Sunday, March 22, 2026

కేవలం 20 నిమిషాలు = 4 గంటల గాఢ నిద్ర! | Yoga Nidra (NSDR) | Telugu Geeks

కేవలం 20 నిమిషాలు = 4 గంటల గాఢ నిద్ర! | Yoga Nidra (NSDR) | Telugu Geeks

Author Name:Telugu Geeks

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=t9d-mI4GEuo



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు రాత్రంతా ఎనిమిది గంటలు నిద్రపోతున్న సరే పొద్దున్నే లేవగానే ఇంకా అలసటగా తల బారంగా అనిపిస్తుందా? మీ బాడీ బెడ్ మీద ఉన్నా సరే మీ బ్రెయిన్ మాత్రం ఇంకా ఆఫీస్ ఫైల్స్ చుట్టూనో లేకపోతే రేపటి టెన్షన్ చుట్టూనో పరిగెడుతుందా అయితే మీకు కావాల్సింది నిద్ర కాదు యోగ నిద్ర.
(00:19) ప్రస్తుతం మనం ఉన్న బిజీ లైఫ్ లో మన మెదడు ఎప్పుడూ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లోనే ఉంటుంది. అంటే సమస్యని ఫైట్ చేయడం లేకపోతే సమస్య నుంచి పారిపోవడం అంటే ఫ్లైట్ అయిపోవడం. దీనివల్ల మన ఆఫీస్ ఇల్లు అన్ని చోట్ల కష్టాల్ని బ్రెయిన్ లో పెట్టుకొని తిరుగుతున్నాం. అండ్ ఈ టెన్షన్స్ వల్ల నిద్ర కూడా మనకి పూర్తిగా రావడం లేదు.
(00:38) అండ్ దీనివల్ల మన బాడీ రిపేర్ అవ్వడం ఆగిపోతుంది. అందుకే మీరు ఎంత నిద్రపోయినా రీచార్జ్ అవ్వలేకపోతున్నారు. కానీ ఉమా తెన్స్మోట్ టూలీ రాసిన యోగ నిద్ర మేడ్ ఈజీ పుస్తకంలో ఒక మైండ్ బ్లోయింగ్ పద్ధతిని వివరించారు. ఈ పద్ధతిని ఈ ప్రాసెస్ ని గనుక మీరు ఫాలో చేస్తే కేవలం 20 నిమిషాల్లో మీరు యోగ నిద్రని చేరుకుంటారు. మీ శరీరానికి నాలుగు గంటల గాఢ నిద్రని ఇచ్చే విశ్రాంతిని ఈ 20 నిమిషాల యోగ నిద్ర అందిస్తుంది.
(01:02) యోగ నిద్ర అంటే కేవలం నిద్రపోవడం కాదు అది నిద్రకి మెలుకువకి మధ్య ఉండే ఒక అతీతమైన స్థితి. అది మీ మెదడుని ఒక సూపర్ కంప్యూటర్ లాగా రీబూట్ చేస్తుంది. అసలు శ్రమ లేకుండా కేవలం పడుకొని మీ లైఫ్ ని మీరు ఎలా రీసెట్ చేసుకోవచ్చో ఈ పుస్తకంలో చెప్పిన తొమ్మిది అద్భుతమైన స్టెప్స్ ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం.
(01:21) ఈ వీడియో ముగిసేసరికి మీ నిద్రని ఒక మెడిసిన్ లాగా ఎలా మార్చుకోవాలో మీకు అర్థమైపోతుంది. ఇంకా ఆలస్యం చేయను. లెట్స్ స్టార్ట్. యోగ నిద్రలో మొదటి మెట్టు ప్రిపరేషన్ చాలా మంది అనుకుంటారు ఇది నార్మల్ గా బెడ్రూమ్ లో పడుకోవడం అని కానీ ఇక్కడే అసలైన సైన్స్ ఉంది. మన శరీరం ఎప్పుడూ ఎక్స్టర్నల్ ఇన్పుట్ అంటే బయట సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది.
(01:52) మీరు యోగ నిద్రలోకి వెళ్ళాలంటే మీ మెదడుకి ఒక అంగులం కూడా బయట డిస్టర్బెన్స్ ఉండకుండా చూసుకోవాలి. అందుకే ఈ స్టేజ్ లో మీరు కంఫర్ట్ జోన్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి. మీకొక విషయం తెలుసా మనం నిద్రపోయినప్పుడు మన బాడీ టెంపరేచర్ కొంచెం పడిపోతుంది. ఒకవేళ ఆ సమయంలో మీకు కొంచెం చలిగా అనిపించింది అనుకోండి మీ మెదడు వెంటనే మెలుగులోకి వచ్చేస్తుంది.
