Wednesday, November 5, 2025

 💐2శ్రీ లింగ మహా పురాణం💐 

🌼పురాణ అంశములు సంగ్రహ వివరణ🌼

       #రెండవ భాగం#

శ్రీ లింగ పురాణంలో ఈశాన కల్పములో జరిగిన విశేషాలు వివరించారు. ఈ పురాణంలో పదకొండువేలశ్లోకాలుఉన్నాయిపూర్వార్థం, ఉత్తరార్థం అని రెండుభాగాలుగారచించ
బడింది. పూర్వార్థంలో 108 అధ్యాయాలు ఉండగా ఉత్త రార్థంలో 57 అధ్యాయాలు ఉన్నాయి. పరమేశ్వరతత్త్వాన్ని సంపూర్ణంగా వివరించే ఈమహా పురాణం లోకములకు ఇరవై ఎనిమిది శివావతారాలకి సంబంధించిన కథలున్నాయి.

1 -40వరకుగలఅధ్యాయాలలో శివలింగ విశేషాలు, లింగశబ్దార్ధ నిర్వచనాలు, ప్రాధమిక సృష్టి విశేషాలు, బ్రహ్మ సృష్టి క్రమం, అగ్ని సృష్టి కథనం, శివాను గ్రహంతోబ్రహ్మానందం,యోగ
మార్గంలో శివుని ఉపాసన, అష్టాంగయోగ నిరూపణ, యోగవిఘ్న కారణాలు, శివానుగ్రహ నిరూపణ, సద్యోజాత తచ్ఛిష్య నిరూపణ, వామదేవ, తత్పురుష, అఘోర విశేషాలు,అఘోరమంత్రోపాసన, ఈశాన బ్రహ్మ, పంచబ్రహ్మ స్తోత్రం, శివలింగ ఆవిర్భావం,

శ్రీ మహావిష్ణువుచేసినశివస్తుతి, బ్రహ్మ విష్ణువులకు ఈశ్వరుడి వరప్రదానం, హరిహర బ్రహ్మ కృత శివుస్తోత్రం, సర్పోదయం, రుద్రోత్పత్తి,సద్యోజాతమూర్తుల ఆవిర్భావం,వ్యాసయోగాచార్యత్వం, స్నాన విధులు, సంధ్యా వందనం, బ్రహ్మయజ్ఞనిరూపణ, లింగార్చనవిధానాలు,మానసిక లింగార్చన,దారువనంలోమును లనుశివుడుపరీక్షించుటమునులశివప్రార్ధన,శివుడుఉపదేశించిన పాశుపత వ్రతం, భస్మస్నాన విధులు సవివరంగా చెప్ప బడ్డాయి.

41 నుంచి ఎనభై వరకు గల అధ్యాయాలలో దధీచి క్షుప సంవాదం, క్షుపుని విష్ణు స్తుతి, నందికేశ్వర వృత్తాంతం ఆది సృష్టి, యుగధర్మాలు, వేద వ్యాస పురాణ క్రమం కలియుగ ధర్మాలు, బ్రహ్మ దేవీపుత్రుడిగా మారుట, ఈశ్వరుడు శిలిదము నికిప్రసాదించుట,నందికేశ్వరుడు శివానుగ్రహం పొందుట, గణాధిపత్యం లభించుట, శివుని సర్వాత్మ భావం,

భూలోకం లో గలసప్తద్వీపాలు, జంబుద్వీపంలోనివర్షాలు,అగ్నీ ధ్రుడి వంశం, మేరు పర్వతం, ఇంద్రాదుల నగరాలు, పరమే శ్వరుడి నాలుగు స్థానాలు, గంగాది నదుల జననం, ప్లక్ష ద్వీప విశేషాలు, సూర్య ధ్రువుల గతులు, సూర్య రథం, చంద్ర రథం, చంద్రుడికళలు,బుధగ్రహా దుల రథాలు, మండలాలు, సూర్యుడి గ్రహాధిపత్యము, 
త్రియగ్నులు, సూర్యుడి వేయి కిరణాలు,

