Thursday, November 20, 2025

 *ఆడవారికి  ఆడ పుట్టుకనే శాపం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అన్ని సమస్యలే*

*ఆడవారు పెళ్లి చేసుకోవడం ఎందుకు ?*
*ఒక  తోడు కొరకా?*
*లేకపోతే  శారీరక సుఖం కొరకా?* 
*లేకపోతే  పిల్లల్ని కనడానికా?*

*లేకపోతే మగవాడు కష్టపడి డబ్బులు*
*సంపాదించి పెడితే కూర్చోని బతకడానికా?*
*ఆడవారు పెళ్లి చేసుకోవడం  ఇందు కొరకేనా?*

*ఆత్మాభిమానం కలవారు ఇది అయితే అవసరం లేదు*
*ఆడవారు పెళ్లి  చేసుకోకపోయినా బతకవచ్చు*
*అని కొందరు అనుకుంటే  మీరు ఏం చేస్తారు*

*శారీరక సుఖం లేకపోయినా  బ్రతుకవచ్చు*
*పిల్లలు లేకపోయినా బ్రతకవచ్చు*
*మగవాడి తోడు లేకపోయినా బ్రతకవచ్చు*
*తానే డబ్బు సంపాదించుకొని* 
*తన అవసరాలు తీర్చుకోవచ్చు అనుకుంటే*
*మగవాడి మీద ఆధారపడకుండా స్వేచ్ఛగా జీవించవచ్చు అని ఆత్మ అభిమానం కలవారు అనుకుంటే* 

*అసలు ఆమె మగ తోడు లేకుండా ఎందుకు బతకాలని కోరుకుంటూందొ వివరాల్లోకి వెళ్దాం.*

*ఒక ఆడబిడ్డ ఒంటరిగా తిరగడం బతకడం  కన్నవారు ఊరుకుంటారా*

*ఊరుకోరు  అందుకే*

*తల్లిదండ్రులకు ఆడపిల్ల పుడితే భయం అమ్మాయిని ఎలా పెంచాలో అందుకే అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచుతారు*

*అయినా అమ్మాయికి బయటకు వెళ్తే  మగ పిల్లలతో భయం దొంగ చూపులు దొంగ తాకిడిలు  చదువుకునే కాలేజీలో వేధింపులు ఎవరో ప్రేమిస్తున్నాను అంటూ వస్తారు ప్రేమించకపోతే చంపుతాను అని బెదిరిస్తారు*

*మొత్తానికి అమ్మాయి చదువు పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంది అప్పుడు తల్లిదండ్రులు*

*తన బిడ్డకు  పెళ్లి చేసి  అత్తగారింటికి పంపించాలి అని చూస్తారు*
*ప్రతి తల్లిదండ్రులు అందుకే*
 
*ఏరి కోరి ఆస్తి పాస్తులు ఉన్న  భర్తను చూసి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు చూస్తారు.*

*అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా అని అడగరు ఆస్తిపాస్తులు ఉంటే అమ్మాయి సుఖపడుతుంది అని అనుకుంటారు.*

*పెళ్లి చేయడం వల్ల తల్లిదండ్రుల బాధ్యత తీరిపోతుంది ఇక్కడితో మంచి సంబంధం చూసి పెళ్లి చేసాము అని తల్లిదండ్రులు సంబరపడతారు.*

*ఆడవారు పెళ్లి చేసుకున్నప్పటినుండి ఇక్కడే ఆడవారికి సమస్య మొదలవుతుంది*

*పెళ్లి చేసి అత్తగారింటికి పంపిన తర్వాత*
*ఈ సమస్యలకు పుట్టింటికి సంబంధం లేదు.*

*ఇక్కడ పెళ్లయిన తర్వాత ఆడవారే ఆ సమస్యను సొంతంగా ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితాంతం*

*1  ఇక్కడ ప్రధాన సమస్య భర్త మంచివాడైతే సరే ఒకవేళ చెడ్డవాడైతే ఆడవారికి ప్రధాన పెద్ద సమస్య తయారవుతుంది   ఇది మొదటి సమస్య ఆడవారికి*