(02:11) మీరు ఆ ప్రాసెస్ నుండి డిస్కనెక్ట్ అయిపోతారు. అందుకే ఈ పుస్తకంలో ఒక చిన్న దుప్పటికి కప్పుకోమని క్లియర్ గా చెప్పారు. ఇది కేవలం వెచ్చదనం కోసం కాదు మీ మైండ్ లోతైన విశ్రాంతిలోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటానికి ఒక సెక్యూరిటీ షీల్డ్ లాగా ఈ దుప్పటి పని చేస్తుంది. అండ్ ఈ స్టేజ్లో మీరు శవాసనంలో పడుకోవాలి. మీ కాళ్ళు, చేతులు విడదీసి అరచేతులు ఆకాశం వైపు చూసేలా ఉంచాలి. అంటే ఇలా పెట్టాలి.
(02:32) ఎందుకు? మన అరచేతులు మరియు పాదాల్లో కొన్ని వేల నరాల చివర్లో ఉంటాయి అంటే నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అవి ఆకాశం వైపు ఉన్నప్పుడు మీ నాడీ వ్యవస్థ అంటే మీ న్యూరల్ సిస్టం కి ఇప్పుడు ఏ పని చేయక్కర్లేదు విశ్రాంతి తీసుకోవచ్చు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అని ఒక పవర్ ఫుల్ సిగ్నల్ మీరు ఇస్తున్నట్టు అవుతుంది. ఇది ఒక రకమైన బయో హాక్ అని ఈ పుస్తకంలో చెప్తారు.
(02:54) అండ్ ఇక్కడ మనం పాటించాల్సిన కొన్ని ప్రో టిప్స్ ఏంటంటే ఫోన్ ని సైలెంట్ లో కాదు కంప్లీట్ గా పక్క గదిలో పడేయండి. ఐ మాస్క్ అంటే కళ్ళ మీద ఒక చిన్న గుడ్డ లేదా ఐ మాస్క్ ఉంచండి. కళ్ళల్లో వెలుతురు వెళ్ళకపోతే మీ పీనియల్ గ్లాండ్ మెలటానిన్ ని రిలీజ్ చేయడం మొదలు పెడుతుంది. అలాగే నిద్రపోగానే మనసులో అనుకోండి నేను ఇప్పుడు యోగ నిద్ర చేస్తున్నాను.
(03:13) నేను మెలుకువగా ఉంటాను కానీ యోగ నిద్ర చేస్తున్నాను అని చెప్పుకోండి. మొదటి దశలో నిద్ర పోయాక రెండో దశలో మీరు చేయాల్సింది సెట్టింగ్ ఇదే స్టెప్ టు. మన బాడీ ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ ని మోస్తూనే ఉంటుంది. భుజాలు బిగబట్టడం, మన నుదుర్లో ముడతలు వేయడం మనకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ స్టేజ్ లో మీరు ఆ స్ట్రెస్ ని ఆ టెన్షన్ ని పూర్తిగా వదిలేయాలి.
(03:37) మీ శరీరం కరిగి భూమిలోకి వెళ్ళిపోతున్నట్లు మీరు భావించాలి. ఎందుకు ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం విశ్రాంతి తీసుకుంటున్నాం అని అనుకున్నప్పుడు కూడా మన మెదడు మన మజిల్స్ కి చిన్న చిన్న సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుంది. యోగ నిద్రలోని ఈ స్టేజ్ ఏంటంటే మీ బాడీ వెయిట్ ని పూర్తిగా భూమికి అంటే గ్రావిటీకి వదిలేయాలి. మీరు ఎంత బాగా భూమిలోకి వెళ్ళిపోతున్నట్లు మీరు ఫీల్ అయితే మీ మనసులో ఆలోచనలు కూడా అంత వేగంగా తగ్గిపోతాయి.
