Wednesday, November 26, 2025

 Pasupula Pullarao...8919291603.. ధ్యానం ద్వారా జ్ణానం, జ్ణానం ద్వారా ముక్టి మోక్షం... సరైన సాధన ద్వారా జ్ణానం పొందినప్పుడు ఆ జ్ఞానమే సర్వం సకలం నేర్పుతుంది... దేని గురించి ఆలోచించాలి, ఏయే పనులు చేయాలి, ఎలా సరికొత్తగా జీవించాలి, ఎలా తెచ్చుకున్న శ్వాసల ను పొదుపుగా వాడు కోవాలి మొదలగు ఎన్నో ఎన్నెన్నో అధ్బుతమైన అపూర్వమైన అమోఘమైన మార్గాలను చూపిస్తూ, చేపిస్తు మానవ జన్మ కు పరిపూర్ణమైన జీవితాన్నీ, జీవనాన్ని సమ కురుస్తుంది... అంత రంగం కోటను కోట్ల జన్మ జన్మల చెడు కర్మలు అనే చీకట్లలో నిండి పోయి ఉన్నది... చీకట్లు అన్ని పారదోల డానికి కోటను కోట్ల దీపాలు వెలిగించ నవసరం లేదు... సరైన సాధన ద్వారా ఒకే ఒక్క ఙ్ఞాన జ్యోతి కోటను కోట్ల చీకట్లను పారద్రోలి అంతరంగం అంతా వెలుగులతో నింపుతుంది... వెలుగు ఉన్న చోట సమస్యల చీకట్లు దరి చేరవు...
మనసును నిలకడగా ఉంచేది, ఆయురారోగ్యాలు ఐశ్వర్య ఆనందాలు కీర్తి ప్రతిష్టలు ప్రేమతత్వం కృతజ్ఞతా భావం క్షమా గుణం,
చెడు కర్మలను దగ్ధం చేసేది, పాజిటివ్ ఆలోచనలు చేయడం మొదలగు సవాలక్ష పనులు ఆత్మ శక్తి ద్వారా మాత్రమే సాధ్యం.. ఒకటి, మరొకటి, ఇంకొకటి దొడ్డి దారి మార్గాలు లేవు గాక లేవు, ఉండవు గాక ఉండవు..
     ఎంత ఎక్కువ సమస్యలు ఉంటే అంత ఎక్కువ చెడు కర్మలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

No comments:

Post a Comment