Pasupula Pullarao...8919291603... పూర్వకాలంలో ముక్తి మోక్షం కొరకు సంసారాన్ని వదలి అడవుల్లోకి వెళ్లి ముక్కు మూసుకొని తపస్సు చేసేవారు.
అటు తర్వాత అధ్యాత్మిక రంగంలో కొందరి గురువులు ద్వారా కొంత ప్రచారం జరిగినా కూడా ఆ సత్యాలు కొందరికే అర్థం అయ్యేవి...
ప్రస్తుతం బ్రహ్మర్షి పత్రీజీ గురువు గారు మరణం లేని మీరు పుస్తకం చదవడం ద్వారా బుద్ధ ప్రభోధిత ఆనా పాన సతి మార్గాన్ని శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన మార్గాన్ని విస్తృతంగా ప్రచారాలు చేస్తూ తన శిష్యులు అందరిని గురువులుగా తీర్చి దిద్ధడమే కాకుండా అనేక విధాలుగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మరియు ధ్యాన జగత్,PMC ఛానల్ ద్వారా ధ్యాన సాధన మార్గాన్ని పండిత, పామరులకు అర్ధం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ చివరిగా ఎవరి శ్వాస వారి వారి యొక్క గురువుని శ్వాస గురువును పట్టుకుంటే చాలు సర్వం సకలం నేర్పుతుంది అని,నాడీమండలం శుద్ది జరిగి జన్మ జన్మల రాబోయే జన్మల చెడు కర్మలు దగ్దం చేసుకోవచ్చని తెలిపారు... అందుకే ధ్యానానికి ప్రపంచ వ్యాప్తంగా అంతటి ఆదరణ.. అంతరంగం లో తిస్ట వేసిన సమస్త సమస్యలు ఒకే ఒక్క ఙ్ఞాన జ్యోతి ద్వారా మటుమాయం... ఇంకెందుకు ఆలస్యం వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టీ శ్వాస మరియు అలోచనలు లేని స్థితికి చేరుకోవడం, అనంతమైన విశ్వ మయ ప్రాణ శక్తిని పొంది విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు భాగస్వామ్యాన్ని కల్గి ఉండండి.
No comments:
Post a Comment