(04:03) దీనివల్ల మీ మైండ్ లోని ఎమిక్డలా అనే పార్ట్ కూల్ చేస్తుంది. అది మన భయాల్ని కంట్రోల్ చేసే సెంటర్ సో మనలో ఏ ఫియర్ ఉండదు. ఈ దశలో మీరు శబ్దాల మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ శబ్దాలని మీరు అనాలసిస్ చేయకూడదు. ఫ్యాన్ తిరిగే శబ్దం లేదా బయట వాహనాల శబ్దం వస్తుంది. ఇది కార్ సౌండ్ ఇది ఏ కార్ అయి ఉండొచ్చు swిఫ్ట్ అవ్వచ్చా లేకపోతే డస్ట్ అవ్వచ్చా ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు.
(04:24) వాటిని కేవలం ఒక అలలాగా ఒక కార్ సౌండ్ వచ్చింది ఒక కార్ సౌండ్ అని వదిలేయండి అంతే ఇంకొక సౌండ్ వచ్చింది ఫ్యాన్ సౌండ్ వచ్చింది ఇదొక ఫ్యాన్ సౌండ్ అని వదిలేయండి అంతే మీరు ఎంతలా ఈ సౌండ్స్ ని స్వీకరిస్తారో అంతలా మీ లోపల నిశశబ్దం పెరుగుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి మీరు అనలైజ్ చేయకూడదు సౌండ్ ని జస్ట్ విని వదిలేయాలి. మీ శరీరం ఇప్పుడు ఒక ఖాళీ పాత్రలా మారుతుంది.
(04:42) అండ్ తర్వాతది అసలు మనం చేసేది ఈ ఎనర్జీకి ఒక పునాది వేయడం. యోగ నిద్రలో కేవలం రిలాక్సేషన్ కోసం మాత్రమే కాదు అది మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోవడానికి ఒక అవకాశం. ఈ స్టెప్ త్రీ లో మనం చేసేది సంకల్పం. సంకల్పం అంటే ఒక కోరిక కాదు. అది మీ మనసు లోతుల్లో మీరు నాటుకునే ఒక బలమైన విత్తనం. యోగ నిద్రలో మీ మెదడు అత్యంత ప్రశాంతమైన స్టేజ్ లో ఉన్నప్పుడు మీరిచ్చే ఈ కమాండ్ నేరుగా మీ సబ్కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది.
(05:15) సాధారణంగా మనం ఏదైనా అలవాటు మార్చుకోవాలన్నా లేదా ఒక లక్ష్యం సాధించాలన్నా మనపై మనకి అనుమానం ఉంటుంది. కానీ యోగ నిద్రలో మీ మెదడు తీటా స్టేట్ లోకి వెళ్తుంది. ఈ స్థితిలో మీ లాజికల్ బ్రెయిన్ విశ్రాంతి తీసుకుంటుంది. మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక మాట అంటే అది మీ మెదడులో ఒక న్యూరల్ పాత్వే ని క్రియేట్ చేస్తుంది.
(05:37) ఇది అచ్చం ఒక ఖాళీగా ఉన్న కంప్యూటర్ లోకి కొత్త సాఫ్ట్వేర్ ని కోడ్ రూపంలో రాయడం లాంటిది. ఈ పుస్తకం ప్రకారం మీ సంకల్పం ఎప్పుడు చిన్నగా స్పష్టంగా అలాగే ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి. నేను ధనవంతుడిని అవ్వాలి అని ఎప్పుడు అనుకోకూడదు నేను ధనవంతుడిని అని అనుకోవాలి. నేను విజయవంతమైన వ్యక్తిని అని అనుకోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని అని అనుకోవాలి.
(05:58) దీనిని మీ మనసులో మూడు సార్లు పూర్తి నమ్మకంతో చెప్పుకోవాలి. యోగ నిద్రలో మీరు వేసిన ఈ విత్తనం నేరుగా మీరు మెలుకువుగా ఉన్నప్పుడు మీ ప్రవర్తనని మీ డెసిషన్ మేకింగ్ ని శాసిస్తుంది. అలాగే ఇక్కడ కొన్ని ప్రో టిప్స్ ఉన్నాయి. నేను భయపడకూడదు అని అనకూడదు నేను ధైర్యవంతుడిని అని అనాలి. అలాగే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. ప్రతిరోజు మీ సంకల్పాన్ని మార్చకండి.
