జపాన్ అంతా మన ఒడిస్సీ డ్యాన్స్ ఎందుకు చేస్తున్నారు? #Forefront #odissidance #japan
Author Name:FOREFRONT
Youtube Channel Url:https://www.youtube.com/@forefront_bharat
Youtube Video URL:https://www.youtube.com/watch?v=S9YIwDFOWzg
Transcript:
(00:00) ఈ వీడియో ఒక్కసారి చూడండి ఇందులో వింతగా ఏమైనా అనిపిస్తుందేమో గమనించండి. ఇది భారతదేశంలోని డాన్స్ స్కూల్ కాదు ఇది టోక్యోలోని ఒక చిన్న వంటగది. ఈ జపనీస్ అమ్మాయిలు మన భారతీయ శాస్త్రీయ నృత్యం ఒడిస్సీ చేస్తూ స్పష్టంగా సంస్కృత శ్లోకాలను పటిస్తున్నారు. కానీ అసలు వింత ఇది కాదు. అసలు కథ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
(00:30) ఈ కథ 1982 లో భారతదేశంలోని ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిని కుంకుమలాల్ గారు తన భర్తతో కలిసి జపాన్ లోని టోక్యోకు వెళ్ళినప్పుడు మొదలైంది. ఒకరోజు ఆమె ఒక చిన్న ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శన చూస్తున్న ప్రేక్షకులలో అసాకో తకామి అనే ఒక జపనీస్ యోతి ఉంది. కుంకుమలాల్ గారి నృత్యం చూసి అసాకో మంత్ర ముగ్దురాలయింది. ఆమె ఇలా చెప్పింది. మానవ శరీరం స్పేస్ మరియు ఎనర్జీని ఎలా మార్చగలదో చూసి నేను షాక్ అయ్యాను.
(00:53) నా శరీరంతో నేను కూడా అలా చేయాలనుకున్నాను. ఆ తర్వాత రోజు ఉదయాన్నే అసాకో నేరుగా కుంకుమలాల్ గారి అపార్ట్మెంట్ కి వెళ్లి నన్ను మీ శిష్యురాలుగా స్వీకరించండి అని పట్టుపట్టింది. ఆమె కళ్ళల్లో ఉన్న ఆ తపనను చూసి కుంకుమ గారు కాదనలేకపోయారు. కానీ ఒక పెద్ద సమస్య వచ్చింది. జపనీస్ ఇళ్లల్లో నేల మీద తతామి అనే మెత్తటి చాపలు ఉంటాయి. వాటి మీద డాన్స్ చేయడం కుదరదు.
(01:13) ఆ ఇంట్లో గట్టి నేల ఉన్న ఏకైక ప్రదేశం వాళ్ళ వంటగది. అంతే ఆ చిన్న వంటగదిలోనే వాళ్ళ మొదటి పాఠం మొదలైంది. ఒక గురువు ఒక శిష్యురాలితో ఆ వంటగదిలో మొదలైన ఆ ప్రయాణం కొద్ది రోజుల్లోనే పెద్ద ఉద్యమంలా మారింది. ఎంతో మంది విద్యార్థులు రావడం మొదలు పెట్టారు. వాళ్ళు సంస్కృతం దేవనాగరి లిపిని కూడా నేర్చుకున్నారు. అసాకో అయితే ఒడిస్సీని పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి తన ఉద్యోగాన్ని కూడా వదిలేసింది.
(01:37) ఆ తర్వాత ఆ తరగతులు వంటగది నుండి సాంస్కృతిక కేంద్రాలకు మారాయి. నాలుగేళ్లలో జపాన్ అంతటా ఒడిస్సీ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈరోజు భారతదేశం తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ఒడిస్సీ కమ్యూనిటీ ఉన్న దేశాలలో జపాన్ ఒకటి ఒకసారి ఆలోచించండి ఒక అద్భుతమైన గురువు ఒక నిబద్ధత గల శిష్యురాలితో టోక్యోలోని ఒక చిన్న వంటగదిలో మొదలైన ఈ ప్రయాణం ఈరోజు ఎంత పెద్ద సాంస్కృతిక విప్లవానికి దారి తీసిందో మన సంస్కృతి గొప్పతనం ఇదేనేమో ఈ అద్భుతమైన కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి జై హింద్
No comments:
Post a Comment