ఆత్మసాక్షాత్కారం పొందిన వారు సంభోగంలో పాల్గొంటే తమ ఆత్మస్థితిని కోల్పోతారా
https://youtu.be/RRWnEq32xYs?si=BRjIFrE_U8ZB8AQ7
https://www.youtube.com/watch?v=RRWnEq32xYs
Transcript:
(00:02) అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు సంభోగంలో పాల్గొంటే తన యొక్క ఆత్మజ్ఞానాన్ని కోల్పోతాడా ఇంకోసారి వినండి టైటిల్ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు సంభోగ కార్యక్రమంలో పాల్గొంటే తన యొక్క ఆత్మజ్ఞానాన్ని కోల్పోతాడా తన యొక్క ఆత్మస్థితిని కోల్పోవడం అన్నది జరుగుతుందా అనే అనే టాపిక్ మీద ఈరోజు మనం ఈ వీడియో చేయబోతున్నాం మిత్రులారా.
(00:35) సో మనం టాపిక్ లోకి వెళ్తే చాలామంది జనాలు చాలామంది సాధకులు భావించేది ఏమిటంటే ఒక వ్యక్తి ఆత్మజ్ఞానం కలిగాక ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత అతడిలో లైంగికత అన్నది ఉండది అని భావిస్తూ ఉంటారు. అంటే అతడిలో శృంగార శక్తి కామశక్తి అన్నది మిగలదు అనే తప్పుడు అపోహ ఉంటుంది. అతడు ఇంకా ఏమని తప్పుడు అపోహ ఉంటుందంటే ఈ సాక్షాత్కారం పొందినవాడు మళ్ళీ సంభోగ ఆ సాక్షాత్కార స్థితిని పొందిన తర్వాత మళ్ళీ సంభోగ కార్యక్రమంలో పాల్గొంటే అతడి సాక్షాత్కారాన్ని కోల్పోతాడు.
(01:22) లేకుంటే అతడు ఆత్మజ్ఞానం నుండి కిందికి పడిపోతాడు అజ్ఞానంలో మళ్ళీ పడిపోతాడు అనే తప్పుడు అపోహ జనాలల్లో సాధకులల్లో ఉంది. చాలామంది సాధకులు ఆ విధంగానే భావిస్తారు మిత్రులారా ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి తను అనేక సంవత్సరాలు సాధన చేసి ఆత్మ జ్ఞానం సిద్ధించింది అని ఉదాహరణ తీసుకోండి. సరే అతడికి ఆత్మజ్ఞానం కలిగింది.
(01:54) ఈ ఆత్మజ్ఞానం కలిగాక అతడు మిగతా మనుషుల మాదిరిగా అంటే మిగతా సమాజంలో ఉన్న జనాల మాదిరిగా అతడు అతడిలో ఆ లైంగిక వాంచ ఆ సంభోగ కార్యక్రమం దానికి సంబంధించిన ఆ లైంగిక శక్తి అన్నది అతడిలో ఉండదు అని మీరు భావిస్తున్నారా? ఆ విధంగా భావిస్తున్నారంటే మీరు అత్యంత పొరపాటుగా భావిస్తున్నారని నేను మీకు తెలపగలను. కారణం సాక్షాత్కారం కలిగిన తర్వాత అతడిలో లైంగిక శక్తి అంతరించదు.
(02:28) అతడి దేహం యదామాదిరిగా అందరి దేహాలలో ఉన్న మాదిరిగానే అతడిలో కూడా లైంగిక శక్తి అన్నది ఉద్భవిస్తుంది ఉంటుంది మిత్రులారా ఈ తప్పుడు అపోహలను మీరు పెట్టుకోకూడదు. ఎంత తప్పుడు అభిప్రాయంతో జనాలు ఉన్నారంటే సాధకులు ఉన్నారంటే ఒక సాక్షాత్కారం పొందినవాడు సాక్షాత్కారం పొందిన తర్వాత ఇక అతడు ఎన్నటికీ ఆ సంభోగ కార్యక్రమంలో పాల్గొనడు ఒకవేళ అతడు పాల్గొంటే ఇక అతడు సాక్షాత్కారమే పొందనట్టు అని భావిస్తూ ఉంటారు.