(06:19) మీరు వేసిన విత్తనం మొలకెత్తే వరకు అదే విష మీద ఉండండి అది జరిగేదాకా చూడండి అండ్ బిలీవ్ ఇట్ అది ఇప్పటికే జరిగిపోయినట్టుగా అనుభూతి చెందుతూ చెప్పండి. మీరు పూర్తిగా ధైర్యవంతుడిని అని మిమ్మల్ని మీరు ఫీల్ అవుతూ మీ కమాండ్ మీ విష్ ని చెప్పుకోండి. ఇప్పుడు మీ అవేర్నెస్ ని ఒక యాత్రికుడిలాగా శరీరం మొత్తం తెప్పాలి. దీనినే ఎంబాడడ్ అవేర్నెస్ అని అంటారు.
(06:40) ఇక్కడ రూల్ ఒకటే మీరు ఏ బాడీ పార్ట్ అయితే మైండ్ లో చెప్పుకుంటారో ఆ భాగాన్ని మీరు కదల్చకూడదు. కేవలం మీ మనసుతో ఆ భాగాన్ని తాకాలి. ఇది మీ మెథడ్ లోని మోటార్ కార్టెక్స్ ని కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి గాఢమైన విశ్రాంతిని మీకు ఇస్తుంది. మీరు యోగ నిద్రలో ఉంటూ మీ అవేర్నెస్ తో మీ ప్రతి బాడీ పార్ట్ ని టచ్ చేయాలి. అంటే ఫిజికల్ గా టచ్ చేయకూడదు మీ మైండ్ లో అవేర్నెస్ తో టచ్ చేయాలి.
(07:04) ఇలా టచ్ చేస్తూ హీల్ అవుతుంది అని బలంగా నమ్మాలి. ముందుగా మీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీని కవర్ చేయండి. మీకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీలో ఉన్న కాళీ బొటని వేలు దగ్గర నుంచి ప్రతి పార్ట్ పేరు చెబుతూ వెళ్ళాలి. బొటన వేలు, చిటికిన వేలు, పాదం, మోకాలు, తొడ అలా చెయ్యి వరకు చెప్పి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి రావాలి.
(07:22) అలాగే రైట్ సైడ్ కూడా సేమ్ ఇవన్నీ కూడా పార్ట్స్ కవర్ చేశక చివరగా ముఖం దగ్గరికి రావాలి. ఇలా చెబుతూ మీ అవేర్నెస్ ని ఆ పార్ట్ కి పంపించాలి అండ్ ఆ పార్ట్ పేరు చెప్పి కొంచెం టైం ఇవ్వండి. అలాగే మీరు ఒక్కొక్క పార్ట్ పేరు చెప్పి కొంచెం టైం ఇవ్వండి. ఒక 2త సెకండ్స్ లేకపోతే 5 సెకండ్స్ ఇలా చేస్తే మీ అవేర్నెస్ ఆ పార్ట్ ని హీల్ చేస్తుంది. అలాగే మీరు ఈ బాడీ పార్ట్ పేరు చెప్తున్నప్పుడు ఆ పార్ట్ ని ఫీల్ అవ్వండి.
(07:43) చాలా బలంగా ఫీల్ అవ్వండి దాన్ని కదల్చకండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం ఒకేసారి మీ స్పృహలో ఉంటుంది. ఇప్పుడు శరీరం మొత్తం కూడా మీరు చెప్పినట్టు వింటుంది. మీకు తెలుసా మీరు ఇలా ఒక్కో పాటు పేరు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు నిజానికి మీరు మీ మెదడులోని ఆయా భాగాల్ని ఒక్కొక్కటిగా రీసెట్ చేస్తున్నట్టు ఉంటుంది. మీరు తల వరకు వచ్చేసరికి మీ శరీరం మీకు సంబంధం లేని ఒక వస్తువు లాగా అత్యంత తేలిగ్గా మారిపోవడం మీరు గమనిస్తారు.
(08:06) ట్రై చేసి చూడండి. ఇది మీ సెంట్రల్ నర్వస్ సిస్టం ని కంప్లీట్ గా రీబూట్ చేసే ఒక హైటెక్ ప్రాసెస్ అలాగే ఇక్కడ మీరు పాటించాల్సిన కొన్ని ప్రో టిప్స్ ఉన్నాయి. అవే డోంట్ కాన్సంట్రేట్ ఫోకస్ కోసం కష్టపడకండి కేవలం మీ వాయిస్ ని మీరు ఫాలో అవుతూ వెళ్ళండి చాలు. అలాగే కీప్ మూవింగ్ ఏదైనా భాగాన్ని మర్చిపోయినా పర్లేదు వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్ళిపోండి.
