213f8;
🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀🍇M.A.197.
*మన ఆరోగ్యం…!
*’నల్లేరు’ మీద నడక!*
➖➖➖✍️
*_అనేక వ్యాధులకు దివ్య ఔషదం ఈ ‘నల్లేరు’.._*
*హెల్త్ డెస్క్ :*
*ఆధునిక జీవనశైలిలో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. అయితే, మన పెరట్లో లేదా పల్లెటూరి పొలాల గట్లపై కనిపించే ‘నల్లేరు’ ఈ సమస్యలన్నింటికీ దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నల్లేరుకు ‘అస్థిసంహారక’ అనే పేరు ఉంది. ఎముకలు విరిగినప్పుడు ఆ కణజాలం త్వరగా పునరుత్పత్తి చెందడానికి ఇది దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం, కార్బోనేట్ మూలకాలు ఎముకలను వజ్రం వలె దృఢంగా మారుస్తాయి. అందుకే పూర్వకాలంలో పెద్దలు ఎముకల బలం కోసం నల్లేరు పచ్చడిని ఆహారంలో భాగంగా తీసుకునేవారు.*
*ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పితో బాధపడేవారికి నల్లేరు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది వాపును తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ఆకలి లేకపోవడం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను నల్లేరు నివారిస్తుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ.. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, శరీరంలోని అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను, మెనోపాజ్ దశలో ఎదురయ్యే ఎముకల సాంద్రత తగ్గే సమస్యను ఇది అరికడుతుంది.*
*ఎలా తీసుకోవాలి ?*
*నల్లేరు కాడల పైన ఉండే ఈనెలను తీసివేసి, చిన్న ముక్కలుగా కోసి నెయ్యి లేదా నూనెలో వేయించాలి. ఆ తర్వాత పల్లీలు, చింతపండు, మిరపకాయలు కలిపి పచ్చడిలా చేసుకుని తినవచ్చు. అయితే, నల్లేరు కాడలు కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకోవడం మంచిది. లేదంటే కొందరికి దురద వచ్చే అవకాశం ఉంటుంది.*
*ఆడవారిలో వచ్చే రుతుక్రమ సమస్యలు మరియు మెనోపాజ్ సమయంలో కలిగే అసౌకర్యాలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నల్లేరు కాడలతో పచ్చడి లేదా కూరలు చేసుకుని తినడం వల్ల శరీరానికి అమితమైన బలం లభిస్తుంది. ఖరీదైన మందుల కన్నా ప్రకృతిలో దొరికే ఇలాంటి మూలికలను సరైన పద్ధతిలో వాడటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నల్లేరును మీ డైట్‌లో చేర్చుకుని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
No comments:
Post a Comment