Thursday, January 1, 2026

బాడీ ఫాక్ట్స్ Human Body facts #facts #factsintelugu #telugufacts #humanbodyfacts #bodyfacts #facts

బాడీ ఫాక్ట్స్ Human Body facts #facts #factsintelugu #telugufacts #humanbodyfacts #bodyfacts #facts

https://youtu.be/9pZxnK66PVQ?si=cNnD3H1zLUXK1qtb


https://www.youtube.com/watch?v=9pZxnK66PVQ

Transcript:
(00:00) మీకు రెండో బ్రెయిన్ ఉందని తెలుసా అది ఎక్కడుందో తెలుసా మీరు లవ్ కెమికల్స్ గురించి విన్నారా స్వచ్ఛమైన చెమట వాసన వస్తుందా రాదా మన కన్నీళ్లు ఎన్ని రకాలో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ మన ఛానల్ లో చేసిన హ్యూమన్ బాడీ ఫాక్ట్స్ వీడియో కి పార్ట్ట గా ఈరోజు మనం మన శరీరం గురించి ఇంకొన్ని క్రేజీ ఫాక్ట్స్ తెలుసుకుందాం.
(00:34) వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ ఫాక్ట్స్ తెలుసుకున్నాక మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చెమట వాసన ఎందుకు వస్తుంది? మన చెమట బ్యాడ్ స్మెల్ వస్తుంది కానీ నిజం చెప్పాలంటే స్వచ్ఛమైన చెమటకి వాసన ఉండదు. చెమట చర్మ గ్రంధుల ద్వారా బయటికి వచ్చినప్పుడు చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో కలిసిన తర్వాత ఆ దుర్వాసన వస్తుంది. సో చెమట వాసన రావడానికి అసలు కారణం చర్మంపై ఉండే బ్యాక్టీరియా అని చెప్పాలి.
(01:10) మన బ్రెయిన్ నిజంగా మల్టీ టాస్కింగ్ చేస్తుందా? మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి ఒక్క పని కాకుండా రెండు కన్నా ఎక్కువ పనులు చేయటం అయితే మన బ్రెయిన్ నిజానికి ఒకేసారి రెండు పనులు చేయలేదు. చాలా ఫాస్ట్ గా పనులు మారుస్తూ ఉంటుంది. అందుకే ఫోన్లో రీల్స్ గాని షాట్స్ గాని స్క్రోల్ చేస్తూ ఏదైనా పుస్తకం చదివితే ఆ చదివిన మేటర్ మనకి గుర్తుండకపోవచ్చు.
(01:43) చాలామంది ఒకేసారి చాలా పనులను చేయగలమని గర్వంగా చెప్పుకుంటారు. నిజం చెప్పాలంటే అలా చేయటం వల్ల వారు వారి బ్రెయిన్ పై ఎక్స్ట్రా లోడ్ పెడుతున్నారు. లవ్ కెమికల్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మనం ఎవరినైనా ఇష్టపడటం మొదలు పెడితే బ్రెయిన్ లో డోపమైన్ ఆక్సిటోసిన్ సెరిటోనిన్ వంటి కెమికల్స్ విడుదల అవుతాయి. అందుకే మనకి ఆ ప్రేమ భావాలు ఎక్కువయ్యే కొద్దీ వరల్డ్ అంతా కలర్ఫుల్ గా కనిపిస్తుంది.
(02:17) ప్రేమలో ఉన్నవారు గాలిలో తేలినట్టు ఉండటానికి అసలు కారణం బ్రెయిన్ లో విడుదలయ్యే ఈ లవ్ కెమికల్స్ే మీకు తెలుసా మన బ్రెయిన్ కి ఒక కూలర్ ఉందని ఎస్ మీరు విన్నది నిజమే మనకి బోర్ కొట్టినా మనం అలిసిపోయినా ఆవులింపు వస్తుంది ఒక థియరీ ప్రకారం ఆవులింత ద్వారా బ్రెయిన్ కి ఫ్రెష్ ఎయిర్ సప్లై పెరిగి టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది.
