Monday, November 24, 2025

ఈ భయంకర విగ్రహం - వీరిద్దరూ... | Varanasi Movie Chinna masta devi | Nanduri Srinivas

ఈ భయంకర విగ్రహం - వీరిద్దరూ... | Varanasi Movie Chinna masta devi | Nanduri Srinivas

https://youtu.be/oN3PQcH9CbI?si=hv3j4sEu0peZg1S0


శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ వారణాసి అనే సినిమాకి సంబంధించిన వీడియో ఏదో వచ్చింది కదా దాన్ని చూసాక సబ్స్క్రైబర్లు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఒకటి ఉంది ఏమిటంటే ఆ వీడియోలో ఇదిగో ఈ అమ్మవారి స్వరూపం చూపించారు తల ఒక చేత్తో పట్టుకొని మూడు రక్తధారలు వస్తూఉంటే అమ్మవాలు తాగుతున్నట్టు ఎవరండి అమ్మవారు కాళికా దేవా క్షుద్ర దేవత ఎందుకు అంత భయంకరంగా ఉన్నారు అని అడుగుతున్నారు ఈ అమ్మవారు దశమహావిద్యల్లో ఆరవ మహా మహావిద్య చిన్నమస్త అనే అమ్మవారు మహావిద్యలన్నిటిలోకి అసలు అలా చెప్పాలంటే అమ్మవారి స్వరూపాల అన్నిటిలోకి కూడా చాలా తీవ్రంగా ఉండే స్వరూపం కానీ భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు పార్వతీదేవి స్వరూపమే ఆ తల్లి కూడా మనక అమ్మే ఆ తల్లిని ఆరాధిస్తే శత్రువుల పైన విజయము రాజ్య ప్రాప్తి అలాగే కష్టమైన కార్యాలని చాలా అవలీలగా చేసే శక్తి వస్తుంది అని చెప్పి తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఉంది అమ్మవారినే వజ్రవైరోచని అనిను ప్రచండ చండి అని కూడా పిలుస్తారు ఈ పేర్లు మీరు చాలా చోట్ల వినే ఉంటారు ఈ అమ్మవారి స్వరూపం ఏంటండి అలా విచిత్రంగా ఉంది అంటే అమ్మవారికి ఒక ధ్యాన శ్లోకం ఉంది ప్రత్యాలీడపదాం సదైవ దతీం చిన్నం శిరః కర్త్రికాం దిగ్వస్త్రాం స్వకబంధ శోణిత సుధాధారాం పిబంతిముదా అని అమ్మవారిది పెద్ద ధ్యాన శ్లోకం ఉంది అందులో అమ్మవారి రూపాన్ని వర్ణించారు ఏమిటంటే అమ్మవారికి ఒక చేతిలో నరికివేయబడ్డ శిరస్సు ఆవిడ శిరస్సే ఖండించుకుని ఆ చేతిలో ఉన్నట్టు ఇంకో చేతిలో ఖడ్గం ఉంటుంది మొండెల్లోనుంచి మూడు రక్తధారలు వస్తూ ఉంటాయి. అందులో మధ్యలో ఉన్న రక్తధారని ఈ అమ్మవారి శిరస్సు ఏదైతే ఖండించింది ఉందో ఆ శిరస్సే తీసుకుంటూ ఉంటుంది అదే తాగుతూ ఉంటుంది. మిగతా రెండు ధారల్ని ఆ పక్కనఉన్న ఇద్దరు యోగినిలు ఉన్నారు వర్ణిని డాకిని అని ఆ యోగినులు ఇద్దరు ఆస్వాదిస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే ముగ్గురు దిగంబరంగా ఉంటారు అమ్మవారి శిరస్సు మూడు కళ్ళతోటి పైన ఒక సర్ప రూపం తోటి ఉంటుందన్నమాట. అమ్మవారి కాళ్ళ కింద చూస్తే విచిత్రంగా రతి మన్మధులు శృంగార కేళిలో ఉంటే వాళ్ళని అమ్మవారు తొక్కి పెట్టినట్టుగా ఉంటుంది ఆ స్వరూపం