*సైంధవుడు లేదా జయధ్రదుడు.*
*ఇతిహాసంలో కౌరవులకు చెల్లెలైన దుస్సల కి పతి. జయధ్రదుడు*
*సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు*
*కాబట్టి సైంధవుడు అయ్యాడు.*
*ఇతడు పాండవులు వనవాసము చేయుకాలమున తాను ఒక*
*రాచకూతురును వివాహము చేసికొని వారు ఉన్న వనముగుండ తన*
*పట్టణమునకు పోవుచుండి ఆశ్రమమున ఏకాకియై ఉండిన వారిపత్ని*
*అగు ద్రౌపదిని చూచి వారులేకుండుట తెలిసి బలాత్కారముగా పట్టి*
*తన రథముమీద పెట్టుకొని పోవుచు ఉండెను.*
*ఇంతలో ఈవర్తమానమును ఎఱిగి పాండవులు వచ్చి వీనిని*
*చక్కగ మర్దించి అవమానించి పంపిరి.*
*అంతట వీడు దానికి ప్రతికారము చేయ సమకట్టి ఉగ్రతపము*
*సలిపి అర్జునుఁడు తక్క తక్కిన పాండవులను ఒక్కదినమున*
*జయించునట్లు వరము పడసి భారతయుద్ధము జరుగునపుడు*
*పాండవులను పద్మవ్యూహము భేదించిన అభిమన్యునికి తోడు*
*పడకుండ అడ్డగించి గెలుపుకొనెను.*
*కనుక పదుగురు యోధులు ఒక్కటిగాచేరి అభిమన్యుని చంపిరి.*
*ఆవృత్తాంతము సంశప్తకులతో పోరాడపోయి ఉండిన అర్జునుడు*
*విని ఆమఱునాడు సూర్యుఁడు అస్తమించునంతలో సైంధవుని*
*తల నఱకుదును అని ప్రతిజ్ఞచేసి ఆప్రకారము నడపెను.*
*మఱియు ఇతఁడు అర్భకుడై ఉండు కాలమున ఒకనాడు*
*అశరీరవాణి వీడు సంగ్రామమున ఏమఱి తల తునుమబడును*
*అని ఆదేశింపగా అది అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడు*
*విని ఎవడు వీనిమస్తకమును మహిమీఁద పడవైచునో అట్టివాని*
*శిరము సహస్రశకలములు అగుఁగాక అని సకలజనుల వీనులకు*
*గోచరము అగునట్లు పలికెను.*
*అర్జునుడు చేసిన ప్రతిన కౌరవసైన్యములో అందరికి తెలుస్తుంది.*
*సైంధవుడిని రక్షించడం కోసం కౌరవ సైన్యం ఒక వలయం క్రింద ఏర్పడి*
*అర్జునుడు సైంధవుడి వద్దకు చేరకుండా చేయాలని అందరూ వ్యూహం*
*పన్నుతారు. అనుకొన్న ప్రణాళిక ప్రకారం కౌరవసైన్యం సైంధవుడి వద్దకు*
*అర్జునుడిని చేరకుండా చేస్తుంది. అర్జునుడు చాలా చింతితుడయి*
*సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారి*
*శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంను సూర్యుడికి అడ్డుగా ఉంచి*
*సూర్యాస్తమయం అయిపోయిందనే భావన కలిగిస్తాడు.*
*అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయం*
*అయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు*
*అసలు విషయం తెలిపి తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి*
*తొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తాము*
*పన్నిన వ్యూహం నుండి సడలుతారు. ఆ విధంగా సడలడం వల్ల*
*సైంధవుడిని వద్దకు చేరడం చాలా తేలికవుతుంది. అర్జునుడు*
*సైంధవుడితో యుద్ధం జరిపి సైంధవుడి మీదకు పాశుపతాశ్త్రం*
*ప్రయోగిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది.*
*అప్పుడు ఆ శిరస్సు నేలపై పడిపోతుండగా శ్రీ కృష్ణుడు ఆ శిరస్సు నేలపై*
*పడరాదని దానిని ఆ అస్త్ర సహాయంతోనే వనంలో తపస్సు చేసుకొంటున్న*
*సైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో పడేటట్లు చేయమని*
*చెబుతాడు. సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారి*
*శిరస్సు నూరు చెక్కలు అవుతుంది. ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి*
*చేతులనుండి సైంధువుడి శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరు*
*చెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు.*
*ఈ విధంగా సైంధవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు.*
No comments:
Post a Comment