(03:05) ఇక వాడు గురువు ఏమిటి? అసలు వాడు సాక్షాత్కారం పొందడం ఏమిటి? ఆ సంభోగ కార్యక్రమంలో పాల్గొనేవాడు సాక్షాత్కారం పొందినట్ట అని చాలామంది భావిస్తూ ఉంటారు అది పెద్ద తప్పు పొరపాటు శరీర ధర్మం అన్నది చేంజ్ కాదు సాక్షాత్కారం పొందిన తర్వాత కానీ మిత్రులారా ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఈ లైంగిక చర్యలో అంటే ఏదైతే సంభోగ కార్యక్రమంలో పొందే క్షణకాల అత్యున్నతమైన ఆనందం ఉంటుంది కదా మిత్రులారా దానికంటే ఉన్నతమైన ఆనంద స్థితిని ఆత్మ స్థితిని అతడు శాశ్వతానందాన్ని అనుభవిస్తాడు కాబట్టి అతడు ఉన్నతమైన ఆనంద స్థితిలోనే ఉంటాడు అత్యున్నతమైన ఆనందం శాశ్వతానందం ఆ ఆత్మ
(03:54) స్థితిలోనే ఉంటాడు అతడు తిరిగి ఈ క్షణకాల సుఖానికై ప్రయత్నించడు అంటే అత్యున్నతమైన ఆనందాన్ని నువ్వు రుచి చూస్తున్నప్పుడు దానికంటే తక్కువ స్థాయికై నువ్వు ప్రయత్నించావురు కదా మిత్రులారా సో అలాగే ఆత్మజ్ఞాని కూడా ఈ సంభోగ కార్యక్రమం వైపు కదలడు తను అత్యున్నతమైన శాశ్వతానందం పొందినవాడు అంటే అన్నిటికంటే గొప్ప ఆనందం ఏమిటి శాశ్వతానందం ఏమిటి అది ఆత్మజ్ఞానమే ఆత్మస్థితియే ఆ స్థితిని పొందినవాడు తన దానికంటే తక్కువ స్థితి తక్కువ మెట్టుకు అడుగు వేయడు కదా మిత్రులారా సో ఆత్మజ్ఞాని ఎన్నటికీ ఈ లైంగిక వాంచ వైపు కదలడు కానీ ఇక్కడ మీరు ఈ యొక్క విష
(04:36) విషయాన్ని మీరు చాలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడనే ఏమిటంటే మిత్రులారా ఒక సాక్షాత్కారం పొందినవాడు తను తలచుకుంటే ఈ యొక్క సంభోగ కార్యక్రమంలో పాల్గొనగలడు ఆ పాల్గొన్న తర్వాత అతడి ఆత్మజ్ఞానం అన్నది పడిపోవడం అన్నది ఉండదు తన యొక్క సాక్షాత్కార స్థితిని కోల్పోవడం అన్నది ఉండదు ఇది తప్పుడు అపోహ తలచుకుంటే ఒక బుద్ధి బుద్ధుడు తిరిగి సంభోగ కార్యక్రమంలో పాల్గొనగలడు.
(05:10) ఒక రమణుడైనా రామకృష్ణుడైనా ఆ ఆత్మస్థితిని పొందిన వారు ఎవరైనా వారు ఒక ఫన్ గా అంటే లైంగిక వాంచను ఒక ఫన్ గా దాన్ని వారు తిరిగి సంభోగ కార్యక్రమంలో పాల్గొన కలరు ఆ పాల్గొన్న తర్వాత వారు సాక్షాత్కారం కోల్పోవడం అన్నది ఉండదు. సో ఇది మీరు గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ ఏమిటంటే సాక్షాత్కారం పొందినవాడు ఇటువైపు కదలడు.
(05:36) కానీ అతడు నిర్ణయించుకుంటే అతడు ఎస్ నేను సంబోక కార్యక్రమంలో పాల్గొనాలని అతడు భావిస్తే పాల్గొనవచ్చు దాని ద్వారా ఎటువంటి నీ యొక్క ఆత్మ స్థితి పడిపోవడం అన్నది ఉండదు. కానీ జనాలు ఏమని భావిస్తారు, సాధకులు ఏమని భావిస్తారు? ఒక సాక్షాత్కారం పొందిన ఒక ఒక ఋషి సంభోగ కార్యక్రమంలో పాల్గొన్నాడని అతడు తెలియ తెలియబడితే ఇక వాడేమి స్వామి వాడేమి ఋషి అసలు వాడిదేమి సాక్షాత్కారం వాడు పరమ దుర్మార్గుడు అనే నింద వేయడం జరుగుతుంది మిత్రులారా అది అత్యంత తప్పు అత్యంత శుద్ధ అబద్ధం చాలామంది మనకు అనేక సంవత్సరాలుగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ యొక్క లైంగిక చర్య సంభోగ కార్యక్రమాన్ని
(06:20) ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు శత్రువుగా చూపడం జరిగింది. అది అత్యంత తప్పు మిత్రులారా అత్యంత పాపం కూడం. ఎందుకంటే ఉన్నది ఒకటే శక్తి అది కింది వైపు ప్రవహించినప్పుడు అది లైంగిక శక్తి అవ్వడం జరిగింది. అదే శక్తి నీ యొక్క చైతన్యం ఉన్నత స్థితికి పై స్థాయికి కదిలినప్పుడు అదే ఆత్మ జ్ఞానం అయింది, ఆత్మ సాక్షాత్కారం అయింది.