అసలు ఎలా వచ్చిందండి స్వరూపం అంటే ప్రాణతోషే తంత్రం అని ఒక తంత్రశాస్త్ర గ్రంథం ఉంది అందులో దీని సంబంధించిన కథ ఉందన్నమాట ఏమిటంటే పార్వతీదేవి ఒకసారి ఇద్దరు పరిచారికలతో గంగా స్నానానికి వెళ్తే అక్కడ వాళ్ళద్దరు ఆకలి అని అడిగారట అమ్మవారు కాసేపు ఉండండి అంటే మళ్ళీ మళ్ళీ అదే అడిగేసరికి అప్పుడు అమ్మవారు నల్లటి స్వరూపం ఒకటి తీసుకుని తన శిరస్సుని తనే ఖండించుకుంటే ఆ రక్తధారల్ని వాళ్ళిద్దరు గ్రోలి సంతోషించారు ఆ తర్వాత మళ్ళీ అమ్మవారు ఆ శిరస్సుని అతికించేసుకున్నారు అని ఇది ఒక కథా తంత్రశాస్త్ర గ్రంథంలో ఉంది. ఇది వినగానే మన బోటి వాళ్ళకి కనిపిస్తుంది ఏమిటండీ అమ్మవారు వాళ్ళ ఆకలి అంటే ఏ పలో పదార్థాల్లో సృష్టించి ఇవ్వచ్చు కదండీ ఎందుకు ఇదంతా చేశారు అని ఈ సృష్టి చేసింది వాళ్ళ కోసం కాదు మన ఉపాసన కోసం మన సాధన కోసం అమ్మవారు చిన్నమస్త రూపాన్ని తీసుకున్నారు. అంటే ఎలాగండి సాధన చేయడం అంటే ఏ దేవతా స్వరూపాన్నైనా సనాతన ధర్మంలో ఉన్న ఏ దేవతనైనా సాత్వికంగా సాధన చేసేవాళ్ళు ఉన్నారు తామసికంగా వామాచార ప్రక్రియల్లోనూ చేసేవాళ్ళు ఉన్నారు సృష్టిలో ఇద్దరూ ఉన్నారు కాకపోతే ఎప్పుడు సాత్వికమైన ఆరాధనే శ్రేయస్కరం ఎవ్వరికైనా అసలు ఈ అమ్మవారి విషయంలో అయితే సాత్వికమైన ఆరాధన కూడా చాలా చాలా కష్టం గురువు శిక్షణ లేకుండా అసలు ఈ అమ్మవారి ఆరాధన చేయకూడదు అంత కష్టతరమైంది అంటే అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అసలు ఆరాధన అంటే మనకి తెలుసున్న వాళ్లే మహాత్ములు ఇద్దరు ఉన్నారు మొట్టమొదట ఆయన ఎవరంటే 1936 వరకు మనకి దగ్గరలోనే ఉన్న మహా ఉపాసకులు కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని కమల మహర్షి చరిత్ర కానీ రమణ మహర్షి జీవితం గురించి కానీ తెలిసిన వాళ్ళందరికీ గణపతి ముని పేరు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ మహనీయుడు దశమహావిద్యలన్నిటికి సైంటిస్ట్ అని చెప్పొచ్చు అంత గొప్ప ఆయన ఆ విద్యలన్నిటిని సాత్వికంగా ఆరాధించి ప్రసన్నం చేసుకున్న మహనీయుడు ఆయన ఒకసారి తీవ్రంగా చిన్నమస్తా విద్యని ఉపాసన చేస్తూ ఉంటే అది ఫలించే సమయానికి ఆ పక్కనే ఉన్న ఒక పొదలో శిరస్సు ఖండింపబడిన అమ్మవారి శిరస్సు కనిపించింది ఆయనకి చిన్నమస్తాదేవి ఆ స్వరూపంలో ఇంకా తీవ్రంగా చేశాక చివరికి ఏమైందంటే కపాలం ఇక్కడ చిట్లిపోయి అందులోనుంచి పొగార రక్తం అవన్నీ వచ్చాయి ఏమైందంటే ప్రవహించే శక్తి ఉంటుంది కదా వెన్నెముకలోనుంచి అది ఆకాశంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీతో కలిసి పైకి వస్తూ వస్తూ పోతూ వస్తూ పోతూ అలా జరిగి చివరికి పాప ఆయన తలనెప్పి