*2 అలాగే అత్త మామ మంచివారైతే ఆమెకు ఏ సమస్య ఉండదు  ఒకవేళ అత్త మామ చెడ్డవారైతే మళ్లీ ఇంకో సమస్య మొదలవుతుంది రెండవది*

*3 ఆడబిడ్డ మంచిదైతే పర్వాలేదు భర్త తోడబుట్టిన మగవారు మంచివారు అయితే పర్వాలేదు తోడికోడలు మంచివారైతే పర్వాలేదు వారు కూడా మంచివారు కాకపోతే ఆమెకు మూడో సమస్య మొదలవుతుంది*

*4 ఇక ఆమె ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అది అలా చేయకు ఇది ఇలా చేయకు  అని  కట్టడి చేస్తే ఆమెకు నాలుగో సమస్య మొదలవుతుంది*

*5 ఆమె ఏ పని చేసిన తిట్టడం ప్రతిదానికి వంకలు పెట్టడం  అత్త కోడలు గురించి ఇరుగుపొరుగు వారికి ఉన్నవి లేనిది చెప్పడం  అత్త ఇలా చేయడం వల్ల ఆమెకు ఐదో సమస్య మొదలవుతుంది*

*6 భర్త వ్యసన పరుడైతే తాగుబోతు అయితే  తిరుగుబోతు అయితే ఆమెకు ఆరో సమస్య మొదలవుతుంది*

*7 ఇలాంటి క్రమంలో ఒకవేళ సంతానం కలిగితే  సంతానం కలిగితే ఇక ఆమె ఏమి చేయలేని పరిస్థితి తయారవుతుంది అది ఏడవ సమస్య*

*8 ఇప్పుడు ఇలాంటి అత్తమామలతో కలిసి బతకాలా ?*

*వ్యసనపరుడైన ఇలాంటి భర్తతో కలిసి బతకాలా ?*

*ఈ పిల్లల్ని పట్టుకొని ఇక్కడే ఉండాలా లేదా ?*
*బయటకెళ్ళి పోవాలా అనే సమస్య తలెత్తుతుంది* 
*ఆమెలో అప్పుడు అది ఎనిమిదవ సమస్య*

*ఇలాంటి సమస్యలు ఆమెకు ఎదురవుతాయి ఇది ఒకనాటితో పోయేవి కావు జీవితాంతం ఉంటాయి*

*అత్త అర్థం చేసుకోదు మామ అర్థం చేసుకోడు  భర్త చెబితే వినడు ఇలాంటి క్రమంలో ఏమి చేయాలో ఆమెకు ఏమీ అర్థం కాదు*

*అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వస్తుంది అత్తగారింట్లో అన్ని భరిస్తూ ఉండాలా లేకపోతే అందరిని వదిలేసి బయటకు వెళ్లి పోవాలా*

*కొందరు సమాజానికి భయపడి కష్టాలు బాధలు అవమానాలు భరిస్తూ అదే ఇంట్లో ఉంటారు అత్తమామలు తిట్టిన భర్త కొట్టిన అన్ని భరిస్తూ అందులోనే ఉంటారు*

*కొందరు ఇలాంటి అవమానాలు భరించాల ఇలాంటి మనుషుల మధ్య ఉండాలా ఇలా ఎంత కాలం ఉండాలి* 
*ఈ నరకంలో అనే కొందరు తెగించి బయటకెళ్ళిపోతారు*

*9 ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళిపోతే*
*సమాజంలోకి వెళ్లాలి సమాజంలో పెద్ద సమస్య మొదలవుతుంది అది తొమ్మిదవ సమస్య*

*10 ఈమె సమాజంలో ఎక్కడో ఒక అక్కడ ఉండాలి* 
*ఆమె ఉన్న కాడ ఇరుగుపొరుగు వారు ఉంటారు*
*అప్పుడు ఆమె గురించి ఆలోచిస్తారు.*

*ఈమె ఎవరు ఇక్కడ ఎందుకు ఉంటుంది*
*ఈమె ఏం పని చేస్తుంది.* 
*ఇంతకు ముందు ఎక్కడ ఉండేది ఈమె భర్త ఎవరు అని అందరూ ఆరాలు తీస్తారు.*