(06:47) అంటే ఒకే శక్తికి ఇవి నిచ్చనలు. కింది మెట్టులో ఉన్నప్పుడు అది లైంగిక వాంఛ అయింది. అదే పై మెట్టుకు చేరుకున్నప్పుడు అది ఆత్మ సాక్షాత్కారం అయింది. అంటే ఒకే శక్తిలో ఉన్న ఈ యొక్క నిచ్చనలు ఈ యొక్క మెట్లు అంతేకానీ లైంగిక శక్తి సపరేట్ గా ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి, ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆ శక్తి సపరేట్ గా ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీరు పొరపాటు పడ్డట్టే సృష్టిలో ఉన్నది ఒకటే శక్తి కానీ అది భిన్న రకాలుగా వ్యక్తపరచుకుంటుంది.
(07:24) అనేక రూపాలలో తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. ఒక రూపంలో లైంగిక చర్య ఒక సంభోగ చర్యగా అది తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. అదే శక్తి ఉన్నత దశలకు చేరుకున్నప్పుడు అదే ఆత్మజ్ఞానంగా తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. సో మిత్రులారా ఈ యొక్క ఈ యొక్క అపోహ తప్పు సాక్షాత్కారం పొందిన వాడు అసలు లైంగిక ఆ సంభోగ కార్యక్రమంలోనే పాల్గొనకూడదు అని మీరు నిర్ణయించడం మూర్ఖత్వం ఆ విధంగా నిర్ణయించేవాడు ఎన్నటికీ ఆధ్యాత్మికతను ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడు.
(08:02) సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా ఒక బుద్ధత్వ స్థితిని పొందినవాడు సంభోగ కార్యక్రమంలో పాల్గొనే ఆ చర్య అలాగే ఒక సామాన్యుడు ఈ ప్రాపంచికులు సంభోగ కార్యక్రమంలో పాల్గొనే చర్య చాలా డిఫరెంట్ గా ఉంటుంది గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రాపంచికుడి యొక్క సంభోగ చర్య ఏ విధంగా ఉంటుంది కేవలం నేను అన్న అహం మాత్రమే ఉంటుంది నా యొక్క వాంఛ నా యొక్క ఆనందం నా యొక్క సుఖం అని ఆ యొక్క అంటే తను మాత్రమే తను మాత్రమే ప్రాధాన్యతను సంతరించుకుంటాడు అంటే నేనే ముఖ్యం నా కోరిక నా యొక్క ఆనందం అంటే అతడి యొక్క స్థాయి అతడి యొక్క సంభోగ
(08:49) స్థాయి ఎక్కడి వరకు ఉంటుంది కేవలం శరీరం వరకే అతడు అతడు శరీరం దాటి వెళ్ళలేడు ఆ ప్రాపంచికుడు తన యొక్క సంభోగ కార్యక్రమంలో శరీర స్థాయిని దాటి వెళ్ళలేడు. కానీ బుద్దుడు ఏ విధంగా బుద్దుల యొక్క సంభోగ చర్య ఏ విధంగా ఉంటుంది అతడి యొక్క స్థాయి దేహాన్ని దాటివేసి ఆత్మ స్థాయిని చేరుకుంటుంది. అప్పుడు అతడు ఏకత్వాన్ని అనుభవిస్తాడు.
(09:14) కానీ ఈ ప్రాపంచికులు అనుభవించలేరు. సో మిత్రులారా క్వాలిటీలో డిఫరెంట్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి. ఇది చాలా సున్నితమైన అంశం దీన్ని తప్పుగా భావించకూడదు. నేను చెప్పేది ఏమిటంటే ఒక బుద్ధుడి యొక్క సంభోగ చర్యలో అలాగే ఒక సామాన్యుడి యొక్క సంభోగ చర్యలో చాలా తేడా ఉంటుంది. సామాన్యుని యొక్క సంభోగ చర్య ఎక్కడ ఏ స్థాయి వరకు ఉంటుంది కేవలం దేహం యొక్క స్థాయి వరకే.
