Osho Philosophy: Sex Energy Transformation from Lust to Love | Telugu Podcast
https://youtu.be/xAaBQSrn-R8?si=oAPfhNiOtKB66Zt9
https://www.youtube.com/watch?v=xAaBQSrn-R8
Transcript:
(00:03) కొంచెం పచ్చిగా మాట్లాడుకుంటే సెక్స్ అంటే ఏమిటి? ఒక మేల్ ఫీమేల్ ఫిజికల్ అవ్వడమా లేదా కోరిక తీర్చుకునే అవసరమా? సెక్స్ అనేది నీలో దాగుడు మూతలాడే ఒక పవర్ లాంటిది. ఆ పవర్ ప్రతి ఒక్కరిలో ఉంటూ అదే నిన్ను ఇంకో తరాన్ని బ్రతికిస్తుంది. అది ఆ పవర్ బయటకు కనిపించే మొదటి రూపం. సెక్స్ అందుకే ఫస్ట్ అని కూడా అనవచ్చు.
(00:33) ఆ పవర్ రూపం మార్చుకునేలా చేస్తుంది. ఏ పిల్లవాడైనా చిన్నతనంలో చురుగ్గా మంచి హుషారుగా తెలివిగా ఉంటాడు. ఆ స్టేజ్ లో వాళ్ళకి ఆ పవర్ అలానే యూస్ అవుతుంది. అలానే అదొక ఆటగా కనిపిస్తూ పరుగులుగా నవ్వులుగా కనిపిస్తుంది. బట్ కొంచెం అడల్ట్ అవ్వగానే మన బాడీలో రక్తం ఉడికెత్తుతూ పరుగులు పెడుతూ ఆ రక్తాన్ని కూల్ చేయడానికి ఇంకో బాడీ కోసం అట్రాక్ట్ అవుతుంది.
(01:04) ఈ ప్రాసెస్ లో ఆ పవర్ రూపం మార్చుకుని సెక్స్ గా మారుతుంది. బట్ పవర్ అనేది మారలేదు. దాని రూపం మాత్రమే మారింది. ఎగజాక్ట్లీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అడల్ట్ లో ఉన్న పర్సన్ పల్లెటూరిలో తనకు తగ్గట్టు ఉండేవాడు. లైక్ డ్రెస్సింగ్ స్టైల్ గాని మాట తీరు గాని ఫ్రెండ్స్ గాని అన్నీ తన ఊరికి తగ్గట్టుగానే ఉండేవాడు. బట్ అదే పర్సన్ పల్లెటూరి నుండి సిటీలోకి వస్తే అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి అన్నీ మార్చుకుంటాడు.
(01:36) అంటే తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి వేసే చెప్పుల వరకు మొత్తం మారిపోతాయి. ఇక్కడ పిల్లవాడికి ఒక అవగాహన ఉంది. ఎక్కడ ఎలా ఉండాలి అని అదేవిధంగా మనలో ఒక పవర్ ఏజ్ ను బట్టి రూపం మార్చుకుంటూ ఒక స్టేజ్ లో సెక్స్ గా మారి మనలో ఉండే కోరికల్ని బయటకు పడేలా చేస్తాయి. బట్ మనం ముందుగానే దాన్ని అబ్సర్వ్ చేసి ఇక్కడ అవగాహన లేకపోతే ఆ పర్సన్ దానికి బానిసగా మారతాడు.
(02:04) అదే ఆ పల్లెటూరి నుండి వచ్చిన పిల్లవాడిగా ఉంటే ఆ పవర్ వేరే విధంగా యూస్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని చూస్తే నీ లోపల ఉన్న శక్తికి అవగాహన ఒక క్లారిటీ లేకపోతే అది శారీరంగా బయటకు వస్తుంది. అదే శక్తికి కొంచెం అవగాహన క్లారిటీ వస్తే ప్రేమగా మారుతుంది. ఇంకా డీప్ గా వెళ్లి క్వశ్చన్ చేస్తే క్రియేటివిటీగా మారుతుంది.
(02:29) పూర్తిగా దాని గురించి తెలుసుకుంటే చివరికి మౌనంగా మారుతుంది. బట్ మనుషులు ఉన్నాక ఈ చివరి స్టేజ్ వరకు రారనుకో చాలా రేర్ సరే మనం ఒక విషయం గుర్తించాలి అదేంటంటే నీలో ఉన్న పవర్ మంచిదే కాదు ఇటు చెడ్డది కాదు జస్ట్ న్యూట్రల్ గా ఉండే పవర్ అది ఒక నది లాంటిది నదినే చూసుకుంటే ఆ నది నీళ్లుు తాగిస్తాయి. అదేవిధంగా ముంచేస్తుంది. ఇక్కడ తేడా నీళ్ళల్లో లేదు.
(02:58) నీళ్ళు ఎలా వాడుతున్నాము అనే దానిలో ఉంది. అలాగే నీలో ఉన్న పవర్ ని నువ్వు అర్థం చేసుకోకపోతే అది నిన్ను బానిసలా మార్చుకొని నడిపిస్తుంది. సో అర్థం చేసుకోవాలి. సెక్స్ చేసేటప్పుడు అందరి తపన ఆ వీర్యం బయటకు వచ్చే సమయంలో ఇచ్చే మత్తు కోసం ఆ మత్తులోనే సుఖం ఉంటుంది. ఆ సమయంలో నువ్వు ఆ క్షణంలో జీవిస్తావు. అప్పుడు నువ్వు చేసే జాబ్ గుర్తుకు రాదు.