(02:50) అయితే ఆవులింపు అంటు వ్యాధి లాంటిది. మన పక్కవారు ఆవలిస్తే మనకి కూడా కంట్రోల్ లేకుండా ఆవలింపు వచ్చేస్తుంది. మీకు ఈ విషయం తెలుసా? మన మెథడ్ కొన్నిసార్లు ఘోస్ట్ పెయిన్ ని క్రియేట్ చేస్తుంది. యక్సిడెంట్ వల్లో మరే ఇతర కారణం వల్లో చేతులు కానీ కాళ్ళు గాని తొలగించిన తర్వాత ఆ అవయవం ఇంకా ఉన్నట్టుగా నొప్పివేయడం ఈ ఫినామినన్ ని ఫాంటం లింపెన్ అంటారు.
(03:20) దీనికి కారణం బ్రెయిన్ లో ఉన్న బాడీ మ్యాప్ అవయవం పోయిన తర్వాత కూడా బ్రెయిన్ మ్యాప్ మాత్రం అలాగే ఉండిపోతుంది. పుట్టిన పిల్లలకి నీ క్యాప్స్ మోకాలి చిప్పలు ఉండవని మీకు తెలుసా? నిజమే అప్పుడే పుట్టిన పిల్లలకి నీ క్యాప్స్ ఉండవు. అది సాఫ్ట్ కార్టిలేజ్ రూపంలో ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అది ఆసిఫై అయ్యి ఎముకలా మారుతుంది. పిల్లలకి పెద్దవాళ్ళ కన్నా ఎక్కువ రుచులు తెలుస్తాయని మీకు తెలుసా? చిన్న పిల్లల నాలుక మీద టేస్ట్ బడ్స్ ఎక్కువగా ఉంటాయి.
(03:56) వాళ్ళు కొన్ని రుచులకు చాలా సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతారు. టేస్ట్ బడ్స్ ఎక్కువగా ఉండటం కారణంగా చిన్న పిల్లలు గాటైన రుచులను తట్టుకోలేరు ఏడ్ చేస్తారు. మనం టెన్షన్ లో ఉన్నప్పుడు మన గుండె తన వేగాన్ని పెంచేసుకుంటుంది. మనం అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు అడ్రనల్ హార్మోన్స్ పెరిగి హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ దూసుకుపోతాయి. మన పూర్వీకులకి ఏదైనా క్రూర మృగం ఎదురైనప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే పోరాడడమా లేక పారిపోవడమా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వారు కరెక్ట్ గా నిర్ణయం తీసుకొని బతికి బట్ట కట్టేందుకు మన బాడీ గుండె వేగాన్ని పెంచి వారు సరైన
(04:45) నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. కానీ ఇవాల్టి రోజుల్లో మనం క్రూర మృగాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి మన గుండె ఆఫీస్ టెన్షన్స్ కి ఎగ్జామ్స్ వత్తిడికి ఈఎంఐ వాయుదాలు కరెక్ట్ గా కట్టడానికి ఇంకా అనేక ఒత్తిడిలను తట్టుకోవడానికి తన వేగాన్ని పెంచుకుంటుంది. మన బ్రెయిన్ మనకు ఫేక్ మెమరీస్ అంటే నిజంగా జరగని జ్ఞాపకాలను ఇస్తుంది.
(05:13) మనకి 100% నిజం అనిపించే కొన్ని జ్ఞాపకాలు నిజానికి పూర్తిగా యక్యురేట్ కాకపోవచ్చు. మన బ్రెయిన్ మన ఊహల్ని మనం విన్న కథల్ని మన నిజమైన జ్ఞాపకాల్ని అన్నీ కలిపి ఒక ఎడిటెడ్ వెర్షన్ క్రియేట్ చేస్తుంది. ఒక విషయం జరిగినప్పుడు అక్కడ ఉన్న ఇద్దరిని కొన్ని సంవత్సరాల తర్వాత పిలిచి ఆ రోజు అక్కడ ఏం జరిగిందని అడిగితే వారు ఇచ్చే సమాధానాలు వేరువేరుగా ఉంటాయి.
