🕉️అష్టావక్ర గీత. 266🕉️
అధ్యాయము 18
శ్లోకము 54
శ్లో|| శ్రోత్రియం దేవతాం తీర్థం అంగానాం భూపతిం ప్రియం!
దృష్ట్వా సంపూజ్య ధీరస్య న కాపి హృది వాసనా || 54.
వేదవిదులను దేవతలను పూజిస్తున్నా, తీర్థాలను సేవిస్తున్నా, సౌందర్య వతులైన స్త్రీలను, మహారాజును, ప్రియజనులను చుస్తున్నా, అతనిలో కోరిక లేశ మాత్రమయిన ఉదయించదు. స్థిర చిత్తంతో చూస్తూ ఉంటాడు.
వేదవిదులను దేవతలను పూజించడమూ, తీర్థసేవనమూ మనదేశంలో చాలా సహజమైనవే, ఇటువంటి కార్యకాలాపాల మధ్యనున్నప్పటికి జ్ఞానిలో ఎటువంటి కోరికా ఉదయించదు. అందమైన స్త్రీని, మహారాజును, యిష్టులను చూసినా ఒకేవిధంగా నిర్వికారంగా అతడుండగలడు.
అహంకారానికి అతీతంగా నిలచి, సర్వత్రా ఏకత్వాన్ని అనుభవించగల జ్ఞానికి సర్వమూ సమానమే, సర్వమూ తన స్వరూపమే, సర్వమూ ప్రియమే, అందుకే అతడు సర్వకాల సర్వావస్థలలోనూ సమదృష్టితో శాంతంగా ఉండగలడు.🙏🙏🙏
No comments:
Post a Comment