Tuesday, November 25, 2025

 🕉️ ఓం నమో శివ కేశవ శనీశ్వరాయ నమః 🕉️

🙏 శివాయ గురు పరమాత్మనే నమః 🙏

*మంచి వ్యక్తి మంచి పుస్తకం అంత తొందరగా అర్థం కారు/కాదు.. లోతుగా చదవాల్సిందే.*
*గుర్తింపు కోసమైతే ఎదో ఒక గెలుపు సాధిస్తే చాలు..* *గుర్తుండిపోవాలంటే..మాత్రం గెలుపును పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాల్సిందే.*

.        మన *జీవితంలో* అవసరానికి అదుకునే వారు ఎవ్వరు ఉండరు, *కానీ* వాళ్ళ అవసరానికి మనల్ని వాడుకునే వారు చాలా మంది ఉంటారు, మన *మాటే* మన సంపదలకు మూలం, ఆ సంపదలే *మానవ* సంబంధాలకు మూలం.
         
       మనం మాట్లాడే మాటలే మనకు *స్నేహితుల్ని* సంపాదించి పెడతాయి, ఆ మాటలే మనకు *శత్రువుల్ని* కూడా తయారు చేస్తాయి తెలుసా మిత్రమా.. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.

     ఎప్పుడూ *గతంలోకి* చూడటం లేదా పక్కవారి *జీవితంలోకి* చూడటం చేస్తావో అప్పుడే నీ *ఆనందానికి* అవరోధం మెదలు, ఎప్పుడైతే నిలోకి నువ్వు చూడటం మొదలుపెడతావో ని పురోగతికి తొలి మెట్టు అవుతుంది..

.   మంచి *పరిణామం* ఎప్పుడూ నత్తనడకనే ఉంటుంది *చెడు* ఎప్పుడూ రెక్కల *గుర్రంలా* పరుగులు పెడుతుంది....!!

     *బడిలో* ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి/పండగ కు *బాధ్యతలు* పెరిగాక వచ్చే ఆదివారానికి/పండగ కు చాలా తేడా ఉంటుంది..

.   *మనస్సులో కత్తులు*
దాచు కొని *మాటల్లో పువ్వులు* రాల్చే *మనుషులు* ఉంటారు,
*బ్రతకడం* కోసం *రాజీ* పడటం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం *యుద్ధం* చేయడమే *ఉత్తమం*

*మౌనం మాట్లాడుతుంది కానీ* 
 *ఆశబ్దాన్ని మనిషి వినలేడు* .

 *కేవలం మనసు మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది.* 
*చాలా సందర్భాలలో నిశ్శబ్దం అనేక సమస్యలను నెరవేర్చుతుంది. ఎన్నో విజయాలని తెచ్చిపెడుతుంది. ఒక మనిషి మౌనంగా ఉన్నాడు అంటే దానర్థం ఏమి చేయడం లేదని కాదు గతాన్ని నెమరువేసుకుంటూ, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నాడని అర్థం...*
 *రాబోతున్న సునామీకి ముందు సముద్రం ఎంత  ప్రశాంతంగా ఉంటుందో మౌనంగా ఉన్న మనిషి మనస్సు కూడా  అంతే ప్రశాంతంగా ఉంటుంది...కానీ లోపల తనకే తెలియని శత్రువుతో తనో యుద్ధం చేస్తున్నాడు అని అతనికి మాత్రమే తెలుసు... కాబట్టి మౌనంగా ఉన్నారని ఎవరిని తక్కువ అంచనా వేయకండి ప్లీజ్.. ఆ మౌనం వెనుక మహా ప్రళయమే ఉండొచ్చు.. మౌనం అర్ధాంగీకారమని మన పెద్దలు ఊరికే అనలేదు..*
*ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు అతని నోటి నుండి వచ్చే మాటని మనం వినగలుగుతాం...కానీ అతన్ని మౌనాన్ని అర్థం చేసుకున్నప్పుడే అతను ఏంటో తెలుస్తుంది....*
*ఒక రూపాయి Coin కింద వేయండి,  ఓ వంద రూపాయల నోటుని కింద వేయండి. ఏది ఎక్కువ శబ్దాన్ని ఇస్తుంది. రూపాయి Coin యే  కదా.. అంటే దీన్ని బట్టి ఏం అర్థమైంది, విలువైనవన్నీ నిశ్శబ్దంగానే ఉంటాయని. విలువ లేనివే శబ్దాన్ని సృష్టిస్తాయని అర్థం.*
*ఏమీ లేని ఆకే ఎగిరి ఎగిరి పడుతుంది. అన్ని వడ్డించిన ఆకలి తీర్చే ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.*
*కాబట్టి నీ విలువ తెలవాలి అంటే నీ చేతలు మాట్లాడాలి, ఎప్పుడైతే నీ చేతల్ని నీ మాటలు డామినేట్ చేస్తాయో, అప్పుడే నువ్వు చేతగాని వాడిగా మిగిలిపోతావ్.. ఎప్పుడైతే నీ విజయాలు మాట్లాడతాయో ప్రపంచం నీతో మాట్లాడడానికి ఉవ్విళ్ళురుతుంది. నువ్వు మాత్రమే మాట్లాడినప్పుడు ప్రపంచం నిన్ను నిర్లక్ష్యం చేస్తుంది.*
*నువ్వు ఎవరి దగ్గరో అపాయింట్మెంట్ తీసుకోవడం కాదు, నీ  అపాయింట్మెంట్ కోసం పదిమంది పోటీపడేలా ప్రయత్నించు. అది నీ మౌనం మాత్రమే నీకు తెచ్చిపెడుతుంది..*
*కాబట్టి శబ్దం చేసే రూపాయి లా మిగిలిపోతావో, నిశ్శబ్దంగా అత్యున్నత విలువ నిచ్చే 100 రూపాయల నోటుగా ఎదుగుతావో నీ ఇష్టం ఫ్రెండ్..*
 *ఆలోచించుకొని అడిగెయ్.*