(08:25) అలాగే ఇది ఎఫర్ట్ లెస్ గా ఉంచండి. ఇది శ్రమ లేని ధ్యానం కాబట్టి ఎంత రిలాక్స్డ్ గా ఉంటే అంత మంచిది. అలాగే మీకు గనుక ఈ వీడియోకి సంబంధించి ఒక పూర్తి గైడెడ్ మెడిటేషన్ కావాలి అంటే నాకు కామెంట్స్ లో చెప్పండి బై కామెంటింగ్ గైడెడ్ మెడిటేషన్. నేను మీకు ఒక వీక్ లోపల మన ఛానల్ లో ఈ గైడెడ్ మెడిటేషన్ ని అప్లోడ్ చేస్తాను. శరీరాన్ని ఇలా మనం స్కాన్ చేశక ఇప్పుడు మీ దృష్టిని శ్వాస మీదకు మల్లించాలి.
(08:47) యోగ నిద్రలో విశేషం ఏంటంటే మనం ప్రాణాయామం లాగా శ్వాసని కంట్రోల్ చేయం అది సహజంగా ఎలా జరుగుతుందో కేవలం ఒక సాక్షిలా మనం చూస్తాం. మీ శ్వాస మీ శరీరంలో ప్రవహిస్తున్న ఒక కాంతి కిరణం లాగా ఊహించుకోండి. సైన్స్ పరంగా చూస్తే మన శ్వాసను కేవలం గమనించడం వల్ల మన బాడీలోని పారాసింపథటిక్ నెర్వస్ సిస్టం యాక్టివేట్ అవుతుంది.
(09:08) ఇది మన హార్ట్ రేట్ ని మన బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. మీరు శ్వాసని గమనిస్తున్న కొద్దీ మీ మెదడుకి ఇప్పుడు అంతా క్షేమంగా ఉంది. నువ్వు ఇంకా లోతుగా నిద్రపోవచ్చు అనే సంకేతం అందుతూ వెళ్తుంది. ఇది మీ స్ట్రెస్ లెవెల్స్ ని ఇన్స్టెంట్ గా పడగొట్టే ఒక నాచురల్ మెకానిజం. మరి ఎలా చేయాలి? హౌ టు డూ ఇట్? ఈ స్టేజ్ లో మీరు ఈ చిన్న ప్రాక్టీస్ చేయండి.
(09:26) మీ ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్తున్నప్పుడు కలిగే ఆ చల్లదనాన్ని ఒకసారి గమనించండి. అలాగే గాలి బయటకి వస్తున్నప్పుడు ఆ వెచ్చదనాన్ని ఫీల్ అవ్వండి. శ్వాస తీసుకున్నప్పుడు మీ పొట్ట ఒక బెలూన్ లాగా మెల్లగా పైకి లేవడాన్ని గమనించండి. అలాగే వదిలినప్పుడు కిందకి వెళ్లడాన్ని కూడా అబ్సర్వ్ చేయండి. ఇప్పుడు శ్వాసని రివర్స్ లో లెక్క పెట్టడం మొదలు పెట్టండి.
(09:46) అంటే 27 నేను శ్వాస తీసుకుంటున్నాను. 27 నేను శ్వాస వదులుతున్నాను. 26 నేను శ్వాస తీసుకుంటున్నాను. 26 నేను శ్వాస వదులుతున్నాను. ఇలా చెప్తూ వెళ్ళండి. మధ్యలో నెంబర్ మర్చిపోతే మళ్ళీ 27 నుండి మొదలు పెట్టండి. అలాగే గుర్తుంచుకోండి ఇది బయటికి చెప్పాల్సిన పని లేదు మీ మైండ్ లోనే మీరు చేయాల్సింది. ఈ రివర్స్ కౌంటింగ్ ఎందుకంటే మీ మెదడు పూర్తిగా నిద్రలోకి జారిపోకుండా అవేర్నెస్ తో ఉండటానికి ఇదొక ట్రిక్.