(09:45) అందుకే అతడికి ప్రేమ అంటే ఏమిటో తెలియదు. ఏకత్వం అంటే ఏమిటో తెలియదు సామాన్యులకు. కానీ బుద్ధుడికి అలా కాదు. అతడు సంభోగ కార్యక్రమాన్ని తన యొక్క ఆత్మస్థాయికి తీసుకు వెళతాడు. దీన్నే మనం తంత్ర అంటాం కదా మిత్రులారా తంత్ర మార్గం అంటే ఏమిటి? ఒక సంభోగ కార్యక్రమాన్ని ఆత్మస్థాయికి తీసుకు వెళ్ళడం సో ఇది ఇది మిత్రులారా ఇది చాలా సున్నితమైన అంశం దీన్ని తప్పుగా భావించకూడదు.
(10:15) ఎవరైతే ఆ యొక్క సంభోగ కార్యక్రమాన్ని నీచ దృష్టితో చూస్తారో వారు ఎన్నటికీ ఆధ్యాత్మికతలో ఉన్నత దశను చేరుకోలేరు కానీ ఈ మతాలు అనబడేవి ఈ యొక్క స్వాములు సన్యాసులు అనే కొందరు మూర్ఖులు ఉంటారు కదా మిత్రులారా వారు ఈ యొక్క లైంగిక చర్యను ఈ యొక్క సంభోగ కార్యక్రమాన్ని అత్యంత పాప చర్యగా చూస్తారు. అది చాలా అజ్ఞానం మిత్రులారా సృష్టి ఎక్కడి నుండి మొదలైంది అది సంభోగ కార్యక్రమం నుండే కదా అది లైంగిక చర్య నుండే కదా దాన్ని ఎందుకు నువ్వు తప్పుగా భావిస్తావ్ అంటే నీ అనువణవు నిండి ఉన్న ఆ శక్తిని నువ్వు తప్పుగా భావిస్తూ ఉన్నావ్ అంటే నిన్ను నువ్వు తప్పుగా
(10:57) భావించుకున్నట్టే ఈ సృష్టిని తప్పుగా భావిస్తున్నట్టే ఆ పరమాత్మను తప్పుగా భావిస్తున్నట్టే ఎందుకంటే ఒకే శక్తి అది ఇది సపరేట్ శక్తి తర్వాత ఇంకోటి సపరేట్ శక్తి అనేది లేదు లేదు మిత్రులారా ఉన్నది ఒకటే శక్తి ఆ ఒకే శక్తి అనేక రకాలుగా తనను తాను వ్యక్తపరుచుకుంటుంది. కింది స్థాయిలో ఉన్నప్పుడు అది లైంగిక చర్యగా ఉంటుంది పై స్థాయికి వెళ్ళినప్పుడు అది ఆత్మజ్ఞానంగా ఉంటుంది.
(11:27) సో బుద్ధుడు ఆ బుద్ధత్వ స్థితిని పొందిన తర్వాత లైంగిక చర్య ఆ యొక్క సంభోగ చర్య చేయడం వలన తన బుద్ధత్వాన్ని కోల్పోడు. కానీ మిత్రులారా ఇక్కడ గమనించండి ఒక సంభోగ చర్య ద్వారా నీ యొక్క బుద్ధత్వాన్ని కోల్పోవడమే జరిగితే ఇక బుద్ధత్వం దాన్ని శక్తివంతమైనది అనగలమా ఒక ఆత్మ సాక్షాత్కారాన్ని అది శక్తివంతమైనది అని అనగలమా ఒక చిన్న సంభోగ కార్యక్రమం ద్వారానే అది పడిపోయే అంటే అది కోల్పోబడితే ఇక దాన్ని శక్తివంతమైనది అనలేము దాన్ని శాశ్వతమైనది అనలేము మనం కానీ మహాపురుషులు ఏమన్నారు అది శాశ్వతమైన ఆనందం ఎందుకంటే అది కోల్పోబడడం అన్నది ఉండదు అది అసలు అది కొత్తగా పొందేది కాదు
(12:15) అది అజ్ఞానిలో కూడా ఉంది ఆ యొక్క ఆత్మ స్థితి అజ్ఞానిలో ఉంది జ్ఞానిలో ఉంది కానీ అజ్ఞాని దాన్ని దాని యొక్క ఎరుక లేదు కానీ జ్ఞానికి దాని యొక్క ఎరుకను గుర్తించడం జరిగింది సో మిత్రులారా అది కోల్పోబడేది కాదు కారణం అది కొత్తగా ఏర్పడేది కాదు అది శాశ్వతం ంగా ఉంది దానికి ఆద్యంతాలు లేవు. సో సాక్షాత్కారం అన్నది ఒక్కసారి నీకు దాని ఎరుక కలిగిన తర్వాత అది ఇక నువ్వు ఏమి చేసినా అది కోల్పో పడడం అన్నది ఉండదు.