*వారే అన్ని ఊహించుకుంటారు వారే వచ్చేటప్పుడు*  *పోయేటప్పుడు మాటలంటారు ఇవన్నీ భరించాలి ఇది పదవ సమస్య*

*11 ఆమె బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి  ఉద్యోగం చేసే కాడ లేదా ఇతర పని కాడ కూడా సమస్య  యజమాని మంచివాడు అయితే సరే వాడు చెడ్డవాడు అయితే ఆమెకు మళ్ళీ11వ  సమస్య*

*12 సమాజంలో తిరుగుతున్నప్పుడు ఇతర మగవారు దొంగ చూపులు దొంగ తాకిడిలు వీళ్ళందర్నీ తట్టుకొని బతకాలి 12వ సమస్య*

*13 ఆమె ఒంటరిగా బ్రతికినప్పుడు ఆమె ఎవరితో మాట్లాడిన*
*ఎవరైనా ఆమె ఇంటికి వచ్చిన లేదా*
*ఆమె ఎవరి ఇంటికి వెళ్ళినా అది  సమస్య*
*ఆమె గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు సమాజంలో 13వ సమస్య*

*14 ఆమె తప్పు చేయకపోయినా చెడ్డదానిగా ముద్రలు వేస్తారు కొందరు వెనుక గుసగుసలు పెడతారు*
*కొందరు ముఖం ముందే అంటారు  ఇది 14వ సమస్య*

*1 ఇలా ఆడవారు పుట్టింట్లో జీవితాంతం ఉండలేరు*

*అలాగే*

*2 అత్తగారింట్లో ఇలాంటి సమస్యల వల్ల అత్తగారింట్లో జీవితాంతం చస్తూ బతకలేరు*

*3 ఆమె వాళ్ళని వదిలేసి సమాజంలోకి వస్తే*
*సమాజం వల్ల ఇలాంటి సమస్యలు మొదలవుతాయి*

*( ఇప్పుడు ఆమె ఎక్కడ బతకాలి )*

*పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండనివ్వరు*
*అత్తగారింట్లో స్వతంత్రంగా  బతుకనివ్వరు*
*సమాజంలో ఒంటరిగా బ్రతుకుదామంటే బతకానివ్వరు*

*( ఇప్పుడు ఆమె ఎక్కడ బతకాలి )*
.
*1 పుట్టింట్లో తల్లిదండ్రులకు బిడ్డ భారం కాకూడదు అని వారు బాధ్యత నెరవేర్చుకుంటారు. పెళ్లి చేసి*

*2 అత్తగారింట్లో అన్ని బాగుంటే పర్వాలేదు ఒకవేళ ఇలాంటి సమస్యలు తలెత్తితే  ఆమె స్వతంత్రంగా బతకాలి అని కోరుకుంటూ*

*3 ఆమె స్వతంత్రంగా బతకాలి అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు కనుక వాటిని పట్టించుకోకుండా తన కాళ్ళ మీద తాను బతకాలి*

*సమాజాన్ని పట్టించుకోకూడదు సమాజాన్ని పట్టించుకుంటే ఆమె జీవించలేదు*

*ఇప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది*

*నాకు ఎవరితో పనిలేదు  ఎవరు నాకు అవసరం లేదు  తల్లి తండ్రి అవసరం లేదు అత్త మామ అవసరం లేదు భర్త అవసరం లేదు*

*పిల్లలు ఉంటే పిల్లలతో తన పని తాను చేసుకుంటూ వారిని పోషిస్తూ ప్రయోజకుల్ని చేసి సమాజానికి అందిస్తుంది.*

*తాను ఎవరిని పట్టించుకోకుండా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ*
*తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంది*
*సమాజానికి భయపడకుండా అత్త గారింటిలో బానిసల ఉండకుండా*
*పుట్టింటి వాళ్లకు భారం కాకుండా.*

*ఇది ఎవరికి భారం కాకుండా  ఎవరికి బానిస కాకుండా*
*తన వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా.*

*తనకు తానే రాసుకున్న శిలాశాసనం.*

No comments:

Post a Comment