*🙏ఓం నమో శ్రీ శివ కేశవ శనీశ్వరాయ నమః*🙏

*అసలు మానవులుగా మనం పుట్టింది ఎందుకు..??*

ఈ ప్రశ్న మనకే కాదు, ఋషులకు , మునులకు కూడా అంతు పట్టలేదు, మనం కూడా ప్రతి ఒక్కరూ తమను తాము అడగాల్సిన ప్రశ్న ఇది... !!

అయితే.. మళ్ళీ మళ్ళీ మానవులుగా పుట్టకుండా ఉండటానికే. 
అంటే మోక్షం పొందటానికే,u అని ఉపనిషత్తులు భగవద్గీత తెలిపాయి.

అయితే మోక్షం సాధించక పోయినా , సాధించటానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోయినా , మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లే.

*మరి అట్టి మోక్షాన్ని పొందటానికి ముఖ్యమైన ఏకైక మార్గం ఏమిటి...??*

*"అదే..!!"* ...

*జ్ఞాన మార్గం లేదా జ్ఞాన యోగం!!...*

దానినే ఇక్కడ బుద్ధియోగం అని కూడా అన్నారు!!...


అట్టి బుద్ధియోగం మనకు ఎలా లభ్యమవుతుందో ఇక్కడ ఉపాయాన్ని చెబుతున్నారు...

1) *నిత్యము, నిరంతరము భగవంతుని యందు చిత్తాన్ని నిలపటం.*

2) *భగవంతుని ప్రీతితో, ఇష్టంతో, ప్రేమతో, భక్తితో భజించటం.*

*కనుక ఎప్పుడో ఒకప్పుడు కాక నిత్యము, నిరంతరము మనస్సు భగవంతుని యందే ఉండాలి.*
 
*అదీ.... ప్రీతితో, భక్తితో, ప్రేమతో నింపాలి, భజించాలి, సేవించాలి.*   
 *ఇలా ప్రీతితో సేవించిన వారికి ఫలంగా భగవంతుడు బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాడు.*

 *ఈ బుద్ధియోగం వల్లనే జీవుడు తన యదార్థ స్వరూపం ఆత్మయని పరమాత్మయని గ్రహించి,  j జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని సాధించి, ఈ జీవబ్రహ్మైక్యత ద్వారా సమస్త దుఃఖనివృత్తిని, శాశ్వత ఆనంద ప్రాప్తిని పొందుతాడు.*

*బుద్ధియోగం అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ అనిత్యమైన అనాత్మ వస్తువులని గ్రహించి, వీటిని నిత్యవస్తువైన ఆత్మ నుండి వేరు చేసి చూచే జ్ఞానమే బుద్ధియోగం.*

ఇలా వేరు చేసి చూచే శక్తి బుద్ధి వల్లనే కలుగుతుంది, అందుకే ఇది బుద్ధియోగం అన్నారు.

🙏 ఓం నమః పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏

No comments:

Post a Comment