(12:48) కొందరు అజ్ఞానులు మాత్రమే ఇటువంటి తప్పుడు అపోహ సృష్టించడం జరిగింది. సంభోగ చర్య అన్నది ఆధ్యాత్మికతకు ఆటంకమని అది అత్యంత పాప పూరితమైనదని ఇంతటి మూర్ఖత్వాన్ని సృష్టించారంటే నువ్వు ఒక లైంగిక శక్తిని సంభోగ చర్యనే పాపం అంటే నువ్వు పరమాత్మను పాపం అంటున్నావు. ఆ పరమాత్మ శక్తి ఒక్కటే దైవశక్తి సంభోగ చర్యలో ఆ యొక్క లైంగిక శక్తి ఒక్కటే కానీ వ్యక్తీకరణలు భిన్నము స్థాయిలు మాత్రమే తేడా ఒకే నిచ్చనలో ఉన్న ఆ యొక్క మెట్లు మాత్రమే సో ఇది మీరు అర్థం చేసుకోండి మిత్రులారా మీరు ఎన్నటికీ ప్రతి మనిషి ఆధ్యాత్మికతలోకి వచ్చే ప్రతి మనిషి ఎన్నటికీ లైంగిక చర్యను ఆ యొక్క సంభోగ
(13:39) కార్యక్రమాన్ని తప్పుగా నీచంగా చూడ చూడకూడదు ఎందుకంటే అక్కడ చూశారు దాన్ని తప్పుడు దృష్టితో చూస్తున్నప్పుడు మీరు ఎన్నటికీ ఉన్నత దశలను చేరుకోలేరు. లైంగికత్వాన్ని ఆ యొక్క సంభోగ కార్యక్రమాన్ని మీరు పాపంగా చూస్తున్నప్పుడు ఎన్నటికీ మీరు పై దశలను చేరుకోలేరు. ఎందుకంటే దాన్ని నువ్వు దాని స్థాయిని దాన్ని గుర్తించినప్పుడు మాత్రమే ఉన్నత దశలకు కదలడం అన్నది జరుగుతుంది కానీ దానితో పోట్లాడుతూ దాన్ని నీచంగా ఈ మూర్ఖులు సృష్టించారు చూశారు గురువులమని స్వాములమని ఆ యొక్క ఈ మతాలు ఏర్పరిచిన ఆ మూర్ఖులు ఒక లైంగిక చర్యను ఆ సంభోగ కార్యక్రమాన్ని
(14:21) చాలా నీచంగా చూడడం జరిగింది కదా మిత్రులారా దానివల్లనే చాలామంది చాలామంది దుర్మార్గులు అయిపోయారు అంటే లైంగిక చర్యను అణచడం వలన లైంగికత్వాన్ని తప్పుడు దృష్టితో చూడడం వలన వారిలో క్రూరత్వం ఉద్భవిస్తుంది వారిలో నీచత్వాలు ఉద్భవిస్తాయి సో మిత్రులారా ఎన్నటికీ ఆ శక్తిని మనం నీచ స్థాయిలో చూడొద్దు ఉన్నది ఒకటే శక్తి అదే పరమాత్మ ఆ పరమాత్మ తనను తాను అనేక రూపాలుగా వ్యక్తీకరించుకుంటున్నాడు సో అది సంభోగ చర్యగా ఉన్నప్పుడు అది కింది స్థాయి మెట్టు అదే శక్తి ఒక ఆత్మజ్ఞానంగా నీకు కలిగినప్పుడు అది ఉన్నతమైన మెట్టు సో ఇది మిత్రులారా ఒక బుద్ధత్వం పొందినవాడు
(15:15) సంభోగ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అతడి బుద్ధత్వాన్ని కోల్పోవడం అన్నది జరగదు కానీ బుద్ధులు సహజంగా సంభోగం వైపు కదలరు. కారణం వారు ఇంకా ఉన్నతమైన ఆనందాలను రుచి చూస్తారు కాబట్టి ఆత్మజ్ఞానం శాశ్వతమైన ఆత్మ జ్ఞానం శాశ్వతమైనది అని మనం ఎందుకు అంటాం దాన్ని మించిన అత్యున్నతమైన ఆనందం ఇంకొకటి లేదు కాబట్టి నువ్వు లైంగిక చర్య ద్వారా ఆ సంభోగ కార్యక్రమం ద్వారా పొందే ఆ యొక్క సుఖం కేవలం క్షణక్యం క్షణకాలమే ఉంటుంది.