(10:11) మీరు ఎంత ఫోకస్ తో లెక్కిస్తారో మీ ఆలోచనల గోల ఆ ఓవర్ థింకింగ్ అంతగా చల్లారిపోతుంది. మీరు మీ శ్వాసతో కలిసి ఒకటైపోతారు. ఇప్పుడు మీ శ్వాస మీద పూర్తి స్పృహ వచ్చాక మీ మెదడుని ఒక వింతైన స్థితిలోకి మీరు తీసుకువెళ్ళాలి. ఒకేసారి రెండు వ్యతిరేక ఎమోషన్స్ ని అనుభూతి చెందడం మొదలు పెట్టాలి. ఇది వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు.
(10:34) కానీ మీ మనసులో గడ్డకట్టిన ఆ పాత ఎమోషన్స్ ని కరిగించాలంటే ఇదొక మాస్టర్ టెక్నిక్. సో ఇప్పుడు నేను చెప్పే ఈ అనుభూతుల్ని మీరు ఆ స్టేట్ లో మీ మనసులో చెప్పుకోండి. ముందుగా చలి మీ శరీరం గడ్డకట్టి చలిలో ఉన్నట్టు ఊహించుకోండి. మీ ఎముకల వరకు ఆ చలి ప్రవహిస్తుంది అన్నట్టు మీరు చూడండి. మీ బాడీలో ఆ వణుకును అనుభూతి చెందండి. నెక్స్ట్ వేడి.
(10:54) ఇప్పుడు వెంటనే మీరు మండుతున్న ఎండలో ఉన్నట్టు ఊహించుకోండి. మీ శరీరం లోపల నుండి సెగలు వస్తున్నాయని మీరు బలంగా ఊయించుకోండి. నెక్స్ట్ హెవీనెస్ బరువు మీ శరీరం టన్నులు కొద్ది బరువుగా మారి భూమిలోకి కుంగిపోతున్నట్టు ఫీల్ అవ్వండి. నెక్స్ట్ లైట్నెస్ ఇప్పుడు ఒక్కసారిగా మీ శరీరం ఒక దూది పింజు లాగా మారి గాలిలో తేలుతున్నట్లు ఊహించుకోండి.
(11:12) మీరు ఎంత తేలిగ్గా ఉన్నారంటే గాలి మిమ్మల్ని ఎక్కడికైనా లేపి తీసుకెళ్ళగలదు అన్నట్టు ఫీల్ అవ్వండి. అసలు ఎందుకు ఈ వ్యతిరేక భావాలు? మన మెదడు లోని లింబిక్ సిస్టం మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. మీరిలా వేడి, చలి, బరువు, తేలిక లాంటి ఆపోజిట్ భావాలని ఒకేసారి అనుభవించినప్పుడు మీ మెదడులోని ఎమోషనల్ సెంటర్ ఒక రకమైన రీసెట్ అవుతుంది.
(11:34) ఇది మీ జీవితంలోని స్ట్రెస్ ని, భయాన్ని తట్టుకునే శక్తిని పెంచుతుంది. అంటే మీరు రిలాక్స్ అవుతూనే మీ మెదడుని మీరు స్ట్రాంగ్ గా తయారు చేసుకుంటున్నారు. మన జీవితం అంటేనే సుఖ దుఃఖాల కలయక. యోగ నిద్రలో మీరు ఆ విరుద్ధ భావాలను బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటే బయట ప్రపంచంలో వచ్చే కష్ట సుఖాలను కూడా అంతే స్థిత ప్రజ్ఞతతో మీరు ఎదుర్కోగలరు. ఇది కేవలం నిద్ర కాదు ఇది మీ లైఫ్ ని మార్చే చాలా మోస్ట్ ఇంపార్టెంట్.
(11:58) ఇప్పుడు మీ శరీరం శ్వాస భావాలు అన్ని స్థిమితపడ్డాయి. సెటిల్ అయ్యాయి. ఇప్పుడు మీ మనసు అనే స్క్రీన్ మీద ఇప్పుడు నేను చెప్పబోయే ఈ దృశ్యాల్ని సినిమా లాగా మీరు చూడాలి. ఇది మీ అతి ఆలోచనని ఆపేసి మిమ్మల్ని ఒక అతీతమైన కామ్నెస్ లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను మీకు ఏదైతే బొమ్మలు లేకపోతే ఒక విజన్ ని చెప్తున్నానో అది మీరు ఆ స్టేజ్ లో ఊహించుకోండి యోగ నిద్రలో ముందుగా ప్రశాంతమైన సరసు చాలా ప్రశాంతంగా ఒక సరస్సు ఉంది అందులో ఒక మంచి నీరు ఉంది.