(05:41) మన శరీరంలో బ్యాక్టీరియా ఎంత ఉంటుందో తెలుసా? మన బాడీలో బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ ట్రిలియన్స్ సంఖ్యలో ఉంటాయి. ఒక్క ట్రిలియన్ అంటే లక్ష కోట్లు మన బాడీలో ఉన్న ఈ బ్యాక్టీరియా మైక్రో ఆర్గనిజమ్స్ ని కలిపి మైక్రోబియం అంటారు. అయితే బ్యాక్టీరియా పేరు వినగానే భయపడిపోవాల్సిన పని లేదు. మన బాడీలో ఉండే మంచి బ్యాక్టీరియా మన డైజెషన్ కి ఇమ్యూనిటీకి విటమిన్స్ తయారీకి చాలా ఉపయోగపడతాయి.
(06:11) మనకున్న రెండో బ్రెయిన్ గురించి మీకు తెలుసా మన ప్రేగులు ఇంటెస్టైన్స్ లో దాదాపు వేల కొద్ది నర్వ్స్ ఉంటాయి. ఆ ప్రేగుల్లోనే కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే మనం కొన్నిసార్లు నా గట్ ఫీలింగ్ చెబుతుంది అని చెప్పుకోవడానికి శాస్త్రీయంగా ఇదే ఆధారం. శాస్త్రవేత్తలు గట్ బ్రెయిన్ ఆక్సిస్ అనే ఒక నెట్వర్క్ ద్వారా ప్రేగులకి బ్రెయిన్ కి డైరెక్ట్ సంబంధం ఉందని నిరూపించారు.
(06:38) ఒక్క ఊపిరి తిత్తిలో మిలియన్ల సంఖ్యలో ఎయిర్ సాక్స్ ఉంటాయని మీకు తెలుసా మన లంగ్స్ ఊపిరితిత్తులలో చిన్న చిన్న పూసల్లా ఉండే వాటిని ఆల్వియోలే అంటారు. వీటి సంఖ్య మిలియన్స్ లో ఉంటుంది. ఇవే మనం శ్వాసించే గాలిలో ఆక్సిజన్ కార్బన్ డైాక్సైడ్ ను వేరు చేసేందుకు ఉపయోగపడతాయి. మనకు వచ్చే కన్నీళ్లు ఎన్ని రకాలో మీకు తెలుసా మన కళ్ళ నుంచి వచ్చే కన్నీళ్లు ప్రధానంగా మూడు రకాలు మన కళ్ళు పొడిబారకుండా రక్షించే బాసల్ టియర్స్ మొదటి రకం ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు లేదా పొయ్యి దగ్గర పొగ తగిలినప్పుడు వచ్చే కన్నీళ్లు రిఫ్లెక్స్ టియర్స్ ఇవి రెండో రకం భావోద్వేగాలు ఎమోషన్స్ వల్ల వచ్చే
(07:20) కన్నీళ్లు ఎమోషనల్ టియర్స్ ఇవి మూడో రకం మన బ్రెయిన్ లో ఎలక్ట్రిసిటీ వర్క్ నిరంతరం జరుగుతూ ఉంటుందని అని మీకు తెలుసా? మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ మధ్యలో జరిగే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కారణంగా మన బాడీ పార్ట్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. మన బ్రెయిన్ ని స్కాన్ చేసి చూస్తే మన ఆలోచనా విధానాలు మన భావోద్వేగాలు ఇవన్నీ ఒక మెరుపు ప్రళయంలా కనిపిస్తాయి.