భరించలేక రమణుల వద్దకు వెళ్తే అది కాస్త సర్దుకుంది. ఆ తర్వాత గణపతి మునికి అమ్మవారి విద్య సిద్ధించి ప్రచండ చండీ త్రిషతి అని 300 శ్లోకాలు అలాగే ఉమా సహస్రం అని ఆయన రచించారు కదా అద్భుతమైన కావ్యం అది అందులో కూడా చిన్నమస్తాదేవి గురించి బోల్డ్ ఉంది శ్లోకాలు ఉన్నాయి మొత్తం అమ్మవారి ఉపాసనా మర్మాలు అన్నిటిని కూడా వీటిలో ఇచ్చేశరు. ఆ తర్వాత ఆయన ఇంకో గొప్ప విషయం చెప్పారు ఏమిటంటే మనకి పరశురాముడి కథలో వాళ్ళ తల్లి శిరస్సు ఖండించేస్తారు కదా స్వామి అలా ఎందుకు చేశారండి అంటే అదే చిన్నమస్త రహస్యము ఆ రేణుకాదేవి కూడా చిన్నమస్త అవతారంలో కిందక వచ్చారు అందుకే ఆ తర్వాత రేణుకామాత శిరస్సు వెళ్లి మాహూర్ అనే ఒక క్షేత్రం ఉంది మీకు తెలుసా మహారాష్ట్రలో నాందేడికి దగ్గరలో ఉంది. అక్కడ అమ్మవారి 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఉంది మాహూర్యే ఏకవీరి కాని ఎనిమిదవ శక్తిపీఠం అక్కడికి వెళ్లి కలిసిపోయింది అని చెప్పారన్నమాట ఆ తర్వాత పరశురాముడు తల్లిదండ్రుల అంత్యక్రియలు అక్కడే చేయడం దత్త సాక్షాత్కారం కలగడం ఇవన్నీ మనకి పరశురాముల వారి చరిత్రలో చూస్తే ఉంటాయి కదా ఆ ఎనిమిదవ శక్తి పీఠంలో ఉన్న ఏకవీరాదేవి చాలా ప్రసన్న రూపంలో ఉంటారు కానీ ఒక పెద్ద శిరస్సు ఉన్నట్టు ఉంటారు ఆ తల్లే చిన్నమస్త స్వరూపం ఈ ఉపాసన అయ్యాక గణపతి మునికి అపారమైన శక్తులు వచ్చాయి ఎవరిదైనా ఇలా ముఖం చూస్తే భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పేసేవారు ఆ శక్తులతోనే ఆయన రమణ మహర్షి కుమారస్వామి అంశతో దిగివచ్చారు పూర్వజన్మలో జ్ఞాన సంబంధ నాయనారు అని కూడా చెప్పారు కావ్యగంఠ గణపతి మని సరే వీరొకరు గొప్ప ఉపాసకులు చిన్నమస్తాదేవికి ఇంకొకళ్ళ ఎవరండి అంటే ఇప్పుడు మన తరంలో ఉన్న మహనీయులు ఆయన ఎవరో చెప్పుకోండి చూద్దాం మహామంత్రవేత్త శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు కుర్తాళం పీఠాధిపతి వారికి చిన్నమస్తాదే ఉపాస్యదేవ తర్వాత అమ్మవారు సాక్షాత్కరించారు కూడా వారికి చిన్నమస్తాదేవి పిలిస్తే పలుకుతుంది అమ్మవారు ఆ అమ్మవారి శక్తితో అమ్మవారిని ఆరాధింపచేసి ఎంతమందికి ఎన్ని కష్టాలు తీర్చారో ఒకసారి ఒక స్త్రీ వచ్చి నేను భర్త చక్కగా కాపురం చేసుకునే వాళ్ళం ఈ లోపల వేరే స్త్రీ మా జీవితంలోకి వచ్చాక మా భర్త మోజులో పడి నన్ను వదిలేసాడు వ్యసనాలు అన్నిటికి బానిస అయిపోయాడు అని పాపం ఏడుస్తూ వస్తే అప్పుడు స్వామీజీ ఆమె చేత ఎర్రని పువ్వులు ఎర్రటి వస్త్రాలు ఎర్రటి జపమాల ల ఎర్రటి ప్రసాదం వీటలన్నిటిలతో రాత్రిపూట ఉపాసన చేయించేసరికి కొన్ని రోజుల్లోనే భర్తకి మనసు మారి వెనక్కి వచ్చేసాడు