227
మహిళా, ధైర్యంగా ఉండు
మీరు అడగవచ్చు, మగపిల్లలు ఆడపిల్లలకు భయపడాలా? లేదు నిశ్చయముగా లేదు. ఒకసారి నా చెల్లెలు బజారుకు పోతుండగా ఒకతను ఆమె భుజంపై చేయి వేశాడు. ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె అతని చెంపలపై కొటింది. తర్వాత ఆమె ''ఇంతమంది ఎదుటలో నేను ఎందుకు ఈ రీతిగా వ్యవహరించితిని''. అని చింతించినది. ఆమె అచటనుండి వెళ్ళిపోయింది. అతడు ముఖాన్ని వేలాడేసుకొని నిదానంగా నడచి వెళ్ళాడు. ఆడపిల్లలు వారి ధైర్యమును ప్రదర్శంచక పోయినచో, అది పిరికితనము అవుతుంది. ఇది క్రూరత్వము కాదు. మహిళలకు నా మనవి ఏమిటనగా ''ఈ ప్రపంచ ఉనికికి మీరే బాధ్యులు. తల్లిలాంటి మీరు ధైర్య మరియు సాహసంగల ప్రజలను ప్రపంచంలోకి తీసుకు రావడానికి బాధ్యులు, కనుక మీకు తప్పు చేసేవారిని దండించే హక్కు ఉంది.
అనవసరముగా ఇతరులను హింసించడంలాంటి పనులు మనము చేయరాదు అని నా అభిప్రాయము. దుశ్చర్యను నిరోధించడానికి చేసేహింస హింస కాదు. మీరు ధైర్యముగల మహిళగా ఉండాలి, తప్పుచేయువారిని దండించగలగి ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా దురుద్దేశ పూరితముగా చూచినట్లు మీకు తెలిస్తే, వారిని నాలుగు తన్నులు తన్నండి. అది సాధ్యము కాకపోతే, ఆ స్థలాన్ని వదలి వెళ్ళండి. మీరు స్పర్శకు అవకాశాన్నివ్వ రాదు. ఇది స్త్రీ మరియు పురుషులకు చెప్పు సందేశము. ఎవరు స్పర్శించుటకు అర్హులైనవారు అనగా - తల్లి, తండ్రి, సోదరుడు, భార్య, గురు లేక త్యాగులు. ఇతరులతో - వారు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు లేక పరిచయస్తులు కావచ్చు, వారితో సాధ్యమైనంత తక్కువగా మెలగాలి, దూరాన్ని పాటించాలి.
228
మనం సరియైన విద్యను పొందడం లేదు. కళా శాస్త్రము యొక్క రహస్యం మనకు తెలిసినచో, 'మదము' యొక్క పొదలో మనమెప్పుడునూ పడము. నా ఉద్దేశము ఇది విద్యలో ఒక భాగము కావలెను. కారణము ఉత్తేజ భరిత పాటలు మరియు ఉత్తేజములతో నిండిన నవలలు, ప్రతి వీధిలోను, ప్రతి సందులోను వారి ఇంద్రియవాంఛాతృప్తికై ఉర్రూతలూగు జనులు అవకాశములకై చూస్తున్నారు. వారిని మనము నాగరికులు అంటున్నాము. నాగరికత పేరు మీదగా, లెక్కలేనన్ని పైత్యాలు ప్రదర్శింప బడుతున్నాయి. మనకు మనము వైజ్ఞానిక కాలానికి చెందిన వారముగా యోచిస్తాము. దీని గురించి మనము ఆలోచించ వలసియున్నది. నిజమైన జ్ఞానం గల విద్యావంతులు ఈ విధంగానే ప్రవర్తిస్తారా?
Captured from book: విశ్వరూప దర్శనము


No comments:
Post a Comment