(12:27) దానిలో ఒక వెన్నెల రిఫ్లెక్షన్ మీరు చూస్తున్నారు. అలాగే పెద్ద మర్రి చెట్టు ఆ పెద్ద మర్రి చెట్టు కింద చల్లని నీడ ఉంది. ఆ నీడలో మీరు ఉన్నారు. అలాగే వెలుగుతున్నది చీకటి గదిలో అది గాలికి అటు ఇటు ఊగుతుంది. అలాగే నీలి ఆకాశం అంతులేని ఆకాశంలో తేలుతున్న తెల్ల మేఘాలు అవి అటు ఇటు వెళ్తున్నాయి. మీరు ఇలా ఆ దృశ్యాలని ఊహించుకుంటున్నప్పుడు మీ మెదడు తీటా బ్రెయిన్ వేవ్స్ ని రిలీజ్ చేస్తుంది.
(12:47) ఈ స్థితిలో మీ క్రియేటివిటీ అద్భుతంగా పెరుగుతుంది. సైన్స్ ఏం చెప్తుందంటే మన మెదడికి నిజానికి మనం ఊహించుకుంటున్న దానికి మధ్య తేడా తెలియదు. అందుకే ఈ దృశ్యాలని చూడటం వల్ల మీ బాడీ నిజంగానే ఆ ప్రశాంతమైన చోటు ఉన్నట్లు ఫీల్ అయ్యి డీప్ గా హీల్ అవుతుంది. అలాగే మీరు చాలా గట్టిగా బలంగా ప్రయత్నిస్తూ ఆ దృశ్యాలను చూడకండి.
(13:08) ఆ పేరు మీరు మైండ్ లో ఏదైతే పేరు అన్నారో జస్ట్ ఆ పేరు చెప్పిన వెంటనే మీ మనసులో వచ్చే ఆ చిత్రం ఏదైతే వస్తుందో దాన్నే చూడండి. మీ మైండ్ ని బలవంతం చేయకూడదు. మీరు ఆ దృశ్యంలో కలిసిపోవాలి అంతే అప్పుడే మీలోని ఒత్తిడి పూర్తిగా కరిగిపోతుంది. యోగ నిద్రలో మీరు అంతులేని ప్రశాంతతను ఇప్పుడు అనుభవించారు. ఇప్పుడు నెమ్మదిగా మీ అవేర్నెస్ ని మళ్ళీ బయట ప్రపంచం వైపు మీరు మల్లించాలి.
(13:31) మీ చుట్టూ ఉన్న సౌండ్స్ ని స్లోగా గమనించడం మొదలు పెట్టండి. గదిలోని టెంపరేచర్ ని ఒకసారి ఫీల్ అవ్వండి. మీ శరీరానికి టచ్ అయి ఉన్న ఆ దుప్పటిని ఫీల్ అవ్వండి. మీ శరీరం నేల మీద ఎంత బరువుగా ఉందో గమనిస్తూ నెమ్మదిగా మీ చేతి వేళ్ళను, కాలి వేళ్ళను కదిలించండి. అండ్ చివరిగా కళ్ళు తెరిచి ముందు వీడియో మొదట్లో మీరు అనుకున్న ఆ సంకల్పాన్ని మరోసారి గుర్తు తెచ్చుకోండి.
(13:53) ఆ ప్రశాంత స్థితిలో మీరు చెప్పే ఆ మాట మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకి పునాది వేస్తుంది. మీ అరచేతుల్ని ఒకదానికిఒకటి రుద్ది ఆ వెచ్చదనాన్ని మీ కళ్ళ మీద ఉంచుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీరు ఇప్పుడు ఒక 20 నిమిషాల యోగ నిద్ర సెషన్ ని పూర్తి చేశారు. కానీ మీ శరీరం మాత్రం ఒక నాలుగు గంటల గాఢ నిద్ర తర్వాత ఉండేంత ఫ్రెష్ గా మీకు అనిపిస్తుంది.