(15:47) సో అది ఆత్మ జ్ఞానంతో పూల్చదగినది కాదు కానీ దాన్ని నీచ స్థాయిలో చూడకూడదు. ఒక విధంగా మిత్రులారా సంభోగ కార్యక్రమంలోనే నువ్వు ఏకత్వాన్ని క్షణకాలం రుచి చూడడం జరుగుతుంది. అంటే కొన్ని క్షణాల పాటు నువ్వు ఆ యొక్క సమాధి రుచి నీకు తెలుస్తుంది అది లైంగిక చర్యలో సో ఆ యొక్క అనుభవం నీకు కలిగిన తర్వాత నువ్వు ఉన్నత దశ వైపు కదలడం జరుగుతుంది. కనుక ఈ యొక్క సంభోగ కార్యక్రమాన్ని ఎన్నటికీ నీచంగా చూడకూడదు.
(16:20) సో మిత్రులారా ఈ యొక్క సున్నితమైన అంశం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. తలచుకుంటే బుద్ధుడు సంభోగ కార్యక్రమంలో పాల్గొనగలడు. దానివలన అతడి బుద్ధత్వానికి ఎటువంటి ఎఫెక్ట్ కలగదు. సో మిత్రులారా ఇది నేను మీకు తెలియపరచాలనుకున్నాను. దీన్ని మీరు తప్పుడు దృష్టితో చూడకండి మిత్రులారా ఇది మనం చర్చించుకోవాల్సిన విషయం చాలామంది నీచ దృష్టితో చూస్తూ ఉంటారు అది తప్పు ఆధ్యాత్మికతలో అత్యంత ముఖ్యమైన అంశం ఇది లైంగికత్వాన్ని ఆ యొక్క సంభోగ కార్యక్రమాన్ని మనం నీచ స్థాయిలో చూడకూడదు నీచ దృష్టితో చూడకూడదు మీరు ఒకసారి సృష్టి అనువణవు గమనించండి
(17:07) ఉన్నది అదే శక్తి కదా ఒక చెట్టు తను మొలకెత్తు తతుందంటే ఒక పువ్వు వికసిస్తుంది అంటే ఇదంతా మీరు ఏమని చూస్తున్నారు ఇదంతా ఆ ఒకటే శక్తి దాని కామశక్తి అనవచ్చు కానీ ఆ చెట్లు ఆ విధంగా వికసించినప్పుడు దాన్ని నువ్వు కామశక్తి అని భావించవు ఆ ఎరుక నీకు తెలియదు సో మిత్రులారా కానీ అది లైంగిక చర్యనే సృష్టి అన్నది లైంగిక చర్య ద్వారానే ఉద్భవిస్తుంది కానీ మనం అక్కడనే ఆగిపోకూడదు ఆ యొక్క మెట్టు దగ్గరనే ఆగిపోకూడదు దానికంటే ఉన్నతమైన దశలు ఉన్నాయని గుర్తించాలి అటువైపుగా కదలాలి అప్పుడు మాత్రమే మనం ఆత్మస్థాయికి చేరుకోగలం.
(17:49) సో మిత్రులారా మనము ఎక్కడ దేన్ని తప్పుగా చూడకూడదు ప్రతిదానికి దానికి అంటూ ఒక స్థానం ఉంటుంది. సో లైంగికత్వానికి దానిది అంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది అలాగే బుద్ధత్వానికి దాని యొక్క స్థాయి దానికి ఉంది. సో ఇది మిత్రులారా ఎవడైతే ఆ యొక్క లైంగిక చర్యను ఆ యొక్క సంభోగాన్ని నీచంగా చూస్తాడో వాడు ఎన్నటికీ ఆత్మ సాక్షాత్కారం పొందలేడు.
(18:18) సో ఇది మిత్రులారా నా యొక్క ఎక్స్ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు
No comments:
Post a Comment