(03:24) నీ ఫ్యామిలీ నీ ప్రాబ్లమ్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేవి ఏం గుర్తుండవు. కేవలం ప్రెసెంట్ లో జీవిస్తుంటావు. అలా ఒక కొత్త అనుభూతి బాగుంటుంది. కిక్ ని ఇస్తుంది. సో దానికోసం మళ్ళీ పోరాడతావు. అందుకే నీకు అది అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. నిజానికి నువ్వు సెక్స్ ని కోరడం లేదు. నువ్వు ఆ వచ్చే పై చచ్చికి ఆనందం కోసమే ఈ తపన.
(03:49) బట్ ఇక్కడ పొరపాటు చేసేది ఆ అనుభవానికి రీజన్ బాడీ అట్రాక్షన్ అని అనుకుంటాం. లేదా ఎదురుగా ఉండే అమ్మాయి అనుకుంటావు. అందుకే నా తప్పేముందిలే అని మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తావు. ఇక్కడ మనిషి ఆగిపోతాడు. అదే పవర్ ని నువ్వు కళ్ళతో కాకుండా గమనించడం మొదలు పెడితే శరీరం నుంచి పైకి కదులుతుంది. అప్పుడు సెక్స్ ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమలో శరీరం ఉంది కానీ శరీరమే అంతా కాదు అక్కడే ఒక సున్నితత్వం కలయిక మృదుత్వం ఉంటుంది.
(04:20) బ్రేకులు వేస్తుంటారు కానీ ఆగమని కూడా చెప్పట్లేదు. కానీ అబ్సర్వ్ చేసి చూస్తే దాన్ని తిరిగేస్తే అదే సెక్స్ కాస్త క్రియేటివిటీగా మారుతుంది. అందుకే కొంతమంది పెయింటింగ్ లో మునిగిపోతుంటారు. మ్యూజిక్ లో మరిచిపోతారు. మ్యూజిక్ లో ఈ లోకాన్ని మరిచిపోతారు. రాయడంలో కాలాన్ని మరిచిపోతారు. ఇలా దాన్ని ఒక పవర్ఫుల్ వెపన్ గా మార్చుకొని క్రియేటివిటీతో లైఫ్ ని లీడ్ చేయవచ్చు.
(04:48) ఇక్కడే చెప్పలేనంత ఆనందం వస్తుంది. ఒక ప్రశాంతత ఉంటుంది. మన బుద్ధుడి జీవితం చూస్తే అతను ఒక రాజకుమారుడు అతనికి సుఖాలు లేవా భోగాలు లేవా భార్య లేదా అతనికి అన్నీ ఉన్నాయి. అతను వాటిని అనుభవించకుండా వదిలేయలేదు. వాటిని పూర్తిగా చూసిన తర్వాతే వదిలాడు. అతను ఎప్పుడూ ఇలా అనుకోలేదు. ఒకరోజు నేను గొప్పవాడిని అవుతానని సెక్స్ పాపం అని అతను చూసింది కేవలం ఇవి ఆనందం ఇస్తున్నాయి కానీ తృప్తి ఇవ్వడం లేదు అని బిర్యానీ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం.
(05:24) బిర్యానీ ముందు పెట్టి నోరుఊరుతుంది. బట్ నేను తినను తినను అని కూర్చోవడం దాన్ని త్యాగం అనరు హింస అంటారు. బిర్యానీ తిని పూర్తిగా తిని తర్వాత శరీరం చెప్పినట్టు ఇంకా చాలు అన్నప్పుడు నువ్వు తినడం ఆపేస్తే దాన్ని అవగాహన అంటాం. ఇక్కడ బుద్ధుడు చేసింది అదే. అతను కోరికల్ని అణచివేయలేదు. అతని కోరికల్ని లోతుగా అబ్సర్వ్ చేశాడు. అలా అబ్సర్వ్ చేయబట్టే బుద్ధుడయ్యాడు.
(05:52) కోరికలు స్వయంగా కరిగిపోయాయి. సో త్యాగం వల్ల జ్ఞానం రాదు జ్ఞానం వల్ల త్యాగం జరుగుతుంది. ఇక్కడ ఓషు పాయింట్ లో చెప్పాలంటే ఇటు బుద్ధుడైనా మహావీరుడైనా ఎవరైనా వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు కాబట్టే సెక్స్ వదిలారు. అంతేగాని సెక్స్ వదిలారు కాబట్టే గొప్పవాళ్ళు కాలేదు. సో ముందే సెక్స్ ని పాపం చెడు అని అనుకోవడం నీ మూర్ఖత్వం.
(06:19) దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం నీ చేతగానితనం. అక్కడే అసలైన మనిషి అంటే ఏమిటో మృగం అంటే ఏమిటో బయటపడుతుంది. ఫైనల్ గా నువ్వు సెక్స్ ని అణచి వేస్తే అది నిన్ను లోపల నుంచి నాశనం చేస్తుంది. నువ్వు సెక్స్ ని అబ్సర్వ్ చేసి అర్థం చేసుకుంటే లోపల నుంచి మారుస్తుంది. ఇట్స్ యువర్ ఛాయిస్ బ్రదర్.
No comments:
Post a Comment