ధృవుడి చరిత్ర, దేవదానవ గంధర్వాదుల జననం, సూర్య చంద్ర వంశాల వర్ణన,శివసహస్ర నామ నిరూపణ, యయాతి చరిత్ర, యదు వంశం, శ్రీకృష్ణ అవతారం, ఆది సృష్టి కధనం, త్రిపురాసుర కథ, లింగార్చన విశిష్టత, శివలింగ భేదాలు మొదలైనవి వర్ణించ బడ్డాయి.

81 నుండి 120 వరకు గల అధ్యాయాలలో శివుడి సాకార నిరాకార స్వరూపాలు, శివ విగ్రహ ప్రతిష్ట , శివమందిర నిర్మాణ పుణ్యఫలం, భక్తి మహిమ, అహింస మహిమ, శివపూజా మహిమ, కైలాస వైభవం, ద్వాదశ లింగ వ్రతం, సర్వపాపహరం వ్యపోహన స్తవం,నక్తవ్రతం,ఉమామహేశ్వర వ్రతం, శివ పంచాక్షరి మహా మంత్ర విధి,

శివ ధ్యానం,సనత్కుమారదుల మాయా విమోచనం, మోక్ష ప్రాప్తి, అణిమాద్యష్టసిద్ధి ప్రాప్తి, శివయోగుల సదాచారాలు, ప్రణవ మహిమ, శ్రీశైలం మొద లైన క్షేత్రాల మహిమ, అంధ కాసుర కథ, హిరణ్యాక్ష వధ, శివుని వరాహదంష్ట్ర ధారణ, శరభేశ్వర అవతారం, ఉగ్ర నరసింహుని శాంత పరచుట, జలంధర వధ, శ్రీహరికి శివుడు సుదర్శనం ప్రసాదించుట, దక్ష యజ్ఞ వినాశనం, సతీదేవి పార్వతిగా జననం, శివ పార్వతుల కళ్యాణం, ఉపమన్యుడి కథ మొదలైనవ వర్ణించ బడ్డాయి.

121 నుండి 165 వరకు గల అధ్యాయాలలో శివ లింగార్చన మహిమ, శివుడిఅష్టమూర్తులు, శివ మూర్తుల సంజ్ఞలు, భార్యా పుత్రులు, పంచబ్రహ్మనిరూపణ, మహేశ్వరునిసంజ్ఞలు,శివరూపాలు, సూర్య మండలంలో శివుని పూజించే విధి, తంత్రోక్త శివపూజావిధానం,నియమాలుమానస శివపూజా విధి, అఘోర శివపూజా విధి ,

షోడశమహాదానాలు,తులాదాన మహిమ,హిరణ్యగర్భదానం, తిలపర్వతదానం,సువర్ణభూమి దానం, గణేశ దానం, సువర్ణగో దానం, లక్ష్మీ దానం, తిలధేను దానం,సహస్రగోదానం,హిరణ్యా శ్వదానం,కన్యాదానం, సువర్ణ వృషభ దానం, సువర్ణ గజ దానం, లోకపాలాష్టక దానం, త్రిమూర్తి దానం,

జీవచ్ఛార్థ నిరూపణం, శివలింగ స్థాపనప్రాముఖ్యత,సర్వదేవతా ప్రతిష్ఠాపనా విధి, అఘోరశివ ప్రతిష్ట, విగ్రహ విధి, వజ్రవాహనికా విద్య, వజ్రేశ్వరీ విద్య, మృత్యుంజయ మంత్ర విధానం, త్రయంబక మంత్ర శబ్దార్థాలు, లింగ పురాణ పఠన శ్రవణ ఫలం మొదలైనవి వర్ణించ బడ్డాయి.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుకుందాం.*
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜 శ్రీ ఓంఉమా 
మహేశ్వరాయ నమ:💜
లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

No comments:

Post a Comment