ఇలాగ ఆయన జీవితంలో చిన్నమస్తాదేవి అనుగ్రహంతో ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశారో అది ఆ దేవతా శక్తి కానీ ఇది గురువుల శిక్షణలో మాత్రమే చేయాల్సిన ఆరాధన ఎందుకంటే కావ్యకంఠ గణపతిమునంత ఆయనకే తల చిట్లిపోతే ఇంక మనలాంటి వాళ్ళని చేయగలవా వీడియో ముగించే ముందు చిన్న విషయం ఈ అమ్మవారి స్వరూపం చూస్తే గనుక కొంచెం బట్టలు అవి లేకుండా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అలాగనే చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవన్నీ చూసి కొంతమంది కువ్యాక్షలు చేసే వాళ్ళు తయారవుతారు ఏమిటంటే అమ్మవారు గాని ఉపాసన గాని ఏమి తెలియని జీవితాలు ఏమిటంటే ఏమిటంటే ఇలాంటి స్వరూపాల్ని చూసేనండి సనాతన ధర్మాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు అని అలాంటి వాళ్ళు ఎవ్వరిని పట్టించుకోకండి మనకి జువాలజీ ల్యాబ్ ఉందనుకోండి అక్కడికి అసలు ఏమాత్రం చదువుకోని అతను ఒకతను వచ్చి ఛి ఛి ఛిఛి పుర్రెలు ఏమిటి అస్తి పంజరాలు ఏమిటి ఇలాంటి వాటిల వల్ల ఎవరు చదువుకోవట్లేదు ఇవన్నీ క్షుద్ర పూజలు అన్నాడు అనుకోండి అతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడికి శాస్త్రం తెలియదని అర్థం ఇక్కడ కూడా ఏమిటంటే ఇలాంటి స్వరూపాలు అర్థం కావాలి అంటే ఆ ఉపాసన ఏమిటి ఆ సాంప్రదాయం ఏమిటి అమ్మవారు ఏమిటి అవన్నీ తెలియాలి ఉపాసకులకు మాత్రమే తెలిసే మహావిద్య అసలు ఒక్కసారి ఆలోచించండి ఏదైనా శిరస్సు అలా ఖండించి చేతిలో పట్టుకుంటే రక్తధారని తాగడం అనేది జరుగుతుందా అలా చూపించారు అంటే అందులో ఏదో రహస్యం ఉంది ఆ రూపంలో మర్మం ఉంది అని తెలుస్తుంది కదా ఇంతకీ దీన్నే సహస్రార విద్య అని పిలుస్తారు. ఆ కింద ఉన్న జంట ఎవరు అంటే ఇంద్రియ నిగ్రహం పాటిస్తేనే సిద్ధించే విద్యది అందుకే మన్మధుడిని రతిదేవిని అమ్మవారు కాలు క్రింద తొక్కి పెట్టినట్టుగా ఉంది. అలాగనే కుండల్ని సాధకులకి తెలుసున్నది ఇడా పింగళ సుషుమ్న అనేది తెలుసు కదా వెన్నుపూసకి మధ్యలో సుషుమ్న శక్తి ఉంటుంది అటు ఇటు ఇడా పింగళ అని రెండు నాడులు ఉంటాయని ఈ కుండల్ని సాధకులందరికీ కూడా అవి తెలుసు కొంతమందికి అనుభవం కూడా అవుతూ ఉంటుంది. దానికి సంకేతమే ఆ మూడు ధారలు అన్నమాట అసలుండి మొత్తానికి సినిమాల్లో ఇటువంటివి చూపించడం వల్లన అందరూ ఉత్సాహంగా అది ఏమిటి అని అడుగుతున్నారు అలా అడిగితే మా బోటి వాళ్ళకి చెప్పాలనే ఆతృత సంతోషం కూడా శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోల్ని మూడు ఛానల్స్ గా విభజించాం మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి

No comments:

Post a Comment