(14:13) ఇలా ఈ నైన్ స్టెప్స్ తో మీరు కూడా యోగ నిద్ర చేయవచ్చు. సో ఒక్కసారి ఈ నైన్ స్టెప్స్ ఆఫ్ యోగ నిద్రని ఫాస్ట్ గా రివైజ్ చేసేద్దాం. ముందుగా ప్రిపరేషన్ ప్రశాంతమైన చోట శవాసనంలో పడుకొని శరీరాన్ని పూర్తిగా వదులుగా వదిలేయండి. బయట ప్రపంచాన్ని మర్చిపోయి మీ లోపలి ప్రయాణాన్ని మీరు మొదలు పెట్టండి. స్టెప్ టు సెట్టింగ్ మీ శరీరంలోని ఒత్తిడిని పూర్తిగా వదిలేసి భూమి లోపలికి మీరు వెళ్ళిపోతున్నట్లు మీరు ఫీల్ అవ్వండి.
(14:36) చుట్టూ ఉన్న సౌండ్స్ ని అనలైజ్ చేయకుండా కేవలం గమనిస్తూ మీ మనసులోని భయాల్ని తగ్గించే నిశబ్ద స్థితిలోకి మీరు వెళ్ళిపోండి. స్టెప్ త్రీ ముఖ్యమైనది సంకల్పం మీ జీవితంలో మీరు సాధించాలనుకునే ఒక్క చిన్న కోరికను గట్టిగా అనుకోండి. ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఒక విత్తనంలా నాటుకుపోతుంది. స్టెప్ ఫోర్ రొటేషన్ ఆఫ్ అవేర్నెస్ మీ దృష్టిని శరీరం మొత్తం ఒక్కో భాగం మీదకు మల్లించండి.
(14:56) ఏ భాగాన్ని కదల్చకుండా కేవలం గమనిస్తూ రిలాక్స్ చేయండి. స్టెప్ ఫైవ్ బ్రీత్ అవేర్నెస్ మీ శ్వాస నాచురల్ గా ఎలా వస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు కడుపు పైకి లేవడం వదులుతున్నప్పుడు కిందకి వెళ్ళడం ఫోకస్ పెట్టండి. అలాగే 27 నుంచి ఒకటి వరకు వెనక్కి లెక్క పెట్టండి. మధ్యలో లెక్క తప్పితే మళ్ళీ 27 నుంచి స్టార్ట్ చేయండి. స్టెప్ సిక్స్ ఆపోజిట్ ఫీలింగ్స్.
(15:14) ఒకసారి విపరీతమైన చలిని ఊహించుకోండి అలాగే వెంటనే వేడిని ఊహించుకోండి. ఒకేసారి బరువు ఫీలింగ్ ని ఊహించుకోండి అలాగే లైట్ ఫీలింగ్ ని కూడా ఊహించుకోండి. ఇలా బాలెన్స్ చేయడం నేర్చుకోండి. రాపిడ్ విజువలైజేషన్ స్టెప్ సెవెన్ పచ్చని చెట్లు నీల ఆకాశం ఇలాంటి ప్రశాంతమైన దృశ్యాలని ఊహించండి. ఇది మీ మెదడులోని క్రియేటివిటీని పెంచే తీటా వేవ్స్ ని రిలీజ్ చేస్తుంది.
(15:33) స్టెప్ ఎయిట్ ఎక్స్టర్నలైజింగ్ నెమ్మదిగా మీ చుట్టూ ఉన్న శబ్దాల్ని గదిలోని వాతావరణాన్ని గమనించండి. మీ శరీర బరువుని తెలుసుకుంటూ మెల్లగా స్పృహలోకి రండి. స్టెప్నైన్ కంప్లీషన్ మీ సంకల్పాన్ని మరోసారి తలుచుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మీ బాడీ మరియు మీ మైండ్ పూర్తిగా రీఛార్జ్ అయినట్టు ఫీల్ అవుతారు. సో చూశారుగా యోగ నిద్ర అంటే కేవలం పడుకోవడం కాదు అది మీ మెథడ్ ని సూపర్ కంప్యూటర్ లా రీబూట్ చేసే ఒక పద్ధతి.
(15:58) రోజుకి కేవలం 20 నిమిషాలు ఈ ప్రాక్టీస్ చేస్తే మీ జీవితంలోని ఒత్తిడి మాయమై ఒక కొత్త ఉత్సాహం మీ సొంతం అవుతుంది. నిద్రలేని రాత్రులకు అలిసిపోయిన శరీరానికి ఇదే అసలైన మెడిసిన్. మీరు ఈరోజు రాత్రే దీన్ని ఒకసారి ప్రయత్నించండి. ఆ అనుభవం ఎలా ఉందో నాకు తర్వాత రోజు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్

No comments:

Post a Comment