*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼♂️ ఒక యువకుడు చదువుకున్నవాడు. కొంత స్థితి, స్తోమత కలిగి ఉన్నవాడు. ఆరోగ్యవంతుడు. మంచీ చెడ్డా ఎఱిగినవాడు._*
*_ఒకనాడు ఇంట్లో భగవాన్ పటం ఎదురుగా కూర్చుని భగవానును ధ్యానిస్తున్నాడు. ఉన్నట్లుండి చిత్రం సజీవమైనట్లు తోచింది. భయంతో మూర్ఛపోయేంత పని అయింది. అమ్మను కేక వేశాడు. ఆమె వచ్చి ఏమయింది ? అని అడిగింది._*
*_చుట్టూ మూగినవారు అతని స్థితి చూచి కలవరపడ్డారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారని ఆ యువకునికి తెలుస్తూనే ఉందికాని ఏదో తెలియని శక్తి అతడిని ఇంకా అణచి వేస్తున్నది. కానీ అతడు దానిని ఎదుర్కొంటూనే ఉన్నాడు. కొంతసేపు స్మృతిని కోల్పోయాడు. తెలివి వచ్చాక అతడిని భయము ఆవేశించింది. కలవరపడినవారు అతనికి మందుమ్రాకులు ఇచ్చి, అతను తేరుకోవటానికి ప్రయత్నించారు._*
*_తరువాత కొంతకాలానికి అతడు తిరువణ్ణామలై వచ్చాడు. ఎదో మునుపటిలాగానే ఆ స్థితి ముంచుకొస్తుందనే భయం ఉండనే ఉంది అతనికి. భగవాన్ సన్నిధి, అట్టిదేమీ జరగనీయలేదు. కాని సన్నిధి నుంచి బయటకు వెళ్ళినప్పుడెల్లా, అతనికి ఆ పూర్వపు శక్తి పూనకం వచ్చి, భయావేశంలో చిక్కేవాడు._*
*_ఈ విషయాన్ని ఆశ్రమ భక్తులు, మహర్షికి విన్నవించారు. అందుకు మహర్షి దీర్ఘముగా ఇలా సెలవిచ్చారు..._*
*_🦚 ఓ అలాగా ! నాకు ఎవరూ ఈ విషయాన్ని యింతవరకూ చెప్పలేదే ? అది శక్తిపాతం. శక్తిపాతంవల్ల కలిగే అనుభవం యధార్థము, సరియైనది కూడా._*
*_ఇక్కడ మనుజుడు తన సంస్కారగతిని సాగిస్తున్నాడు. సాధనలో ఆత్మ తానేనని అనుభవంలోకి వస్తున్నప్పుడు, ఉరకలువేస్తూ వస్తూన్న మనోశక్తి ఆ ఉద్వేగంలో కట్లు తెంచుకుంటుంది. తాను ఆత్మ(దైవము)ను ఏవిధముగా ఊహించాడో దాన్నిబట్టి సాధకుని అనుభవాలు ఉంటాయి._*
*_పరిపక్వబుద్ధి కలిగినవారి మనస్సు, హృదయంలో ప్రవేశించే తరుణంలో ఈ ఆత్మబోధ గురించి ఒక్కసారి విన్నారంటే, అది విద్యుత్తువలె పనిచేస్తుంది. వానికి ఆత్మ(దైవ)సాక్షాత్కారం నిశ్చయంగా అవుతుంది. అట్లుకాకపోతే ఘర్షణ తప్పదు !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_*
*_🧘🏻 ఓం నమో భగవతే_*
*_శ్రీరమణాయ 🧘🏻♀️_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
🙏🇮🇳🎊🪴🦚🐍
No comments:
Post a Comment