(07:45) బ్రెయిన్ లో కేవలం ఒక్క చిన్న భాగం డ్ామేజ్ అయితే మనం పూర్తిగా మాట్లాడలేకపోవచ్చు. మన బ్రెయిన్ లో మనం మాట్లాడే భాషను హ్యాండిల్ చేసే ఏరియాలను బ్రోకస్ ఏరియా వర్నిక్స్ ఏరియా అంటారు. ఆ ఏరియాస్ కానీ డామేజ్ అయితే మనం మాట్లాడలేకపోవచ్చు లేదా ఎదుటివారి మాటల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. బ్రెయిన్ లో ఉన్న ఆ చిన్న ఏరియాసే మనం మాట్లాడటానికి పాటలు పాడటానికి ఎదుటివారి చెప్పేది వినటానికి అర్థం చేసుకోవడానికి కారణం.
(08:18) మన శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుందని మీకు తెలుసా? మన శరీరం చిన్న చిన్న గాయాలను చర్మ పగుళ్లను కొత్త సెల్స్ టిష్యూస్ క్రియేట్ చేసుకుంటూ ఆ గాయాల్ని రిపేర్ చేసుకుంటుంది. ఇది మాన్యువల్ గా ఎవరూ చెప్పకుండానే ఆటోమేటిక్ గా బాడీ తనంతట తాను చేసుకునే ప్రక్రియ. మనం తుమ్ముతున్నాం దగ్గుతున్నాం నవ్వుతున్నాం అంటే అది మన బాడీలో కొన్ని పార్ట్స్ కలిసి చేసే పని మనం బలంగా దగ్గిన తుమ్మినా నవ్వినా మన బాడీలో ఉండే డయాఫ్రామ్ చెస్ట్ మెసల్స్ త్రోట్ చీక్స్ బ్రెయిన్ కూడా కలిసి ఒక కోఆర్డినేటెడ్ యాక్షన్ పెర్ఫామ్ చేస్తాయి. కొన్ని పరిస్థితుల్లో మనం నవ్వు
(09:00) ఆపుకోలేక పగలబడి నవ్వేస్తాం. అంటే ఆ సమయంలో మనం మన బ్రెయిన్ కంట్రోల్ చేయజారిపోయామని అర్థం. మన శరీరం నుండి కంటిన్యూస్ గా కెమికల్స్ బయటకు వస్తూనే ఉంటాయని మీకు తెలుసా మన శరీరంలో ఉండే హానికారక కెమికల్స్ చెమట యూరిన్ మరియు మన శ్వాస ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. మన శ్వాస ద్వారా కొన్ని గ్యాసెస్ చిన్న చిన్న టైనీ పార్టికల్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి.
(09:29) ఇక ఫైనల్ గా మన శరీరం ది వన్ అండ్ ఓన్లీ వన్ ఒక్కటి మాత్రమే దానికి రీప్లేస్మెంట్ లేదు. ఈ ఫాక్ట్స్ అన్ని విన్నాక మనం గ్రహించాల్సింది ఒక్కటే మన బాడీ ఒక అద్భుతమైన మెషిన్ అది ఏ ఫ్యాక్టరీలోనో కంపెనీలోనో తయారయ్యేది కాదు మనకి నచ్చకపోతే కొత్తది కొనుక్కోవడానికి లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం వేళ్ళకు నిద్రపోవడం వ్యాయామం చేయడం టెన్షన్ తగ్గించుకోవడం ఇవేగా మనిషికి నిజమైన ఆస్తులు ఇవి చేస్తేనే మన బాడీకి మనం అసలైన గౌరవం ఇచ్చినట్టు సో ఫ్రెండ్స్ మనిషి శరీరంలో జరిగే అద్భుతమైన క్రేజీ ఫాక్ట్స్ గురించి చెప్పే ఈ పార్ట్ట వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ
(10:08) ఫాక్ట్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకో డిఫరెంట్ ఫాక్ట్స్ వీడియో మిస్ కాకుండా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని గట్టిగా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ ఫాక్ట్స్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్

No comments:

Post a Comment