🔔 *తెలుసుకుందాం* 🔔
మనం నిత్యం పూజించే దేవీదేవతల చేతులలో వివిధ ఆయుధాలు చూస్తుంటాం, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటాయి, విశ్వంలో ఓ ఐదు శక్తివంతమైన గద ఆయుధాల గురించి తెలుసుకుందాం,
"ఏకం సత్ విప్ర బహుధా వదంతి" అంటే ఉన్నదీ ఒక్కటే సత్యం, పలువిధాలుగ దర్శనమిస్తూ ఉంటుంది, పరమాత్మ ఒక్కటే బ్రహ్మ గా, విష్ణువు గా, శివుడిగ, మరెన్నో విధాలుగా కనిపిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అయితే పరమాత్మ ప్రతి రూపంలో అనేక ఆయుధాలు ధరించారు అందులో గద కూడ ఒకటి, ఆయా రూపాలలో వారు ధరించిన గద కి ఆయాపేరుతో పిలిచారు,
*భగవాన్ శివుడి గద - "ఏక్ష"*
అదేంటి శివుడు త్రిశూల పాణి కదా, గద దరుడు కాదు అంటారేమో, కానీ శివుడికి సర్వాయుధాలు కలవని శివపురాణమే చెబుతుంది,
ఈ గద శివుడి చేతిలో ఉన్నప్పుడు "ఏక్ష" అనుపేరుతో ఉంటుంది, శివుడు అమ్మవారి స్వరూపంలో ఉన్నప్పుడు కూడ ఈ "ఏక్ష" అను గద ను ధరించి ఉంటారు, ఈ "ఏక్ష" ని సృష్టి లయం చేసే సమయంలో స్వామి వాడతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
*భగవాన్ విష్ణువు గద - "కౌమోదకి"*
విశువుకు శంక చక్ర ఖడ్గం గద అను ఆయుధాలు కలవు అందులో గద పేరు "కౌమోదకి" స్వామివారు లక్ష్మి స్వరూపంలో కూడా ఈ "కౌమోదకి" ని ధరించి ఉంటారు. స్వామి ఏ అవతారంలో ఉన్న ఈ కౌమోదకిని ధరించి శత్రుసంహారం చేసినారని పురాణవచనం.
*భగవాన్ హనుమ గద - "కౌమోదకి"*
సాక్షాత్తు పరమేశ్వరుడే హనుమగ అవతిరించారని శాస్త్రాలు చెబుతున్నాయి, ఈ శివస్వరూపం ఐన హనుమ గారు శ్రీమద్రామాయణంలో వారు గధ పట్టుకుని యుద్ధం చేసినట్లు ఎక్కడ లేదు కానీ వేరే పురాణ గ్రంధాలలో గద ని ఆయుధంగా కలవారని ఉన్నదీ, ఆ గధ పేరు "కౌమోదకి", ఈయనేమో విష్ణు స్వరూపం ఈయన గద నెమో విష్ణు మూర్తి వారిది, కదా అంటే. స్వరూపం ఏదైన భగవాన్ ఒక్కరే కదా, శివ విష్ణువులు వేరు కాదని చెప్పే ఒక్క ఆధారం ఇది అని అంటారు పెద్దలు.
ఇంక ద్వాపర యుగ కాలం లో ఆదిశేషుడు బలరాముడుగ అవతరించాడని పురాణ గ్రంధాలు మహాభారతం చెబుతున్నాయి.
*భగవాన్ బలరాముడి గద - "సోలందరు"*
బలరాముడు హలధరుడు అంటే నాగలిని ఆయుధంగ ధరించేవాడని అర్థం, కానీ ఆయనకు తపస్సుద్వార సిద్ధించిన గద ఉన్నదీ దానిపేరు "సోలందరు", ఇది చాల శక్తివంతం ఐనది, ఏదైన సమయం లో ఈ గద గాని భూమికి తగిలితే భయంకరమైన భూకంపం వస్తుందని శాస్త్ర వచనం, ఈ బలరాములవారు గద యుద్ధం లో ఆరితేరి ఉన్నవారిని, వీరే భీమ దుర్యోధనులకు గదా యుద్ధం నిరూపించారని భారత వచనం. బలరాముడు ఒక్కడే పాండవ కౌరవులను నాశనం చేయగలడు కాబట్టి వారు యుద్ధములో పాలు పంచుకోలేదు.
*భీముడి గద - "వర్గోధర్మ"*
భగవాన్ వాయుదేవుడే కుంతికి సద్యో గర్భాన అంటే మైథున సంపర్కం లేకుండ జన్మించడాన్ని సద్యోగర్భం అంటారు, వాయుదేవుడు ఆమాదిరి పిల్లాడిల కుంతి ఒడిలో ప్రత్యక్షం అయ్యాడు, మహాబలశాలి, పాండవులలో రెండవ వాడు, ఈ భీముడి గద పేరు "వర్గోధర్మ", ఈయన గద కూడ తపస్సు ద్వార పొందినదే అంటారు, ఈ గద ధరించడం వలన భీముడి శక్తి రెట్టించినదై ఉంటుందని చెబుతారు, ఈ గద సుమారు 5000ల కేజీల బరువుకు పైమాటే అంటారు, ఈ గద ని వీరు తప్ప ఎవరు ఎత్తలేరని చెబుతారు. ఈ గద తో ఒక్క దెబ్బకే దుశ్యాసనుడు దుర్యోధనుడు చచ్చారని చెబుతారు.
No comments:
Post a Comment