిగిన లెమోరియా ఖండం (కుమారి ఖండం)లో ఒక భాగమనీ, హిమాలయాల కన్నా ప్రాచీన పర్వతమని వారు వివరించారు. మన పురాణకథలలోని సత్యాన్ని ధృవపరచే శాస్త్ర విషయాలివి.

గంగాచ మూలభాగస్థా యమునా గగనస్థితా, సోమోద్భవ శిరోభాగే సేవంతే శోణ పర్వతః ||

గంగ, యమున, నర్మదాది నదులన్నీ ఈ పర్వతాన సూక్ష్మరూపంలో ఉన్నాయని స్కాంద పురాణం చెప్తోంది.

అరుణాచలం చుట్టూ వివిధ దేవతలు, దిక్పాలకులు, గ్రహ దేవతలు, ప్రతిష్ఠించి అర్చించిన శివలింగా లున్నాయి. 

పార్వతి, ఇంద్రుడు, బ్రహ్మాదులు, జడభరతుడు మొదలైన వారంతా అరుణగిరి ప్రదక్షిణ చేసి తరంచారని పురాణాలు చెప్తున్నాయి. విష్ణు పురాణంలో అరుణగిరి సుదర్శన చక్రంగా వర్ణించారు. (సుదర్శనుడు అగ్నితత్త్వమే కదా) అందుకే వైకుంఠ ఏకాదశినాడు వైష్ణవులు 
ఈ గిరిని ప్రదక్షిస్తారు.

"ఇది భూమికే హృదయం. సత్యస్వరూపం జ్ఞాన తేజస్సు. శ్రేష్ఠ తమం” అని ఋగ్వేద మంత్రాలు అరుణగిరిని కీర్తించాయి.

అరుణాచలం కొన్ని యోజనాల వరకూ అనంత శక్తిని ప్రసరిస్తుంటుంది. ఈ పర్వతాన్ని ప్రదక్షిణ చేసేవారికి ఈ శక్తి ప్రభావం వల్ల ఇహపరాలు సిద్ధిస్థాయి. సూక్ష్మ దృష్టిగల వారికి శివుడు ఈ పర్వతాన జ్యోతి స్వరూపునిగా సాక్షాత్కరించిన వైనాలు చాలా ఉన్నాయి.

శివుని జ్యోతి రూపంగా దర్శించి, అర్చించే ఉత్సవం కార్తీక పూర్ణిమ (కృత్తికా నక్షత్రం) నాడు నిర్వహిస్తారు. ఈ రోజు కొండపై వెలిగించిన దివ్యజ్యోతిని దర్శించడానికి అసంఖ్యాక జనవాహిని తరలి వస్తుంది.

అంతేకాక పారమార్థికమైన ఆత్మజ్ఞానాన్ని సైతం ప్రసాదించే శక్తి ఈ క్షేత్రానికి ఉంది.