సాహసమే సాధనం
----------------------------------------------------
కష్టపడితే కలలు
అవుతాయి సాకారము
క్రమశిక్షణ ఉంటే
బాగుపడును బ్రతుకులు
ఏ గీతి పాడినా
ఏ గీత గీసినా
ఉపయోగమవ్వాలి
ఏ పనులు చేసినా
కష్టాలు వచ్చినా
కన్నీళ్లు తెచ్చినా
ధైర్యమే ఉండాలి
నష్టాలు చుట్టినా
ఓటమి వెంటాడినా
సమస్యలు ఎదురైనా
వెనుకంజ వేయొద్దు
పిరికితనం చూపొద్దు
-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
No comments:
Post a Comment